1. అదృష్టం కాదది - బాబా అనుగ్రహం
2. బాబా దయ
3. బాబా దయవల్ల నార్మల్ అని వచ్చిన రిపోర్టులు
అదృష్టం కాదది - బాబా అనుగ్రహం
ఓం శ్రీ సాయినాథాయ నమః. నేను సాయి భక్తురాలిని. 2021, అక్టోబర్ నెల చివరిలో ఆ సాయినాథుడు తమ కృపాకటాక్షాలు నాపై వర్షించిన తీరును నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. 2021, అక్టోబర్ 30, శనివారంనాడు నేను చాలా పనులు పెట్టుకుని మా అమ్మాయితో కలిసి బజారుకు వెళ్ళాను. బ్యాంకు పని, బట్టలకు మరియు బంగారు ఆభరణాలకు సంబందించిన పనులన్నీ ఒకేసారి పూర్తి చేసుకోవాలని బయలుదేరడం వల్ల చేతుల్లో లగేజీ ఎక్కువగా ఉంది(అలా ఎప్పుడూ చేయకూడదని ఆరోజు తరువాత నాకు అర్థమైంది). ముందుగా బ్యాంకుకి వెళ్లి, అక్కడి పని పూర్తి చేసుకుని బంగారం కరిగించే పని మీద బజారుకు వెళ్ళాము. అవి చాలా ఇరుకు సందులు. పైగా అంతకుముందు నాకు ఆ షాపుల గురించి ఏమీ తెలీదు. వాళ్ళనివీళ్ళని అడుగుతూ ఒక షాపు గురించి తెలుసుకుని, విశాలమైన రోడ్డు మీద బండి పార్కు చేసి ఒక చిన్న సందులో ఉన్న బంగారం కరిగించే షాపుకి వెళ్ళాము. ఆ షాపతను అన్నీ తూకం వేసి, పని మొదలు పెడుతుండగా నాకెందుకో నా ఫోన్ గుర్తొచ్చి బ్యాగులో నుండి తీద్దామని చూస్తే, బ్యాగు కనిపించలేదు. పక్కనే ఉన్న మా అమ్మాయి చేతిలో ఉందేమోనని తనని అడిగితే తను, "నా దగ్గర లేదు" అని చెప్పింది. ఒక్క నిమిషం నాకేం అర్థం కాలేదు, మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే బండి ఎక్కగానే బ్యాగును బైక్ ముందు భాగంలో ఉన్న కొక్కానికి తగిలించానని గుర్తొచ్చి, దాన్ని తియ్యకుండా అలానే వదిలేశానా అని ఒక్కసారి గుండె గుభేలుమంది. ఇక్కడ చూస్తే, బంగారం అంతా ఓపెన్ చేసి కూర్చున్నాను. కాబట్టి వెంటనే నేను పరుగెత్తలేని పరిస్థితి. అందువలన మా అమ్మాయిని, "వెళ్లి చూడమ"ని పంపించి, ఒక్క క్షణం బాబాని తలుచుకున్నాను. కేవలం అలా తలుచుకున్నాను అంతే, ఆర్తిగా ప్రార్ధించేందుకు కూడా నాకు మైండ్ పని చేయట్లేదు. కానీ బాబాను తలిచానో, లేదో మా అమ్మాయి చేతిలో బ్యాగుతో వస్తూ కనిపించింది. నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. 'సాయీ' అన్న పిలుపు పూర్తిగా పూర్తయిందో, లేదో స్వామి అనుగ్రహించారు.
తరువాత ఆ షాపతను, "విలువైనవేమన్నా బ్యాగులో ఉన్నాయా మేడమ్?" అని అడిగారు. నేను అతనితో, "డబ్బు అయితే పెద్దగా ఏమి లేదు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాన్, అన్ని బ్యాంకుల ఏటిఎం కార్డులు, కాలేజీ ఐడి కార్డులు, ఫోన్, ఒకటని కాదు నా మొత్తం సంసారం ఎప్పుడూ అందులోనే ఉంటాయి. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం కోల్ కత్తాలో ఇలాగే ఒకసారి కార్డులతో ఉన్న పర్స్ పోగొట్టుకుని అవన్నీ తిరిగి పొందడానికి ఎంత కష్టపడ్డానో నాకు బాగా గుర్తుంది" అని అన్నాను. అప్పుడు అతను, "మీరు చాలా లక్కీ మేడమ్. ప్రత్యేకించి ఈ ప్రాంతానికి వచ్చేవాళ్లంతా నగలు, బంగారంతోనే వస్తారు. కాబట్టి ఇక్కడ పర్స్ దొరికిందంటే సాధారణంగా ఎవరూ వదిలిపెట్టరు. అలాంటిది అంత రద్దీగా ఉన్న రోడ్డులో బండికి వదిలేసిన మీ బ్యాగ్ అలాగే ఉందంటే, చాలా అదృష్టమనే చెప్పొచ్చు" అని అన్నారు. 'అది అదృష్టం కాదు, అనుగ్రహమ'ని అతనికి ఎలా చెప్పాలి? సరే, అంతటితో నా మనసు తేలికై బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుని సాయంత్రం వరకు షాపింగ్ చేసి మొత్తం పనులన్నీ పూర్తి చేసుకుని హాయిగా ఇంటికి చేరుకున్నాం. నా తండ్రి ఎప్పుడూ, నా వెన్నంటే ఉన్నారని, కాపాడుతూ ఉంటారని మరోసారి ఋజువైంది. ఇలాంటి అనుభవాలు ఏవో కొన్ని వ్రాస్తున్నాము కానీ, ప్రతిరోజూ, ప్రతి క్షణమూ ఆ సాయినాథుని కరుణ అనుభవమవుతూనే ఉంటుంది. గత ఫిబ్రవరి నెలలో కోవిడ్ మళ్ళీ పెరుగుతుందన్న కారణంగా మేము వెళ్లాల్సిన శిరిడీ ప్రయాణం వాయిదా వేశాం. తరువాత శిరిడీ మందిరం మూసేసారు. అక్టోబరులో తిరిగి తెరవబడింది కానీ, ఎన్నిసార్లు శిరిడీ వెళ్లేందుకు ప్రయత్నించినా బాబా ఎందుకో ఆపుతున్నారు. "త్వరలోనే కుటుంబ సమేతంగా మేము శిరిడీ వచ్చి, మీ దర్శనం చేసుకునేలా అనుగ్రహించండి బాబా".
బాబా దయ
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. మాది ఒంగోలు. కానీ ప్రస్తుతం న్యూజిలాండులో ఉంటున్నాను. బ్లాగు నిర్వాహకులకు నా వందనాలు. నేను రోజులో ఒక్కసారైనా ఈ బ్లాగు చదువుతాను. తద్వారా నా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను మొదటిసారి నా అనుభవాలు పంచుకుంటున్నాను. దయచేసి నేను వ్రాసిన దానిలో తప్పులు ఏమైనా ఉంటే మన్నించి, వాటిని సరిచేసి ప్రచురించగలరు. గత మూడు నెలలుగా న్యూజిలాండులో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో ఒకసారి నా భర్తకు ఆరోగ్యం బాగాలేకుంటే కోవిడ్ టెస్టు చేయించుకున్నారు. దాని రిజల్టు వచ్చేవరకు నేను ఎంతో టెన్షన్ పడ్డాను. నా భర్తకి బాబా ఊదీ పెట్టి, బాబా నామ స్మరణ చేసుకున్నాను. బాబా దయవలన రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది.
ఎప్పటినుంచో నా చెవిరింగు కనపడట్లేదు. ఎన్నిసార్లు వెతికినా అది కనిపించలేదు. నేను దాని గురించి ప్రత్యేకించి బాబాను అడగకపోయినా, అది కనిపిస్తే బాగుంటుందని అనుకున్నాను. నేను వారానికి మూడు సార్లు అయినా ఇల్లు వాక్యూమ్ చేస్తాను. అయినా ఎప్పుడు కనబడని ఆ రింగు 2021, నవంబర్ 2న వాక్యూమ్ చేస్తుంటే కనిపించింది. అంతా బాబా దయ. బాబాను నమ్మండి, ఆయన అద్భుతాలు చేస్తారు. నాకు ఇంకా నా అనుభవాల గురించి, బాబా కృప గురించి వ్రాయాలని ఉంది. కానీ ఎన్నో ఏళ్లుగా వ్రాయటం మానేసినందున వ్రాయడానికి చాలా కష్టంగా ఉంది. ఈసారి మంచిగా వ్రాసి బాబా ప్రేమను పంచుకుంటాను. "ధన్యవాదాలు బాబా".
బాబా దయవల్ల నార్మల్ అని వచ్చిన రిపోర్టులు
నా పేరు శిరీష. బాబా ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2021, నవంబరు మొదటివారంలో మా పాపకి తలనొప్పి వచ్చి, వారం రోజులైనా తగ్గలేదు. మొదటిరోజు జ్వరం కూడా ఉండేసరికి బ్లడ్ టెస్టు చేయించాము. బాబా దయవల్ల రిపోర్టు నార్మల్ గానే ఉంది. కానీ తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. అసలే ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదీకాక ఇదివరకు మా పాపకు డెంగ్యూ జ్వరమొచ్చి రెండుసార్లు హాస్పిటల్లో చేర్చి ఉన్నందున మేము బాగా టెన్షన్ పడి మరోసారి బ్లడ్ టెస్టు చేయించాము. "బాబా! రిపోర్టు నార్మల్ రావాలి. అలా జరిగితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించి, ఈ బ్లాగు ద్వారా తెలుసుకున్న 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' మంత్రాన్ని రిపోర్ట్ వచ్చేవరకు జపించసాగాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్ గానే వచ్చాయి. సంతోషంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని, బాబాకిచ్చిన మాట ప్రకారం ఈ అనుభవాన్ని ఇలా మీతో పంచుకున్నాను.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness. Jaisairam
ReplyDeleteOm sai ram������
ReplyDeleteOm sai ram when you are with us.There is no problem.you take care of everything. Om sai ram ��❤❤❤
ReplyDeleteOm sri sainaathaaya namaha
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba om sai ram kapadu nannu rakshinchuuu
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDeleteసాయినాథ నేను గత నెల రోజుల క్రితం జాండిస్ తో బాధపడుతున్న క్రమంలో మీరు అందించిన ఆశీస్సులతో నేను జాండీస్ నుంచి కోలుకుని బయటపడ్డాను.. హృదయపూర్వక కృతజ్ఞతలు బాబా.. సాయి దేవా మళ్లీ ఇప్పుడు భయం భయంగా అనిపిస్తుంది బాబా నీ కరుణా కటాక్ష వీక్షణాలు అందించి నా ఆరోగ్యాన్ని బాగు చేయి సాయిబాబా.. సాయిబాబా నీవు తప్ప మరెవరూ లేరు బాబా.. మీ ఆశీర్వాదాలతో నేను చాలా బాగున్నాను బాబా థాంక్యూ సాయి రాం బాబా
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete