ఈ భాగంలో అనుభవం:
- జీవితంలో వెలుగులు నింపిన శిరిడీ సాయినాథుడు
సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు జానకిరామ్. నేను, నా భార్య సాయిబాబా భక్తులం. 2021, మే నెలలో నేను ఒక వింతైన అనారోగ్యం పాలయ్యాను. దానివల్ల బుర్ర తిరగటం, వాంతులవడం, చెవిలో పెద్దపెద్ద శబ్దాలు నిరంతరాయంగా వినిపిస్తూ వినికిడి తగట్టం వంటివి జరుగుతుండేవి. స్థానిక ENT డాక్టరు దగ్గరకి వెళితే, ఒక నెల రోజులు వాడమని మందులిచ్చారు. కానీ ఉపయోగం లేదు. అప్పుడు మందులు మార్చారు. అయినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. అప్పుడు నా స్నేహితుని తోడుగా తీసుకొని హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ MRI స్కాన్ తీసి నా చెవిలో లిక్విడ్ ఎక్కువగా తయారవుతుందని, మరేం పర్వాలేదని 45 రోజులు వాడమని మందులిచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నా భార్య, తన అన్నయ్యని తీసుకొని మళ్ళీ అదే డాక్టరుని సంప్రదిస్తే, ఏదో ఇంజక్షన్ నా చెవిలో చేసి, "ఈ సమస్య ఇక తగ్గదు. ఇక ఇంతే" అని అన్నారు. నాకు చాలా బాధేసి ఏడ్చేసాను. అప్పుడు అదృష్టంకొద్దీ యశోద హాస్పిటల్‌కి ఎదురుగా ఉన్న మరో ఆసుపత్రిలో నా బావమరిది స్నేహితుడు పని చేస్తున్నాడు. నిజానికి అతను జూబ్లీహిల్స్ బ్రాంచ్‌లో పని చేస్తాడు. బాబా దయవల్ల ఆ రోజు ఆ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతన్ని కలిసి సమస్య గురించి చెప్తే అతను, "పంజాగుట్ట దగ్గరలో ఒక డాక్టర్ ఉన్నారు. అతని దగ్గరకి వెళ్ళండి" అని చెప్పాడు. మరుసటిరోజు అతను చెప్పిన డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకుని వెళ్ళాము. ఆ హాస్పిటల్ వున్న ఏరియా పేరు ద్వారకాపురి. అక్కడ ఒక సాయిబాబా గుడి వుంది. మా బావమరిది బాబా భక్తుడు. అతను, "ఒకసారి గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకుని వెళ్దాం" అని అన్నాడు. నేను దేవుడిని నమ్ముతాను కానీ, సాయి గురించి నాకు అంతగా తెలీదు. మేము కొబ్బరికాయ కొని గుడి లోపలికి వెళ్ళాము. అక్కడ శ్రద్ధ, సబూరీలతో పాటు "నేను ఉండగా భయమేలా?" అని వ్రాసి వుంది. అది చూసి నాకు ఏడుపు ఆగలేదు. బాబాకి దణ్ణం పెట్టుకుని హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్ అప్పోయింట్మెంట్ తీసుకుని కూర్చున్నాము. రెండు గంటల తర్వాత నా పేరు పిలిచారు. ఆ డాక్టర్ పేరు కూడా నా పేరే, 'జానకిరామ్'. ఆయన, "ఏంటి నీ సమస్య?" అని అడిగితే అంత వివరంగా చెప్పాను. ఆయన ఫలానా వ్యాధి అని చెప్పి, "ఏం ఇబ్బంది లేదు. తల తిరగడం, వాంతులు అవటం తగ్గుతాయి. కానీ వినికిడి మాత్రం తిరిగి రాదు" అని అన్నారు. వినికిడి విషయం పక్కన పెట్టిన మిగిలిన సమస్యలు తగ్గుతాయని చాలా సంతోషించాను. డాక్టరు నాలుగు నెలలకి చాలా పవర్‌ఫుల్ మందులిచ్చారు. వాటిని అక్టోబర్ 1న నేను వాడటం మొదలుపెట్టాను. రెండు రోజులకి నాకు చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది. అక్టోబర్ 3 ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దగా వాంతులు, విరోచనాలు అవుతూనే ఉన్నాయి. నేను ఇంకా బ్రతుకుతానని అనుకోలేదు. మావాళ్లు నన్ను దగ్గర్లో వున్న హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. ఆ రాత్రి నన్ను హాస్పిటల్‌లో ఉంచి మర్నాడు ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చాక మళ్ళీ హైదరాబాద్ డాక్టరు ఇచ్చిన మందులు వాడటం ప్రారంభించాను. మునుపటిలా ఇబ్బందిపడుతూనే ఉన్నప్పటికీ మందులు వేసుకుంటూ ఉండేవాడిని. ఆ సమయంలో నరకం అంటే ఏంటో నేను స్వయంగా చూసాను. 2022, జనవరితో ఆ మందులు అయిపోయాయి. కానీ సమస్య అలానే ఉంది. నా తల అస్సలు పని చేయలేదు. ఫోన్‌లో నా వ్యాధి గురించి సెర్చ్ చేస్తుంటే ఒక హోమియోపతి డాక్టర్ నా వ్యాధి గురించి చెప్పటం చూసాను. మచిలీపట్నంలో ఉండే ఆ డాక్టర్‌కి ఫోన్ చేసి నా వ్యాధి గురించి అంతా వివరంగా చెప్పాను. అతను, "సరే, ఏం ఇబ్బంది లేదు. నువ్వు బాధపడుకు. అది ఇంగ్లీష్ మందులతో కంటే హోమియోపతితో తగ్గుతుంది" అని చెప్పారు. 2022, ఫిబ్రవరి 16న మేము మచిలీపట్నం వెళ్లి ఆ డాక్టర్ని సంప్రదించాము. అతను ఒక నెల రోజులకి మందులిచ్చాడు. అవి వాడటం మొదలుపెట్టాక నా చెవిలో శబ్దాలు ఇంకా ఎక్కువయ్యాయి. నేను భరించలేక ఏడ్చేసాను. ఆ స్థితిలో నన్ను చూసిన మా బావమరిది చెన్నైలోని వందలూరు సాయిబాబా గుడిలో ఉండే ఒక గురువుగారి కాంటాక్ట్ నెంబర్ తెలుసుకొని అతనికి ఫోన్ చేసాడు. ఆ గురువుగారు సాయంత్రం 6కి వీడీయో కాల్ చేసి, "నేను చెప్పినట్లు చేయి" అని అన్నారు. నేను ఆయన చెప్పినట్లు మా ఇంట్లో వున్న సాయిబాబా ఫోటో ఒకటి నా ముందు పెట్టుకుని, ఒక గ్లాసు నీళ్లు కూడా పెట్టుకొని ఆ నీటిలో ఊదీ వేసాను. ఆ గురువుగారు 5 నిమషాలు ప్రార్థన చేసి, "ఏం భయపడకు. ఆ ఊదీ నీళ్లు తాగు, తగ్గుతుంది" అని చెప్పారు. ఇకపోతే నేను వాడుతున్న హోమియోపతి మందు ప్రతినెలా మారుస్తూ ఉండేవారు. అవి వాడుతూ ఉంటే కొంచం కొంచం మార్పు వస్తూ ఇప్పుడు చాలావరకు బాగుంది. వినికిడి విషయంలో కూడా చాలా మార్పు వచ్చింది.
ఒక సంవత్సరంపాటు నేను చాలా బాదపడ్డ ఆ సమయంలో ఖాళీగా ఉంటూ నాకు ఏం చేయాలో తోచేదికాదు. మా నాన్నవాళ్ళ ఇల్లు వదిలి వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 లక్షల రూపాయలలో 3 లక్షల వరకు నా అనారోగ్యానికి, మా పిల్లోడికి ఖర్చు అయ్యాయి. కేవలం 3 లక్షలు మాత్రమే మిగిలాయి. వ్యాపారం చేయాలంటే చాలా డబ్బు అవసరం. అయినా ఒక పక్క నా ఆరోగ్యం చూసుకుంటూ, మరో పక్క సంపాదనకోసం చాలా ప్రణాళికలు చేశాను. కానీ అన్ని విఫలమయ్యాయి. నేను చాలా అంటే చాలా సమస్యలు ఎదురుకున్నాను.. నాకంటూ నా భార్య, తన అన్నయ్య, వాళ్ళ తల్లిదండ్రులు తప్ప ఎవరూ లేరు. మా అత్తగారింట్లోనే ఉంటుండేవాళ్ళము. వాళ్ళింటో ఒక సాయిబాబా పుస్తకం వుంది. వాళ్ళు దాన్ని నాకిచ్చి చదవమంటుంటే చదవటం మొద్దలుపెట్టాను. సాయిబాబా పారాయణ చేసే మా అక్కవాళ్ళు కూడా కొన్నిసార్లు తమకి చదువటం కుదరక నన్ను చదవమనేవారు. అలా నేను చదువుతూ ఉండటం వల్ల అనుకోకుండా నా ఆరోగ్యం కుదుటపడటం మొదలై మా జీవితాలలో అద్భుతాలు జరగనారభించాయి. మా వదినవాళ్ళు 'సాయి దివ్యపూజ' చేసుకోమంటే 2022, జూలైలో మొదలుపెట్టాం. కానీ ఆటంకమొచ్చి 3వ వారం తరువాత మధ్యలోనే ఆపివేయవలసి వచ్చి ముడుపు దగ్గరలో వున్న బాబా గుడిలో సమర్పించాం. అప్పుడు ఉద్యోగం చేస్తున్న నా భార్య స్నేహితులు కొంతమంది సలహా మీద నేను కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ 5, 6 ఇంటర్వ్యూలకి వెళ్ళాను. కానీ అవి రిజెక్ట్ అయ్యాయి. కానీ అనుకోకుండా ఒక అద్భుతం జరిగి మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. 2022, ఆగస్టు 25, గురువారంకి జాయినింగ్ డేట్ ఇచ్చారు. సరిగ్గా పూజ మొదలుపెట్టిన ఒక నెలకి నేను అడగకుండానే బాబా నాకు మంచి వరం ఇచ్చారు. మా సంతోషానికి అవధులు లేవు. బాబా దయతో ఆ ఉద్యోగం చేసుకుంటూ చాలా అంటే చాలా సంతోషంగా వున్నామనుకుంటే 2022, నవంబర్ 27, ఆదివారం సాయంత్రం రోజులాగే సరదాగా నేను బైక్ మీద టీ తాగటానికి బయటకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుంటే, ఇంటికి దగ్గరలో ఒక చికెన్ షాప్ వద్ద హఠాత్తుగా ఒక కుక్క అడ్డం వచ్చింది. నేను ఆ సమయంలో నెమ్మదిగానే వస్తున్నందువల్ల మాములుగానే కింద పడ్డాను. కొంచం కూడా దెబ్బ తగలలేదు. కానీ కుడికాలు చాలా నొప్పి పెట్టింది. అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఉండే మా బావ ఒకరు చికెన్ కొనటానికని వచ్చి నేను పడిపోవటం చూసి, వెంటనే నా దగ్గరకు వచ్చి లేపితే నేను లేవలేకపోయాను. మా బాబాయ్ RMP డాక్టర్. అతని వద్దకు నన్ను తీసుకెళితే, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇచ్చారు. కానీ నొప్పి తగ్గకపోవడంతో దగ్గరలో వున్న పెద్ద హాస్పిటల్‌కి వెళితే, అక్కడ ఎక్స్‌రే తీసి కుడికాలు బాల్ దగ్గర(తుంటి) కొద్దిగా క్రాక్ అయిందని చెప్పారు. నాకు ఏడుపొచ్చి, "బాబా! నిన్ను నమ్ముకుంటే మళ్ళీ ఇలా చేసావు ఏంటి?" అని అనుకున్నాను. అ రోజు ఆదివారం అవటం వల పెద్ద డాక్టర్లు లేరు. అందుకని ఆ హాస్పిటల్ నుంచి కాకినాడ అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేయాలని, సోమవారం రాత్రి అన్ని టెస్టులు చేసి 7:30కి ఆపరేషన్ చేసి, "3 నెలలు విశ్రాంతి తీసుకోవాలి" అని అన్నారు. అప్పటికి నేను ఉద్యోగంలో చేరి మూడు నెలలే అయింది. అయినా తప్పనిసరై మూడు వారాలు సెలువు పెట్టాను. కానీ ఒక వారం తర్వాత నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి సిస్టం ఆన్ చేసి వర్క్ చేస్తానని మా మేనేజర్‌తో చెప్పాను. తను, "ఒకే గుడ్" అంది కానీ, మా క్లయింట్ ఒప్పుకోలేదు. "నువ్వు విశ్రాంతి తీసుకో! వర్క్ ఏముందిలే" అన్నాడు. అందువల్ల నేను డిసెంబర్ నెలంతా సెలవులో వున్నాను. కానీ మా మేనేజర్ చాలా మంచిది. ఆమె ఒక వారం మాత్రమే సెలువు అని వేసి, మిగతా రోజులన్నీ ప్రెజెంట్ అని వేసి నా టైం షీట్ అప్రూవ్ చేసి నాకు చాలా సహాయం చేసింది. అంతా బాబా దయ. తరువాత 2023, జనవరి నెల రెండో వారంలో మా మేనేజర్ నాకు ఫోన్ చేసి, "నిన్ను, ఇంకా కొంతమందిని ప్రాజెక్ట్‌లో నుంచి తీసేసారు" అని చెప్పారు. నేను చాలా బ్రతిమిలాడాను కానీ, ఏమీ ఉపయోగం లేకపోయింది. క్లయింట్‌తో కూడా మాట్లాడాను. అతను కూడా నా చేతిలో ఏమీ లేదని అన్నాడు. మళ్ళీ సమస్య వచ్చిందేంటి అని అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము కదా! 2023, ఫిబ్రవరి 26న క్లయింట్ లాప్టాప్ కొరియర్ చేద్దామని అనుకుంటూ తిరుగుతుండగా అద్భుతం జరిగింది. మా కంపనీలోని వేరే ప్రాజెక్ట్‌కి చెందిన ఒకతను నాకు కాల్ చేసి, "నువ్వు బెంచ్ మీద ఉన్నావా?" అని అడిగారు. నేను "అవును సార్" అన్నాను. అప్పుడు అతను, "సరే, మా ప్రాజెక్ట్‌లో చాలామంది అవసరం వుంది. నువ్వు చేస్తావా?" అని అన్నాడు. నేను సరేనన్నాను. అది ఇంటి దగ్గర నుంచే చేసే ప్రాజెక్ట్ అవ్వడంతో నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాబా లీలలు మహా అద్భుతం. నేను కోల్పోయిన దానికంటే 90 రేట్లు మంచి ప్రాజెక్ట్, మంచి టీం ఇచ్చారు ఆయన. వెంటనే బాబాకి కొబ్బరికాయలు కొట్టాను. అయితే ఆ ప్రాజెక్ట్ 2023, డిసెంబర్ 31తో పూర్తవడంతో మళ్ళీ నేను బెంచ్ మీదకి వచ్చాను. తర్వాత 2024, మే 10న నన్ను ఉద్యోగం నుంచి తీసేసారు. మళ్ళీ నా జీవితం ఏంటో అర్ధంకానీ ప్రశ్నలా అయింది. కానీ బాబా నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నా జీవితంలో చాలా మంచి మార్పు వచ్చింది. నేను ఇప్పుడు ఏదైతే కోల్పోయానో అది కూడా బాబా లీలే. నాకు తెలిసి వారు నాకు ఇంకా మంచిదేదో ఇవ్వబోతున్నారు. అందుచేత బాబా నామస్మరణ చేస్తూ వారి కృపకోసం ఎదురుచూస్తున్నాను. నేను ఎప్పుడూ వారి పాదాలు పట్టుకునే వుంటాను.
2019, జూలై 16, గురుపౌర్ణిమినాడు బాబా మాకు బాబుని ప్రసాదించారు. చిన్నప్పటి నుంచి వాడి ఆరోగ్యం మంచిగానే ఉండేది కానీ, నిమ్ము ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉంటే దగ్గు విపరీతంగా వస్తుండేది. ఏదైనా తీపి, చల్లనివి తిన్నా విపరీతమైన దగ్గుతోపాటు వాంతులు అవుతుండేవి. మేము బాబాని ఎప్పుడైతే నముకున్నామో మా జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. బాబాతో చెపుకున్నాక కొంచం కొంచంగా వాడి ఆరోగ్యంలో మంచి మార్పు రావటం జరిగింది. ఇప్పుడైతే చలికాలంలోనే కొంచం ఇబ్బంది పెడుతుంది. బాబా చాలావరకు వాడికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు.
2023, ఆగస్టులో బాబుకి జ్వరమొస్తే మా దగ్గరున్న మందు వేసాము. కానీ జ్వరం ఎంతకీ తగ్గలేదు. ఆరోజు ఆదివారం అవ్వటం వల్ల హాస్పిటల్ ఉండదని సోమవారంనాడు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాము. డాక్టరు టెస్టులు చేయించి డెంగ్యూ అన్నారు, మాకు చాలా భయమేసింది. డాక్టర్, "ప్లేట్లెట్స్ బాగానే వున్నాయి, ఏం సమస్య లేదు" అని మూడు రోజులకి మందులిచ్చి, "వెళ్ళండి, ఏమైనా ఇబ్బంది వుంటే రండి. అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది" అన్నారు. అప్పుడు బాబుకి 105 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత వుంది. నేను, "బాబా! మా బాబుకి జ్వరం తగ్గేలా చేయండి" అని సాయిబాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజులకి బాబుకి జ్వరం తగ్గుంది. అయితే మరుసటి నెల మళ్ళీ అదే సమయానికి జ్వరం వచ్చింది. మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే టెస్టులు చేయించి మళ్ళీ డెంగ్యూ అన్నారు. మేము, "మళ్లీ ఇదేంటి బాబా?" అని అనుకున్నాము. డాక్టరు వేరే మందులు వ్రాశారు. ఆ మందులు వాడుతున్నా రెండురోజుల వరకు జ్వరం తగ్గలేదు, 105, 106 డిగ్రీలు ఉంటుండేది. వాంతులు కూడా అవుతుండేవి. భయమేసి నా భార్య, మా బావ బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పుడు ప్లేట్లట్లు చెక్ చేసి, కొంచం తగ్గాయని, బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని అన్నారు. సరేనని అడ్మిట్ చేస్తే, సెలైన్లు పెట్టి, ఇంజెక్షన్లు చేశారు. అప్పుడు నేను, "బాబా! బాబుకి జ్వరం తగ్గాలి" అని బాబాకి చెప్పుకున్నాను. అంతే, మరుసటరోజుకల్లా జ్వరం తగ్గటం మొదలుపెట్టి రెండు, మూడు రోజులకి బాబు పూర్తిగా కోలుకున్నాడు. బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలా బాబా మాకు చాలా అంటే చాలా చేస్తూ మా జీవితాల్లో వెలుగులు నింపారు. బాబాని నమ్ముకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. బాబా లీలలు అనంతం. నేను మీ అందరికి ఒకటి చెప్తాను, 'మనల్ని బాబా ఎన్నుకున్నారు. ఆయన మొదట పాప కర్మలు నుంచి మనల్ని విముక్తులను చేస్తారు. మనం ఎప్పుడూ బాబా మీద నమ్మకంతో ఉండాలి, అధికంగా ప్రేమించాలి. ఆయన మనం ఏ స్థితిలో వున్నా మనతోనే వుంటారు. మనకి ఏమీ కాదు'. "అనంతకోటి ధన్యవాదాలు బాబా".
Om Sairam!!
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl
ReplyDeleteOm Sai Ram please kill me.my negative thoughts are very bad.my negative thoughts are about my husband.He is very good person.i am feeling hell.Om Sai Ram.please change my thoughts into postive thinking.please reduse my depression.
ReplyDeleteOm Sai Ram my desire is keep him healthy 🙏🙏🙏 and with full aayush.Please bless children 🙏🙏 also like that.i want to die Sumangali ga.please bless my desire.Be with us and bless us.Sorry baba I am feeling guilty
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga anandam ga unde la chayandi tandri vaalla badyata meede, na mamasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, ofcs lo anta bagundi illu konukkovali ane na kala neravere la chudandi tandri pls
ReplyDeletebaba sai madava bharam antha meede baba
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
baba maa sai madava bharam antha meede baba
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏