సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 128వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. బాబా వచ్చి 'పోహా' నైవేద్యాన్ని స్వీకరించారు
  2. బాబా నన్ను తాను ఉన్న చోటుకే తీసుకెళ్లారు
  3. సాయి చూపిన కరుణ

బాబా వచ్చి 'పోహా' నైవేద్యాన్ని స్వీకరించారు

పశ్చిమగోదావరి జిల్లానుండి ఒక సాయిభక్తురాలు తనకి ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

నేను 2019, జులై 29న సాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ మొదలుపెట్టాను. ఆగష్టు 1 గురువారంనాడు సాయంత్రం నేను నాల్గవరోజు పారాయణ పూర్తిచేసి, పోహా(అటుకుల ఉప్మా) తయారుచేసి బాబాకు నైవేద్యంగా పెట్టాను. కొద్దిసేపటికి 'సాయి దర్బార్' వాట్సాప్ గ్రూపులో బాబా సంధ్య ఆరతి ఫోటోలు షేర్ చేసారు. 

వాటిలో ఒక ఫోటోలోని బాబాకు నేను ప్రేమగా పోహా తినిపించాను. బాబాను చిన్న బిడ్డగా ఊహించుకుంటూ ఎంతో ఇష్టంగా ఆయనకు తినిపిస్తూ చాలాసేపు ఆనందంగా గడిపాను. కాసేపటికి, అంటే సుమారు రాత్రి 8 గంటల సమయంలో ఒక వ్యక్తి, "మీరు బాబాకు పెడుతున్నారు. కళ్ళుమూసుకుని మీ మనోనేత్రంలో బాబాను ఊహించుకుంటూ పెట్టండి. బాబా తప్పక స్వీకరిస్తారు. అప్పుడు చూడండి పోహాలో వేలిముద్రలు కనిపిస్తాయి" అని ఒక మెసేజ్ పెట్టారు. 'ఏమిటి, నా పారాయణకి ఇంత అనుగ్రహమా?!' అని నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఎవరో ఏమిటో కూడా నాకు తెలియదు. "మీరెవరు? నాకెందుకు ఇలా చెప్తున్నారు?" అని అడిగాను. "నేను గ్రూపులో ఉన్నాను" అని చెప్పారు. అప్పుడు నేను, "నిజానికి నేను మీ మెసేజ్ రాకముందు మీరు చెప్పిన రీతిలోనే చేశాను" అన్నాను. అందుకు తను, "అయితే, బాబా ఆల్రెడీ స్వీకరించారు. ఆ నైవేద్యం యొక్క ఫోటో షేర్ చేస్తారా?" అని అడిగారు. నేను సరేనని ఫోటో తీసి షేర్ చేశాను. తను ఆ ఫోటోపై ఒక భాగంలో మార్కు చేసి చూపిస్తూ, 'అక్కడ బాబా ఉన్నారు' అని చెప్పారు. చూస్తే, నిజంగానే కూర్చొని ఉన్న భంగిమలో బాబా అక్కడ ఉన్నట్లుగా నాకనిపించింది. గ్రూపులో ఉన్న కొంతమంది సభ్యులకి కూడా అలా అనిపించింది, మరికొంతమందికి అలా అనిపించలేదు కూడా. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇదిలా ఉంటే, మరుసటిరోజు 'సాయి యుగ నెట్‌వర్క్ ఆసియా' అను మరో గ్రూపులో ఒక ఇమేజ్ ద్వారా "నేను నీ కోసమే వచ్చాను" అని బాబా నాతో చెప్పారు. బాబా నేను పెట్టిన పోహాను స్వీకరించడమే కాకుండా ఆ మెసేజ్ ద్వారా నిర్ధారణ కూడా చేసారు. ఇంతకంటే నాకు ఏం కావాలి? నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు నేను చాలాసార్లు పారాయణ చేశాను. ఎన్నోరకాలుగా బాబా సహాయం చేశారు గాని, ఆయనే రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. "ఇంత గొప్ప అనుభవాన్నిచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

బాబా నన్ను తాను ఉన్న చోటుకే తీసుకెళ్లారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను ఒక డాక్టరుని. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. నా స్నేహితురాలు, తన కుటుంబం సాయిబాబాకు అంకిత భక్తులు. తన సాంగత్యంతో నేను సాయిని పూజించడం మొదలుపెట్టి రెండు సంవత్సరాలైంది. నా ఎం.బి.బి.ఎస్. పూర్తయ్యాక 'రెండు సంవత్సరాలలోపు నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి సీటు రావాలి' అని బాబాని ప్రార్థించాను. మొదటి సంవత్సరం ఎంట్రన్స్ పరీక్షలో విఫలమయ్యాను. దాంతో నేను దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడి స్టాఫ్ డాక్టర్లు, నర్సులు నన్నెంతో ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహంతో ఎంట్రన్స్ పరీక్షకు బాగా చదివాను. తరువాత వచ్చిన ఎంట్రన్స్ పరీక్ష బాగా వ్రాసి, బాబా ఆశీస్సులతో ఉత్తీర్ణత కూడా సాధించాను. అయితే నాకు ర్యాంకు అంత మంచిది రాలేదు. అందువలన మళ్ళీ ఒక సంవత్సరం ప్రిపేర్ కావాలని అనుకున్నాను. ఆ సమయంలో నేను క్వశ్చన్ & ఆన్సర్ సైట్‌లో "నాకెందుకు ఇలా అవుతుంది బాబా?" అని అడిగాను. అందుకు బాబానుండి సానుకూలమైన సమాధానం వచ్చింది. దాంతో 'బాబా ఏం చేయబోతున్నారో' అనుకున్నాను. హఠాత్తుగా స్టేట్ కౌన్సిలింగ్ ప్రకటించారు. నేను దానికి అప్లై చేసాను. బాబా కృప! అందులో నేను కోరుకున్న స్పెషలైజేషన్‌లో సీటు వచ్చింది. పెద్ద ఆశ్చర్యం ఏమిటో తెలుసా?! కాలేజీ పేరు 'సత్యసాయి మెడికల్ కాలేజ్'. నేను అంతకుముందెప్పుడూ ఆ పేరు వినలేదు. నేను కాలేజీలో చేరాక అక్కడ రిసెప్షన్లో చూస్తే, పెద్ద సాయిబాబా ఫోటోలు రెండు ఉన్నాయి. అలా బాబా నన్ను తాను ఉన్న చోటుకే తీసుకెళ్లారు. తన సమక్షంలోనే నేను నా హయ్యర్ స్టడీస్ చేసేలా అనుగ్రహించారు. సాయిబాబా యందు నమ్మకం ఉంచండి. ఆయన మనకేది మంచిదో దాన్ని సరైన సమయంలో మనకు అందిస్తారు.

సాయి చూపిన కరుణ

ఒక సాయిభక్తురాలి అనుభవం:
ఒక శీతాకాలంలో నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాను. ఒకరోజు రాత్రి మా పాప దగ్గు, జ్వరంతో ఇబ్బందిపడుతోంది. ఆ కారణంగా తను నిద్రపోలేకపోయింది. నేను సహాయం చేయమని కరుణామూర్తి అయిన బాబాను ప్రార్థించాను. ఆ తరువాత కొద్ది నిమిషాలలోనే తను నిద్రపోయింది, తన జ్వరం కూడా తగ్గిపోయింది. "థాంక్యూ వెరీ మచ్ బాబా!"
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2388.html

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo