సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అఘటిత లీల సాయిది


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై


ఈ లీల షిర్డీ సాయిబాబా సంస్థాన్ వారి సాయి లీల మ్యాగజైన్ ద్వారా స్వీకరించబడింది.
తెలుగు అనువాదం:- మాధవి గారు (భువనేశ్వర్)

          అసలు నేను చెప్పాలంటే కవిని కాను, రచయతను కాదు అయినా మూల మరాఠీ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంధాన్ని హిందీలోకి అనువాదం చేయాలని ప్రేరణ ఎలా నాకు కలిగిందో నాకే ఆశ్చర్య జనకమైన విషయం.
అందుకు సంబంధించిన లీలనే నేను మీతో పంచుకోభోతున్నాను.



          నా జీవితమంతా కష్టపడుతూనే గడిచిపోయింది. నేను చదువు కేవలం 10వ తరగతి వరకు మాత్రమే సాగింది. నాకు 11 సంవత్సరాల వయస్సులో మా నాన్న గారు స్వర్గస్తులైనారు. మేము నలుగురం అన్నదమ్ములం. మా పెద్దన్నయ్య మా అందరిని తండ్రిలాగా చుసుకోనేవాడు. ఆయన ఇచ్చిన సంస్కారం వల్లనే నేను ఇప్పుడు ఇలా వ్రాయగలుగుతున్నాను.

          మాకు 1970 వరకు సాయిబాబా  గురించి తెలియదు. అసలు నమ్మే వాళ్ళం కాదు. మేము ఒక కుటుంబంలా ఉంటూ వ్యవసాయం చేసుకొనేవాళ్ళం. మాకు ఒక tobacco(పొగాకు) షాప్ వుండేది. తరువాత మాకు కిరోసిన్ షాప్ కూడా ఇచ్చారు. వాళ్ళు మాకు మేము ఉండే హింగన్ ఘాట్ నుండి 13కి.మీ. దూరంలో నేషనల్ హైవే చోక్ దగ్గర పెట్రోల్ పంపు పెట్టుకోండి అన్నారు. ఇంతలో అక్కడికి ఇంకో పార్టీ వాళ్ళు కూడా వచ్చి మాకు ఇవ్వండి ఆ స్థలం అన్నారు. ఇంకా మాకు అది రాదులే అనుకున్నాం.

          ఇంతలో ఒక సాయి భక్తుడు “అంబాదాస్” అనే ఆయన మా షాప్ కు వచ్చారు. అతను “మీరు సాయిబాబాకు పెట్రోల్ పంపు కోసం మ్రొక్కుకోండి, తప్పకుండా ఆ స్థలం మీకే వస్తుంది” అని చెప్పారు. అయినా మేము ముందు అంతగా నమ్మలేదు. కాని అతడు చాలా ధృడంగా మాకు నమ్మకం కలిగేలా చెప్పారు. మేము ఆయన మీద విశ్వాసంతో సాయి చరిత్ర పారాయణం చేశాం. తరువాత సాయి అనుగ్రహం వలన ఏ కష్టం లేకుండా ఆ స్థలం మాకే వచ్చింది. అప్పటినుండి మేము సాయి భక్తులం అయ్యాం.

          కాలక్రమంలో మేము అందరం విడిపోయి మా సొంత వ్యాపారాలు పెట్టుకున్నాం. నేను మోటార్ మెకానిక్ పని మొదలు పెట్టాను. మెకానిక్ పని నాకు ముందు ఇష్టం ఉండేది కాదు, కాని ఇప్పుడు అది నా జీవనాధారమైంది. ఇలా మొదలై మెల్లగా చిన్న చిన్న కాంట్రాక్టు పనులు, క్యాంటిన్ కూడా నడిపేవాడిని. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పెళ్ళిళ్ళు కూడా చేశాను. ఇంతలో నా భార్య స్వర్గస్తురాలైంది. ఇక నా ఒంటరి జీవితంలో సాయిబాబాయే నాకు తోడూ నీడగా నిలిచారు. బాబా ప్రేరణ వలన “ధర్మ” “శ్రీమద్భాగవతము” పుస్తకాలు వ్రాశాను.
          
           నేను గుజరాతీ సాయి సచ్చరిత్ర నిత్య పారాయణ చేసేవాడిని. ఒకరోజు బాబా ప్రేరణ వలన ‘బాబా గురించి హిందీలో మంచి సాహిత్య గ్రంధాలు లేవు. అన్ని మరాఠీ, గుజరాతీలో ఉన్నాయి. అందుకే హిందీ భాషా ప్రజలకోసం హేమడ్ పంత్ గారు వ్రాసిన ఓవీ టు ఓవీ సాయి సచ్చరిత్రను హిందీలోకి అనువదించాలని” నాకు అనిపించింది. బాబా ప్రేరణ వలన హిందీలోకి అనువాదించే పని మొదలుపెట్టాను. ఓవీ టు ఓవీ మరాఠీ సాయి సచ్చరిత్ర ఆరంభంలోనే జ్ఞేనేశ్వర్ మహారాజ్ గారి ఓవీ ఉంది. నేను అది ఎలా అనువదించగలను అని ఆశ్చర్యపోయాను. నాకు బాబా పెద్ద పరీక్ష పెట్టారు అనుకున్నాను. అయినా బాబా స్మరణ చేస్తూ అనువాదం చేస్తూ ఉన్నాను. ఇంతలో నా కలం ఒక పదం దగ్గర ఆగిపోయింది. ఆ పదం “జ్ఞానానలీ”. ఆ పదానికి హిందీలో చూస్తే “జ్ఞాన కి నలికా” అని ఉంది. అంతే నేను దాని గురించి విచారిస్తూ కూర్చున్నాను. దీనికి “నలీ” శబ్దం ఎలా కుదురుతుంది? అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. 15 నిమషాలు గడిచిపోయింది. ఏమి చేయాలో తోచలేదు. అప్పుడు ఇక ఇక్కడ ఆపేస్తాను, తరువాత చుస్తానులే అని అనుకోని నా కంప్యూటర్ షట్ డౌన్ చేద్దాం అనుకున్నాను. అలా అనుకోని కంప్యూటర్ స్క్రీన్ చూసేసరికి  ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం! ఆ ఓవీ అనువాదం అయిపోయి నా కంప్యూటర్ స్క్రీన్ మీద అదే వచ్చేసింది. (పోతన భాగవతానికి సంబందించిన ఒక సంఘటన ఉంది. అదేమిటంటే “అల వైకుంఠ పురంబులో” అని వ్రాసి తరువాత ఏమి వ్రాయాలో తెలియక పోతన గారు అలా వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడే పోతన రూపంలో వచ్చి అలవైకుంఠ పురంబులో, ఆ మూల సౌదంబులో అని వ్రాస్తారు. మన బాబా కూడా ఆ శ్రీరామచంద్రుడే).

          హిందీలో జ్ఞానానలీ అంటే జ్ఞానిక నలికా. నిజానికి అది జ్ఞానానల్, ఎలాగంటే దావానల్ లాగా. అప్పుడు అనుకున్న ఓహో ఇది బాబానే వ్రాసారు అని. తరువాత బాబా కృప వలన ఆ గ్రంధం మొత్తం హిందీలో అనువాదం పూర్తీ అయిపొయింది. కాని గ్రంధం అయితే పూర్తీ అయింది కాని, నాకు వ్యాకరణం సరిగా రాదు. అప్పుడు మళ్ళి అనుకోకుండా బాబానే చమత్కారం చేశారు. ఒకరోజు దిలీపు పవార్ గారు నా వద్దకు వచ్చారు. ఆయన మరాఠీ లో భావార్ధ శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాశారు. దాన్ని ఆయన హిందీలో ఎవరన్నా చేయగలరా అని వెతుకుతూ నా దగ్గరకు వచ్చారు. అప్పటికి మేము అపరిచితులమే. వారు నా సచ్చరిత్ర వ్యాకరణం సరిచేసి చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. కాని ఓవిలకు మూడున్నర చరణాలు ఉంటాయి అని చెప్పి నా హిందీ రచనలో దాన్ని సరిచేశారు.

          శ్రీ దిలీప్ పవార్ సహాయంతో నా హిందీ సాయి సచ్చరిత్ర బాబా అనుగ్రహంతో పరిసమాప్తి అయింది. ముందు జ్ఞానేశ్వర్ మహారాజ్ ఓవీ నుంచి చివర మూడున్నర చరణాల ఓవీల వరకు అంతా, వ్యాకరణంతో సహా బాబానే నాచేత వ్రాయించి నా జన్మ ధన్యం చేసారు.

రమేష్ హింగన్ ఘాట్


6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo