సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1378వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'నేనున్నాన'ని బాబా ఇచ్చిన దర్శనం, నిదర్శనం
2. పిసిఓడి ఉన్నప్పటికీ తొందరలోనే సంతానాన్ని అనుగ్రహించిన బాబా

'నేనున్నాన'ని బాబా ఇచ్చిన దర్శనం, నిదర్శనం


సాయి బంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు. నా పేరు హరిత. నేను ఇదివరకు రెండు అనుభవాలు మీతో పంచుకున్నాను. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. ఇటీవల ఒకరోజు ఆఫీసులో ఉండగా మా డాడీకి గుండె దగ్గర కొద్దిగా నొప్పి వచ్చింది. సాయంత్రం మామూలుగానే ఇంటికి వచ్చారు కానీ, ఆఫీసులో నొప్పి వచ్చిన విషయం మాకెవరికీ చెప్పలేదు. రాత్రి నేను, అన్నయ్య టీవీ చూస్తుండగా డాడీ, "నేను వెళ్లి పడుకుంటాను" అని వెళ్ళిపోయారు. కానీ కొద్దిసేపట్లో తిరిగొచ్చి కుర్చీలో కూర్చున్నారు. అన్నయ్య, "ఏం డాడీ పడుకోలేదు" అని అడిగితే, "అసౌకర్యంగా ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యేమో! పరవాలేదులే" అని అన్నారు. అన్నయ్య, నేను, "ఎందుకు అలా?" అని అడిగాము. అప్పుడు, "ఉదయం ఆఫీసులో గుండె దగ్గర నొప్పి వచ్చింది. ఇప్పుడు అసౌకర్యంగా ఉంది" అని అన్నారు. మేము మెడికల్ షాపులో ఏవో మందులు తెచ్చిస్తే, వేసుకుని పడుకున్నారు డాడీ. కానీ అన్నయ్య కంగారుపడుతూ రోజూ బాడీ చెకప్ చేయిద్దాం అంటుండేవాడు. ఒక పది రోజుల తరువాత ఏదో పని మీద అన్నయ్య, డాడీ హైదరాబాద్ వెళ్లారు. ఇంక అన్నయ్య బలవంతంగా డాడీకి అన్ని టెస్టులు అక్కడ చేయించాడు. దాదాపు అన్ని టెస్టులు బాగానే ఉన్నా TMT టెస్టు మాత్రం పాజిటివ్ వచ్చింది. డాక్టరు, "ఆంజియోగ్రామ్ చెయ్యాలి. స్టెంట్ వేయాల్సి ఉంటుందేమో" అని అన్నారు. కానీ డాడీ మూమూలుగానే తిరుగుతున్నారు, ఆఫీసుకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నారు. కాబట్టి ఇంటికి తిరిగి వెళ్ళిపోయి అక్కడ చూపించుకుందామని ఇంటికి వచ్చేసారు. 'ఈమధ్య మామూలుగా హాస్పిటల్‍కి వెళ్లినా స్టెంట్ వేయాలి అంటున్నారు అని ఒకరు. '99% స్టెంట్ వేయాల'ని ఒకరు అంటుంటే ఒక పదిరోజులు మేము భయంభయంగా గడిపాము. నేను, అన్నయ్య, అమ్మ, డాడీ స్టెంట్ పడదని ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటున్నా లోపల అందరికీ ఒకటే భయం. ఎప్పుడూ ధైర్యంగా ఉండే డాడీ డల్‍గా అయిపోయారు. చివరకి మా ఊరి హాస్పిటల్లో చూపిద్దామని ఒక హాస్పిటల్ ఫిక్స్ చేసుకున్నాం. నేను నాకు తెలిసిన స్నేహితుల ద్వారా సాయి సంకల్ప పారాయణ చేయించి, " సాయి... డాడీ గుండెలో బ్లాక్స్ ఉండకూడదు. స్టంట్ పడకూడదు" అని చెప్పుకున్నాను. శనివారం డాక్టర్‍ని కలిసాం. డాక్టరు, "బుధవారం ఆంజియోగ్రామ్ చేస్తాను" అని అన్నారు. అంతే, మేము చాలా టెన్షన్ పడ్డాము. డాక్టరు, "ఆంజియోగ్రామ్ చేయాలి, స్టెంట్ మాత్రం పడకపోవచ్చు. మంగళవారం ఫోన్ చేసి బుధవారం రావడానికి కన్ఫర్మ్ చేసుకోండి" అని అన్నారు. ఆదివారం రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మేము ఒక హాస్పిటల్‍కి వెళ్ళాము. ఆ హాస్పిటల్ ఎదురుగా బాబా గుడి ఉంది. నేను, అమ్మ, డాడీ, మా పెద్దమ్మ ఆ గుడికి వెళ్లినప్పటికీ అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. బాబా నిల్చుని చిలుము పీల్చి వదులుతున్నారు. ఆ పొగని చూస్తూ బాబా ధునిలో నా కర్మఫలం భస్మమైపోతుంది అనుకుంటూ లోపలికి వెళ్లి కాసేపు అక్కడే ఉన్నాను. అంతటితో కల ముగిసింది. అప్పుడు నేను, 'బాబా ఉన్నారు' అని అనుకున్నాను. ఉదయం నిద్ర లేచాక చూస్తే బ్లాగులో "నీ కుటుంబం గురించి ఆందోళన చెందకు అంతా బాగుంటుంది" అని బాబా వచనం ఉంది. మంగళవారం హాస్పిటల్‍కి ఫోన్ చేస్తే, "రేపు డాక్టర్ గారికి ఖాళీ లేదు. గురువారం ఆంజియో చేస్తారు" అని చెప్పారు. ఆవిధంగా సాయి నాకు తమపట్ల మరింత నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. గురువారం నాడు ఆంజియో చేసి సమస్యేమీ లేదని చెప్పారు. నిజంగా ఇది సాయి చేసిన అద్భుతం. ఆయన కలలో దర్శనం ఇవ్వటం ద్వారా "నేనున్నాను" అని నాకు నిదర్శనం ఇచ్చారు.  నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నిజానికి నేను డాడీకి నొప్పి వచ్చిన మొదటిరోజే బ్లాగులో పంచుకోవాలనుకున్నాను. కానీ, మొత్తం అనుభవం పూర్తయ్యాక సంతోషంగా ఈ అనుభవాన్ని పంచుకుంటానని, అప్పుడే బాబా ప్రేమ, వారి అనుగ్రహం స్పష్టంగా, పరిపూర్ణంగా ఉంటుందని ఇప్పుడు పంచుకున్నాను. 'సాయి సాయి' అని పిలిచిన వెంటనే పలుకుతూ నేనున్నానని నాకు ధైర్యం చెప్పిన బాబాకి కృతజ్ఞతలు.


మా అన్నయ్య కూతురుకి రెండేళ్ల వయస్సు. తనకి బాబా అంటే చాలా ఇష్టం. తను చిన్నదైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మేము కూడా తన విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాము. ఒకరోజు పడుకునే ముందు తనని టాయిలెట్‍కని బయటకి అంటే రోజూ తీసుకువెళ్లే చోటకి తీసుకువెళితే అక్కడ పిల్లి ఉండటంతో పాప భయపడింది. దాంతో వదిన తన చేయి పట్టుకుని వేరే చోటుకు తీసుకెళ్లింది. పని పూర్తయిన తర్వాత వదిన పాపకి డ్రాయర్ వేస్తున్నప్పుడు ఏదో పురుగు కనిపించడంతో పాప భయపడి, వదిన చేయి వదిలించుకోబోయే క్రమంలో జారి మెట్ల మీద పడింది. పదునుగా ఉన్న మెట్టు అంచుకి పాప తల గుద్దుకోవడంతో తల చిట్లి రక్తం కారింది. వెంటనే పాపని హాస్పిటల్‍కి తీసుకెళ్ళాము. చిన్నపిల్ల కదా! నాకు చాలా భయమేసి, "సాయి! తనకి ఏ నొప్పి లేకుండా చక్కగా ఆడుకోవాలి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అనుకున్నాను. పాప కూడా మేమెవరం చెప్పకుండానే డాక్టరు గాయాన్ని క్లీన్ చేస్తుంటే 'సాయిరామ్ సాయిరామ్' అని అంటుంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది. నా మేనకోడలిని బాబా చూసుకుంటారు అనిపించింది.  బాబా దయవల్ల పాపకి నొప్పి అస్సలు తెలియలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి బాబా".


పిసిఓడి ఉన్నప్పటికీ తొందరలోనే సంతానాన్ని అనుగ్రహించిన బాబా


అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. నా ప్రెగ్నెన్సీకి సంబంధించి శ్రీసాయి చూపిన అపార కృపను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, డిసెంబర్ 9న నా వివాహం జరిపించి ఎప్పటినుండో కోరుకుంటున్న నా కోరికను తీర్చారు బాబా. నాకు పిసిఓడి సమస్య ఉండడం వల్ల మాకు పిల్లలు ఆలస్యంగా పుడతారని అందరం అనుకున్నాము. కానీ బాబా కృపతో 2022, మార్చిలో నేను గర్భవతినని నిర్ధారించారు. తరువాత స్కాన్ చేసినప్పుడు డాక్టరు, "కడుపులోని బేబీకి హార్ట్ బీట్ లేదు. రెండు వారాల తర్వాత మళ్ళీ స్కాన్ తీయించండి" అని చెప్పారు. హార్ట్ బీట్ లేదన్నప్పటికీ నేను ఏ మాత్రమూ ఆందోళన చెందకుండా బాబా మీద నమ్మకంతో ఉన్నాను. ఆయన దయవల్ల రెండు వారాల తర్వాత డాక్టర్ స్కాన్ చేసి, "హార్ట్ బీట్ ఉంది" అని అన్నారు. నిజంగా అది బాబా చేసిన అద్భుతం! అలా ప్రెగ్నెన్సీ సమయంలో చాలాసార్లు బాబా నన్ను కాపాడారు. నేను, "కాన్పు సురక్షితంగా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని సాయికి మ్రొక్కుకున్నాను. నవంబర్ 21కి డెలివరీ డేట్ ఇచ్చి, అక్టోబర్ 17న చివరి స్కాన్ తీయించమన్నారు. ఆరోజు మేము స్కాన్ తీయిస్తే, "ఉమ్మనీరు తక్కువగా ఉంది" అని చెప్పారు. మరుసటిరోజు అంటే అక్టోబర్ 18 తెల్లవారుఝామున 3 గంటలకి నాకు కుడివైపున నొప్పి వచ్చింది. వెంటనే హాస్పిటల్‍కి వెళ్తే, "ఉమ్మనీరు బ్రేక్ అయింది. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి" అని చెప్పి ఆపరేషన్ చేసారు. బాబా పెద్దగండం నుండి నన్ను, నా బిడ్డను రక్షించారు. అయన కృపతో నాకు బాబు పుట్టాడు. శ్రద్ధ, సబూరిలతో ఉంటే మనం కోరిన కోరికలు బాబా తప్పక తీరుస్తారని ఇంకోసారి ఋజువు చేశారు బాబా. "ధన్యవాదాలు బాబా". మా బాబు ఆరోగ్యం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకోమని మీ అందరినీ అర్థిస్తున్నాను. నాకు ఈ అవకాశమిచ్చిన సాయి బంధువులకు నా కృతజ్ఞతలు.


మరో చిన్న అనుభవం: మా పిన్నికి గతంలో కవలలు పుట్టి రెండు, మూడు రోజుల్లో చనిపోయారు. ఈమధ్య తను మళ్ళీ గర్భవతి అయ్యారు. కాన్పు సమయం దగ్గర పడిందనగా ఆమెకు సిజేరియన్ చేయాలి అన్నారు. మేమంతా దేవునికి దణ్ణం పెట్టుకున్నాం. నేను, "బాబా! ఆమెకి గనక నార్మల్ డెలివరీ అయి తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అంతలోనే డాక్టర్ వచ్చి, "నార్మల్ డెలివరీ అయింది. బాబు పుట్టాడు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నార"ని అన్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Baba yevvariki nenu ma ayyana malli kalusthamu ane nammakam ledu sai na bartha lo ithe kanisam okka percent kuda positive ga ledu sai kani na pelli jarigindhi thursday mi ashirvadham tho jarigindhi sai naku nammakam undhi sai kachithanga na sai kalipina bandham yeppatiki dhuram avvadau yentha nagtive unna srae nenu mi midha nammakam tho baram mk midha vesi yedhurchusthunna sai nenu na nammakanni na anubhavanni blog lo panchukune adhrustam prasadhinchu sai

    ReplyDelete
  3. ఓం సాయిరాం

    ReplyDelete
  4. ఓం సాయిరాం

    ReplyDelete
  5. Om sai ram, amma nannalani kshamam ga chudandi vaalla badyata meede tandri pls, vaallaki manchi arogyanni anandanni prasadinchandi tandri, vaalla badyata me chethillo peduthunna, anta baguntundi ani asisthunnanu, manasu purthi ga nammuthunnanu tandri.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo