1. అడిగితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే బాబా
2. శిరిడీ దర్శనం - జన్మ ధన్యం
అడిగితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే బాబా
అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాను. మాకు ప్రతి 6 నెలలకు పని అప్పగిస్తారు. దాన్ని మేము 6 నెలల్లో పూర్తి చేయాలి. ఆ క్రమంలో గత సంవత్సరం జూన్‌లో నాకు ఒక పని ఇచ్చి నవంబర్ పూర్తి చేయమన్నారు. నాతో పాటు ఇంకో అమ్మాయికి కూడా అదే పని ఇచ్చారు. అంటే మేమిద్దరం వర్క్ డివైడ్ చేసుకొని చేయాలి. ఆ అమ్మాయి వర్క్ బాగానే చేసేదికానీ, నేను చేసింది కూడా తనే చేసినట్టు చెప్పేది. దానివల్ల చివరికి పని అంతా తనే చేసినట్టు అయి నేను చేసినదంతా వృధా అనిపించింది నాకు. అందుచేత నేను బాబాని, "వచ్చే 6 నెలల పని వేరేవాళ్లతో కలిపి కాకుండా నాకు మాత్రమే ఇచ్చేలా చూడు సాయి" అని అడిగాను. బాబా దయతో అనుగ్రహించారు. ఒక ఐదుగురు సభ్యుల బృందాన్ని నాకిచ్చి నన్ను నడిపించమన్నారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీకు శతకోటి వందనాలు తండ్రీ. పని బాగా చేసేలా చూడు స్వామి".
శిరిడీ దర్శనం - జన్మ ధన్యం
నా పేరు భారతి. నేను గత 25 సంవత్సరాలుగా బాబా సేవలో గడుపుతున్నాను. నేను ఇప్పుడు నా శిరిడీ అనుభవం గురించి ఈ బ్లాగులో పంచుకోవాలనుకుంటున్నాను. నేను శిరిడీ వెళ్లాలని దాదాపు నాలుగు, ఐదు సార్లు రిజర్వేషన్ చేయించుకున్నాను. కానీ ప్రతిసారీ ఏదో ఒక కారణంతో శిరిడీ ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దాంతో నేను ఎందుకిలా జరుగుతుందని బాబా ముందు చాలాసార్లు బాధపడ్డాను. ఆపై, 'సరే, ఆయనకు నా మీద ఎప్పుడు దయ కలిగితే అప్పుడు నన్ను రప్పించుకుంటార"ని సర్దుకున్నాను. ఆ తర్వాత 2024, ఏప్రిల్ 30వ తేదీన నాకు తెలియకుండా మా శ్రీవారు శిరిడీ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసారు. కానీ నాకు మనసులో 'ఈసారైనా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటానా?' అని అనుమానం, ఏదో తెలియని బాధ ఉండేది. కానీ బాబా నన్ను చక్కగా తమ సన్నిధికి పిలుచుకొని, తిరిగి క్షేమంగా మా ఇంటికి చేర్చారు. అక్కడ శిరిడీలో బాబా దర్శనం చేసుకున్న ప్రతిసారీ నేను ఏదో తెలియని తన్మయత్వానికి లోనయ్యాను. ప్రతీ దర్శనంలో బాబా నన్ను చూస్తుంటే, నేను బాబాను చూస్తూ "ఆహా! అద్భుత దర్శన భాగ్యం. నా జన్మ ధన్యం" అని అనుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఓం నమో సాయినాథాయ నమః.
Om Sai Ram 🙏🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba amma nannalaki manashanti ni evvandi, na manasuki nachakunda yedi jaragakunda unde la chudandi tandri pls
ReplyDeleteOm sri sai karma dwamsine namaha 🙏 🌺 🙏
ReplyDeletePlease bless my child baba 🙏🌺🙏
ReplyDeleteBabsvplease take care of my pinky and bruno 👏😍
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsairam
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteఓం నమో సాయి నాథయ నమః 🙏🙏🙏🙏
ReplyDelete