1. జీవితాన్ని అర్థవంతంగా మలిచిన శ్రీసాయి మహరాజ్2. కృపతో శ్రీసాయి చేసిన అద్భుతం
జీవితాన్ని అర్థవంతంగా మలిచిన శ్రీసాయి మహరాజ్
ప్రతి ఒక్క బాబా భక్తునికి నమస్కారం. నా పేరు సాయిసృజన. నేను సాయిభక్తురాలిని. నేను ఈరోజు గడుపుతున్న నా జీవితానికి బాబానే కారణం. ఆయన నా జీవితంలోని ప్రతి దశలో నాకు ఎలా సహాయం చేశారో నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2018, ఏప్రిల్‌లో మెకానికల్ ఇంజనీరుగా నేను నా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేశాను. ఆ తర్వాత నేను జర్మనీలో మాస్టర్స్ చేయాలని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ నా తల్లిదండ్రులకు అంతటి ఆర్థికస్తోమత లేకపోవడం వల్ల, అలాగే నన్ను వేరే దేశానికి పంపడం ఇష్టం లేకపోవడం వల్ల నేను చదువు, ఉద్యోగం ఏమీ లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవలసి వచ్చి, ఏం చేయాలో, నా భవిష్యత్తు ఏమిటో అర్థం కాని స్థితిలో ఉండిపోయాను. అలా నెలలు గడిచాయి. ఋతువులు మారాయి. మా అమ్మ శ్రీసాయిబాబా భక్తురాలు. ఆమె నన్ను బాబా లీలలు చెబుతూ పెంచింది. కానీ అప్పటివరకు నేను శ్రీసాయిబాబాను అంతగా విశ్వసించలేదు. అలాంటి నేను 2019, ఆగస్టు నెలలో బాబాను పూజించడం ప్రారంభించాను. కానీ పరిస్థితులు మెరుగుపడలేదు. ఎందుకంటే, శ్రీసాయిబాబాపై నమ్మకం లేకుండా అద్భుతాలు జరగవు. అందుచేత నేను 'మనం పూర్ణహృదయంతో శ్రీసాయిబాబాను నమ్మాలి. అప్పుడే ఆయన మనకు సహాయం చేస్తారు' అని ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచాను.
నాకు ఆసక్తి లేకపోయినప్పటికీ చాలా పెళ్లి సంబంధాలు వస్తుండేవి. ఆ క్రమంలో ఒకరోజు అకస్మాత్తుగా మా పక్క ఊరిలో ఉంటున్న వారి వద్దనుండి ఒక పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఆ అబ్బాయి జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడని నేను ఆ సంబంధం పట్ల ఆసక్తి కనబరిచి, "వాళ్లతో మాట్లాడమ"ని మా నాన్నతో చెప్పాను. ఈ సంబంధం 2019, నవంబర్‌లో వస్తే, నాకు ఆ అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడటానికి 4 నెలలకు పైగా సమయం పట్టింది. చివరికి ఒక శుభప్రదమైన గురువారంనాడు నేను ఆ అబ్బాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడాను. మరుసటిరోజు కూడా మా సంభాషణ కొనసాగింది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి, మా తల్లిదండ్రులకు మా అంగీకారం తెలిపాము. అయితే 'కోవిడ్ 19' కారణంగా వీసా విషయంగా ఆ అబ్బాయికి ఎదురైన కొన్ని సమస్యల వల్ల తను భారతదేశానికి రావడానికి కుదరలేదు. అందువల్ల సంవత్సరం 5 నెలలకు పైగా మా వివాహం ఆగిపోయింది. ఈ సమయంలో నేను చాలా కష్టాలు పడ్డాను. మా బంధువులు చాలామంది, "నిన్ను పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టం ఉందా?" అని బుద్ధి తక్కువ ప్రశ్నలు అడుగుతుండేవారు. నేను వాళ్ళ మాటలకి శ్రీసాయిబాబా ముందు చాలా ఏడ్చి, "వీలైనంత త్వరగా పెళ్లి జరిగేలా అనుగ్రహించమ"ని బాబాను అడుగుతుండేదాన్ని. కానీ బాబాకు నాకోసం వేరే ప్రణాళికలున్నాయి.
నేను, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోకపోయినా 2020, ఫిబ్రవరి నుండి 2021, ఆగస్టు మధ్యకాలంలో ఫోన్ మరియు వీడియో కాల్స్‌లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మేమిద్దరం గతంలో జర్మనీలో మాస్టర్స్ చేయాలన్న నా కోరికను అనుసరించి నేను జర్మనీలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసి, విద్యార్థిగా జర్మనీ వెళ్లాలని నిశ్చయించుకున్నాము. తదనుగుణంగా నేను 'IELTS' పరీక్ష వ్రాశాను. నేను ఆ పరీక్ష బాగా వ్రాయనప్పటికీ శ్రీసాయిబాబా నాకు మంచి గ్రేడ్ వచ్చేలా సహాయం చేస్తారని నా కాబోయే భర్త నుండి ఎటువంటి సహాయం ఆశించకుండా నా అంతట నేనే 3 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేశాను. రోజులు గడిచిపోతున్నాయి. అంత సమయం వేచి ఉండటం కష్టంగా ఉంటున్నప్పటికీ నేను శ్రీసాయిబాబా పట్ల నా నమ్మకాన్ని కొనసాగించాను. ఆ నమ్మకమే నన్ను బ్రతికించిదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒక శుభదినాన నా కాబోయే భర్త ఫోన్ చేసి, "వీసా వచ్చింది. నేను ఇండియా వస్తున్నాను" అని చెప్పాడు. అంతే, వీలైనంత తొందరలో పెళ్లికి ముహూర్తం నిర్ణయించి పెళ్లిపనులు మొదలుపెట్టారు. అంతేకాదు, ఒక వారంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద మాస్టర్స్ చేయడానికి నాకొక విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ లభించింది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన నాకు ఈ విశ్వవిద్యాలయంలో సీటు ఎలా వచ్చిందని నేను ఆశ్చర్యపోయాను. అయితే సాయి పట్ల నాకున్న నమ్మకమే ఈ అద్భుతం చేసిందని నా అభిప్రాయం.
సరే, నేను తొందరలోనే నా వీసాకోసం దరఖాస్తు చేసుకున్నాను. సాధారణంగా అయితే వీసా రావడానికి 4 నుండి 5 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ బాబా దయవల్ల ప్రతిదీ చాలా వేగంగా జరిగి నెలా పదిహేను రోజుల్లో నాకు వీసా రావడం, పెళ్ళైన 2 నెలలకే నేను జర్మనీ వెళ్లడం జరిగిపోయాయి. 60% కంటే ఎక్కువ కోర్సు పూర్తిచేసి స్టూడెంట్‍గా ఉంటూనే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించాను. 2022, అక్టోబర్ 27, గురువారంనాడు ఒక యూరోపియన్ ప్రముఖ ఎనర్జీ కంపెనీలో నా మొదటి ఇంటర్వ్యూ ఇచ్చాను. అయితే మెకానికల్ ఇంజనీరునైన నాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ సవాలు చేసే విషయాలలో, కష్ట సమయాల్లో నాకు సహాయం చేసిన శ్రీసాయిబాబాపై నేను నమ్మకం ఉంచాను. ఒకప్పుడు ఏమి చేయాలో తెలియక ఇంట్లో ఖాళీగా కూర్చున్న నేను బాబా దయవల్ల ప్రస్తుతం నా మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేయడం, ఉద్యోగ సంపాదన, పిల్లలు, కుటుంబ నిర్వహణ వంటి వాటితో అర్థవంతమైన జీవితం గడుపుతూ బిజీగా ఉన్నాను. ఇది ఒక అద్భుతం. బాబా మనకోసం ఏదైనా చేయడానికి సదా సిద్ధంగా ఉంటారు. మనం చేయాల్సిందల్లా ఆయనని విశ్వసించి ఓపికగా ఉండటం. "బాబా! నాకు మీ యందు పూర్తి నమ్మకం ఉంది. నా తప్పులు ఏవైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి".
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
కృపతో శ్రీసాయి చేసిన అద్భుతం
అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2022, జూన్ 6న శిరిడీ దర్శనానికి మాకు టిక్కెట్లు లభించాయి. అయితే అవి నాకు ఇబ్బంది రోజులు. ఆ ఇబ్బందిని అధిగమించడానికి మందులు వాడదామంటే గతంలో నాకున్న హార్మోనల్ ఇబ్బందుల వల్ల సాహసం చేయలేకపోయాను. అందుచేత నేను బాబా మీద భారమేసి, "ఒక్కరోజైనా సరే ఇబ్బంది లేకుండా మీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించండి బాబా" అని ప్రార్థిస్తూ నా ప్రయాణం మొదలుపెట్టాను. శిరిడీలో నాలుగు రోజులు ఉంటే వెళ్లినరోజు, తిరిగి వచ్చేరోజు రెండుసార్లు బాబా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ దర్శనాన్ని అనుగ్రహించారు. మేము పదవ తారీఖున ఇల్లు చేరుకున్నాక 13వ తారీఖున నాకు ఇబ్బంది వచ్చింది. ఆ విధంగా ఏ మందులు వాడకుండా, ఎటువంటి ఇబ్బందీ లేకుండా తమ దర్శనాన్ని అనుగ్రహించి నా శిరిడీ యాత్రను పూర్తి చేయించారు బాబా. ఆయన మీద పూర్తిగా విశ్వాసముంచి భక్తితో వేడుకుంటే, ఇబ్బందులను తొలగించి మన ఇష్టాలను నెరవేరుస్తారని ఈ అనుభవం ద్వారా బాబా నాకు తెలియజేశారు. అందుకే ఈ అనుభవాన్ని బ్లాగ్ ద్వారా శ్రీసాయి భక్తులందరితో పంచుకోవాలని అనుకున్నాను.
2022, జూలై 1న మా బాబు పార్కులో పడిపోవడంతో కుడికాలుకి మేజర్ ఫ్రాక్చర్ అయింది. మాది చిన్న ఊరు కావటం వల్ల మామూలు డాక్టర్ దగ్గరకి వెళ్తే, కాలికి కట్టు కట్టారు. అయితే 14 రోజులు దాటినా బాబుకి నొప్పి తగ్గలేదు. నొప్పి వల్ల వాడు రోజూ ఏడుస్తుండేవాడు. వాడిని అలా చూసి నేను, నా భర్త కూడా ఏడుస్తుండేవాళ్ళం. పట్టణంలో చూపిద్దామంటే, బాబు నొప్పితో కారులో రాలేనని చెప్పేవాడు. నాకు ఏమి చేయాలో అర్థంకాక బాబాని, "వాడికి ప్రమాదం లేకుండా నొప్పి తగ్గేలా చూడండి బాబా" అని అడుగుతుండేదాన్ని. అప్పుడు బాబా అద్భుతం చేశారు. అదేమిటంటే, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ప్రతి గురువారం మా ఊరు రావటం మొదలుపెట్టారు. మేము బాబుని ఆ డాక్టరు దగ్గరకు తీసుకెళ్లి చూపించాం. ఆ డాక్టరు కట్టు సరిగా కట్టలేదని మొత్తం తీసేసి మళ్ళీ కట్టు వేసి, "మొదట కట్టు సరిగా వేయకపోవడం వల్ల కండరాలు బలహీనపడ్డాయి. అందువల్ల కొంచెం ఆలస్యంగా నొప్పులు తగ్గుతాయ"ని చెప్పారు. 10 రోజులకి నొప్పి తగ్గటం నెమ్మదిగా మొదలైంది. నాలుగు వారాల తరువాత కట్టు తీసేశారు. అయినా డాక్టరు చెప్పినట్లు దాదాపు నెల రోజుల వరకు బాబుకి నొప్పి తెలుస్తుండేది. ప్రస్తుతం తగ్గిపోయి బాబు స్కూలుకి వెళుతున్నాడు. ఇక్కడికొక ముఖ్య విషయం చెప్పాలి. అదేమిటంటే, దెబ్బ తగిలినరోజు నుంచి మా బాబు రోజూ బాబా ఫోటో పక్కన పెట్టుకుని, కట్టు మీద ఊదీ రాయించుకునేవాడు. ఆ తండ్రి మా మీద చూపిన కృప వల్లే బాబుకి నయమైంది. "కష్ట సమయంలో మాకు మానసిక ధైర్యాన్నిచ్చి, కాపాడిన మీకు శతకోటి వందనాలు బాబా. బాబు బాగా చదువుకునేలా ఆశీర్వదించండి సాయీ. అయ్యప్పస్వామి దీక్ష తీసుకున్న నా భర్తకు తోడుగా ఉండి ఆయన యాత్రను సురక్షితంగా పూర్తి చేయించండి. హార్మోనల్ ఛేంజెస్ వల్ల నేను కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను. మీ దయతో వాటి నుంచి నెమ్మదిగా బయటపడతానని అనుకుంటున్నాను తండ్రీ. త్వరలో మా సొంత ఇంటి కల నెరవేరేలా ఆశీర్వదించండి బాబా. నిరంతరం మీ నామస్మరణ చేసుకునే సద్బుద్ధిని ఇవ్వండి తండ్రీ. ఈ అనుభవాలను పంచుకోవటంలో జరిగిన ఆలస్యానికి మన్నించండి".
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ!!
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష శ్రీసాయినాథ!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai ram when we call him with saburi he will take care of us.I love you baba with my heart ♥️ please take care of my family 🙏🏽🙏🏽🙏🏽♥️🌷💐🌺🌹🎉
ReplyDeleteSai nannu na barthani kalapandi sai na kapuranni nilabettandi sai pls mimmalne nammukoni brathukuthunna sai na vamsi nannu manaspurthi Ga barya ga swikarimchi kapiraniki thiskellela chudandi sai naku na anubhavanni sai blog lo panchukune adhrustanni prasadinchandi sai
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsairam omsairam omsairam
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeletePlease save me baba. Please bless my daughter baba
ReplyDeletePlease baba
ReplyDelete