ఈ భాగంలో అనుభవాలు:
1. సమయానికి రైలు అందించిన బాబా
2. జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన బాబా
3. కొన్నిగంటల్లో చిన్నారి జ్వరం తగ్గించిన బాబా
సమయానికి రైలు అందించిన బాబా
అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ప్రతి గురువారం బాబా గుడిలో ఆరతికి వెళ్తాను. మా ఊరి నుండి వేరే ఊరిలో ఉన్న బాబా గుడికి వెళ్లాలంటే రైలులో 10 నిముషాల సమయం పడుతుంది. ఒకరోజు ఒక అత్యవసరమైన పని ఉండటం వల్ల ఆలస్యమై గుడికి వెళ్ళటానికి కేవలం 20 నిమిషాల సమయమే మిగిలింది. వెంటనే బయలుదేరినా నేను ఉన్న చోటునుండి రైల్వేస్టేషన్‌కు వెళ్ళడానికి 10నిమిషాలు పడుతుంది. ఇంకో పది నిముషాల్లో నేను గుడికి చేరుకోవాలి. అలా జరగాలంటే నేను స్టేషన్‌కి వెళ్ళేటప్పటికి ట్రైన్ సిద్ధంగా ఉండాలి. అప్పుడే నేను ఆరతికి అందుకోగలను. అందువల్ల నేను, "బాబా! నేను ఆరతి సమయానికి మీ గుడికి చేరుకునేలా సహాయం చేయండి" అని బాబాను వేడుకొని మావారితో కలిసి స్టేషన్‌కి బయలుదేరాను. బాబా దయవల్ల మేము స్టేషన్‌లోకి వెళ్లేసరికి రైలు వస్తుంది. మేము ఆ రైలెక్కి గుడికి చేరుకున్నాము. నేను ఆరతి లైన్‌లోకి వెళ్తూనే ఆరతి లైన్ ఆపేశారు. నా వెనకాలే ఉన్న మావారిని కూడా రానివ్వకుండా అడ్డగించారు. నేను చాలా ప్రాధేయపడిన మీదటే లోపలి పంపించారు. గుడిలో మేము వెనకాల కూర్చొన్నా కూడా చాలా బాగా ఆరతి దర్శనమైంది. ఆరతి అనంతరం ప్రసాదానికి లైన్ ఎక్కువగా ఉండటంతో మావారు, "మనకి అంత సమయం లేదు కదా! వెళ్ళిపోదాము" అన్నారు. ప్రసాదం తీసుకోకుండా వెళ్లిపోవాలంటే నాకు బాధేసింది. మరుక్షణం ఒకామె ప్రసాదం తీసుకుని వస్తుంటే, "కొంచెం ప్రసాదం పెడతారా?" అని నేను అడిగాను. ఆమె చాలా సంతోషంగా నాకు ప్రసాదం పెట్టారు. ఈవిధంగా బాబాను మంచి అనుభవాన్ని ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా".
జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. 2024, మార్చి 10న ఎప్పుడూ పెట్టిన చోట మావారి బండి తాళాలు కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. ఇంతలో ఆఫీసుకు ఆలస్యం అవుతుందని మావారు ఇంకో తాళం ఉంటే, అది తీసుకొని వెళ్ళారు. సాయంత్రం మళ్లీ ఆ తాళం కోసం వెతికాం కానీ, ప్రయోజనం లేకపోయింది. ఉపయోగించుకోడానికి వేరే తాళం ఉన్నందున మేము ఆ తాళం గురించి అంతగా పట్టించుకోలేదు. అయితే, మరుసటిరోజు ఉదయం ఉన్న ఆ రెండో తాళం కూడా కనిపించలేదు. ఇల్లంతా చాలా వెతికినా కానీ ఎక్కడా కనిపించలేదు. మాకు ఏం అర్థం కాలేదు. మరోవైపు మావారు ఆఫీసులో మీటింగ్ ఉందని, బస్సుకి వెళితే చాలా అలస్యమవుతుందని బాధపడసాగారు. ఆ సమయంలో నేను ఒకసారి బాబా వైపు చూసి, "టెన్షన్ పెట్టకు బాబా. ఎలాగైనా తాళం దొరికేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. అంతలో మావారికి ఏదో ప్రేరణ కలిగి ఇంటి వెనకకి వెళ్లారు. మా ఇంటి వెనక ఖాళీ ప్రదేశం ఉంది. మా ఇంటి ప్రహరీగోడ మీద నుండి కిందికి చూస్తే, అక్కడ ముందురోజు పోయిన తాళం ఉంది. దాన్ని తీసుకొచ్చి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాము. తర్వాత మా బాబు కుర్చీ వేసుకొని ఆ ఖాళీ ప్రదేశంలో చూస్తే, ఒక వారం కింద కనపడకుండా పోయి, ఎంత వెతికినా దొరకని మా పాప వాచీ, రెండో తాళం కూడా కనిపించాయి. మాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాము. అయితే అవి ఆ గోడ అవతల ఎలా పడ్డాయో మాకు అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో బాబాకే తెలుసు. ఆయన దయవల్ల మా వస్తువులు మాకు దొరికాయి. ఈ అనుభవం ద్వారా ఇక మీద జాగ్రత్తగా ఉండాలని మాకు తెలిసింది.
కొన్నిగంటల్లో చిన్నారి జ్వరం తగ్గించిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. మేము యుఎస్ఏలో నివాసముంటున్నాము. నేను, నా భర్త ఇద్దరమూ ఐటి ఉద్యోగాలు చేస్తుండటం వల్ల మా షెడ్యూల్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. మాకు ఒక 5 సంవత్సరాల పాప ఉంది. తను తరచుగా అనారోగ్యం పాలవుతుంటుంది. ఒక శుక్రవారం నాటి సాయంత్రం పాప తనకి తలనొప్పిగా ఉందని కొద్దిగానే ఆహారం తీసుకొని తొందరగానే పడుకుంది. మధ్య రాత్రిలో తనకి దగ్గు మొదలైంది. మరుసటిరోజు తనకి 102 డిగ్రీల జ్వరమొచ్చి ఒళ్ళు కాలిపోసాగింది. సమయానికి మావారు బయటకి వెళ్లారు, వారాంతమైనందున మా డాక్టరు క్లినిక్ మూసేసారు. నాకు ఏం చేయాలో అర్థంకాక చాలా ఆందోళన చెందాను. అప్పటికి కొన్నినెలల క్రితమే పాప వాకింగ్ నిమోనియా నుండి కోలుకుని, ఇంకా చాలా బలహీనంగా ఉంది. ఆ సమయంలో నిమోనియా నయం చేయడంలో బాబానే మాకు సహాయం చేసారు. అందుచేత నేను మళ్ళీ బాబా వైపు తిరిగి ఆయనకు శరణుజొచ్చాను. నేను పాపకి ఊదీ ఇచ్చి, 'సాయి రక్షక శరణం', 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించాను. ఆశ్చర్యంగా కొన్ని గంటల్లో పాప జ్వరం తగ్గడం మొదలుపెట్టి క్రమంగా జ్వరం పూర్తిగా తగ్గిపోయి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టింది. సాయిదేవా వల్లనే ఇదంతా సాధ్యమైంది. మొత్తం ప్రపంచం, మన విధి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాబా మాత్రమే మన ఏకైక రక్షకుడు.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi
ReplyDeletebaba, madava little chandra lo chaduvuthanu anali baba, maa attagariki naa meeda kopam povali baba. tammudiki oka daari chupinchavu baba.alage oka thoduni kuda jatha cheyandi baba.
ReplyDeleteOm Sri Sai Nathaya Namah
ReplyDeleteOmsairam
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram nenu eam aina tappu cheste nannu kshaminchandi baba, amma nannalani kshamam ga chudandi baba, na manasuki nachakunda yedi jaragakunda unde la chudu baba
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba please bless my child baba ji🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం🙏🙏🙏🙏
ReplyDeleteమొత్తం ప్రపంచం, మన విధి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాబా మాత్రమే మన ఏకైక రక్షకుడు🙏🙏🙏🙏🙏 తండ్రీ!!! నీవే నాకు దిక్కు. 🙏🙏🙏🙏 రక్షించు తండ్రీ 🙏🙏🙏🙏🙏