సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2004వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకి చెప్పుకున్నాక ఆయన సమస్య తీర్చకుండా ఉంటారా!
2. ఆరోగ్య ప్రదాత సాయి


ఆరోగ్య ప్రదాత సాయి

నా పేరు సౌదామిని. నాకు 25 సంవత్సరాలుగా బాబాతో అనుబంధం ఉంది. 2021లో నాకు కరోనా వచ్చిన దగ్గరనుండి నేను ఏదో ఒక అనారోగ్యంతో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. సరిగా అదే సంవత్సరం నాకు ఈ బ్లాగు పరిచయమైంది. అప్పటినుండి నాకు ఏ సమస్య వచ్చినా నా బాధలన్నీ బాబాకు చెప్పుకుంటూ ఉన్నాను. అలాగే ఆరోగ్య పరీక్షలన్నీ చేయించుకుంటూ ఉన్నాను. ఆ తండ్రి దయవల్ల నాకు ఏ ప్రమాదం జరగకుండా తిరిగి సాధారణ స్థితికి వచ్చి నా పనులు చేసుకుంటూ ఉండగా 2024 సంవత్సరాంతంలో ఒకసారి డాక్టర్ దగ్గరకి వెళితే, బీపీ చాలా ఎక్కువగా ఉందని మళ్ళీ అన్ని టెస్టులు చేయించమన్నారు. మరుసటిరోజు "ఈసారి కూడా నాకు ఏ ఆరోగ్య సమస్య లేకుండా చూడండి" అని బాబాని ప్రార్థించి అన్ని టెస్టులు చేయించుకున్నాను. రిపోర్టులు చూసి డాక్టర్, "అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. కానీ బీపీ కొంచెం ఎక్కువగా ఉంద"ని చికిత్స ప్రారంభించారు. బాబా దయతో బీపీ నార్మల్‌గా వచ్చేలా చేసి నాకు ఏ సమస్య లేకుండా అనుగ్రహించారు. "ధన్యవాదాలు సాయినాథా".

2025, మే నెలలో కోవిడ్-19 మరలా వస్తుందని వార్తలు వచ్చిన సమయంలో ఒకరోజు మధ్యాహ్నం నాకు ఉన్నట్టుండి 101 డిగ్రీల జ్వరం వచ్చింది. ఒళ్లునొప్పులు, కీళ్ళనొప్పుల, ఒళ్ళంతా వేడివల్ల ఆవిర్లతో మంచం మీద నుండి లేవలేకపోయాను. నాకు భయమేసి బాబాకి చెప్పుకొని మందులతోపాటు ఊదీ పెట్టుకొని, ఊదీ నీళ్ళు తీసుకుంటూ ఒకరోజు గడిపాను. రెండు రోజుల తర్వాత గొంతునొప్పి, శ్వాస ఆడక జ్వరం ఒళ్ళునొప్పులతో నరకం అనుభవించాను. అప్పుడు, "బాబా! దయచేసి నాపై దయ చూపండి" అని ఆర్తిగా చెప్పుకొని సాయిచరిత్ర తల కింద పెట్టుకొని పడుకున్నాను. మందులు వేసుకుంటూ బాబా మీద నమ్మకముంచి నా పనులు నేను చేసుకుంటుండగా రెండు రోజులకి జ్వరం, నొప్పులు అన్నీ తగ్గిపోయాయి. "నా యందు మీ చల్లని చూపు ఎల్లవేళలా ఈ విధంగానే ఉండాలి సాయిదేవా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo