ఈరోజు భాగంలో అనుభవం:
- 6ఏళ్ళ బాబుకి బాబాతో ఏర్పడుతున్న అనుబంధం
సాయిబంధువు శ్రావణి తన 6ఏళ్ళ బాబుకి బాబాతో ఏర్పడుతున్న అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ నా నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలను ఎప్పటికప్పుడు నేను మన ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు బాబా మా బాబుని ఎలా ప్రేమగా చూసుకుంటున్నారో మీతో పంచుకుంటాను.
బాబా మా బాబుకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారని నేననుకుంటాను. ఎందుకంటే, 2016 మార్చి నెలలో మేము కంపెనీ టూరులో భాగంగా ఊటీ వెళ్ళాం. అప్పుడు మా బాబు వయస్సు 3 సంవత్సరాలు. అక్కడ ‘షూటింగ్ స్పాట్’ అనే లొకేషన్లో ఉండగా మా బాబు, “మమ్మీ, సాయిబాబా!” అన్నాడు. ‘ఎక్కడ?’ అని అడిగితే లోయలో ఉండే చెట్లవైపుకి చూపిస్తూ, ‘బాబా అక్కడున్నారు’ అన్నాడు. వాడికి ఆ టైంలో మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు. నేను, “సాయిబాబా లేదు, ఏం లేదు, అలా భయపెట్టకు” అని అప్పుడు వాడిని కోప్పడ్డాను కూడా. "నన్ను క్షమించండి బాబా!"
వాడిని అలా కోప్పడటానికి ఒక కారణముంది. 2017 దాకా నేను బాబాని అంతగా నమ్మేదాన్ని కాదు. అందుకు కారణం, మా నెల్లూరులో గొలగముడి వెంకయ్యస్వామిని ఎక్కువ ఆరాధిస్తారు. ఆయన మా తాతగారి ఊరిమీదుగా నడుచుకుంటూ సముద్రం వరకు వెళ్ళేవారట. ఈ విషయం మా తాతగారు ఎన్నోసార్లు చెప్పేవారు. మా తాతగారు కూడా ఆయనని ఆరాధించేవారు. కానీ, నా చిన్నతనంలో కొంతమంది బయట వ్యక్తులు స్వామి గురించి చులకనగా మాట్లాడడం విని నేను అప్పటినుండి బాబా, వెంకయ్యస్వామి కూడా మనలాంటి వారే అని అనుకుని ఎవరినీ నమ్మేదాన్ని కాదు. కానీ మా ఇంట్లో మా నాన్నగారు బాబా భక్తులు. మా ఇంటినిండా బాబా ఫొటోలే ఉంటాయి. మా పెళ్లి శుభలేఖపై కూడా బాబా ఫోటో పెద్దది వేయించారు. 2017 జనవరిలో మా నాన్నగారి కోరికపై మేము శిరిడీ వెళ్ళడంతో బాబా నన్ను కూడా తన వైపుకి లాక్కున్నారు. ఇక అప్పటినుండి బాబా ఇచ్చిన అనుభవాలు అన్నీ మీతో పంచుకుంటూనే ఉన్నాను. ఇక మా బాబు అనుభవాలకి వస్తే...
నేను 2019, జూలై 6న వాడిని మా ఇంటి దగ్గరలో ఉండే ఒక షాపుకి ఒంటరిగా పంపించి దూరంనుండి చూస్తూ ఉన్నాను. మా వీధిలో ఉండే బాబా గుడి దగ్గర ఒక కుక్క అడ్డురావడంతో వాడు క్రింద పడిపోయాడు. కుడిచేతికి బాబా గుడికి ఉండే గ్రిల్ గీసుకొని బాగా ఎర్రబారిపోయింది. ఆ తరువాత కొంచెంసేపు అలానే ఏడ్చి ట్యూషన్‌కి వెళ్ళిపోయాడు. మరుసటిరోజు నేను లేవగానే వాట్సాప్‌లో వచ్చిన బాబా ఫోటోలు చూస్తుండగా వాడు నా ఫోన్ లాక్కుని బాబాని ముద్దుపెట్టుకుంటున్నాడు. ఆ సన్నివేశం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించి, “ఎందుకు బాబాకి ముద్దుపెట్టావు?” అని అడిగితే, “నిన్న ట్యూషన్లో చెయ్యినొప్పి ఎక్కువగా వుంది మమ్మీ. అప్పుడు నేను, “చెయ్యినొప్పి తగ్గాలి బాబా, ప్లీజ్!” అన్నాను. వెంటనే నొప్పి తగ్గిపోయింది” అని చెప్పాడు. మా బాబుపై బాబా చూపిన ప్రేమకు ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
మా బాబుకి ఎప్పుడు దగ్గు వచ్చినా అంత త్వరగా తగ్గదు. బాగా అల్లరివాడు కావడంతో నాకు తెలియకుండా తన ఆరోగ్యానికి పడనివన్నీ తినేస్తూ ఉంటాడు. దగ్గు ఎక్కువ అవుతుండడంతో బాబా ఊదీని నీళ్ళలో కలిపి త్రాగించాను. వెంటనే నెమ్ము అంతా ఒక్కసారిగా బయటికి వచ్చేసి వాడికి చాలా ఉపశమనం లభించింది. ప్రతి పూటా వాడే అడిగి ఊదీనీళ్ళు తాగేవాడు. వేరే మందులు ఏమీ వాడే అవసరం లేకుండా బాబా ఊదీతో మాత్రమే వాడికి దగ్గు తగ్గిపోయింది. “థాంక్యూ సో మచ్ బాబా!”
ఒకసారి మేము నాగసాయి మందిరానికి వెళ్ళాము. అక్కడ వివిధ ఆకృతుల్లో బాబా బొమ్మలు, తిరగలి అన్నీ పెట్టి అలంకరించి ఉంటారు. మా బాబు పైకి ఎక్కి బాబా చేతిలో చిల్లర పెట్టి, “తీసుకో బాబా, తీసుకో! చాక్లెట్లు కొనుక్కో!” అని బాబాతో చెప్పాడు. అది చూసిన మేమందరం ఆశ్చర్యపోయాం. ఆ సన్నివేశం ఎప్పటికీ గుర్తుండేలా ఫోటో తీసి పదిలంగా దాచుకున్నాను.
రీసెంట్ గా 2019, జులై 28న మధ్యాహ్నం నుండి మా అబ్బాయికి వాంతులు మొదలయ్యాయి. అప్పటినుండి రాత్రి 11వరకు వాంతులవుతూనే ఉన్నాయి. ఆ సమయంలో నేను బాబాని ప్రార్ధించి ఊదీ నీళ్లలో కలిపి వాడి చేత త్రాగించాను. కొద్దిసేపట్లో వాడికి మళ్ళీ వాంతి అయ్యింది. చూస్తే, అందులో పేపర్ ఉంది. వెంటనే మావారితో ఆ విషయం చెపితే తాను, "ఉదయం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరున్న ఒకరింటికి వెళ్ళాడు. వాళ్ళు తనకి లడ్డులు ఇచ్చారు. ఇంతలో నేను అక్కడికి వెళ్లడం గమనించి, నేనెక్కడ ఆ లడ్డులు తిననివ్వనోనని వాడు పేపరుతోపాటు లడ్డుని తినేసాడు" అని చెప్పారు. పేపర్ బయటకి వచ్చిన తరువాత మరి వాంతులు కాలేదు. ఆలా బాబా ఊదీతోనే మా అబ్బాయి సమస్య పరిష్కారమైంది.

అదేరోజు ఉదయం మావాడు నిద్రలేస్తూనే కళ్ళు కూడా తెరవకుండానే నా దగ్గరకి వచ్చి, "నన్ను శిరిడీకి తీసుకెళ్ళు, అసలు ఎప్పుడు తీసుకెళ్తావు?" అని అడిగాడు. నేను "ఏమైనా కల వచ్చిందా?' అని అడిగితే, "లేదు, తీసుకుపో త్వరగా" అన్నాడు. తరువాత వాళ్ళ డాడీతో, "నీ ఫోన్ ఇవ్వు, టికెట్స్ బుక్ చేసుకోవాలి" అని అడిగాడు. మాకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ నిద్రలేవగానే ఎక్కువసార్లు ఇలానే అడుగుతుంటాడు. అదేమిటో మాకు అర్థం కావట్లేదు గానీ, వాడు బాబాతో బాగా అనుబంధాన్ని పెనవేసుకుంటూ ఆయనకు దగ్గరవుతున్నాడని అనిపిస్తుంది. ఇంత చిన్న వయస్సులోనే వాడికి బాబాపట్ల ఏర్పడుతున్న ప్రేమకి ముచ్చటేస్తుంది. ఇప్పుడు నేను ఈ అనుభవం టైపు చేసే సమయంలో కూడా, “ఎవరో ‘బాబా!’ అంటున్నారు మమ్మీ, నీకు వినిపిస్తోందా?” అని అడిగాడు. నేను 'వినిపించడంలేద'ని చెప్పాను. “నాకు వినిపిస్తోంది మమ్మీ! బాగా విను” అని మరోసారి అన్నాడు. “బాబా! నిజంగా నాకు ఏమీ వినపడలేదు. వాడికి మీరు తోడుగా ఉన్నారని నాకు అర్థమైంది. ఎప్పుడూ వాడిని మీరు ఇలాగే చూసుకోండి బాబా!”.
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteనిజంగానే మీ జీవితం ధన్యం.
ఈ బ్లాగ్ కూడా బాబా మీద ఉన్న నమ్మకం తగ్గిపోతున్న నాకు బాబా కరుణా కటాక్షాలను గుర్తుచేస్తూ బాబా కి దూరం కాకుండా సహాయపడినందు కృతఙ్ఞతలు.
అంతా బాబా దయ అండి.
Delete🕉 sai Ram
ReplyDeleteBaba chala daggaraga unnaru mi baabu ki.
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete