ఈ భాగంలో అనుభవం:
- బాబా ఆశీస్సులు
నేను ఒక సాయి భక్తురాలిని. మేము యుఎస్‌లో ఉంటున్నాము. నేను చాలా సంవత్సరాలుగా భారతదేశం వెళ్ళలేదు. అందువల్ల నాకు ఇంటి మీద దిగులు ఉంది. అదీకాక వేసవి గురించి కొంచం భయపడ్డాను. ఎందుకంటే, నా స్నేహితులందరూ వేసవిలో భారతదేశానికి వెళ్లారు. కాబట్టి నేను ఒంటరినైపోతాను. పోనీ నేనూ భారతదేశం వెళదామంటే కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం వెళ్లలేని పరిస్థితి. అందుకు నేను చాలా బాధపడి నా దుఃఖాన్ని బాబా పాదాల వద్ద విన్నవించుకున్నాను. బాబా దయతో ఒకరోజు నా భర్త నాతో, "నువ్వెందుకు నీ తల్లిదండ్రులను ఇక్కడకు వచ్చి, నీతో కొంత సమయం గడపమని అడగకూడదు" అని అన్నారు. అది విని నేను చాలా సంతోషించాను. కానీ 'నాన్నకు వీసా లేదు, ఆయనెలా వస్తారు? ఆయన వృత్తిరీత్యా కూడా చాలా అనుమతులు పొందాలి. ఒకవేళ అమ్మ ఒక్కతే వస్తే, డయాబెటిక్ ఉన్న నాన్నని ఎవరు చూసుకుంటారు?' అని నా మదిలో ఆలోచనలు సాగాయి. చివరికి ఎలాగోలా కాస్త ధైర్యం తెచ్చుకొని మా అమ్మని యుఎస్ రావడం గురించి అడిగితే, అమ్మ సంతోషించింది కానీ, నాన్న గురించి ఆందోళన చెందింది. కాబట్టి మేమంతా ఏం చేయాలో ఆలోచించాము. మా అమ్మమ్మవాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఆమె వచ్చి నాన్నకు వండిపెట్టడానికి అంగీకరించదని తెలిసినందున చాలా ఆందోళన చెందాము. చివరికి ఎలాగో మా అమ్మ వాళ్ళని అడిగితే, అమ్మమ్మ రావడానికి ఒప్పుకుంది. అది మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతా బాబా అనుగ్రహం వల్లే జరిగింది. ఆయనే ఏదో ఒక అద్భుతం చేసి ఆమె మనసు మార్చారు. ఎందుకంటే, చాలా సందర్భాలలో మా అమ్మమ్మ, తత్తయ్యలు కాస్త మద్దతు ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. ఇది నిజంగా అద్భుతాలలోకెల్లా అద్భుతం. "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి ఆ సమయంలో మా నాన్నను జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ బాబా".
ఇకపోతే, అమ్మ జూన్లో యుఎస్ రావడానికి టిక్కెట్లు బుక్ చేసాము. అమ్మ తను యుఎస్ వస్తే, పనిమనిషి ఉంటే నాన్న, అమ్మమ్మలకు ఇంటి పనులు చేయడంలో సహాయకారిగా ఉంటుందని పనిమనిషి కోసం వెతికింది. కానీ అదృష్టం లేకపోయింది. కొన్ని కారణాలు వల్ల అమ్మవాళ్ళు ఉండే ప్రాంతంలో పనిమనిషిని వెతకడం చాలా కష్టమని అందరూ చెప్పారు. అందువల్ల నేను బాబాను, "దయచేసి సహాయం చేయండి బాబా. నాన్న, అమ్మమ్మలకు సహాయం చేసే మనిషిని చూపించండి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు నేను మా అమ్మకు ఫోన్ చేసిన సమయానికి ఒక పనిమనిషి వచ్చింది. వాళ్ళు ఆమెతో మాట్లాడుతున్నారు. "చాలా ధన్యవాదాలు బాబా. మీరు మాకు ఏ సహాయమైన చేస్తున్నారు. కోటి కోటి ప్రణామాలు బాబా".
ఇకపోతే, నాన్న యుఎస్ రావడానికి వీసా కోసం దరఖాస్తు చేస్తే, ఇంటర్వ్యూ స్లాట్ ఆగస్ట్‌లో బుక్ అయింది. దానికన్నా ముందు ఇంటర్వ్యూలో చూపించడానికి నాన్న NOC సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంది. కానీ నాన్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్నందున సెలవు ఆమోదం పొందడం చాలా కష్టం. ఒక రోజు నేను బాబాని, "బాబా! మా నాన్నని యుఎస్కి తీసుకురావడం సాధ్యమేనా?" అని అడిగి క్వశ్చన్&ఆన్సర్ సైట్లో సమాధానం కోసం చూస్తే, "అతను ప్రయత్నిస్తే చాలు. అంతా బాగుంటుంది" అని వచ్చింది. అది చూసి నేను చాలా సంతోషించి మా అమ్మతో చెప్పాను. మర్నాడు మా నాన్న మీటింగ్‌కి వెళ్లి 2 నెలల సెలవు కోసం తనపై అధికారిని అడిగారు. ఆశ్చర్యకరంగా ఆ అధికారి సరేనన్నారు. "ఎంత అద్భుతమైన లీల బాబా. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. దయచేసి అమ్మానాన్న ఇక్కడ ఉండేలా చేయండి బాబా. నేను వాళ్ళకి ఇక్కడ అన్నీ చూపించి ఈ వయసులో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకి నా సేవ చేసుకోనివ్వండి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి బాబా".
ఒకసారి నా భర్త సంవత్సరానికి ఒకసారి చేయించుకొనే హెల్త్ చెకప్కి వెళ్లి బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు. రిపోర్టులో ట్రైగ్లిజరైడ్స్(రక్తంలో ఫాట్) లెవల్ చాలా ఎక్కువగా ఉందని వచ్చింది. డాక్టర్ కూడా ఫోన్ చేసి కార్బోహైడ్రేట్లు తీసుకోవడం తగ్గించమని చెప్పారు. నాకు బాధ, భయం కలిగాయి. నాకు ఎప్పుడు బాధ కలిగినా నేను సాయిబాబా ప్రత్యక్ష దర్శనం చూస్తాను. అలాగే ఆరోజు కూడా చూస్తున్నప్పుడు నా మనసులో, "రానున్న 15 నిమిషాలలో పూజారి ఏ బిడ్డనైనా ఆశీర్వదించినట్లైతే నా భర్త గురించి చింతించాల్సిన అవసరం లేదు" అని ఆలోచన వచ్చింది. అయితే 14వ నిమిషం చివరివరకు పూజారి ఏ బిడ్డని ఆశీర్వదించలేదు. దాంతో నేను చాలా భయపడ్డాను, ఆందోళన చెందాను. కానీ చివరి నిమిషంలో నిముషంలో పూజారి ఒక బిడ్డని అందుకొని, ఆ బిడ్డ తలపై తన చేయి ఉంచారు. అది చూసి నేను చాలా ఆశీర్వాదపూర్వకంగా భావించాను. నిజానికి ఆ బిడ్డ ముందుకు వెళ్లిపోవడం నేను చూసాను. కానీ ఎలాగో మళ్ళీ వెనక్కి వచ్చి పూజారి ఆశీర్వాదం తీసుకున్నాడు. అది నాకు చాలా ప్రత్యేకంగా, సంతోషంగా అనిపించింది. నా భర్తను బాబా చూసుకుంటారని భావిస్తున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా, కోటి కోటి ప్రణామాలు బాబా".
సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||
Baba Kalyan ki marriage chai thandri pl
ReplyDeleteBaba
ReplyDeleteBaba na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri, amma nannalani kshamam ga chudandi tandri pls vaalla badyata meede, ofce lo anta bagunde la chayandi tandri
ReplyDeleteOka manchi illu dorike la chayandi tandri pls
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam🙏
ReplyDeletebaba madava bharam antha meede baba
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏
Financial problems
ReplyDeleteసాయి స్మరణం సంకట హరణం|
ReplyDeleteబాబా శరణం భవభయ హరణం||
సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||
సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||
సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||
సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||
సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||
సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||
సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||
Om Sai Ram
ReplyDeleteOmsairam. Please baba please baba please baba ma papani kapadandi baba. Omsairam. Please baba
ReplyDelete