- రావ్‌బహాదుర్ దివాడ్కర్
ముంబాయిలోని దాదర్ నివాసి శంకర్రావు నెరూర్కర్ ఇలా చెప్తున్నారు: "నేను బాబాకు పూర్తిగా అంకితమైన కుటుంబంలో పెరిగిన చాలా అదృష్టవంతుడిని. 94 సంవత్సరాల వయసులో 2003లో మరణించిన మా నాన్నగారు బాబాకు పరమ భక్తుడు. అతనికి తెలిసిన ఒకేఒక దైవం బాబా. అతను తన రోజును బాబా ఆరాధనతో ప్రారంభించి రోజంతా బాబా నామాన్ని జపిస్తూ, శ్రీసాయి సచ్చరిత్ర చదువుతూ, మిగిలిన సమయమంతా కూడా బాబా గురించే సంభాషిస్తుండేవారు. ఆవిధంగా మా ఇల్లు ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది. నాకు పిల్లనిచ్చి పెళ్ళి చేసిన మా మావయ్య మనోహర్ దివాడ్కర్ కూడా బాబా భక్తుడు. అతను తనకి సుమారు 4 సంవత్సరాల వయస్సున్నప్పుడు బాబాను దర్శించారు. అతని తండ్రి రావ్‌బహాదుర్ దివాడ్కర్ కూడా బాబాకు అత్యంత భక్తుడు. అతను దయార్థహృదయాడు, పరోపకార స్వభావం గలవాడు, మృదువుగా మాట్లాడేవాడు. బాబానే అతని సద్గురువు, అతనికి వేరే గురువు, దైవం తెలియదు. అతని రోజు పెదవులపై బాబా పేరుతో ప్రారంభమై బాబాకు 'కృతజ్ఞతలు' తెలపడంతో ముగిసేది. 1910-1918 మధ్యకాలంలో అతను బాబాతో సన్నిహితంగా గడిపారు. ఆ కాలంలో అతను తరచుగా శిరిడీ వెళ్లి బాబాకు తాను చేయగలిగిన సేవను సంతోషంగా చేసుకుంటుండేవారు. అతను తన జీవితాన్ని బాబాకు ఆమోదయోగ్యంగా ఉండే విద్గంగా జీవించాడు.
ఒకసారి రావ్‌బహాదుర్ శిరిడీలో ఉన్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన లీల జరిగింది. ఆ రోజుల్లో మసీదు పురాతనమైన శిథిలావస్థలో ఉన్న భవనం. మట్టి నేలపై ఆవు పేడతో అలికి ఉండేది. ఒకరోజు బాబా తమ సాధారణ స్థలంలో కట్టడా వద్ద కూర్చొని ఉండగా ఆయన పక్కన షామా, మహల్సాపతి, దీక్షిత్, నిమోన్కర్, డెంగ్లే వంటి ఇతర భక్తులు ఆయన ముందు కూర్చున్నారు. ఒక భక్తుడు బాబా పాదాలు ప్రేమతో మర్దన చేస్తుండగా మరో భక్తుడు ఆయన వీపు మర్దన చేస్తున్నాడు. ఆ సమయంలో రావ్‌బహాదుర్ మశీదుకు వెళ్లి, తన కొడుకు మనోహర్‌ని ఒడిలో పెట్టుకొని బాబాకి ఎదురుగా కూర్చున్నాడు. బాబా భక్తులతో కబుర్లు చెప్తుండగా షామా చిలుము సిద్ధం చేసి ఆయనకి ఇచ్చాడు. బాబా ఒకసారి పొగ పీల్చి చిలుము గొట్టాన్ని ఒక భక్తునికి అందించారు. అతను ఒకసారి పొగ పీల్చిన మీదట వినయంగా చిలుము గొట్టాన్ని తిరిగి బాబాకి ఇచ్చాడు. అప్పుడు బాబా ఇంకోసారి పొగ పీల్చి చుట్టూ ఉన్న భక్తులకు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత బాబాకు తీవ్రంగా దగ్గు వచ్చింది. ఆయన కఫం తెగక దగ్గుతో ఇబ్బందిపడుతుంటే రావ్‌బహాదుర్ ఆందోళన చెందాడు. బాబా మాత్రం ఒక పక్క చిలుము పిలుస్తూ, అదే సమయంలో మరోపక్క దగ్గుతూ ఉన్నారు. ఇక రావ్‌బహాదుర్ తనని తాను నిగ్రహించుకోలేక చాలా భయపడుతూ, "బాబా! మీరు చాలా ఎక్కువగా పొగ తాగుతున్నారు. మీకు కడుపునొప్పి రావట్లేదా?" అని అడిగి, ఆపై తన మాటలకి బాబా కోప్పడతారని అనుకున్నాడు. కానీ బాబా నవ్వుతూ, "అరె! నువ్వు కూడా నా చిలుము తాగు. ఇదిగో ఈ చిలుము తీసుకుని పొగ పీల్చు" అని అన్నారు. మునుపెన్నడూ పొగ తాగిన అలవాటులేని రావ్‌బహాదుర్ సంకోచిస్తూనే, "బాబా! నేను ఇంతకు ముందెన్నడూ పొగ తాగలేదు. కాబట్టి నేను మీరు ఇచ్చే చిలుము తాగలేను" అని అన్నాడు. అయినప్పటికీ బాబా అతను ఎలాగైనా ఒకటి, రెండుసార్లు పొగ పీల్చాల్సిందేనని నిశ్చయించుకున్నందున బలవంతంగా చిలుము అతని చేతిలో పెట్టి, "కానివ్వు, ఒకటి, రెండుసార్లు చిలుము పీల్చి ఏమి జరుగుతుందో చూడు!" అని అన్నారు. ఇక అతనికి వేరే దారి లేకుండా పోయింది. గురు ఆజ్ఞను పాటించకపోతే ఘోర పాపానికి పూనుకున్నట్లే! కాబట్టి గురువు చెప్పినట్లు చేయాలని లేదంటే సంపాదించినా ఆధ్యాత్మిక సంపదనంతా కోల్పోతానని అతనికి తెలుసు. అందుచేత అతను బలవంతంగా చిలుము పెదవుల దగ్గర పెట్టుకొని ఒకసారి పొగ పీల్చాడు. తర్వాత మరోసారి కూడా పీల్చాడు. తర్వాత కూడా బాబా అతనిని ఇంకా ఇంకా పీల్చమని ప్రోత్సహించారు. అతను ఆయన మాటకి తలొగ్గాడు. కొద్దిసేపటి తర్వాత అతను మరోసారి పొగ పీలిస్తే, ఆ చిలుము గొట్టం నుండి అమృతం స్రవించనారంభించింది. చిలుము గొట్టం గుండా కారుతున్న ఆ అమృతం చిక్కగా, మధురంగా, సువాసనభరితంగా ఉంది. దాని రుచి చూసిన రావ్‌బహాదుర్ పరమానందభరితుడయ్యాడు. బాబా అతని వైపు చూసి నవ్వారు. అమృతం ఇంకా స్రవిస్తూ ఉండడంతో దాన్ని బాబా ఆశీర్వాదంగా భావించి అతను తన కొడుకుకి కొద్దిగా పట్టి, ఆపై చుట్టూవున్న భక్తులందరికీ ఇచ్చాడు. అందరూ బాబా అమృతాన్ని స్వీకరించారు. బాబా పెదవులపై చిరునవ్వుతో ఆ దృశ్యాన్నంతా చూసి పైకి చూసి, "అల్లా మాలిక్. అల్లా మాలిక్" అన్నారు.
(రిఫ్: సాయి ప్రసాద్ మ్యాగజైన్; 2004; దత్తజయంతి సంచిక
సోర్స్: ఏ డివైన్ జర్నీ విత్ బాబా బై విన్నీ చిట్లూరి.)
Om Sai Ram 🙏🙏🌞
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chudandi vaalla badyata meede, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, ofce lo anta bagunde la chayandi tandri, nenu anukunna korika neravere la chayandi tandri pls
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
saibaba madava ni bhashyam school lo cherpinchalani vundi, mee agnani ivvandi baba. maa varu kuda bhashyam lo cherchudam ani anali baba
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDelete