సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1379వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. స్మరణ మాత్రాన కష్టాల నుండి బయటపడేస్తారు బాబా
2. మనసు కుదుటపరిచిన బాబా
3. బాబా లీల

స్మరణ మాత్రాన కష్టాల నుండి బయటపడేస్తారు బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు శ్వేత. గత సంవత్సరం బాబా దయవల్ల నాకు ఒక MNC కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆఫీసు దూరంగా ఉన్నా వర్క్ ఫ్రం హోం ఇవ్వడం వల్ల నాకు పెద్ద కష్టం అనిపించలేదు. అయితే ఈమధ్య ఆఫీసుకు రావాలని చెప్పారు. దాంతో ఆఫీసుకు వెళ్లడం మొదలుపెట్టాను. కానీ ఏదో తెలియని బాధగా ఉండి ఆఫీసుకు దగ్గరగా ఉంటే బావుంటుందేమోననిపించి, "బాబా! ఆఫీసుకి, పిల్లల స్కూలుకి దగ్గరగా ఒక మంచి ఇల్లు దొరికేలా సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. నేను కోరుకున్నట్లే బాబా దగ్గర్లో ఒక మంచి ఫ్లాట్ చూపించారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ".


కొత్త ఇంటిలోకి మారడానికి నేను ఒక వారం రోజులు సెలవు తీసుకున్నాను. సెలవు పూర్తయిన తర్వాత ఆఫీసుకి వెళితే మా టీమ్ లీడ్, మేనేజర్ తదితరులు, "వర్క్ ఎంతవరకు వచ్చింది? మూడురోజుల్లో పూర్తిచేసి చూపించాలి" అని ఒత్తిడి చేశారు. 'హఠాత్తుగా ఇలా తొందర చేస్తారేంట'ని నాకు చాలా బాధేసింది. మూడు రోజుల్లో ఎలా పూర్తి చేయాలో తోచక బాబా నామస్మరణ చేయసాగాను. ఆ రాత్రి నేను మా టీమ్ లీడ్‍కి ఫోన్ చేసి, "నేను మూడు రోజుల్లో మొత్తం వర్క్ పూర్తిచేయలేను. కొంతవరకు అయితే చేసి చూపించగలను" అని చెప్పాను. అందుకు తను, "ఎవరి సహాయమైనా తీసుకుని పూర్తిచేయి" అని అన్నారు. సరేనని మా టీమ్‍లో ఉన్న ఇంకొక అమ్మాయి సహాయం తీసుకుని మూడు రోజుల్లో వర్క్ అంతా పూర్తిచేసి వాళ్ళకి చూపించాను. బాబా దయవల్ల మీటింగ్ అంతా బాగా జరిగి, "చాలా బాగా చేశావు" అని అందరూ మెచ్చుకున్నారు. ఇలా ఎన్నోసార్లు బాబా నన్ను కాపాడారు. ఇక నేను, 'ఎంత కష్టం వచ్చినా భయపడను. నాకు బాబా ఉన్నారని ఆయన నామస్మరణ చేస్తాను'. బాబా నన్ను ఆ కష్టం నుంచి బయటపడేస్తారు. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".


ఒకసారి నేను శ్రీహనుమంతునికి తమలపాకుల మాల సమర్పించుకుంటానని అనుకున్నాను. కానీ నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. హఠాత్తుగా ఒక శుక్రవారంనాడు నా ఫ్రెండ్స్, "రేపు శనివారం కదా! ఉదయం శ్రీహనుమాన్ గుడికి వెళదామా?" అని అన్నారు. నేను సరే అన్నాను. మరుసటిరోజు ఉదయం అందరం కలిసి గుడికి వెళ్ళాము. అక్కడ 108 తమలపాకులతో చేసిన మాల అమ్ముతుంటే, అందరమూ వాటిని కొని శ్రీహనుమాన్‍కి సమర్పించుకున్నాము. తర్వాత నాకు నా మ్రొక్కు గుర్తొచ్చి, "మనం మర్చిపోయినా బాబా మనతో మన మ్రొక్కులు తీర్పిస్తార"ని మనసులోనే బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. "అందరినీ సదా చల్లగా చూడు సాయీ. ఎప్పుడూ మీ నామస్మరణ మా మదిలో సాగేలా  చూడు సాయీ".


మనసు కుదుటపరిచిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


శ్రీసాయి మహరాజ్‍కు శతకోటి వందనాలు. ఓర్పు, సహనాలతో ఈ బ్లాగును నిర్వహిస్తూ మాలాంటి భక్తుల అనుభవాలను నలుగురితో పంచుకునే అవకాశం కల్పిస్తున్న సాయికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నాకు నా కొడుకులంటే చాలా ప్రేమ. బిడ్డలంటే అందరికీ  ప్రేమ ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ నిజం చెప్తున్నాను, వాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను చాలా ఆందోళన చెంది, బీపీ పెంచుకుని, డాక్టర్ దగ్గరకి వెళ్లే పరిస్థితి తెచ్చుకుంటాను. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల మా చిన్నబాబు ఆఫీసులో స్టాఫ్ అందరూ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. అప్పుడు నాన్‍వెజ్ బాగా ఎక్కువగా తినేవాళ్లకు ఉండేంత కొలెస్ట్రాల్ మా బాబుకుందని, "కొద్దిగా సమస్య ఉంది. నాన్‍వెజ్ తినవద్దు" అని చెప్పి మందులు ఏమీ ఇవ్వలేదుగానీ, "నీళ్లు ఎక్కువగా త్రాగి, ఒక నెల తరువాత మళ్ళీ టెస్టు చేయించుకో" అని అన్నారు. ఆ విషయం మా బాబు నాకు చెప్పలేదు. ఒకరోజు మా బాబు మా వదినవాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. ఆ అబ్బాయి డాక్టర్. మా బాబు ఉండగా వాళ్ళు అదివరకు మామూలుగా  చేయించుకున్న టెస్టు రిపోర్టులు వచ్చాయి. అప్పుడు మా బాబు, "మా కొలీగ్స్ హెల్త్ చెకప్ చేయించుకుంటే, నేను కూడా చేయించుకున్నాను" అని తనకున్న సమస్య గురించి చెప్పాడు. మా వదిన, "నీ రిపోర్టులు అబ్బాయికి చూపించు" అని అంది. సరేనని చూపిస్తే, ఆ అబ్బాయి రిపోర్టులు చూసి అంతకుముందు చెప్పిన విధంగానే, "మటన్ తినకు. చికెన్ తిను. నీళ్లు బాగా తాగి మరోసారి టెస్టు చేయించుకో" అని చెప్పాడు. మా వదిన, "మీ అమ్మకు ఈ విషయం చెప్పావా?" అని అడిగితే, లేదని చెప్పాడు మా బాబు. మా వదిన నాతో, "చిన్నబాబుకి కొద్దిగా సమస్య ఉందని మీ అల్లుడు చెప్పాడు. కానీ నువ్వేమీ టెన్షన్ పడకు. చాలా చిన్న సమస్యేనట" అని చెప్పింది. ఇక చూడండి, నేను ఒకటే ఏడుపు. మా బాబుకి ఫోన్ చేసి, తరువాత మా అల్లుడికి ఫోన్ చేసి, "ప్రాబ్లం ఏమిటి?" అని అడిగాను. తను, "ఏమీ కాదు అత్తమ్మా, చిన్న సమస్య" అని చెప్పాడు. అయినా నా మనసు కుదుటపడక చాలా టెన్షన్ పడిపోతూ, "బాబా! నా కొడుకుకి ఎలాంటి సమస్యా ఉండకూడదు" అని బాబాను వేడుకున్నాను. మా బాబు ఫ్రెండ్ వాళ్ళ బాబాయి డాక్టరు. ఆయనకు రిపోర్టులు చూపించాము. ఆయన, "ఏమీ కాదు. మామూలు సమస్యే" అని కొన్ని మందులు ఇచ్చి, "ఇంకోసారి టెస్టు చేయించమ"ని చెప్పారు. అప్పుడు నేను కాస్త కుదుటపడ్డాను. "ధన్యవాదాలు బాబా. మీరే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. నా కొడుకు మళ్ళీ టెస్టు చేయించినప్పుడు మీ దయతో రిపోర్టు నార్మల్ వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను, సచ్చరిత్ర పారాయణ చేస్తాను".


బాబా లీల


సాయిభక్తులకు నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యు.ఎస్.ఏలో ఉంటాము. మా అమ్మాయి 12 గ్రేడ్(ఇంటర్ రెండో సంవత్సరం) చదువుతుంది. ఇక్కడ యు.ఎస్.ఏలో మరుసటి సంవత్సరం కాలేజీలో జాయిన్ అవటానికి ఇప్పటినుండే యూనివర్సిటీలకు అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఆ క్రమంలో 2022, అక్టోబర్ నెల మూడో వారంలో ఒకరోజు మా అమ్మాయి అప్లికేషన్ పంపే ప్రయత్నంలో అదే చివరిరోజు కావడంతో కంగారులో కొన్ని విషయాలు తప్పు వ్రాసి, మొత్తం అప్లికేషన్ నింపాననుకుని కంప్యూటర్లో సెండ్ బటన్ నొక్కేసింది. ఆ తర్వాత చూసుకుని, "అమ్మా! నేను అప్లికేషన్‍లో కొన్ని తప్పులు వ్రాశాను. నా పూర్తి జీవితానికి పెద్ద ప్రమాదం ఏర్పడింది" అని ఒకటే ఏడ్చింది. కానీ ఒక్కసారి సెండ్ చేశాక ఏమీ చేయలేని పరిస్థితి. అందువలన నాకు ఏం తోచక ఒకటే అనుకున్నాను, "బాబా! నువ్వు ఉన్నావు. ఎలా అయినా ఏదో ఒక పరిష్కారం చూపి అద్భుతం చేయి తండ్రీ. ఏదైనా మంచి విషయం వింటే వెంటనే నీ బ్లాగులో పంచుకుంటాను" అని. మరుసటిరోజు ఉదయం కాలేజీవాళ్ళ దగ్గర నుండి, 'అప్లికేషన్‍లో కొన్ని తప్పులున్నాయి. మళ్ళీ అప్లికేషన్ నింపి పంపించండి' అని మెసేజ్ వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే, ఇప్పటివరకు అలా ఎవరికీ మెసేజ్ రాలేదంట. అంతా బాబా లీల. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Sai nannu vamsi ni kalupu sai ma kapuranni nilabettu sai thanu machi ga Mari mosam cheyyadam thappani thelusukoni nannu nannu manas purthi ga barya ga swikarichi kapuraniki thiskellela chudu sai prathi vishyam lo kana thandri LA nanny kapadtharu kasha said we vishyam lo kids nanny kapadaandi said na jeevithanni nilabettandi sai nenu na anubhavanni said maharj sannidhi blog lo panchukuntanu sai naku Mir u thappa sahayam chesevallu yevvaru leru said naku na Bart ha ante chala is tam said pls dhuramcheyyodhu said thana KO dhuram ga undaleka narakam chusth

    ReplyDelete
  4. om sai ram. Please help me. I am surrounded by enemies. My husband is not understanding and causing the problem. Baba please change his mindset. He takes all the things negatively and quarrels with me.change him baba... he causing problem for past 14 years. Not allowing me to see my parents.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo