- బాబా అద్భుత అనుగ్రహం - మూడవ భాగం
నా పేరు రాజేశ్వరి. మాది విజయవాడ. నేను ముందు భాగాలలో కొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఒకరోజు మానాన్నకి ఒంట్లో బాగాలేదు. ఆయనకు మమ్మల్ని చూడాలనిపించి పిలిపించుకున్నారు. మేము వెళ్లేసరికి ఆయనకి ఆయాసంగా ఉంది. మేము నాన్నని చూసి విజయవాడ తిరిగి వచ్చేసాం. మా ఇంట్లో మేము పడుకునే గదిలో సాయిబాబా ఫోటో ఉంది. రోజూ నిద్రలేవగానే ఆఫోటోకి దణ్ణం పెట్టుకోవటం నాకలవాటు. నాన్నని చూసి వచ్చిన మరునాడు ఉదయం నిద్రలేచి బాబాకి దణ్ణం పెట్టుకుంటుంటే, ఆయన ఏడుస్తున్నట్లు నాకు కనపడింది. అప్పటికే మేము అనుకోని కారణాల వల్ల సొంతింట్లో నుండి అద్దె ఇంట్లోకి వచ్చాం. అందుకని బాబా అలా కనపడుతున్నారనుకొని, “నువ్వెందుకయ్యా! బాధపడతావు? మా మామగారు వాళ్ళకి ఈయన ఒక్క కొడుకై ఉండి కూడా ఈ విధంగా అయినందుకు, నిన్నేమీ అనటం లేదు కదా! ఇదేదో మా మంచికే అనుకుంటాము. నువ్వెందుకయ్యా అలా ఉంటావు” అన్నాను. బాబా కలలోకీ రాలేదు, నాకు సమాధానమూ ఇవ్వలేదు. మర్నాడు ఉదయం కూడా అలాగే కనిపించారు బాబా. "ఏంటి ఇలా వున్నావు?" అని అడిగాను. నాకు బాబా నుండి ఏ విధంగానూ సమాధానం రాలేదు కానీ, అదేరోజు మధ్యాహ్నం మా నాన్న చనిపోయారని మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు నాకు రెండు రోజులుగా బాబా ముఖం అలా ఎందుకుందో అర్థం అయింది. నేను పడబోయే బాధను ఆయనే ముందుగా పడ్డారు.
మా అక్కయ్యవాళ్ళు వైజాగ్‌లో ఉంటారు. ఒకసారి తన కొడుకు ఎంసెట్ పరీక్షకి వెళ్ళాడు. తను పరీక్ష వ్రాసి ఇంటికి వచ్చేదాక మా అక్క తనకి మంచి ర్యాంక్ రావాలని ఎంతో నియమనిష్ఠలతో ఒక్కరోజులో సచ్చరిత్ర పారాయణ చేస్తాననుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు చదివింది. కానీ పరీక్ష ఫలితాలు వచ్చేసరికి అబ్బాయికి అనుకున్న ర్యాంకు రాలేదు. అప్పుడు మా అక్క చాలా బాధపడి, "మీరు మావాడికి మంచి ర్యాంకు ఇప్పిస్తారనే కదా! వాడు పరీక్ష వ్రాసినంతసేపూ నేను నీ పారాయణ చేస్తూ నీ ధ్యాసలోనే ఉన్నాను. మీరు వాడు పరీక్ష వ్రాసినంతసేపూ వాడి దగ్గర, వాడికి తోడుగా ఉంటారనుకున్నాను కదా బాబా!” అంటూ బాగా ఏడ్చింది. అదేరోజు బాబా మా అక్క కలలోకి వచ్చి, “ఎందుకేడుస్తావు?" అని అక్క తలను తమ ఒడిలో పెట్టుకొని, నిమురుతూ, “నేనున్నాను కదా! నేను చూసుకుంటాను. నువ్వు అధైర్యపడకు" అని చెప్పారట. ఆ స్పర్శ అక్కకి స్పష్టంగా తెలిసిందట. ఇంకా పాలు, విబూది, అత్తరు వాసనలు వచ్చాయట. అక్కకి మెలకువ వచ్చాక కూడా ఆ వాసనలు అలాగే వచ్చాయట. అక్క చాలా సంతోషపడింది. మరుసటిరోజు అక్కవాళ్ళు అబ్బాయికి మంచి ర్యాంక్ రాలేదు కాబట్టి, ఒక కాలేజీలో పేమెంట్ సీటు కోసం రెండు లక్షలు కట్టారు. బాబా ఏ అద్భుతం చేసారోగాని, ఆ కాలేజీ ప్రిన్సిపాల్, "మీరు కట్టిన రెండు లక్షలు తీసుకోండి. నేను ఈ బాబుకి ఫ్రీగానే సీటిస్తాను. డొనేషన్ అవసరం లేదు" అన్నారు. అక్కవాళ్ళు ఆ ప్రిన్సిపాల్ని, "ఎందుకు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నార"ని అడిగితే, "అవసరం లేద"ని చెప్పరాతను.
