1. సదా వర్షించే సాయి కృపకు నిదర్శనం
2. పదేళ్లనాటి నొప్పిని పూటలో మాయం చేసిన బాబా
సదా వర్షించే సాయి కృపకు నిదర్శనం
సాయిభక్తులకు శతకోటి ప్రణామాలు. నా పేరు మణిమాల. నేను ఒక ఉపాధ్యాయురాలిని. సాయి పిలిస్తే పలుకుతాడు, అడగకుండానే ఇచ్చేస్తాడు. ఎన్ని జన్మల పుణ్యమో ఈ అదృష్టం నాకు దక్కింది. ఇక నా అనుభవం విషయానికి వస్తే, మావారి పుట్టినరోజు 2024, మే 10న వచ్చింది. నాటితో ఆయనకి 60వ సంవత్సరాలు. అందుచేత మా అమ్మాయిలు షష్టిపూర్తి వేడుక చేయాలనుకున్నారు. కానీ నా మనసెరిగిన మావారు నాకు తెలియకుండానే మా కుటుంబం(నేను, నా భర్త, మా ఇద్దరమ్మాయిలు, అల్లుళ్ళు, ముగ్గురు మనవళ్లు, ఒక మనవరాలు) అందరికీ శిరిడీ వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేశారు. అది తెలిసి నా ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే, సాయి సన్నిధిలో ఉండటం కంటే ఫంక్షన్ గొప్పది కాదు. అయితే అనుకోకుండా నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. శిరిడీ వెళ్తామంటే నాకు వేసిన డ్యూటీ రద్దు చేయరు. అందుకని ఎలాగూ ఆరోగ్యం బాగుండట్లేదు కదా అని ఆఫీసర్లకి డాక్టర్ సర్టిఫికెట్లు చూపించాను. కానీ ఆఫీసర్లు వాటిని ఆమోదించలేదు, నా డ్యూటీ రద్దు కాలేదు. నేను పడిన వేదన అంతాఇంతా కాదు. ఎంత ప్రయత్నించినా వృధా అయిందని బాధపడ్డాను. ఇంకా బాబా మీదే భారమేసి ఏమైనా పర్వాలేదని ధైర్యంగా 9వ తేదీన ట్రైన్ ఎక్కాను. 10వ తేదీన బాబా సమక్షంలో నాకు కలిగిన అనుభూతి వర్ణించనలవికానిది. అప్పుడు నాకు కలిగిన గగూర్పాటు, ఆనందభాష్పాలు చూసిన అక్కడి సిబ్బంది 'రుక్ జా' అని నన్నోక్కదాన్నే చాలాసేపు ఉండనిచ్చారు. అది మరపురాని మధుర స్మృతి. మరునాటి ఉదయం సాయి పూర్తిగా కనిపించేలా ఆయన ముందర కూర్చుని కాకడ ఆరతి చూసాను. ఎలక్షన్ డ్యూటీ గురించి నా మదిలో ఆలోచనే లేదు. సాయిపై భారం వేస్తే ఆదుకోకుండా ఉంటారా? నేను శిరిడీ వచ్చేముందు ఎందుకైనా మంచిదని మా బ్రదర్(టీచర్)కి ఒక లెటర్ తోపాటు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి వచ్చాను. అతను నేను శిరిడీలో ఉండగా ఫోన్ చేసి "మీ డ్యూటీ కాన్సల్ అయింది. హాయిగా దర్శనం చేసుకోండి" అని చెప్పాడు. నాకు చాలా ఆనందమేసింది. ఆఫీసరుకి కాల్ చేసి ధన్యవాదాలు చెప్పాను. ఎవ్వరికీ కాన్సల్ కానీ డ్యూటీ నాకు మాత్రమే కావడం సాయి దయకాక మరేమిటి? నాపై సదా సాయి కృప ఉందనడానికి ఇంకొక నిదర్శనం. నేను సప్తశృంగేరిదేవి దర్శనం కలిగించమని సాయితండ్రిని వేడుకున్నాను. మొదట ఆలోచించిన నా కుటుంబం చివరికి సరే అన్నారు. అది కూడా అద్భుత దర్శనం. హారతి ఇచ్చే సమయానికి మేము అమ్మవారి ముందు వున్నాము. మరువలేని దర్శనమని మా కుటుంబమంతా ఆనందపడ్డారు. సాయి దయతో ఆ మర్నాడు మూడుసార్లు సాయిని దర్శించుకొని తిరుగు ప్రయాణమై మా ఇల్లు చేరుకున్నాము. ఈ అనుభవం మీతో పంచుకుంటుంటే నా కళ్ళల్లో నీళ్లు కమ్ముకుంటున్నాయి. సాయి భక్తులకు ఏది శ్రేయస్కరమో అది తప్పక చేస్తారు. సదా సాయినామం, ధ్యానం ఇవే మనకు దారి చూపుతాయి, రక్షణనిస్తాయి. "ధ్యన్యవాదాలు బాబా".
పదేళ్లనాటి నొప్పిని పూటలో మాయం చేసిన బాబా
సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు స్వాతి. బాబా నా జీవితంలో మర్చిపోలేని అద్భుతం చేశారు. దాదాపు 10 ఏళ్ల నుంచి నా కుడిభుజం నొప్పిగా ఉంటుంది. కుడి వైపు తిరిగి పడుకున్నా, పని ఎక్కువైనా భుజం చాలా నొప్పి పెట్టేది. డాక్టర్‌కి చూపిస్తే, "అంతా నార్మల్‌గా ఉంది" అని చెప్పారు. ఫిజియోథెరపీ చేయించుకుంటే, చేయించినన్నీ రోజులు బాగుండేదిగాని తరువాత మళ్ళీ అదే పరిస్థితి. చివరికి నేను విసుగు చెంది బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఫిజియోథెరపీకి అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేను బాబా. ఇక మీదే భారం" అని చెప్పుకొని భుజానికి ఊదీ రాసుకొని పడుకున్నాను. మరుసటిరోజు నుంచి నా చేయి నొప్పి మాయమైపోయింది. నన్ను నేనే నమ్మలేకపోయాను. కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న నొప్పిని ఒక్క పూటలో తీసేసారు బాబా. పూర్వజన్మలో ఎంతో అదృష్టం ఉంటే కానీ, ఈ జన్మలో సాయి పాదాల చెంత మనం ఉండలేం. కనుక మనందరం ఈ అదృష్టాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ బాబాకి నచ్చిన పనులు చేస్తూ ఆయన సేవలో గడుపుతూ ఉండాలి. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు సదా మాపై ఇలాగే కురిపించండి బాబా".
ఓం శ్రీ సాయినాథాయ నమః.
Om sai ram, amma nannalani kshamam ga chudandi tandri vaalla badyata meede, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri, ofce lo anta bagunde la chudandi tandri, na manasulo anukunna korika nerevere la chudandi tandri
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house work complete chai thandri
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
baba madava ni manchi school lo cherpinchali baba. maavaru bhasyam school lo cherchudamu anetattu cheyandi baba.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏
ఓం సాయిరామ్
ReplyDeleteOmsairam. Please save my kid baba. Omsairam
ReplyDelete