సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 125వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. ఇండియా ట్రిప్పులో అనుభవాలు
  2. ఊదీ ఇచ్చిన మానసిక ప్రశాంతత

ఇండియా ట్రిప్పులో అనుభవాలు

యు.ఎస్.ఏ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను గత కొన్ని సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలిని. ఒకసారి నేను వీసా స్టాంపింగ్ కోసం పదిరోజులు సెలవు పెట్టి, మా అమ్మాయిని మావారి వద్ద  వదిలిపెట్టి ఇండియా వెళ్ళాను. ఒక్కరోజులో H4 స్టాంపింగ్ పూర్తి ఐపోతుందన్న ఆలోచనతో వీసా ఆఫీసుకు వెళ్ళాను. కానీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కోసం పంపించారు. ఆ ప్రక్రియ పూర్తికావటానికి చాలారోజులు పడుతుంది. అన్నిరోజులు మావారు ఒక్కరే మా అమ్మాయిని చూసుకోవడం కష్టమైపోతుందని ఆందోళనపడి బాబాను ప్రార్థించాను. నా తిరుగుప్రయాణం బుధవారంనాడు ఉన్నదనగా సోమవారమే వీసా వచ్చేలా బాబా అనుగ్రహించారు.

ఆ సమయంలోనే నేను నా కజిన్స్ తో కలిసి శిరిడీ వెళ్ళాను. మేము గురువారం శిరిడీ చేరుకుని బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా కృపతో చక్కటి దర్శనమైంది. అక్కడి పూజారి సచ్చరిత్రను బాబా పాదాలవద్ద పెట్టి పువ్వులతోపాటు నాకు తిరిగిచ్చారు. మరుసటిరోజు ఉదయం మేము కాకడ ఆరతికి వెళ్ళాము. బాబా సమక్షంలో దాదాపు గంట సమయం ఉండే భాగ్యం దక్కింది. నా మనస్సులో కొన్ని వేపాకులు కావాలని ఆశపడ్డాను. రెండురోజులు ఎంతగానో వెతికాను కానీ ఒక్క ఆకు కూడా దొరకలేదు. "ఏమిటి బాబా, నాకు వేపాకు దొరకలేదు" అనుకున్నాను. బాబా తన భక్తులని నిరాశపరచరు. ఆయన నన్ను ఆశీర్వదించారు. మేము బాబా విగ్రహం తీసుకోవడానికి దగ్గరలో ఉన్న షాపులకు వెళ్ళాము. మేము వెళ్లిన రెండో షాపతను కొన్ని వేపాకులు, బాబా కోసం ఉపయోగించిన ఒక క్లాత్ ఇచ్చాడు. నా ఆనందాశ్చర్యాలకు అంతులేదు. బాబా ఎంత గొప్పగా అనుగ్రహిస్తారో కదా! ప్రెగ్నెన్సీతో ఉన్న నాకు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా చూసుకున్నారు.

నా తిరుగుప్రయాణానికి సంబంధించిన టిక్కెట్లను తక్కువధర ఉందని ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో బుక్ చేయడానికి ప్రయత్నించాను. నేను అన్ని వివరాలు పూర్తి చేసి కన్ఫర్మ్ బటన్ నొక్కేసరికి అప్పుడే ధరలో మార్పు జరిగిందని టికెట్ బుకింగ్ కాలేదు. తరువాత బ్యాంకు ట్రావెల్ వెబ్‌సైటు నుండి టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించాను, కానీ సాధ్యపడలేదు. చివరికి బాబా అనుగ్రహం వలన నేను ముందు అనుకున్న అదే ధరకి ట్రావెల్ వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ అయింది. కానీ నా పాస్‌పోర్టు రావడంలో ఆలస్యమై నా ప్రయాణం గురువారానికి మార్పు చేసుకోవలసి వచ్చింది. టికెట్స్ మార్పు చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌తో పోల్చితే ట్రావెల్ వెబ్‌సైట్‌లో చాలా తక్కువగా ఉంది. బాబా నాకు తెలియకుండానే అన్నీ అనుకూలంగా మలిచారు. ఒకవేళ నా మొదట ప్రయత్నంలో ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ అయుంటే నేను డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. బాబా తన బిడ్డలకు ఏది మంచిదో అది ఇస్తారు.

బాబా కృప లేకుంటే నా ఇండియా ట్రిప్ ప్రశాంతంగా జరిగేది కాదు. నేను చాలాసార్లు నాకు కావలసిన వాటికోసం ఆయనతో పోరాడినప్పటికీ ఆయనెప్పుడూ నాకేది మంచిదో అదే ఇస్తున్నారు.

source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2389.html

ఊదీ ఇచ్చిన మానసిక ప్రశాంతత

ఢిల్లీ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. నేను బాబా భక్తురాలిని. నాకు జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను చాలా సున్నిత మనస్కురాలిని. నేను ఏ మరణవార్త విన్నా చాలా బలహీనపడిపోతాను. అలాంటి పరిస్థితులలో ఒంటరిగా ఉండడానికి చాలా భయపడతాను. ఒకసారి మా సంఘంలోని నిర్వాహకులు ఒకరు మరణించారు. ఆ వార్త విన్న నేను, "బాబా! ఈ పరిస్థితి నుండి బయటపడే ధైర్యాన్ని ఇవ్వండి" అని ప్రార్థించాను. నిద్రపట్టేలోపు ప్రతి గంటకోసారి టానిక్, మెడిసిన్, ఊదీ తీసుకుందామని అనుకున్నాను. కేవలం 2 సార్లు తీసుకునేసరికి నా మనస్సు చాలా ప్రశాంతమైపోయింది. అంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. నిజానికి నేను అలాంటి వార్తలు విన్నట్లైతే కనీసం 2 రోజులు అందులోనుండి బయటకు రాలేను. అంతా బాబా దయ, ఆయన ఊదీ మహిమ. ఊదీకి సమానమైన ఔషధం వేరేదీ లేదు. మన బాబాను మించిన వైద్యుడు లేడు. కేవలం మనకు బలమైన విశ్వాసం ఉండాలి అంతే.

జై బోలో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo