ఈ భాగంలో అనుభవం:
- చివరి నిముషంలో గట్టెక్కించిన బాబా
నా పేరు రాంప్రసాద్. నేను హైదరాబాదులో నివాసం ఉంటున్నాను. నేను ప్రెషర్గా ఐటి ఉద్యోగంలో జాయినయ్యాను. ఆరు నెలలైనా నేను నేర్చుకున్న డొమైన్ ప్రాజెక్టు నాకు కేటాయించకుండా వేరే డొమైన్ ప్రాజెక్టులో నన్ను వేసి, ఆ డొమైన్ నేర్చుకోమని అన్నారు. సరేనని, నేను ఆ డొమైన్ నేర్చుకుంటూ ఉండగా హఠాత్తుగా 2024, జనవరి 19, శుక్రవారంనాడు నాకు రిఫరెన్స్ ఇచ్చినతను నాకు ఫోన్ చేసి నన్ను టాలెండ్(TALEND) అనే ఒక ETL టూల్ ప్రాజెక్టులో వేశానని చెప్పి, నాకు తెలియకుండానే క్లయింట్‌తో ప్రతిరోజూ సాయంత్రం 7 నుండి 8 గంటలకి కాల్ షెడ్యూల్ చేసారు. దానికి తోడు నన్ను క్లయింట్‌తో నాకు 1.5 సంవత్సరాల అనుభవముందని పరిచయం చేసుకోమన్నారు. దాంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, నాకు ఆ టూల్‌కి సంబంధించి అస్సలు నాలెడ్జ్ లేదు. పైగా ఫోన్లో నన్ను నేను పరిచయం చేసుకోగానే కేటీ(knowledge transfer) ఇవ్వడం మొదలుపెట్టింది ఆ క్లయింట్. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. పక్కనే ఉన్న ఆ డొమైన్‌లో సీనియర్స్‌కి కూడా అర్థం అవ్వలేదు. నేను భయంతో ఆ సమయమంతా బాబాని తలుచుకున్నాను. బాబా దయవల్ల ఎలాగో ఆ రోజుకి గండం గడిచింది. ఆ తర్వాత జనవరి 21, సోమవారం అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగిన రోజు కూడా బాబాని, రాముడిని తలుచుకుంటూ గట్టెక్కాను. ఇంకో నాలుగు రోజులు యాక్సిస్సులు రాలేదని క్లయింట్‌ని మేనేజ్ చేశాను. అయినప్పటికీ ఆ క్లయింట్ నాకు కొన్ని వర్క్స్ ఇచ్చేది. నేను అవి చేయలేక చాలా టెన్షన్ పడేవాడిని. ఆ క్లయింట్ కాల్ నడుస్తున్నంతసేపు నేను, "నాకు సహాయం చేయమ"ని బాబాని, రాముడిని తలుచుకుంటూ ఉండేవాడిని. ఇలా ఉండగా మా సీనియర్స్ నన్ను మా లీడ్‌తో మాట్లాడి, "నేను ఈ ప్రాజెక్టు చేయలేన"ని చెప్పమని, వాళ్లు కూడా మా లీడ్‌తో మాట్లాడారు. దాంతో సోమవారంనాడు నన్ను ఆ ప్రాజెక్ట్ నుండి తీసి వేరే ప్రాజెక్టులోని ఒక సీనియర్‌తో కలిపారు. ఆ ప్రాజెక్ట్‌లో నాతో కలిపి మొత్తం ముగ్గురం ఉండటం వల్ల నాకు కాస్త ఉపశమనంగా అనిపించింది. హమ్మయ్య బతికాననుకొని ఆ టూల్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అయితే ఆ కొత్త ప్రాజెక్టు కేవలం ఒక నెలరోజులే ఉంటుంది. ఫిబ్రవరి 29కి డెంప్లోయిమెంట్‌కి వెళ్ళిపోవాలి. ఆ ప్రాజెక్టు మీటింగ్ ప్రతిరోజు మధ్యాహ్నం 12కి ఉండేది. ఒక పది రోజులయ్యాక క్లయింట్ మేము డెవలప్ చేసిన జాబ్స్‌కి యూనిట్ టెస్టింగ్, డాక్యుమెంటేషన్ ఫిబ్రవరి 15, గురువారం సాయంత్రంకల్లా సబ్మిట్ చేయాలని చెప్పింది. అయితే ఆ కొత్త ప్రాజెక్టులోని సీనియర్ ఆ వర్క్ ఎలా చేయాలో నాకు చెప్పలేదు. కేవలం యూనిట్ టెస్టింగ్ ఎలా చేయాలో నేర్పారు. అదీకాక యూనిట్ టెస్టింగ్, డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సిన తేదికి మూడురోజుల ముందు నుండి అతను సెలువు తీసుకొని వెళ్లిపోయారు. ఇంకా నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, క్లయింట్ కాల్ చేస్తే ఏం మాట్లాడాలో నాకు తెలీదు. ఆమె టెస్టింగ్ స్టేటస్ కూడా అడుగుతుంది. అందువల్ల నాకు చాలా భయంగా ఉండేది. ఏం చేయాలో తెలియకపోయినా మా సీనియర్ నేర్పిన టెస్టింగ్ ప్రాసెస్ చేస్తే, డెవలప్ చేసిన జాబ్స్‌లో కొన్ని విజయవంతంగా రన్ అయ్యాయి. కానీ కొన్ని అవ్వలేదు, కొన్ని ఎర్రర్స్ వచ్చి ఆగిపోయాయి. క్లయింట్‌ని డౌట్స్ అడుగుదామంటే ఏం అడగాలో నాకు అస్సలు తెలీదు. మా సీనియర్ కాకుండా ప్రాజెక్టులో ఉన్న ఇంకో అతను అస్సలు నాకు సపోర్ట్ చేసేవాడు కాదు. పైగా నాకు ఏమీ రాదని తెలిసి కూడా నన్నే క్లయింట్‌ని సంప్రదించమన్నాడు. దానికి తోడు క్లయింట్, "సుపీరియర్ కాల్ చేసే లోపు డాక్యుమెంటేషన్ స్టేటస్ తప్పనిసరి" అని చెప్పసాగింది. నేను చాలా టెన్షన్ పడ్డాను. రెండు రోజులు రాత్రి రెండు, మూడు గంటల వరకు మేల్కొని చాలా ప్రయత్నం చేశాను. ఇంకా గురువారం సబ్మిట్ చేయాలనగా ఆరోజు బాబా నాపై దయ చూపారు.
కొద్దిరోజులు ముందు ఒక ఇద్దరు సీనియర్లు కొత్తగా ఆఫీసులో జాయినయ్యారు. వాళ్ళు నా సమస్య చూసి తమకున్న అనుభవంతో పరిష్కారం చూపారు. దాంతో మూడు జాబ్స్ విజయవంతంగా రన్ అయ్యాయి. ఇంకా ఒకటి మిగిలింది. దానికి కొత్త సినారియో ఉండటం వల్ల అది ఎవరికీ అర్థం అవ్వలేదు. క్లయింట్‌ని అడుగుదామంటే, ఆమెకు అప్పటికే నా మీద అనుమానమొచ్చి నా ప్రాజెక్ట్‌లో ఉన్న అతనిని సంప్రదించి, 'నాకు ఎంత అనుభవం ఉందని, ఊరికే డౌట్స్ అడుగుతున్నారు' అని అడిగిందట. అయినప్పటికీ నేను చేయగలిగిందేమీలేక బాబా మీద భారమేసి నా సమస్యను క్లయింట్‌తో చెప్తే, తను ఒక ఫైల్ ఇచ్చి రన్ చేయమంది. అది రన్ చేస్తే మిగిలిన ఆ ఒక్క జాబ్ కూడా విజయవంతంగా రన్ అయింది. అలా మొత్తానికి బాబా దయతో సాయంత్రం 7 గంటలకల్లా జాబ్స్ అన్ని రన్ అయి, డాక్యుమెంటేషన్ కూడా పూర్తైంది.
నేను కాసేపు, "అరే.. అసలు అలా ఎలా జరిగింది? ఇంతసేపు ఏం చేయలేకపోయాము కదా! హఠాత్తుగా ఎలా పూర్తి చేయగలిగాను' అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక దృశ్యం కనపడింది. మా ఆఫీసులో నేను కూర్చొనే చోట దగ్గర ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ ఉంది. నేను అలా అటు తల తిప్పి ఆ కేబిన్ వైపు చూసాను. ఆ క్యాబిన్ తలుపు తెరిచి ఉంది. అందులో బాబా కళ్ళు ఉన్న ఫోటో ఫ్రేమ్ ఉంది. అది నా కనపడింది. వెంటనే, 'బాబా నన్ను గమనిస్తున్నారని, ఆయన నా కష్టం, టెన్షన్ చూసి చివరి నిముషంలో సహాయం చేసి నన్ను ఆ క్లిష్ట పరిస్థితి నుండి గట్టించార'ని అనిపించింది. వాస్తవానికి నేను మొదటినుండి నా వల్ల ఎస్కలేషన్ వచ్చి ప్రాజెక్టు పోతుందని చాలా భయపడ్డాను. ఎందుకంటే, అది రియల్ టైం డేటా. ఏ చిన్న తేడా వచ్చినా కంపెనీపై చాలా ప్రభావం చూపుతుంది. ఎలాగో ముందుకు సాగినా ఆ నాలుగు జాబ్స్ రన్ అవ్వక అక్కడ ఆగిపోయి డాక్యుమెంటేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయగలనని నేను అస్సలు అనుకోలేదు. చివరికి ఏం చేయాలో తెలియక చేతులెత్తేద్దామనుకున్న సమయంలో, గురువారం సాయంత్రం చివరి నిమిషంలో సాయిబాబా మిరాకిల్ చేయడంతో ఆ జాబ్స్ అన్ని రన్ అయి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయగలిగాను. నేను ఆ యూనిట్ టెస్టింగ్ వర్క్ చేస్తున్నంతసేపూ, "నన్ను ఈ ప్రాజెక్టు నుండి రిలీవ్ చేసినా లేదా ఈ ప్రాజెక్టులో ఏ సమస్యా లేకుండా పని చేసి, నాకిచ్చిన టెస్టింగ్ నేను విజయవంతంగా పూర్తి చేసినా మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన్నని మనసులో బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నేను ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను ఏ తప్పటడుగు వేయకుండా నన్ను కాపాడండి బాబా. నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి చేయండి బాబా. నా మనసులో ఉన్న బాధలన్నీ తీసేయండి. నాకు అండగా ఉండండి బాబా".
Om Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏
Om Sairam!!
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu na problem meku telusu pl baba problem solve cheyandi pl
ReplyDeleteOm sai ram naaku manashanti ni evvandi, na mamasuki nachakunda yedi jaragakunda chudandi tandri, amma nannalani kshamam ga chudandi tandri vaalla badyata meede
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeletesai madava bharam antha meede baba
ReplyDelete