1. దయతో సమస్యలను పరిష్కరించిన బాబా
2. సాయి మీద నమ్మకంతో ప్రశాంతత
3. తలుచుకుంటే, 'నేను నీతోనే ఉన్నాను' అని ఋజువు చేసారు బాబా
దయతో సమస్యలను పరిష్కరించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి|
ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః||
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులకు నా నమస్కారాలు. నేనొక శ్రీసాయి భక్తురాలిని. నా పేరు వెంకటలక్ష్మీ. చిన్ననాటినుండి నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఆయన తమ భక్తులు అడిగితే, అడిగింది ఇస్తారు; అడగకుంటే వాళ్లకు ఏమి కావాలో అది ఇస్తారు. ఆయన చూపిన లీలలు అన్నీఇన్నీ కాదు. ఈమధ్య మా పాప శరీరంపై దద్దురులు వచ్చి ముఖము, చేతివేళ్లు, కాళ్ల వేళ్లు వాచిపోయాయి. హాస్పిటల్‍కి తీసుకువెళ్తానంటే తను రానంది. "ఏంటి బాబా ఈ పరిస్థితి? నువ్వే ఎలాగైనా ఆ దద్దుర్లు తగ్గించాలి" అని మనసులో బాబాని స్మరించుకున్నాను. అప్పుడే మా బాబు హాస్టల్ నుండి ఫోన్ చేసి, "అమ్మా! ఈరోజు శ్రీసాయి సచ్చరిత్ర చదివావా?" అని అడిగాడు. తను అలా అడిగేసరికి వాడి ద్వారా బాబా సందేశమిస్తున్నారనిపించింది. ఎందుకంటే, రాత్రి 9 గంటల సమయంలో మా బాబు అంతకుముందెప్పుడూ ఫోన్ చేయ్యలేదు. వెంటనే నేను పారాయణ చేసి ఇంట్లో శిరిడీ ఊదీ ఉంటే బాబాని స్మరించి పాప నుదుటన పెట్టి, వాపులపై రాశాను. మా పాప ఆ ఊదీనే టాబ్లెట్ వేసుకున్నట్లు వేసుకోసాగింది. నేను, "పాపకి తగ్గిపోతే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవలన శ్రీసచ్చరిత్ర పారాయణ, ఊదీలతో హాస్పిటల్‍కి వెళ్లకుండానే రెండురోజుల్లో పాపకి నయమైంది. "ధన్యవాదాలు బాబా".
ఇకపోతే, మా తమ్ముడు, మరదలికి మొదటి కాన్పులో, రెండో కాన్పులో కూడా ఆడపిల్లలు పుట్టారు. మా తమ్ముడికి ఇష్టం లేకపోయినా తన అత్తింటివారు పిల్లలు పుట్టకుండా తన భార్యకు ఆపరేషన్ చేయించేశారు. దానివల్ల మా తమ్ముడు మనస్తాపానికి గురై 4 నెలల వరకూ అత్తగారింటికి వెళ్లలేదు. కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. దానివల్ల తనకి, తన భార్యకి మధ్య గ్యాప్ ఎక్కువైంది. అప్పుడు నేను, "బాబా వాళ్ల మధ్య మనస్పర్థలు తగ్గి ఒక్కటయ్యేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా దయచూపారు. ఆయన చమత్కారంగా వాళ్లిద్దరిని కలిపారు. "ధన్యవాదాలు బాబా". నిజంగా బాబా ఈ బ్లాగు రూపంలో ఉన్నారన్నది వాస్తవం. సాయి భక్తులకు ఈ బ్లాగు ఒక వరం. ఇదే మొదటిసారి నా అనుభవాలు పంచుకోవడం. "తప్పులుంటే మన్నించండి బాబా". నాకు ఈ అవకాశమిచ్చిన 'సాయి మహారాజ్ సన్నిధి'కి మరొక్కసారి ధన్యవాదాలు.
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!!!
సాయి మీద నమ్మకంతో ప్రశాంతత
శ్రీసాయినాథాయ నమః!!! నాపేరు నాగలక్ష్మి. నేను 18 సంవత్సరాలుగా శ్రీసాయిని పూజిస్తున్నాను. ఎన్నో సందర్భాలలో శ్రీసాయి నాకు తోడుగా ఉండి సమస్యల నుంచి నన్ను బయటపడేసారు. 2020 నుంచి నాకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒకదాని నుండి బయటపడ్డాను అనుకునేలోపు మరికొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి పడేవి. వాటికి తోడు ఆర్థిక సమస్యలు, వృత్తిలో సమస్యలు కూడా వచ్చి పడ్డాయి. వాటన్నిటిని నేను శ్రీసాయిని స్మరిస్తూ తట్టుకుంటూ ఉండేదాన్ని. అయితే ఈమధ్య నేను చాలా డిప్రెషన్‍లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అప్పటివరకు అంటే 2022, ఆగస్టు నెలవరకు నాకు శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ, ఈ బ్లాగుల గురించి నాకు తెలియదు. ఆ సమయంలో మా బాబుకు మొబైల్ ఫోన్ అవసరమవ్వడంతో కొత్త ఫోన్ తీసుకున్నాము. అప్పుడు నా ఫోన్లో కొత్తగా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, నాకు మొదటిసారి ఈ బ్లాగు గురించి తెలిసింది. అప్పటినుండి బ్లాగులోని భక్తులు అనుభవాలు చదువుతుంటే నాకు శ్రీసాయి మీద నమ్మకం అధికమై నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నా దగ్గర ఉన్న సాయి లీలామృతం చదవడం మొదలుపెట్టి, మహాపారాయణ గ్రూపులో కూడా జాయినయ్యాను. ఇలా ఉండగా నాకు గ్యాస్ట్రిక్ సమస్య వలన చెస్ట్‌లో పెయిన్ వస్తుండేది. అప్పుడు నేను, "ఈ నొప్పి తగ్గాల"ని అనుకున్నాను. బాబా దయవల్ల నొప్పి చాలావరకు తగ్గింది. కానీ ఏవేవో ఆలోచనలతో ఏకాగ్రత కుదరక పారాయణ సరిగ్గా చేయలేకపోయేదాన్ని. అయినా పారాయణ కొనసాగిస్తూ ఉండేదాన్ని. రెండవసారి పారాయణ చేసేటప్పుడు, ఆరవరోజు ఆలోచనలతో పారాయణ పూర్తిచేసి చాలా బాధపడుతూ సాయిని స్మరించుకుంటూ నిద్రపోయాను. కలలో పచ్చని చీర కట్టుకున్న ఒకావిడ కనిపించి నా పేరు పెట్టి చాలా స్పష్టంగా నన్ను పిలిచారు. నాకు మెలకువ వచ్చి చుట్టూ చూశాను, ఎవరూ కనిపించలేదు. అప్పుడు అది కల అని ఆ కలను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. అప్పుడు ఆ కలలో కనిపించిన ఆవిడ చీరకట్టు శ్రీసాయి సజీవులుగా ఉన్నకాలంలో శిరిడీలోని స్త్రీల వస్త్రధారణలా ఉందని గుర్తించి సాయే ఆవిడ రూపంలో కనిపించి నన్ను పేరుపెట్టి పిలిచారని చాలా ఆనందమేసింది. ఇంకా నాకు వచ్చిన సమస్యలన్నింటిని శ్రీసాయి ఖచ్చితంగా తీరుస్తారని నాకు నమ్మకం కల్గింది. ఆ నమ్మకంతో సాయిని నమ్ముకున్న వాళ్ళను ఏ సమస్యలు ఏమీ చేయలేవని ఓర్పుగా ఆయన కృపకోసం ఎదురుచూస్తున్నాను.
తలుచుకుంటే, 'నేను నీతోనే ఉన్నాను' అని ఋజువు చేసారు బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు ఉమ. మేము దుబాయ్‍లో నివాసముంటున్నాము. ఒకసారి నా దుబాయ్ రెసిడెన్స్ వీసా ఎక్స్‌పైర్ అయిపోతే, ఆ పని మీద నేను రక్తపరీక్ష చేయించుకోవడానికి హాస్పిటల్‍కి వెళ్లి బ్లడ్ శాంపిల్ ఇచ్చాను. అయితే వాళ్ళు ఎక్స్-రే కూడా తీయించుకోమన్నారు. దాని అవసరమేమిటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వీసా కోసం రక్తపరీక్ష సరిపోతుంది. అది కూడా వాళ్లకు టీబీ వంటివి ఏమైనా ఉన్నాయేమోనని అనుమానం ఉంటేనే రక్తపరీక్ష చేయించుకోమంటారు. సరే, అక్కడ ఎక్స్-రే కొరకు చాలామంది ఉన్నారు. అందువల్ల నన్ను కాసేపు కూర్చోమన్నారు. నేను సరేనని అక్కడ కూర్చుని, "బాబా, ఓ దయామయ తండ్రి! నాకు ఎక్స్-రే అవసరం లేదని వీళ్ళు చెప్పాలి. అద్భుతం చెయ్యండి మేరే బాబా" అని చెప్పుకుని సాయి నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను. అలా ఒక అరగంట గడిచాక ఒక ఉద్యోగి వచ్చి 'మిస్టర్ మండ' అని పిలిచింది. నేను ఏమిటని అడిగితే, "మీకు ఎక్స్-రే అవసరం లేద"ని చెప్పింది. అలా తలుచుకుంటే, 'నేను నీతోనే ఉన్నాను' అని మరోసారి ఋజువు చేసారు బాబా. "ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba naku vamsi ante chala istam baba,thana ki dhuram ga undaleka narakam ga undhi sai .dagara undi kanna thandri la ma pelli jaripincharu adhi kuda baba guruvaram roju na .malli naku ee pariksha yendhuku sai .nanu na barthani kulupandi sai na kapuranni nilabettu sai court ki velladam naku istam ledu sai.sakshalu sikshalu tho kadhu sai thanu manaspurthi na midha istam tho thanu na barya ani happy ga nannu kapuraniki thiskellali sai ..aadapillani mosam cheyyadam thappu ani thanu thelsukovali manchi ga marali.andharu antunnaru sai, mosam Chesthe anubhavisthadu chudu ani kani na barthaki siksha padali ani menu korukovatledu sai thannu manchi ga Mari mashula viluva thelsukoni nannu thiskellali ani korukuntunnanu sai.andharu dhanni thisi parre Vere marriage chesko ee rojullo avi mamule antunnaru sai.Kani nannu na barthan ni kalipidhi na sai . na pelli jarigindhi guruvaram adhi kuda mi ashirvadham tho .na pranam poina nenu miru echina ee mangalyam thiyyanu sai.ee pariksha mi midha nammakam tho untano ledho ani testing la undhi sai.kani Bartha ki dhuram ga chala narakam ga undhi yennno avamanalu Amma Nana dhigulu chudaleka pothunna sai. andharu Ee blog gurinchi chepthunte valla anubhavalu chaduvuthunte sai tho matladthunnatu anipisthundhi.na life lo dadhappu 10 years venakki chuskunte motham prathi anuvanuvulonu baba na kanispithunnaru Miru na life lo chesina yenno miracles miku yea run am thirchukogalanu sai..ye adapilla ina kapuram bagundali Bartha tho undali ane korukuntundhi nenu adhe korukuntunnanu nyayam anipisthe nannu na barthani kalapandi sai ...Mali na anubhavanni sai blog lo panchukune adhrustanni prasadhinchandi sai om sairam🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me