ఈ భాగంలో అనుభవాలు:
1. ఊహించని విధంగా లోన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
2. బాబా దయ
3. ఊదీతో నెలసరి సమస్యను పరిష్కరించిన బాబా
ఊహించని విధంగా లోన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
నేను ఒక సాయిభక్తుడిని. నేను ఇప్పుడు ఈమధ్య బాబా అనుగ్రహాన్ని ఎలా పొందానో మీ అందరితో పంచుకుంటాను. నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత రెండేళ్లగా ఆర్థికంగా కష్టపడుతున్నాను. కారణమేమిటంటే, నేను స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇస్తానన్న సమయానికి నా దగ్గర జమ కాలేదు. లోన్స్ కోసం అన్నీ విధాలా ప్రయతించాను కానీ, అప్పటికే నేను ఇంటి లోన్ తీసుకొని ఉండటం వల్ల ఎటువంటి లోన్స్ రాలేదు. వేరే స్నేహితులను అడిగి చూశాను కానీ, ఎక్కడా నాకు డబ్బు సర్దుబాటు కాలేదు. ఒక సమయంలో నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. ఏమి చెయ్యాలో, ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక దుఃఖపడుతూనే మనస్పూర్తిగా బాబాని, "బాబా! నన్ను ఈ సంకటం నుండి బయటపడేసే శాశ్వత పరిష్కరం చూపండి" అని అడిగాను. తర్వాత ఊహించని విధంగా నాకు బ్యాంకు లోన్ వచ్చింది. అది కూడా ప్రొఫెషనల్ లోన్. నా డాక్టర్ సర్టిఫికేట్ మీద వచ్చింది. మూమూలుగా నాకున్న EMIలకి లోన్ వచ్చే అవకాశం లేదు. నేను చాలా బ్యాంకులకి ప్రయత్నించాను కానీ, ఫలితం లేకపోయింది. అలాంటిది బాబా అనుగ్రహం వల్ల ఆ లోన్ రావడంతో నా స్నేహితులకు డబ్బులు ఇవ్వగలిగాను. "ధన్యవాదాలు బాబా".
బాబా దయ
నేను ఒక సాయిభక్తురాలిని. నెలసరి సమస్య వున్న నాకు పెళ్ళై 3 సంవత్సరాలైన పిల్లలు కలగలేదు. డాక్టర్ పీసీఓడీ సమస్య మాత్రమే కాకుండా ఫెలోపియన్ ట్యూబులు బ్లాక్ ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవడానికి టెస్ట్ చేద్దామన్నారు. అయితే ఆ టెస్టు నొప్పితో కూడుకున్నదైనందువల్ల నేను కొన్నాళ్లు ఆగిన తర్వాత టెస్టుకి సిద్ధమై బాబాని, "అంతా బాగుండాలి. నొప్పి ఎక్కువగా ఉండకూడదు" అని ప్రార్థించాను. బాబా దయవల్ల డాక్టర్ బ్లాకేజ్ లేదన్నారు, నొప్పి కూడా ఎక్కువ ఏమీ రాలేదు. బాబా నాకు పిల్లలు పుడతారని తమ మెసేజ్‌ల ద్వారా తెలుపుతున్నారు. ఆయన దయవల్ల త్వరగా నేను గర్భవతినవ్వాలని కోరుకుంటున్నాను.
ఒకసారి మేము ఒక ఫంక్షన్‌కి వెళ్ళాము. ఆ ఊరిలో ఉన్న మా మేనత్త వాళ్ళింటికి రమ్మంది. కానీ మావారు నేను రానన్నారు. మేము వెళ్లకపోతే అత్తవాళ్ళు బాధపడతారు. అందుకని 'మావారు వచ్చేలా చేయమ'ని బాబాకి చెప్పుకుంటే, ఆయన దయవల్ల మావారు వాళ్ళింటికి వెళ్ళడానికి ఒప్పుకోవడంతో ఇద్దరం వెళ్లి వచ్చాము. ఇంకోసారి ఒక విషయంగా మావారికి నా మీద కోపం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! సాయంత్రానికి మావారు నాతో మాట్లాడాలి" అని అనుకున్నారు. బాబా దయవల్ల సాయంత్రానికి మావారు నాతో మాములుగా మాట్లాడారు. "ధన్యవాదాలు బాబా".
ఊదీతో నెలసరి సమస్యను పరిష్కరించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయిభక్తులకు నమస్కారం. నేను చిన్నప్పటినుండి సాయి భక్తురాలిని. ఇప్పుడు నా వయసు 40. సాయి నాకు ప్రసాదించిన ఒక అనుభవం మీతో పంచుకుంటున్నాను. నేను ఉద్యోగరీత్యా చెన్నై వెళ్ళాను. అక్కడకి వెళ్ళాక నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అయి చాలా ఇబ్బందిపడ్డాను. ఆ సమస్యతో ఒక నెల బాధపడ్డాక నాకు భయమేసి డాక్టర్ దగ్గరకి వెళితే, బ్లీడింగ్ ఆగడానికి మందులిచ్చి, "వచ్చే నెల నెలసరి వచ్చినప్పుడు కూడా ఇలాగే అయితే స్కాన్ చేయాలి" అన్నారు. నేను బాబాని ప్రార్థించి రోజూ ఊదీ నీళ్లలో వేసుకుని తాగాను. ఒకరోజు ఈ బ్లాగులో "చింతించకు, వచ్చి నా దర్శనం చేసుకో. నీ ఆరోగ్యం బాగుంటుంది" అని బాబా సందేశం చదివాను. నేను సమస్య తగ్గాక వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు ఆ సస్మస్య లేదు. "ధన్యవాదాలు ప్రభూ. మీ కృపా మీ భక్తులందరికీ ఎప్పుడూ ఉండాలి".
Om Sai Ram 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeletePlease 🙏🙏 bless my family.Be with us and bless us.Om Sai Ram.please Baba arrange room near college.please help Sai.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba naa manasulo korika neraverchu...nee paadaalaki dooram kaakunda chudu ...dhanyavaadaalu Sai
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage s ettle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl
ReplyDeleteఓంసాయిరాం
ReplyDelete