సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 142వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా నా ఆరోగ్యాన్ని చూసుకుంటారు
  2. జీవితప్రయాణంలో బాబా సహకారం

బాబా నా ఆరోగ్యాన్ని చూసుకుంటారు


ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబా బిడ్డని. నేను డిఫెన్స్‌లో పనిచేస్తూ దేశసేవలో నిమగ్నమై ఉన్నాను. నేను కుటుంబానికి దూరంగా ఉంటున్న దురదృష్టవంతుణ్ణి. అలాంటి నాకు బాబానే తల్లి, తండ్రి, సోదరుడు అన్నీ. నేను కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాను. వాటిని పూర్తిగా నయం చేస్తానని బాబా నాకు నమ్మకాన్ని ఇచ్చారు. అందుకే నా సమస్య పూర్తిగా తీరకపోయినప్పటికీ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా కుటుంబసభ్యులు నా పెళ్లికోసం సన్నాహాలు చేస్తున్నారు. అటువంటి సమయంలో హఠాత్తుగా నా జననావయవములలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఒంటరివాడినైన నాకోసం ఏడ్చేవాళ్ళు కూడా లేరు. రోజూ నా మొబైల్లో బాబా ఫోటో ముందు ఏడుస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు సాయి మందిరంలో కూడా. అలా మందిరంలో ఉన్నప్పుడు జీవితంలో నిజమైన బాధ అంటే ఏమిటో నాకు తెలిసింది. ఆ సంఘటన తరువాత నేను చాలా శాంతంగా మారిపోయాను. తరువాత ఒకరోజు సాయంత్రం సంధ్య ఆరతి చూస్తూ, "బాబా! దయచేసి నాకీ సమస్య నుండి ఉపశమనం కలిగించండి. సమస్యను ఎదుర్కొనే శక్తినివ్వండి" అని కన్నీళ్లతో బాబాను ప్రార్థించి అలాగే నిద్రపోయాను. కొంతసేపటికి మెలకువ వచ్చేసరికి హఠాత్తుగా నా ఆరోగ్యం కుదుటపడుతున్న అనుభూతి కలిగింది. బాబా నాకు పునర్జన్మనిచ్చినట్లుగా అనిపించి చాలా సంతోషించాను. ఇప్పటికీ నాకు చికిత్స కొనసాగుతోంది, కానీ బాబా అంతా చూసుకుంటారు. ఆయన చాలా దయగలవారు. ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.  నేనిప్పుడు ఆయనకు బాగా అలవాటు పడిపోయాను. ఎక్కువ సమయం సచ్చరిత్ర చదువుతూ, ఆయన పాటలు వింటూ ఉంటాను. తద్వారా నాకు సానుకూలమైన శక్తి లభిస్తుంది. మీరు కూడా ఏవైనా కష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండవచ్చు. బాబా తప్పక సహాయం అందిస్తారు. అందుకు నా అనుభవం ఒక ఉదాహరణ. బాబా యందు విశ్వాసాన్ని ఉంచండి. ఆయన ఖచ్చితంగా మీ ప్రార్థనలు వింటూ మీ కష్టాన్ని తొలగిస్తారు. "ఐ లవ్ యు బాబా! ఐ లవ్ యు సో మచ్! బాబా! దయచేసి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా మీ భక్తులను ఆశీర్వదించండి. ప్లీజ్ ప్లీజ్ బాబా".

జీవితప్రయాణంలో బాబా సహకారం

చెన్నై నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. బ్లాగులు నిర్వహిస్తూ బాబాతో మా అనుభవాలు పంచుకునే అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. సాటి సాయిభక్తులతో అనుభవాలు పంచుకోవడం నిజంగా చాలా ఆనందాన్నిస్తుంది. పైగా బ్లాగులోని అనుభవాల ద్వారా 'కష్టసమయంలో జాగ్రత్తగా చూసుకోవడానికి బాబా ఉన్నారు, దేనికీ ఆందోళనపడనవసరం లేద'నే ధైర్యం కలుగుతుంది.

మొదటి అనుభవం:

నేను తరచూ ప్రయాణాలు చేయాల్సి వుంటుంది. కానీ రైలు ప్రయాణమంటే నాకు అసలు ఇష్టం ఉండదు. ఆ ప్రయాణం చాలా విసుగ్గా ఉండటమే కాదు, తరువాత కొన్ని రోజుల పాటు కలతగా కూడా ఉంటుంది. అయితే ఒకరోజు చెన్నై నుండి మా సొంత ఊరికి రైలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆరోజు గురువారం కావడంతో నేను ఉదయం 4 గంటలకి లేచి 5 గంటలకల్లా బాబా పూజ పూర్తి చేసుకుని, "బాబా! ఈరోజు పగలంతా నేను రైలు ప్రయాణం చేయబోతున్నాను. కాబట్టి నేను ప్రయాణంలో ఒంటరితనంతో విసుగు చెందకుండా, ఉండేందుకు అవసరమైనది చేయండి బాబా" అని ప్రార్థించాను. తరువాత స్టేషన్‌కు బయలుదేరాను. స్టేషన్‌కు వెళ్లే దారిలో బాబా మందిరానికి వెళ్లి బాబా ఆశీస్సులు తీసుకున్నాను. రైలెక్కి నా సీటులో కూర్చుంటూనే, 'ఈ రోజంతా రైల్లో ఎలా గడపాలి' అని ఆందోళనపడ్డాను. అంతలో నన్ను దాటుకుంటూ వెళ్తున్న నా స్నేహితురాలిని చూసి ఆశ్చర్యపోయాను. తను నాకు చాలా మంచి స్నేహితురాలు. తనని చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక తను నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. ప్రయాణమంతా మేము మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపాము. అంతకుముందెన్నడూ లేనంత ఆనందంతో సొంత ఊరికి చేరుకున్నాను. "థాంక్యూ బాబా! నా జీవితంలోని ఈ చిన్న ప్రయాణంలో ఇంత చక్కటి ఏర్పాటు చేశారు. లవ్ యు బాబా!" ఈ అనుభవం సాయి తండ్రి పట్ల నా విశ్వాసాన్ని దృఢతరం చేసింది.     

రెండవ అనుభవం:

2018, జులైలో నాకు, నా కాబోయే భర్తకు మధ్య సానుకూలతకు సంబంధించి సమస్యలు వచ్చి తను నాతో మాట్లాడటం మానేశాడు. దానితో నేను చాలా కలవరపడ్డాను. ఆ విషయమై తరచూ బాబాకు చెప్పుకునేదాన్ని. ప్రతిసారీ బాబా నుండి సానుకూలమైన స్పందన వస్తుండేది. దానితో కాస్త సంతోషపడినా మళ్ళీ కలవరపడుతూ ఉండేదాన్ని. దానివలన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. కాలం గడుస్తూ 2019, జనవరి నెల వచ్చింది. నా విషయంలో బాబా ప్రణాళిక ఏమిటో అర్థంకాక నేను ఆందోళనపడుతూ ఉన్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు తను నాతో మాట్లాడాడు. ఇప్పుడంతా నార్మల్ అయిపోయింది. 6 నెలల గ్యాప్ తరువాత బాబా మళ్ళీ మా ఇద్దరిని కలిపారు. "థాంక్యూ, థాంక్యూ సో మచ్  బాబా!"  బాబా మనందరినీ మంచి ఆరోగ్యంతో, చాలినంత సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo