1. అన్ని విధాలా అండగా ఉంటున్న బాబా
2. అడిగిన రీతిన అనుగ్రహించిన బాబా
3. బాబా అవాజ్యమైన ప్రేమ
అన్ని విధాలా అండగా ఉంటున్న బాబా
ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాయి బంధువులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈమధ్య మా అమ్మగారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. నేను 'ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి, మావారు సహకరిస్తారో లేదో' అని భయపడి నా బాబాని, అమ్మవారిని తలచుకున్నాను. ముందు హాస్పిటల్ సిబ్బంది ట్రీట్మెంట్‍కి క్రెడిట్(ట్రీట్మెంట్‍కి అవసరమైన ఖర్చు భరించేలా ఆఫీసు వాళ్ళు ఇచ్చే కాగితం) రాదు అన్నారు. కానీ బాబా దయవల్ల అమ్మ ఆపరేషన్‍కి, డయాలసిస్‍కి ఇన్సూరెన్స్ కవర్ అయింది. మావారు కూడా మా పుట్టింటితో ఉన్న ఇబ్బందులన్నీ మర్చిపోయి నాకు నైతిక మద్దతు ఇచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం, అమ్మ ఆపరేషన్ విషయంలో ఒక ఉద్యోగి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చి, గ్యారంటీ సంతకం చేస్తేనే అమ్మకి డబ్బులు రావడం, సర్జరీ చేయడం జరుగుతాయి. అయితే ఆ అబ్బాయి ఒక బంధువు చెప్పుడు మాటలు విని హాస్పిటల్‍కి, మా ఇంటికి రావడం మానేశాడు. 2022, సెప్టెంబర్ 15న నేను హాస్పిటల్ నుండి వస్తూ అతనికి ఫోన్ చేస్తే, అతను ఎత్తలేదు. అతను తప్ప మాకు సహాయం చేయడానికి ఎవరూ లేనందున నేను టెన్షన్ పడి, "బాబా! అతను మళ్లీ మామూలుగా ఉండి ఆ డాక్యుమెంట్స్ పని పూర్తి చేస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. నేను అలా మ్రొక్కుకున్న పది నిమిషాల్లో అతను డాక్యుమెంట్స్ తెచ్చి హాస్పిటల్లో ఇచ్చాడు. బాబా ఆశీస్సుల వల్ల లక్షల్లో ఖర్చు అవ్వాల్సిన సమస్య నుండి వేలల్లో బయట పడ్డాము. "ధన్యవాదాలు బాబా".
తరువాత అక్టోబర్ నెల మొదటి వారంలో అమ్మని చూడటానికి మా పిన్ని వచ్చింది. ఆవిడ, మావారు మామూలుగా మంచివాళ్ళే కానీ, ఇద్దరికీ కోపం ఎక్కువ. అందువల్ల వాళ్లిద్దరూ గొడవ పడితే అమ్మ ఇబ్బందిపడుతుందని నేను భయపడ్డాను. అయితే సరిగ్గా మా పిన్ని వచ్చిన సమయంలో నేను ఫోన్‍లో చూస్తే, బాబా ఫోటోతో "అంతా సవ్యంగా జరుగుతుంది, భయపడకు" అని మెసేజ్ వచ్చింది. అది చూసి నేను, "బాబా! మీదే భారం అనుకున్నాను. బాబా దయవల్ల మా పిన్ని, మావారు చాలా మామూలుగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".
అమ్మకి బాగోలేనందున నేను ఆగస్టు నుండి ఏలూరులో ఉంటున్నాను. మావారు మా పిల్లల్ని చూసుకుంటూ హైదరాబాద్‍లో ఉన్నారు. అక్టోబర్ నెల మొదటి వారంలో మా ఏడేళ్ల చిన్నపాప చేతికి ఫ్రాక్చర్ అయ్యి కట్టు వేశారు. అయినా తను ఎడవకుండా తన పని తను చేసుకుంటూ, "నువ్వు బెంగపడకు అమ్మా" అని ఫోన్‍లో చెప్తుంది. అమ్మ మంచం మీదే ఉంది, అక్కడ పాపకి అలా అయింది, మరోపక్క మావారి ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. ఆయనకి హెర్నియా ఆపరేషన్ చేయాలన్నారు. ఇటువంటి స్థితిలో సాయి లీలామృతం చదువుదామన్న నా మనసు లగ్నం అయ్యేది కాదు. కానీ రోజూ మన బ్లాగు చదువుతూ బాబాను స్మరిస్తూ, "బాబా! తమ్ముడు మొండితనం వదిలి అమ్మని ఇబ్బందిపెట్టకుండా ఉండేలా, మా పాప ఆరోగ్యం, మావారి ఆరోగ్యం బాగుండేలా దీవించండి. ఆయనకి ఆపరేషన్ తప్పనిసరైతే మీరే ఆయన్ని కాపాడాలి తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆయన దయతో మావారికి హెర్నియా ఆపరేషన్ మంచిగా జరిగి ఇప్పడు బాగానే ఉన్నారు. కానీ ఇంకా ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. నేను బాబానే నమ్ముకుని ఉన్నాను.
అడిగిన రీతిన అనుగ్రహించిన బాబా
శ్రీసాయి పాదపద్మములకు శతకోటి వందనాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేనొక చిన్న సాయి భక్తురాలిని. నాపేరు అర్చన. 2022, సెప్టెంబర్ 5వ తేదీన నేను మా గురువుగారితో మాట్లాడుతూ అనుకోకుండా ఒక అబద్ధం చెప్పాను. నిజానికి నాకు తెలియకుండానే ఆ అబద్ధం నా నోటివెంట వచ్చేసింది. కానీ ఆ విషయం కనిపెట్టిన మా గురువుగారు, "నాతో అబద్ధం చెప్తావా?" అని చాలా గట్టిగా తిట్టారు. నేను చాలా బాధపడి, "బాబా! మా గురువుగారి కోపానికి కారణమయ్యాను. నేను ఇకమీదట ఎట్టి పరిష్టితుల్లో అబద్ధం చెప్పను. నా తప్పును క్షమించి గురువుగారు నాతో మామూలుగా మాట్లాడేటట్లు చేయండి బాబా. అలా జరిగితే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మాటిచ్చాను. బాబా దయవల్ల గురువుగారి కోపం తగ్గి సెప్టెంబర్ 10వ తేదీ నుండి మామూలుగా మాట్లాడుతున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా".
2022, సెప్టెంబర్ మూడో వారంలో నాకు తెలియకుండానే ఒక పెద్ద తప్పు జరిగింది. దాని కారణంగా మా అక్క నాతో మాట్లాడటం మానేసింది. నేను తప్పు చేయకపోయినా అందరూ నాదే తప్పు అన్నారు. నేను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. తర్వాత బాబా దగ్గర ఎంత ఏడ్చానో ఆయనకే తెలుసు! అప్పటినుండి, "నేను చేసిన తప్పును క్షమించి, అక్క నాతో మాట్లాడేలా చూడండి బాబా" అని బాబాను ఎంతో ఆర్తిగా ప్రార్థిస్తుండేదాన్ని. ఆయన నా బాధను విన్నారు. అక్టోబర్ 7వ తేదీన మా అక్క నాతో మాట్లాడింది. నా అందానికి అవధులు లేవు. వెంటనే బాబాకు శతకోటి ధన్యవాదాలు చెప్పుకున్నాను.
2022, అక్టోబర్ 2, శనివారం నాడు మా గురువుగారు, "మీ ఊరు వస్తాము, వచ్చి కలవండి" అన్నారు. సరిగా అది నా నెలసరి సమయం అయినందున "ఏంటి బాబా ఇలా చేశారు? మీరు, గురువుగారు ఒక్కటేనని ప్రార్థిస్తాను. అటువంటిది మా ప్రాంతానికి గురువుగారు వచ్చినప్పుడు కలవడం కుదరకపోతే ఎలా?" అని చాలా బాధపడ్డాను. అంతేకాదు, "బాబా! గురువుగారు ఆలస్యంగా వచ్చేటట్లైతే, నెలసరి ముందుగా రావాలి. లేదా ఆయన ముందుగా వస్తే, నెలసరి ఆలస్యంగా రావాలి" అని బాబాను వేడుకున్నాను. గురువుగారు అక్టోబర్ 2న రాలేదు. అక్టోబర్ 11న నాకు నెలసరి వచ్చింది. ఇదేమిటి ఇలా జరిగింది అని నేను బాధపడే లోపే గురువుగారు 'నెల ఆఖరున వస్తార'ని కబురు తెలిసింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. మీ కృపాకటాక్షాలు మా అందరి మీద ఉండాలి సాయి .నాకు రావలసిన డబ్బులు ఈ సంవత్సరాంతంలో వచ్చేలా చూడు సాయి".
బాబా అవాజ్యమైన ప్రేమ
ముందుగా శ్రీసాయి బంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు భారతి. ఎంతో క్లిష్టమైన సమస్య విషయంలో సాయితండ్రి ఈమధ్య మమ్మల్ని అనుగ్రహించారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు పంచుకుంటాను. మా అమ్మాయికి వివాహమై నాలుగు సంవత్సరాలైంది. రెండు సంవత్సరాల నుండి సంతానం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మాకు నిరాశే ఎదురవుతుండేది. ఈ విషయం గురించి బాబాని, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని వేడుకోని రోజు ఉండేది కాదు. చివరికి, "సాయితండ్రీ! మా ప్రార్ధనలు, ప్రయత్నాలు ఫలించి త్వరలో మేము శుభవార్త వింటే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్నంతనే బాబా పలికారు, శుభవార్త వినిపించారు. నిజంగా ఈ బ్లాగు బాబాచేత నిర్వహింపబడుతోంది. ఏమిచ్చినా సకల దేవతా స్వరూపమైన సాయి ఋణం తీర్చుకోలేనిది. ఆయన బిడ్డల్ని ఆయనే చూసుకుంటారు. కొన్నిసార్లు మనం అనుకున్నది నెరవేరడానికి ఆలస్యమవుతుంది. మనం శ్రద్ధ, సబూరీలతో ఉండాలి. అదే బాబా చూపిన మార్గం. కాబట్టి కష్టమైనా అలా ఉండడానికి ప్రయత్నిస్తూ మనం ఆయనకి సర్వస్య శరణాగతి చెంది, 'ఇక భరించలేను తండ్రీ' అంటే బాబా పలుకుతారు. ఇది సత్యం. ఎన్నో విషయాలలో ఇది నా అనుభవం. "ధన్యవాదాలు బాబా. మా అమ్మాయి, అల్లుడుకి పుట్టబోయే బిడ్డకి మీరే రక్ష. ఏ ఇబ్బందులు కలగకుండా చూడు తండ్రి. మా కుటుంబాన్ని కాపాడు బాబా. నా ఉద్యోగ జీవితంలో ఎంతో కష్టపడి పనిచేసినా, మంచి చేస్తున్న కూడా నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆ ఒత్తిడిని, పని ఒత్తిడిని భరించలేకపోతున్నాను బాబా. ఆ విషయం మీకే వదిలి పెడుతున్నాను, మీరే పరిష్కరించాలి తండ్రి. సమస్య పరిష్కారం అవ్వగానే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను సాయితండ్రి".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Sai na vamsi manasu manchi ga marchu sai naku anyam cheyyadam thappani thanu thelusu kunela chei sai. Thanu manchi ga manas purthiga prema tho nannu barya ga swikarinchi kapuraniki thiskellela chudu sai naku ee vishyam court daka velli akkkada yevari mundhi nenu na bartha okari midha okaram dweshqm chupukovadam istam ledhu sai. Ee samasyani antha dhuram pokunda. Mi samaksham lo pariksharinchandi sai. Naku n bartha ante chala istam sai Thanaki dhuram ga undalante narakqm ga undhi sai. Kotha samvastram yeppudu thanaki dhuram ga chudakunda lenu Sai modati sari ee samvaram. Baba kanna thandri la dagara undi na pelli jaripincharu baba varam lone na pelli jarigindho sai mire mammalni kaliparu ani Chala aanandhapaddanu sai ee pariksha yenti thandi naku. Mire malli kaluputharu ani nammakam tho btmrathukuthuna sai
ReplyDeleteJaisairam bless supraja for her neck pain and shoulder pain and foot pain relief from the pain of happiness and wealth of happiness Jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me