సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శేజ ఆ ర తి (తెలుగులో భావంతో)


🌹శేజ్ ఆరతి🌹

(రాత్రి పదిగంటలకు ధూపదీప నైవేద్యాలర్పించి ఐదు వత్తులతో ఆరతి యివ్వాలి)


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

 (1)
                 
(1) ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాథా, మాఝ్యా సాయినాథా!!
     పాంచాహీ తత్త్వాంచా దీప--లావిలా ఆతా!!

భావం:-  ఓ నా సద్గురునాథా! నా సాయినాథా! మీకు ఆరతి.
             పంచతత్త్వాలనే దీపాలుగా (మీకు ఆరతి) తిప్పుతున్నాను.

(2) నిరాకరాచీ స్థితి కైసీ ఆకారా ఆలీ, బాబా ఆకారా ఆలీ!!
      సర్వాఘటీ భరూని ఉరలీ--సాయి మావులీ !!ఓవాళూ!!

భావం:- నిరాకారమైన స్థితి ఆకారమెలా పొందినది?
            సర్వమూ వ్యాపించియింకనూ సాయి తల్లిగా శేషించి యున్నారు.

(3) రజ తమ సత్వ తిఘే బాబా మాయా ప్రసవలీ, బాబా మాయా ప్రసవలీ!!
      మాయేచియే పోటీ కైసీ మాయా ఉద్భవలీ !!ఓవాళూ!!

భావం:- రజస్సుతమస్సుసత్వము అనే గుణాలు మాయనుండి ఉద్భవించాయి. (కాని) ఆ మాయ యొక్క పొట్ట (గర్భం) నుండి (మరొక) మాయ ఎలా ఉద్భవించింది?

(4) సప్తసాగరీ కైసా బాబా ఖేళ్ మాండీలా, బాబా ఖేళ్ మాండీలా!!
      ఖేళూనియా ఖేళ్ అవఘా విస్తార కేలా !!ఓవాళూ!!

భావం:- సప్త సాగరములనూ మీరు క్రీడారంగంగా ఎలా చేసుకున్నారు?
            అలా ఆడుతూ మీ ఆట (లీల) ను విస్తరింప చేసుకున్నారు.

(4) బ్రహ్మాండాచీ రచనాకైసీ దాఖవిలీ డోలా, బాబా దాఖవిలీ డోలా!!
      తుకాహ్మణే మాఝా స్వామీ--కృపాళూ భోళా !!ఓవాళూ!!

 భావం:- ఈ బ్రహ్మాండము యొక్క రచన (సృష్టి) ఎలా మాకు కనిపించేలా చేసారు.
             నా స్వామి కృపాళువు, కపటము లేనివాడు (భోళా) అని తుకారాము కీర్తించారు.

(2)

(1) లోపలే జ్ఞాన జగీ! హిత నేణతీ కోణీ
     అవతార పాండురంగ! నామఠేవిలే జ్ఞానీ

 భావం:- ఈ జగత్తులో జ్ఞానం లోపించింది. ఎవరూ తమ హితం తెలుసు కోలేకున్నారు.
            (అందువలన) పాండురంగడు అవతరించారుఆయనకే "జ్ఞాని" (జ్ఞానేశ్వర మహారాజు)              అని నామదేవుడు పేరు పెట్టాడు.

(2) ఆరతీ జ్ఞానరాజా! మహాకైవల్యతేజా
      సేవితీ సాధుసంతా! మనువేధలా మాఝా !!ఆ--జ్ఞా!!

 భావం:-  (అటువంటి) ఓ జ్ఞానేశ్వర మహారాజాఓ కైవల్యతేజా! (మీకు) ఆరతి.
            సాధుసంతులు (మిమ్ము) సేవిస్తున్నారు. నా మనస్సు మీ పట్ల ఆకర్షించబడుతున్నది.

(3) కనకాచే తాటకరీ! ఉభ్యా గోపికనారీ
     నారద తుంబరహో! సామగాయన కరీ !!ఆ--జ్ఞా!!

 భావం:- ఇద్దరు గోప స్త్రీలు చేత బంగారు (ఆరతి) పళ్ళెములు పట్టుకొని నిలచారు.
              నారద తుంబురులు సామగానం చేస్తున్నారు.

(4) ప్రగట గుహ్యబోలే! విశ్వబ్రహ్మచి కేలే
     రామజనార్దనీ! సాయి మస్తక ఠేవిలే !!ఆ--జ్ఞా!!

భావం:- గుహ్యమైన బ్రహ్మ స్వరూపాన్ని మీరు (మీ రూపంలో) యీ విశ్వానికి ప్రకటం చేశారు.
             రామజనార్ధన స్వామి మీ పాదాలపై శిరసు వంచి నమస్కరిస్తున్నాడు.
                  
3 )

(1) ఆరతి తుకారామా! స్వామి సద్గురుధామా
      సచ్చిదానంద మూర్తీ! పాయ దాఖవి ఆహ్మా !!ఆ--తు!!

భావం:- తుకారామా (మీకు) ఆరతి--స్వామిసద్గురు ధామమా.
             ఓ సచ్చిదానంద మూర్తీనాకు మీ పాద దర్శనమివ్వండి.
(2) రాఘవే సాగరాత! జై సే పాషాణ తారిలే
      తై సే హే తుకో బాచే! అభంగ రక్షీలే !!ఆ--తు!!

భావం:- రాఘవుడు (రాముడు) ఎలా పాషాణాలను (రాళ్ళను) సముద్రంపై తేలేలా చేశారో.
             అలానే తుకారాముని అభంగములను గూడ చేసి రక్షించారు.
(3) తూకిత తులనేసీ! బ్రహ్మతుకాసి ఆలే
     హ్మణోని రామేశ్వరే! చరణీ మస్తక ఠేవిలే !!ఆ--తు!!

భావం:- ఆయన మహిమలను తూచి చూస్తే తుకారాము బ్రహ్మమే (అవుతారు).
            అందుకే ఆయన పాదాల ముందు రామేశ్వరుడే తలవంచాడు.

(4)

(చరణములలో చివరి వాక్యము తప్ప మిగిలినవి రెండు సార్లు పాడవలెను)

(1) జై జై సాయినాథ ఆతా--పహుడావే మందిరీ హో
     హళవితో సప్రేమే తుజలా--ఆరతి ఘేవునికరీ హో !!జై జై!!

భావం:- సాయినాథా! మీకు జయము జయము. మీరు మందిరంలో పవ్వళించండి.
             హృదయ పూర్వకమైన ప్రేమతో మీకు యిచ్చే ఆరతి గైకొనండి.

(2) రంజవిసీ తూ మథుర బోలునీ--మాయ జశీ నిజ ములా హో
      భోగసి వ్యాధీ తూచ హరునియా--నిజసేవక దుఃఖాలా హో
      ధావుని భక్తవ్యసన హరసీ--దర్శన దేసీ త్యాలా హో
     ఝాలే అసతిల కష్ట అతీశయ! తుమచే--యా దేహాలా హో !!జై జై!!

భావం:- తల్లి స్వంత బిడ్డలనువలె (మీరు) మధురమైన మాటలతో మమ్మల్ని రంజింప చేస్తారు.
             మీ నిజసేవకుల వ్యాధులు హరించివారి దుఃఖాలను మీరే అనుభవిస్తారు.
             పరుగున వచ్చి భక్తుల కష్టాలు హరించి (వారికి) మీరు దర్శనమిస్తారు.
             అసలు కష్టాల అతిశయమంతా మీ దేహానిదే.

(3) క్షమా శయన సుందర హీ శోభా--సుమన శేజ త్యా వరీ హో
      ఘ్యావీ థోడీ భక్త జనాంచీ! పూజ అర్చాకరీ హో
      ఓవాళీతో పంచప్రాణ! జ్యోతి సుమతీ కరీ హో
      సేవా కింకర భక్త ప్రీతీ! అత్తర పరిమళ వారి హో !!జై జై!!

భావం:-క్షయమనే పూలతో అమర్చబడిసుందర శోభగల్గియున్న శయనం(ప్రక్క) పైన వుండండి.
            మిమ్ము కొలచే భక్తులను (మీకు) పూజ మొదలైన సేవలు చేయనివ్వండి.
            పంచప్రాణములనే వత్తులకు సుమతి యనే జ్యోతిని వెల్గించాను.
           (మీ) సేవచేసే కింకరులుభక్తులూ అయిన మేమర్పించే భక్తియే అత్తరు పరిమళము.

(4) సోడుని జాయా దుఃఖ వాటతే! సాయి త్వచ్చరణాసీ హో
      ఆజ్ణేస్తవ హా ఆశీప్రసాద! ఘేవుని నిజసదనాసీ హో
      జాతో ఆతా యేవు పునరపి త్వచ్చరణాచే పాశీహో
      ఉఠవు తుజలా సాయిమాఉలే--నిజహిత సాధాయాసీ హో !!జై జై!!

 భావం:- సాయీ! మీ పాదాలను విడచి యింటికి వెళ్ళాలంటే మాకు దుఃఖం కల్గుతోంది.
        మేమిప్పుడు మీఆజ్ఞ మేరకు మీ ఆశీస్సులు, ప్రసాదము తీసుకొని మా యిళ్ళకు వెడతాము.
        (ఇప్పుడు) వెళ్ళినా, మేము మరలా వచ్చి మీ పాదాల వద్ద చేరుతాము.
        సాయీ, తల్లీ! మిమ్మల్ని నిద్రమేల్కోల్పి మా హితం సాధించు కొంటాము.

(5)

(మీ నిజవిలే శేజేలా !!అతా!!
 1) అతాస్వామీ సుఖేనిద్రా కరా అవధూతా! బాబా కరా సాయినాథా!
      చిన్మయ నిజసుఖధామ జా వుని పహుడా ఏకాంత!

భావం:- స్వామీఅవధూతా! ఇక మీరు సుఖంగా నిద్రపోండిబాబాసాయినాథాసుఖంగా నిద్రపోండి. చిన్మయమైన నిజ (ఆత్మ) సుఖధామానికి వెళ్ళి ఏకాంతంగా పడుకోండి.

(2) వైరాగ్యాచా కుంచ ఘే ఉని చౌక ఝూడిలా! బాబా చౌక ఝూడిలా!
     తయావరీ సుప్రేమేచా శిడకావా దిధలా !!అతా!!

భావం:- వైరాగ్యమనే చీపురు తీసుకుని (మీ బాట) చిమ్మాము.
             దానిపై సుప్రేమయే (నీరుగా) చల్లాము.

(3) పాయ ఘడ్యాఘతల్యా సుందర నవవిధా భక్తీ !!బాబా నవ!!
      జ్ఞానంచ్యా సమయా లావుని ఉజళల్యా జ్యోతీ !!అతా!!

భావం:-  (దానిపై) నవవిధ భక్తియనే సుందరమైన వస్త్రము పరచాము.
             జ్ఞానమనే ప్రమిద తెచ్చి జ్యోతి వెల్గించాము.

(4) భావార్థాచా మంచక హృదయాకాశీ టాంగిలా !!బాబా కాశీ టాంగిలా!!
      మనాచి సుమనే కరునీ కేలే బాబా శేజేలా !!అతా!!

భావం:- భక్తియనే మంచమును (నా) హృదయాకాశంలో వేసాను.
            మనస్సు అనే పూవును మీ శయ్య (పడక) గా చేసాను.

(5) ద్వైతాచే కపాటలావుని ఏకత్రకేలే!!బాబా ఏకత్రకేలే!!
      దుర్భుద్దీంచ్యా గాంఠీ సోడుని పడదే సోడిలే !!అతా!!



భావం:- ద్వైతమనే (రెండు తలుపుల) ద్వారాన్ని (మూసి) ఒకటిగా చేసాను.
            దుర్భుద్ధియనే గుణం విడచి తెర వేసాను.

(6) ఆశాతృష్ణా కల్పనేచా సోడుని గలబల !!బాబా సోడుని గలబలా!!
     దయా క్షమా శాంతి దాసీ ఉభ్యా సేవేలా !!అతా!!

భావం:- ఆశాతృష్ణలన్న కల్పనల గలభా విడచి,
            దయక్షమశాంతులనే దాసీలు (అక్కడ నిలచి) మీకు సేవలు చేస్తారు.

(7) అలక్ష్య ఉన్మని ఘే ఉని బాబా నాజుక దుశ్శాలా !!బాబా నాజుక దుశ్శాలా!!
      నిరంజన సద్గురుస్వామి నిజవిలా శేజేలా

భావం:- (అన్యములన్నింటినీ) అలక్ష్యం చేసి, ఉన్మని (ధ్యానము) యనే శాలువ తీసుకొని,
             నిరంజనుడవైన ఓ సద్గురుస్వామీ! ప్రక్కమీద శయనించండి.

(6)

పాహేప్రసాదాచి వాటద్యావేదు‌ఓనియాతాటా
శేషాఘే‌ఉని జా ఈనతుమచే ఝూలీయాబోజన
ఝూలో ఆతా‌ఏకసవాతుహ్మ ఆళంవావోదేవా

శేషాఘే‌ఉని జా ఈనతుమచే ఝూలీయాబోజన
తుకాహ్మణే ఆతా చిత్త కరునీరాహిలో నిశ్చిత్
శేషాఘే‌ఉని జా ఈనతుమచే ఝూలీయాబోజన

(7)

పావలా ప్రసాద‌ఆత విఠోనిజవే బాబా ఆతానిజవే
ఆపులాతో శ్రమకళోయేతసేభావే


భావం:- విఠలా! మీ ప్రసాదం లభించినది. ఆలోచించగా మీ శ్రమయంతయు మాకర్ధమైనవి. దయాళువైన ఓ సాయీ!

ఆతాస్వామీ సుఖే నిద్రా కరా గోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా


భావం:- సుఖంగా నిద్రించుము. మనోరధములు ఈడేరినవి. మేము ఇండ్లకు వెళ్ళెదము.


తుహ్మసీ జాగవూ ఆహ్మ‌ఆపుల్యా చాడా బాబా ఆపుల్యాచాడా
శుభా శుభ కర్మేదోష హరావయాపీడా


భావం:- మా కష్టములను విన్నవించు కొనుటకై నిన్ను లేపుదుము. శుభాశుభకర్మ దోష  పీడా పరిహారము. గావించుకుందుము.


అతాస్వామీ సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా


భావం:- సుఖంగా నిద్రించుము. మనోరధములు ఈడేరినవి. మేము ఇండ్లకు వెళ్ళెదము.


తుకాహ్మణేధిదలే ఉచ్చిష్టాచేభోజన (బాబా) ఉచ్చిష్టాచే భోజన
నాహినివడిలే అహ్మ ఆపుల్యాభిన్నా


భావం:- మీ పై ఇతర భావము నుచంక మాలో ఒకనిగా భావించితిమి. మీ ఉచ్చిష్ట భోజనము ప్రసాదముగా లభించినందుకు ధన్యులమైతిమి.


అతాస్వామీ సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరధజాతో ఆపులేస్ధలా

భావం:- సుఖంగా నిద్రించుము. మనోరధములు ఈడేరినవి. మేము ఇండ్లకు వెళ్ళెదము.




శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై



*(శేజ హారతి సమాప్తము.)*

1 comment:

  1. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo