సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

స్వయంగా బాబా వచ్చి 'శ్రీసాయిలీల' బుక్స్ ఇచ్చి నా వ్యధ తీర్చారు


మదన్ గోపాల్ గోయల్ అనే సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఒక ఇంగ్లీష్ రచయిత అన్నారు, 'మనం దేనికోసం ఎదురుతెన్నులు చూస్తూ వుంటామో, అది దొరికినాక అంత ఆనందం వుండదు. ఎదురుతెన్నులు కాయడంలోనే ఆనందం వుంది' అని. కానీ ఆ ఆంగ్లకవికి ఏం తెలుసు నా వ్యధ? నేను వయస్సు మీదపడినవాడిని, వృద్ధుడిని. నా శరీరం నడిచినన్ని రోజులు చాలాసార్లు శిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి. ఇంట్లోనుంచి బయటికి కూడా పోలేని స్థితి. నేను పడే బాధ ఒక వృద్ధుడికే అర్థమవుతుంది. అందుకేనేమో శ్రీసాయినాథుడు ఒక వృద్ధుని రూపంలో నా వద్దకు వచ్చి నన్ను కృతార్థుడిని చేశారు. ఆ సాయిలీలనే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను.

నేను 'శ్రీసాయిలీల' పత్రికకి లైఫ్ టైం మెంబెర్‌ని. ఆ పత్రిక వస్తే మన సాయిభక్తులకు ఎంత ఆనందంగా వుంటుందంటే, నాకైతే చాతకపక్షికి స్వాతి నక్షత్రం నాటి వర్షపు నీటిబిందువు దొరికినట్లే. అలాంటి నేను 2010 ప్రాంతంలో 'శ్రీసాయిలీల' పత్రికకోసం ఎంత ఎదురుచూసినా సుమారు ఒకటిన్నర సంవత్సరం రాలేదు. 'బుక్స్ ఎందుకు రావట్లేదు?' అని చాలా బాధపడుతూ ప్రతిరోజూ బాబాను, "ఓ సాయినాథా! నేను నీ 'శ్రీసాయిలీల', నీ చరిత్ర చదివి తరించడానికి ఎంతో ఉత్కంఠతో, ఎన్నోరోజులుగా ఆశగా ఎదురుచూస్తున్నాను. నా బాధ మీకు తెలుసుగానీ, ప్రజలకు ఏమి తెలుసు? నేను పడే వ్యధ, కష్టం వాళ్ళకు అనుభవం కూడా ఉండదు, ఊహించి కూడా వుండరు. ఎన్నోరోజులుగా ఎదురుతెన్నులు కాస్తున్నాను నీ 'శ్రీసాయిలీల' కోసం. ఓ సద్గురు సాయినాథా! నీ కథలను వినే అదృష్టం నుంచి నన్ను వంచితుడిని చేస్తావా? నీ 'శ్రీసాయిలీల' పుస్తకంలో అత్యంత సుందరమైన నీ ఫోటోలు చూసి నేను ఆనందపడేవాడిని. ఇప్పుడెందుకో అవి రావడం లేదు. 'ఏరోజు ఆయువు అయిపోతుందో, నిన్ను చివరిసారి చూడకుండానే అంతిమశ్వాస తీసుకుంటానేమో' అని నా మనస్సు వ్యాకులపడుతూ వుంది. ఓ సాయినాథా! నీవు ధరిత్రిపై నడయాడేటప్పుడు, నీ అనన్య భక్తుల పిలుపు విని నీవు వాళ్ళందరికీ దర్శనం ఇచ్చావు. నీవే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. వాళ్ళ కష్టాలను కడతేర్చావు. నీవు నీ శరీరాన్ని వదిలేశాక కూడా నీ చైతన్యంతో, నీ సూక్ష్మరూపంతో భక్తులకు కలలో కూడా దర్శనం ఇస్తున్నావు. నీవు ఇంకా ఈ ధరిత్రిపై నీ లీలలను నడుపుతున్నావు, భక్తజన సంరక్షకుడవని తెలుపుతున్నావు. వయస్సు మీదపడిన కారణంగా నేను శిరిడీ రాలేకుండా వున్నాను. ఇప్పుడు నువ్వే నా దగ్గరికి రావాలి తండ్రీ!" అని ప్రార్థించేవాడిని.

నా బాధ ఆ సాయినాథుడికి చేరింది కాబోలు, ఒకరోజు నాలాగే 95 సంవత్సరాలు మీదపడిన ఒక వృద్ధుడు వచ్చి మా ఇంటి తలుపు తట్టాడు. నేను తలుపు తీస్తే, ఆ వృద్ధుడు 'శ్రీసాయిలీల' బుక్స్ నాకు ఇచ్చాడు. నేను ఆ వృద్ధుని ముఖాన్ని పరిశీలనగా చూశాను. అతిసుందరమైన కళ్ళు. 'ఆ కళ్ళలోకి చూస్తే చాలు, మన అనంత జన్మల పాపాలు హరిస్తాయి' అన్నంత తేజోవంతంగా ఉన్నాయి. గడ్డం, మీసం, బాబాను పోలిన పోలికలు. నేను ఆనందం పట్టలేకపోయాను. ఆ వృద్ధుడు నాతో, "నన్ను నిందిస్తావేం? నీవు నీ ఇంటి అడ్రస్ మార్చుకొన్నప్పుడు కొత్త ఇంటి అడ్రస్ నాకు ఇవ్వాలి కదా? అలా చెయ్యకుండా నన్ను నిందిస్తే ఎలా?" అని అన్నాడు. అప్పుడు నా తెలివి పనిచేసింది. అవును కదా! నేను ఇల్లు మారాను. ఆ శ్రీసాయిలీల బుక్స్ పాత అడ్రస్‌కు వెళ్తున్నాయి. అందుకనే నాకు రాలేదు. ఇదీ అసలు విషయం. ఈ విషయం నా మనస్సుకు తట్టేసరికి ఆ వృద్ధుడు అంతర్థానమయ్యాడు. అప్పుడు అనుకున్నా, 'స్వయంగా బాబా వచ్చి 'శ్రీసాయిలీల' బుక్స్ ఇచ్చి వెళ్ళారు' అని. నా జన్మజన్మల పుణ్యం పండింది. ఆ ప్రభువు స్వయంగా వచ్చాడు, నా కోరిక తీర్చాడు.

సోర్స్: సాయి లీల మ్యాగజైన్.

2 comments:

  1. ALL ARE GREAT EXPERIENCES, WE SHOULD BE THANKFUL TO THE BLOG ADMIN AND ALSO SAIBABA
    JAI SAIRAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo