1. శ్రీసాయి అనుగ్రహం
2. నాతోనే ఉన్నారు బాబా
3. 'బాబా' అంటే చాలు - బాధలు తీరుస్తారు
శ్రీసాయి అనుగ్రహం
ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు, సాటి సాయిబంధువులకు నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నాకు 11 నెలల వయసున్న పాప ఉంది. ఈమధ్య తనకి డైపర్ వల్ల రాషెస్ వచ్చాయి. డైపర్ వేయడం మానేసినా, డైపర్ క్రీం రాసినా ఆ రాషెస్ తగ్గలేదు. నాకు చాలా భయమేసి, బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! పాపకి పెద్ద సమస్య కాకుండా రాషెస్ తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల కొన్ని రోజులకి రాషెస్ తగ్గుముఖం పట్టాయి. "పెద్ద సమస్య కాకుండా పాపని కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే మచ్చలు కూడా తగ్గిపోవాలి తండ్రీ".
ఒకరోజు మా కజిన్ సీమంతం ఫంక్షన్ ఉండగా మా పాప బాగా ఏడ్చింది. అలాగే పాప ఏడుస్తుంటే ఫంక్షన్‌లో అందరికీ ఇబ్బంది అవుతుంది, అలాగని దగ్గర బంధువుల ఫంక్షన్‌కి వెళ్లకుండా ఉండలేము. అందువలన, "బాబా! పాప వల్ల ఫంక్షన్‌కి ఇబ్బంది కాకూడదు. పాప ఎక్కువగా అలసిపోకూడదు. అలాగే నేను మంచిగా నవ్వుతూ అక్కడ వాళ్ళకి సహాయం చేయగలగాలి. ఇంకా సంతోషంగా మేము ఫంక్షన్ నుండి ఇంటికి తిరిగి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి ఫంక్షన్‌కి వెళ్ళాను. బాబా దయవల్ల పాప ఫంక్షన్‌లో పెద్దగా ఏడవలేదు. నేను కోరుకున్నట్లే చక్కగా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము. "థాంక్యూ సో మచ్ బాబా".
నేను కడుపుతో ఉన్న తొమ్మిది నెలలూ పూర్తి బెడ్‌రెస్ట్‌లో ఉన్నందువల్ల నాకు సోమరితనం బాగా ఎక్కువైంది. ఆ విషయంగా నేను, "బాబా! మీ దయతో నా సోమరితనం తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. ఎందుకంటే, నాకున్న అతిపెద్ద కోరికల్లో ఈ సోమరితనం పోవడం ఒకటిగా ఉండేది. దాన్ని బాబా తీసేశారు. ఆయన దయతో సోమరితనం నాకు చాలావరకు తగ్గింది. "థాంక్యూ బాబా".
ఒకరోజు రాత్రి నా కుడిచేతి బొటనవేలు చాలా నొప్పిగా ఉండి ఏ పనీ చేసుకోలేకపోయాను. మా పాపకి అన్నం పెట్టాలన్నా వీలుకాక చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబా ఊదీ మంత్రం చదువుకుని ఊదీ బొటనవేలికి రాసి, "నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల నొప్పి చాలావరకు తగ్గింది. "థాంక్యూ సో మచ్ బాబా. ఈ 11 నెలల్లో మా పాపని మీరే జాగ్రత్తగా చూసుకుంటూ ఎన్నో అనుభవాలు పంచుకునేలా అనుగ్రహించారు. పుట్టుకతోనే గుండె సమస్య ఉన్న తనకి ఇంకో 15 రోజుల్లో ఆపరేషన్ జరగనుంది. ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. అది విజయవంతం అయ్యేలా చూడండి బాబా. నిజానికి మీకు మొక్కుకున్నాకే అబార్షన్ అవ్వాల్సిన నా ప్రెగ్నెన్సీ నిలబడింది. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అలాంటి మీ బిడ్డని ఇప్పుడు కూడా కాపాడండి ప్లీజ్. మీ మీద నాకు పూర్తి నమ్మకముంది. ఏదన్నా తప్పుగా రాసి ఉంటే క్షమించండి బాబా". త్వరలోనే మా జీవితంలో జరగబోతున్న అతిపెద్ద అనుభవంతో మీ ముందుకు వస్తాను.
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!
నాతోనే ఉన్నారు బాబా
ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా వందనాలు. సాయిబంధువులకు నా అభినందనలు. నా పేరు ప్రసూన. మేము హైదరాబాదులో నివసిస్తున్నాము. ఈ బ్లాగ్ ద్వారా మన వేదనలు, అనుభూతులు, ఆనందాలు పంచుకుంటూ ఉంటే 'మనమందరం సాయిబిడ్డలం' అని స్పష్టమవుతున్నది. ప్రతి కష్టంలో, ప్రతి సమస్యలో, ప్రతి ఆనందంలో మా సాయితండ్రి మాతో ఉన్నారనడానికి మాకెన్నో అనుభూతులు ఉన్నాయి. వాటిలోనుండి, కొద్దిరోజుల క్రితం మాకు బాబా ప్రసాదించిన అనుభూతిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ప్రతిరోజూ బాబాకు పాదాభివందనంతో నా దినచర్య మొదలవుతుంది. బాబాకి చెప్పకుండా ఏ పనీ చేయాలని అనిపించదు. ఆరోజు గురువారం. ఎప్పటిలానే ఆరోజు కూడా బాబా పూజకి కూర్చున్నాను. కానీ అస్సలు పూజ చేయలేకపోయాను. ఉన్నట్టుండి గొంతులో చాలా అసౌకర్యంగానూ, ఆయాసంగానూ అనిపించింది. ఎప్పుడూ అంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళనిదాన్ని, ఆరోజు మాత్రం 'అసలు ఆలస్యం చేయవద్ద'ని బాబా చెప్పినట్టనిపించి, వెంటనే మావారితో కలిసి హాస్పిటల్‌కి వెళ్ళి ఫిజీషియన్‌ని కలిశాము. నాకున్న లక్షణాలను బట్టి చేయవలసిన పరీక్షలు చేసి, వాటి ఫలితాలు చూసి, "కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. వెంటనే కార్టియాలజిస్ట్‌ని సంప్రదించమ"ని చెప్పి, నన్ను యశోద హాస్పిటల్‌కి వెళ్ళమని సూచించారు. మామూలుగా కూడా నాకు సాయి నామస్మరణ ఊపిరి. అది ఎల్లప్పుడూ నా మనసులో నడుస్తూనే ఉంటుంది. అప్పుడు కూడా బాబాకి చెప్పి యశోద హాస్పిటల్‌కి బయలుదేరాము. నేను ధైర్యంగానే ఉన్నానుగానీ, మావారు చాలా టెన్షన్ పడి బీపీ పెంచేసుకున్నారు. నాకు తన గురించి టెన్షన్. యశోద హాస్పిటల్‌కి వెళ్ళి, డాక్టర్ని కలిశాము. సాయి నామస్మరణ చేసుకుంటూ, "మందులతో నా సమస్య తగ్గితే చాలు బాబా" అని బాబాను వేడుకున్నాను. కానీ డాక్టర్, 'ఒకసారి TMT (ట్రెడ్‌మిల్ టెస్ట్) చేయించమ'ని చెప్పారు. మళ్ళీ బాబాకి చెప్పి టెస్ట్‌కి వెళ్ళాను. కానీ 2 నిమిషాలు కూడా ట్రెడ్‌మిల్‌పై నడవలేకపోయాను. డాక్టర్ TMT రిజల్ట్ చూసి, "యాంజియోగ్రామ్ చేస్తే మంచిది, వీలైనంత త్వరగా చేయించుకోండి" అని చెప్పారు. ఈసారి కూడా బాబాని వేడుకొని, 'నవరాత్రుల పూజ తరువాత యాంజియోగ్రామ్ చేయించుకుంటాన'ని డాక్టరుకి చెప్పాను. నా వేదన తెలుసుకొన్న బాబా, ఒక వారంరోజుల తరువాత యాంజియోగ్రామ్‌కి స్లాట్ ఇచ్చేలా చేశారు. ఈ వారంరోజులూ మందులు వాడమని, అక్టోబరు 6, గురువారంనాడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవమని చెప్పారు డాక్టర్‌గారు. ఈ అన్ని పరిస్థితులలోనూ బాబా నాతోనే ఉన్నారు. ఈ వారంరోజుల్లో మాకు రైల్వే రిఫరల్ కూడా దొరికింది. గురువారంనాడు బాబా ఆశీర్వాదం తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళి జాయినయ్యాను. "బాబా, ఎందుకు ఈ పరీక్ష పెట్టావు?" అని బాబాను అడుగుతూనే ఉన్నాను. మా అబ్బాయి యు.ఎస్.ఎలో ఉంటాడు. తను అప్పటికప్పుడు అక్కడినుండి రాలేని పరిస్థితి. మాకు మేమే ధైర్యం చెప్పుకొని బాబా మీద భారం వేసి, బాబా నామస్మరణ చేసుకుంటూ, సాయిచాలీసా చేసుకుంటూ గడిపాము. ఉదయం 9 గంటలకు యాంజియోగ్రామ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు, హాస్పిటల్లో వేరే ఎమర్జెన్సీ కేసులు ఉండటం వల్ల ఆరోజు సాయంత్రం చేస్తామన్నారు. అక్కడ బాబా నాకొక సందేశం ఇచ్చారనిపించింది. సాయంత్రం 6.30కి నన్ను ల్యాబ్‌కి తీసుకొని వెళ్ళారు. అక్కడ నర్స్ నాతో, "బాబాకి దణ్ణం పెట్టుకోండి, అంతా క్లియర్‌గానే ఉంటుంది" అని అన్నప్పుడు నాకు మళ్ళీ బాబా సందేశం ఇచ్చారనిపించింది. టెస్ట్ పూర్తవుతూనే, 'అంతా బాగుంది' అన్నట్టుగా డాక్టర్ తన చేతి బొటనవ్రేలిని పైకెత్తి చూపుతుంటే అది నాకు బాబా చూపించినట్లే అనిపించింది. డాక్టర్ మావారిని కూడా పిలిచి మానిటర్ చూపించి, "అంతా బాగుంది, ఏ సమస్యా లేదు" అని అన్నప్పుడు మాకు కలిగిన అనుభూతి, ఆనందం మాటల్లో వర్ణించలేనిది. సాయిభక్తులైన మీ అందరూ కూడా బాబా అనుగ్రహంతో ఆ అనుభూతి, ఆనందాలను మీ మీ జీవితాలలో చూసే ఉంటారు. "బాబా! మొదట మా జీవితాలలో తుఫాను రేపి, మళ్ళీ నువ్వే దాన్ని శాంతపరుస్తావు. అందరినీ చల్లగా చూడు తండ్రీ. అందరూ ఆనందంగా మీ అనుభూతులు పంచుకుంటూ ఉండేలా అనుగ్రహించు".
'బాబా' అంటే చాలు - బాధలు తీరుస్తారు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు సుభాషిణి. శ్రీసాయి దయవల్ల మా అమ్మాయికి బాబు పుట్టాడు. ఆరోజు గురువారం కావడంతో బాబానే మా ఇంటికి వచ్చారని మాకు చాలా సంతోషమేసింది. అయితే బాబు పుట్టిన నాలుగో రోజు తనకి కామెర్లు వచ్చి ఇంక్యుబేటర్‌లో పెట్టారు. నేను ఆరోజు బాబాని తలచుకుంటూ అలాగే కూర్చున్నాను. బాబా దయవల్ల ఒక్కరోజులోనే బాబు క్షేమంగా మా దగ్గరకి వచ్చాడు. బాబుకి శాంతి చేయించి, నామకరణం చేశాము. నేను బాబా పేరు బాబుకి పెట్టమని అడిగితే, మా అమ్మాయి, తన అత్తగారు అందుకు అంగీకరించి బాబుకి 'చార్విక్ సాయి' అని పేరు పెట్టారు. "ధన్యవాదాలు బాబా. అప్పుడప్పుడు బాబుకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు తండ్రీ. నీవే తనని రక్షించు బాబా".
ఒకరోజు నేను ఉంగరం మా ఇంట్లో ఒకచోట పెట్టాను. తర్వాత చూస్తే కనపడలేదు. బాబాను తలచుకుని అంతటా వెతికినా కనపడలేదు. నాకు చాలా బాధేసి మరలా వెతికితే, మొదట చూసిన చోటే ఉంగరం నా చేతికి తగిలింది. ఇది బాబా మహిమ. 'బాబా' అంటే చాలు, మన బాధలు తీరుస్తారు. "ధన్యవాదాలు బాబా".
శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and foot pain relief from the pain.jaisairam
ReplyDeleteSai nannu vamsi ni kalupu sai na kapuranni nilabettu sai plsss
ReplyDeleteఓం సాయిరాం.. సాయినాథ్ మహారాజ్ కి జై
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌼❤
ReplyDelete