ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా అనుగ్రహముంటే కానిదేముంది?
2. సాయి కరుణ
బాబా అనుగ్రహముంటే కానిదేముంది?
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. 2024, మార్చ్ 30న నాకు కడుపునొప్పి వచ్చింది. నేను వేడి వల్లనేమోనని భావించి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, సగ్గుబియ్యం జావా ఇలా ఎన్నో తాగటం మొదలుపెట్టాను. అయితే ఎన్ని చేసినా నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! ఎన్ని చేసినా నొప్పి తగ్గటం లేదు. ఏ డాక్టర్ దగ్గరకి వెళ్ళమంటారు" అని బాబాను ప్రార్థించాను. బాబా హోమియో డాక్టర్ దగ్గరకి వెళ్ళమన్నారు. సరేనని ఆ డాక్టర్ దగ్గరకి వెళితే, చూసి ఐదు రోజులకు మందులిచ్చి, "తగ్గకపోతే, యూరిన్ టెస్ట్ చేయించుకొని రమ్మ"ని అన్నారు. అయితే మందులు వాడుతున్నా తగ్గలేదు. ఇంకా నాలుగు టాబ్లెట్లు మాత్రమే మిగిలాయి. అప్పుడు నేను, "బాబా! చివరి నాలుగు టాబ్లెట్లు ఉన్నాయి. ఇంకా తగ్గలేదు. నన్ను టెస్టు చేయించుకోమంటారా? అని బాబాని అడిగాను. బాబా వద్దని సమాధానమిచ్చారు. దాంతో నేను మిగిలిన ఆ టాబ్లెట్లు వేసుకుంటూ వాటితోపాటు బాబా ఊదీ కొంచం నీళ్లల్లో వేసుకొని తాగాను. అప్పుడు నొప్పి తగ్గటం మొదలై క్రమంగా పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల నొప్పి పూర్తిగా తగ్గింది తండ్రీ. ఇలాగే కరుణ చూపు తండ్రీ".
అలాగే ఒకసారి నాకు గొంతునొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. గుటక కూడా వేయలేక చాలా ఇబ్బందిపడ్డాను. టాబ్లెట్లు వాడినా మూడు రోజులు వరకు తగ్గలేదు. అప్పుడు బాబా దగ్గర చాలా ఏడ్చి, "బాబా! ఇంకా ఒక టాబ్లెట్ ఉంది. దానికి కూడా తగ్గకపోతే నేను ఏం చేయాలి తండ్రీ?" అని వేడుకొని ఊదీ వేడినీళ్ళలో కలిపి తాగడం మొదలుపెట్టాను. దాంతో నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా".
మేము లారీ కొనుక్కొని మూడు సంవత్సరాలైంది. ఆ లారీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక ఇబ్బంది వచ్చేది. కానీ ఇబ్బంది వచ్చినప్పుడల్లా బాబా మమ్మల్ని ఆదుకుంటుండేవారు. ఒకసారి లారీ కరెంటు స్తంభానికి గుద్దింది. బాబా పెద్ద విపత్తు నుండి కాపాడారు. కానీ కరెంటువాళ్ళు లక్ష రూపాయలు కట్టమన్నారు. బాబాని వేడుకుంటే 50 వేల రూపాయలు కట్టేందుకు కరెంట్ వాళ్ళు ఒప్పుకునేలా అనుగ్రహించారు. లారీ రెండుసార్లు కారుని ఢీకొట్టింది. ఆయా సందర్భాలలో బాబా ఎవరికీ ఏమీ కాకుండా చూసి కేవలం డబ్బుతో సమస్య లేకుండా సరి చేశారు. మేము, "బాబా! ఎందుకిలా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంద"ని చాలా టెన్షన్ పడేవాళ్ళం. అప్పుడొకసారి "మొక్కులు తీర్చనందుకే" అని బాబా సందేశం వచ్చింది. నిజమే, ఆ లారీ విషయంలో అమ్మవారి మొక్కు వుంది. దాన్ని ఎప్పుడు తీరుద్దామన్నా ఏవో ఆటంకాలు వస్తుండేవి. అందువల్ల బాబాని, "ఏదో ఒక విధంగా మొక్కులు వెంటనే చెల్లించేలా చేయండి బాబా" అని ప్రార్థించి బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్న మా పిల్లల్ని, "మొక్కు చెల్లిద్దాం. రండి" అంటే వచ్చారు. కానీ మావారు సమయానికి డ్యూటీ నుండి రాలేకపోయారు. అలా 15 రోజులు గడిచిపోయాయి. నేను, "ఏంటి బాబా? ఈ మొక్కు తీర్చడం అవ్వదా తండ్రీ? ఆయన రాలేదు. పిల్లలు వెళ్ళిపోతామంటున్నారు" అని చాలా బాధపడ్డాను. అంతలో మరల లారీ ఒక కారుని ఢీ కొట్టింది. మళ్ళీ జరిమానా కట్టాము. వెళ్ళిపోదామనుకున్న మా అమ్మాయి తన మనసు మార్చుకొని, "ఈ వారం అయినా మొక్కు తీర్చుకుందాం డాడీ. వస్తారా?" అని అడిగింది. బాబా దయవల్ల మావారు రావడం, పోతును కొనడం, 2024, ఏప్రిల్ 21న మొక్కు చెల్లిద్దామని అనుకోవడం జరిగింది. కానీ నాకు నెలసరి సమయం కాకపోయినా హఠాత్తుగా కడుపునొప్పి రాసాగింది. నాకు భయమేసి, "తండ్రీ! ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకు, అమ్మవారి గుడిలో మొక్కు తీర్చుకొని భోజనాలు పెట్టుకునే వరకు నాకు, మా పాపకు ఎవరికీ ఏ ఆటంకాలు రాకుండా అనుగ్రహించు తండ్రీ" అని బాబాను పదేపదే వేడుకున్నాను. బాబా తలుచుకుంటే కానిదేముంది? ఆ తండ్రి దయవలన ఏ ఆటంకాలు లేకుండా అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించారు. "సాయీ! మీకు శతకోటి ధన్యవాదాలు. ఇలాగే మమ్మల్ని సదా ఆశీర్వదించండి. మా తప్పులు ఏమైనా ఉంటే ఉంటే క్షమించు సాయితండ్రీ".
సాయి కరుణ
సాయి భక్తులలందరికి నమస్కారం. నా పేరు సాహితి. 2024, ఫిబ్రవరిలో రెండురోజులపాటు మా అమ్మ గుండెల్లో నొప్పిగా ఉందని అంటుంటే ఎందుకైనా మంచిదని ఈసీజీ టెస్టు చేయించాము. రిపోర్టు అబ్ నార్మల్ అని వచ్చింది. అప్పుడు నేను, "బాబా! అమ్మని ఈ సమస్య నుండి రక్షించండి" అని వేడుకున్నాను. గురువారంనాడు నా సోదరి అమ్మను డాక్టర్ దగ్గరకి తీసుకొని వెళ్ళింది. అప్పుడు నేను, "తండ్రీ! డాక్టరు అమ్మని చూసి మరల టెస్టు చేసి, ఏ సమస్య లేదని చెప్పాలి" అని బాబాని ప్రార్థించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించాను. డాక్టరు ఏదో టెస్టు చేసి, "వయసుతోపాటు వచ్చిన సమస్య. బ్లడ్ తక్కువగా ఉంది. మందులతో తగ్గుతుంది" అని చెప్పారు. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కాపాడు సాయితండ్రీ".
. Om Sairam!! Andarini challaga kaapadu thandri. Antha meede bharam baba!!
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteSai Baba please protect my husband 🙏🙏 and children from my thinking.i am feeling hell every day.please change my thoughts.Be with us and bless us.Sorry baba.Om Sai Ram
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chudandi tandri pls, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, ofce lo anta bagunde la chudandi tandri, na manasulo unna korika neravere la chudandi tandri
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
baba sai madava bhram antha meede baba
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏
Om sairam vamsi nenu malli kalisipovali. Na bartha nanu kapuraniki thiskellela chudu saibaba
ReplyDeleteNa samasya nundi nannu kapadu baba yemi cheyyalo nuvve marganni chupinchu babaa
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete