ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా కరుణ
2. బాబా దయ
3. దయతో మర్నాటికి నొప్పి తగ్గించిన బాబా
బాబా కరుణ
నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతిరోజు ఈ బ్లాగులో వచ్చే అనుభవాలు చదవడం వల్ల చాలా ధైర్యం, నమ్మకం కలుగుతున్నాయి. బాబా దయవల్ల 2023, ఆగస్టు 20న నా వివాహం జరిగింది. నాకు గుండె సమస్య ఉన్నందున నేను చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నాకు ఎలాంటి భర్త వస్తాడో అనుకున్నాను. కానీ బాబా దయతో నన్ను అర్థం చేసుకునే వ్యక్తిని నాకు భాగస్వామిగా ఇచ్చారు. ఇప్పుడు నా జీవితం బాగుంది. పెళ్లయ్యాక నాలుగు నెలలకు ప్రెగ్నెన్సీ కోసంగా నేను ప్రతిరోజు ఊదీ నీళ్ళు రెండు నెలలపాటు తీసుకున్నాను. అలా చేయడం వల్ల బాబా దయతో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము చాలా సంతోషించాము. 500 రూపాయలు బాబా గుడిలో అన్నదానికి ఇచ్చాము. ఇకపోతే ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు వస్తుంటాయి. నాకు చాలా కడుపునొప్పి ఉంటుండేది. హాస్పిటల్‌కి వెళ్లి టెస్టులు, స్కానింగ్లు చేయించి కడుపునొప్పి తగ్గడానికి చాలా టాబ్లెట్లు వాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఇంతలో నాకు ఐదవ నెల వచ్చింది. అప్పుడు ఇంకా నొప్పి తగ్గకపోతే ఇతర సమస్యలు వస్తాయని ఒక గురువారంనాడు నేను బాబాకి పూజచేసి, "వారం రోజుల్లో నొప్పి తగ్గితే, మరుసటిరోజు మీరు నాకు చేసిన మేలును బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. అంతే, చాలావరకు నొప్పి తగ్గింది. "ప్లీజ్ బాబా, మిగిలిన నొప్పిని కూడా తగ్గించి కాన్పు సక్రమంగా జరిగేలా చూడండి. నాకున్న గుండె సమస్య వల్ల చివరి వరకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసి బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా దీవించండి. త్వరలో మేము ఇల్లు కొనుక్కునేలా చూడండి. ఎల్లప్పుడూ నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి".
బాబా దయ
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. ఒకరోజు మావారు హైదరాబాదు వెళ్లాలని కారులో బయలుదేరారు. సూర్యాపేట దగ్గరకు వెళ్లిన తర్వాత హఠాత్తుగా కారు ఆగిపోయింది. మా కారు కొత్తదే అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. మావారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను, "ఇలా అయిందేమిటి సాయీ? తొందరగా ఆ సమస్యను పరిష్కరించు" అని బాబాకి మొరపెట్టుకున్నాను. బాబా దయవల్ల మెకానిక్ వచ్చి కారు స్టార్ట్ చేసి, "ఏమీ లేదు, బ్యాటరీ డౌన్ అయింది. మరేం పర్వాలేదు మీరు బయలుదేరండి" అని అన్నారు. అప్పుడు మావారు కారు స్టార్ట్ చేస్తే వెంటనే స్టార్ట్ అయింది. ఆయన క్షేమంగా వెళ్లొచ్చారు.
ఈమధ్య మా పాపవాళ్ళు యుఎస్‌లో ఇల్లు కొనుక్కున్నారు. అయితే మే నెల నుండి మూఢాలు ఉన్నందువల్ల వెంటనే పాలు పొంగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అది మా అమ్మాయికి నెలసరి వచ్చే సమయం. అందువల్ల తను, "ఇప్పుడెలా అమ్మా?" అని అంది. నేను, "బాబా చూస్తారులే" అన్నాను. మరుసటిరోజు తెల్లారి మా అమ్మాయి ఫోన్ చేసి, "నాకు నెలసరి వచ్చిందమ్మా" అని చెప్పింది. నేను బాబా ఉన్నారని చాలా సంతోషపడ్డాను. ఆయన ఏ సమస్యా లేకుండా వారం ముందే నెలసరి వచ్చేలా అనుగ్రహించారు. ఇలాంటి అనుభవమే ఒకసారి నేను చదివి, "ఇలాంటివి కూడానా" అని మనసులో అనుకున్నాను. నా వరకు వచ్చినప్పుడు తెలిసింది, "అది బాబా దయ" అని. ఇలా నా నిజ జీవితంలో బాబా ప్రతి క్షణం కాపాడుతూ ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".
దయతో మర్నాటికి నొప్పి తగ్గించిన బాబా
నా పేరు తేజశ్రీ. 2024, ఏప్రిల్ లేదా మేలో ఒకరోజు రాత్రి సంవత్సరంన్నర వయసున్న మా బాబుకి నోటిలో నొప్పి వచ్చి చాలా బాధపడ్డాడు. పాలు కూడా తాగలేకపోయాడు. రాత్రంతా ఏడుస్తూ పడుకోలేదు. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయవల్ల బాబుకి నొప్పి తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. మరుసటిరోజుకి నొప్పి తగ్గింది. "థాంక్యూ బాబా. మమ్మల్ని అన్ని వైపుల నుంచి కాపాడుతున్నందుకు థాంక్యూ వెరీ మచ్ బాబా. మేము మీకు సదా ఋణపడి ఉంటాము సాయీ".
Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete avala chudandi
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chudandi vaalla badyata meede tandri, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri, ofce lo inka ye kotta projects naaku assign chayakunda chudandi tandri, na manasulo korika neraverela chudandi tandri pls
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Sri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Arogyakshemadhaaya Namaha🙏🙏🙏
baba madava kali noppi taggipovali. maa attagariki naameeda kopam povali. malli ame natho matladali.
ReplyDelete