ఈరోజు భాగంలో అనుభవాలు:
- బాబా మనకు సదా సర్వదా రక్ష.
- సాయి ఆశీస్సులతో మా పాప ఆరోగ్యం వృద్ధి
బాబా మనకు సదా సర్వదా రక్ష.
నాపేరు మాధవి. నేను భువనేశ్వర్ నివాసిని. ఇదివరకు ఈ బ్లాగులో నేను చాలా అనుభవాలు పంచుకున్నాను. 2019, జులై 29న బాబా నన్నొక పెద్ద కష్టం నుంచి బయటపడేసారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. గత ఏడు నెలలుగా మేము చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాము. ఇప్పుడిప్పుడే ఆ కష్టం నుండి కొంచంగా బయటపడుతున్నాము. కొత్త ఇంటికి మారితే పరిస్థితులు మారతాయనే ఉద్దేశ్యంలో భువనేశ్వర్ లో మాకున్న వేరే ఇంటికి మారుదామని అనుకున్నాము. ఆ వాస్తు చాలా బాగుటుంది. వంటగదిలో చిన్న చిన్న పనులు ఉంటే అవి చేయిస్తున్నాము. జులై 29న సన్మయిక్ సెలక్షన్ కోసం మా ఇంటి దగ్గరలో ఉన్న షాపుకి వెళ్ళాను. అక్కడినుండి తిరిగి వస్తుండగా ఒక వ్యక్తి నా వద్దకి వచ్చి, "ఇక్కడ ఏదన్నా ఇల్లు ఖాళీగా ఉందా?" అని అడిగాడు. నేను, "నాకు తెలీదు" అని చెపుతున్నాను. అంతలో అతను నా మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రం కట్ చేసాడు. నేను గట్టిగా "చోర్... చోర్,,, 'బాబా .. బాబా' " అని అరిచాను. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. అందరూ వచ్చారు. ఈలోగా అతడు నా చైన్ కట్ చేసి లాగుతున్నాడు. జనాలు రావడం చూసి అతను పరుగు తీసాడు. నేను అతను నా చైన్ తీసుకుని పారిపోయాడు అనుకుని, మంగళసూత్రాలు పోవడం శుభసూచకం కాదని చాలా బాధతో, "బాబా! నా మంగళసూత్రం నాకు ఇప్పించు" అని బాబాను వేడుకున్నాను. అంతలో జనం మధ్యలో నుంచి ఒక కారు డ్రైవర్ వచ్చి, "మేడం, మీ చైన్ పోలేదు. చూసుకోండి!" అన్నాడు. బాబా దయవల్ల చైన్ చీరలోనే పడిపోయి ఉంది. మంగళసూత్రాలు, బాబా లాకెట్ చైన్ తోపాటు ఉన్నాయి. రెండు పూసలు మాత్రమే పోయాయి. బాబా నన్ను ఎలా రక్షించారోగాని, అన్నీ నా చీరలోనే పడి ఉన్నాయి. ఆయన దయవలన ఆ కష్టం నుంచి బయటపడ్డాను. "ధన్యవాదాలు బాబా". బాబా మనకు సదా సర్వదా రక్ష అనేదానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ.

సాయి ఆశీస్సులతో మా పాప ఆరోగ్యం వృద్ధి
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను చాలా ఏళ్ళుగా సాయిబాబా భక్తురాలిని. నేనెప్పుడూ ఆయన దివ్యపాదాల చెంత ఉండాలని కోరుకుంటాను. నేనెన్నో పొరపాటు ఆలోచనలు చేశాను. కరుణామూర్తి అయిన తల్లిలాంటి సాయి నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. నేను చాలా సందర్భాలలో ఆయన ఉనికిని అనుభూతి చెందాను. నా బిడ్డ ఆరోగ్యం వృద్ధి చెందడంలో బాబా ఆశీస్సులను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
మాకు పెళ్ళైన చాలాకాలం వరకు సంతానం కలగలేదు. కానీ ఆలస్యంగా అయినా సరే బాబా ఆశీస్సులతో నేను గర్భం దాల్చాను. మా పాప పుట్టుక కూడా సాయి చేసిన అద్భుతం వలనే సాధ్యమైంది. తనకు రెండేళ్లు వచ్చాక మేము హఠాత్తుగా తన పెరుగుదలలో, మాట్లాడటంలో లోపం గమనించాము. తను చేయి పైకి ఎత్తలేకపోయేది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది కాదు. ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఒక తల్లిగా నేను తనతో ఎక్కువ సమయం గడపకుండా చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే సమస్య మాకు ఆలస్యంగా తెలిసింది. మేము పిల్లల డాక్టరుని సంప్రదించాము. తన ప్రవర్తనకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకున్నాక డాక్టరు తన సమస్యను 'ఆటిజం' అంటారనీ, ఆ సమస్య వలన వయసుకు తగినట్లు ఎదుగుదల ఉండక ఆలస్యం అవుతుందని చెప్పారు. ఆ మాటలు వింటూనే నాకు, మావారికి నోట మాట రాలేదు. నా గుండె పగిలిపోయింది. ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉండేదాన్ని. ఆ స్థితిలో ఒకరోజు క్వశ్చన్ & ఆన్సర్ సైట్ లో బాబాని అడిగితే, "నిదానంగా నీ బాధలు సమసిపోతాయి. మీరు ఇబ్బందులు మరియు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు" అని వచ్చింది. ఆ వాక్యాలు చదివాక బాబా చెప్పింది ఎప్పుడూ సత్యమై తీరుతుందన్న నమ్మకంతో ఏడవటం ఆపేశాను.
తరువాత డాక్టరు చికిత్స మొదలుపెట్టారు. మేము తనని ప్రీ-స్కూలులో జాయిన్ చేశాము. మేము కూడా తనతో ఎక్కువ సమయం గడుపుతూ, "బాబా! తనకు జరుగుతున్న చికిత్స బాగా పని చేయాలి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నవ గురువారవ్రతం కూడా చేశాను. తనకిప్పుడు మూడేళ్లు వచ్చాయి. తన పరిస్థితిలో చాలా వృద్ధి కనిపిస్తుంది. తనిప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం చేస్తోంది. తన అవసరాలను అడగలేక పోతున్నప్పటికీ చాలా మాటలు మాట్లాడుతుంది. తను సాయిబాబా నామం, ఇంకా ఇతర దేవతల పేర్లు పలుకుతూ ఉంటే మాకెంతో ఆనందంగా ఉంది. ఇదంతా బాబా ఆశీస్సులతోనే సాధ్యమైంది. ఆయన చెప్పేది ఎప్పుడూ సత్యమై తీరుతుంది. త్వరలోనే బాబా ఆశీస్సులతో తను పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడుతూ, తన అవసరాలను కూడా అడుగుతుందని నేను ఆశిస్తున్నాను. పూర్వకర్మానుసారం ఎవరైతే ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో వాళ్లందరికీ బాబా ఆశీస్సులు అందుగాక! ఆయన ఆశీస్సులతో భక్తులందరూ ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.
🕉 sai Ram
ReplyDeleteఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteనేను చాలా ఏళ్ళుగా సాయిబాబా భక్తున్ని. నా పర్నేu గంగాధర్, ఆయన దివ్యపాదాల చెంత ఉండాలని కోరుకుంటాను. నేనెన్నో పొరపాటు ఆలోచనలు చేశాను. కరుణామూర్తి అయిన తల్లిలాంటి సాయి నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. నేను చాలా సందర్భాలలో ఆయన ఉనికిని అనుభూతి చెందాను 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteనేను చాలా ఏళ్ళుగా సాయిబాబా భక్తున్ని. నా పేరు గంగాధర, నేను బాబా దివ్యపాదాల చెంత ఉండాలని కోరుకుంటాను. నేను ఎన్నో పొరపాటు ఆలోచనలు చేశాను. కరుణామూర్తి అయిన తల్లిలాంటి సాయి నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. నేను చాలా సందర్భాలలో ఆయన ఉనికిని అనుభూతి చెందాను.
ఓం సాయి రామ్ 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏