1. బాబాకి చెప్పుకుంటే అన్నీ సవ్యంగా జరిపిస్తారు
2. అడిగిన వెంటనే అన్ని సమస్యలు తీరుస్తున్న బాబా
3. బాబా దయతో జరిగిన అబ్బాయి పెళ్లి
బాబాకి చెప్పుకుంటే అన్నీ సవ్యంగా జరిపిస్తారు
సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇప్పుడు బాబా ఇటీవల ప్రసాదించిన రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. 2021, అక్టోబర్ 30న మా బాబాయ్ వివాహం నిశ్చయమైంది. సరిగ్గా అదే సమయంలో తుఫాను అని ప్రకటించారు. దాంతో మేమంతా చాలా కంగారుపడ్డాము. పెళ్లి ముందురోజు నుంచే వర్షం, ఈదురుగాలులు మొదలయ్యాయి. రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. అప్పుడు నేను బాబాకి నమస్కరించుకుని, "బాబా! పెళ్లి జరిగే రేపటి రోజున వర్షం పడకుండా చేసి, పెళ్లి సవ్యంగా జరిపిస్తే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. అద్భుతమేంటంటే, పెళ్లి పూర్తయ్యేంత వరకూ ఒక్క చినుకు కూడా పడలేదు. దయతో పెళ్లి అంతా సక్రమంగా జరిపించారు బాబా. "థాంక్యూ బాబా".
బాబా దయవల్ల నా తమ్ముడు గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన ఒక పోటీ పరీక్ష వ్రాసి, అందులో క్వాలిఫై అయ్యాడు. తరువాత మరికొన్ని టెస్టులు పెట్టి వాటిలో కూడా క్వాలిఫై అయిన వారిని ఫైనల్‌గా ఎంపిక చేస్తారు. అయితే సెలక్షన్స్‌కి వెళ్ళడానికి రెండురోజుల ముందు మా తమ్ముడికి విపరీతమైన జలుబు, జ్వరం వచ్చేసరికి మేమంతా భయపడ్డాము. నేను బాబాను, "ఏంటి బాబా, ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఇలాంటి పరిస్థితి రావాలా? సెలక్షన్స్‌కి వెళ్ళే సమయానికి తను ఎలాగైనా పూర్తిగా కోలుకోవాలి. మీరే తనకి తగినంత శక్తిని ఇవ్వాలి" అని బాబాని వేడుకున్నాను. తమ్ముడు ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఉదయానికి కూడా తనకి నయం కాలేదు. నేను రోజంతా బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. బాబా దయవల్ల ఏ ఇంజక్షన్ చేయించుకోకుండానే సెలక్షన్స్‌కి వెళ్లాల్సిన రోజుకి తమ్ముడు నార్మల్ అయ్యాడు. తమ్ముడు సెలక్షన్స్‌కి వెళ్ళేముందు నేను బాబాతో, "బాబా! మీరు తమ్ముడి వెంట వెళ్లి, తను సెలెక్ట్ అయ్యేలా చేసి, తిరిగి తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని రావాలి" అని చెప్పుకుని ఆయనను వేడుకున్నాను. బాబా దయవల్ల తమ్ముడు ఆ సెలక్షన్స్‌లో సెలెక్ట్ అయ్యాడు. ఇలానే ఫైనల్ టెస్టులో తమ్ముడు సెలెక్ట్ అయి, తనకి ఉద్యోగం వస్తే ఆ అనుభవాన్ని కూడా మీ అందరితో పంచుకుంటానని బాబాకు విన్నవించుకుంటున్నాను. "థాంక్యూ బాబా. మీకు చెప్పుకున్నట్లు ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను".
అడిగిన వెంటనే అన్ని సమస్యలు తీరుస్తున్న బాబా
సాయిభక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తుడిని. గతంలో నేను నా అనుభవాలు కొన్ని పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మేము మాకున్న కొన్ని ఆర్ధిక పరిస్థితుల వలన మా బంధువుల వద్ద నుండి ఒక బంగారు వస్తువు తీసుకొచ్చి, వాళ్ళకి చెప్పకుండా తాకట్టు పెట్టాము. కొన్నిరోజులకి వాళ్ళు తిరిగి అడిగేసరికి వాళ్లకు విషయం చెప్పలేక, సమయానికి వస్తువును తాకట్టునుండి ఎలా విడిపించాలో తెలియక చాలా భయపడ్డాము. వెంటనే, "బాబా మీకు అన్నీ తెలుసు, ఎలాగైనా ఆ వస్తువును విడిపించడానికి సహాయం చెయ్యండి. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాము" అని బాబాతో చెప్పుకుని మా ప్రయత్నాలు మొదలుపెట్టాము. అద్భుతం! ఒకరి ద్వారా డబ్బు సర్దుబాటు అయి మా సమస్య తీరుపోయింది. జరిగింది మేమే నమ్మలేకపోయాం. అంత దయామయుడు సాయిబాబా.
ఒకరోజు రాత్రి నా భార్యకు హఠాత్తుగా పంటినొప్పి మొదలయ్యింది. పంటినొప్పి వస్తే చాలా భయంకరంగా ఉంటుంది, ఆ బాధను తట్టుకోవడం కష్టం. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు దాటింది. మాది చిన్న గ్రామమైనందున అప్పటికి మెడికల్ షాపులన్నీ మూసివేశారు. ఇక చేసేదేమీ లేక బాబాకు చెప్పుకుని, "నొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాము. అంతే, ఆ క్షణం నుండి నొప్పి తగ్గడం మొదలై ఉదయానికి పూర్తిగా తగ్గిపోయింది. పంటినొప్పి ఏ మందులు వాడకుండా తగ్గడం ఒక అద్భుతం. ఈ విధంగా అడిగిన వెంటనే అన్ని సమస్యలు తీరుస్తున్న బాబాకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను నేను. భక్తితో అయన నామస్మరణ చేయటం తప్ప. ఈ అవకాశమిచ్చిన బాబాకు, బ్లాగు నిర్వహించే సాయికి నా నమస్కారాలు.
బాబా దయతో జరిగిన అబ్బాయి పెళ్లి
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!! నాపేరు రాధాకృష్ణ. మాది రాజమండ్రి. నేను ఇదివరకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని 'సాయిభక్తుల అనుభవమాలిక' ద్వారా మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ముందుగా ఇటువంటి బ్లాగు నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సాయి కృపతో మా అబ్బాయికి వివాహం నిశ్చయమైంది. అయితే ఆ తరువాత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మరియు కరోనా కారణంగా వివాహం వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు నేను నా మదిలో సాయిని తలచి, "ఏ ఇబ్బందీ లేకుండా వివాహం జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయతో ఏ అటంకాలు లేకుండా మా అబ్బాయి వివాహం 2021, అక్టోబర్ 16న జరిగింది. అంతేకాదు, వివాహానంతరం కేవలం వారం రోజుల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, శ్రీ తిరుమల వేంకటేశ్వరుని దర్శనం, అట్లతద్ది ఏ అవాంతరాలు లేకుండా అనుకున్నట్టు జరిగాయి. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా". ఇకపోతే బాబా అనుగ్రహంతో మా అమ్మాయికి బిడ్డ పుట్టాక 2021, నవంబర్ 7న బెంగుళూరులో కొత్త కాపురం పెట్టించాలని నిర్ణయించాం. అందుకు అనుకూల పరిస్థితులు కల్పించినందుకు కూడా ఆ సాయినాథునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం మా చెల్లెలి కోడలికి ఒంట్లో బాగాలేని కారణంగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది. ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడి అందరూ ఆనందంగా ఉండేలా ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరో అనుభవంతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
Om sri sai naathaaya namaha
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDelete🙏🕉️✡️🙏 సాయి దేవా ధన్యవాదాలు తండ్రి.. నీ దయతో నేను అనారోగ్యం చిన్న జాండిస్నుం నుంచి కోలుకుని ఆరోగ్యవంతుడి ని అయ్యాను సాయిరాం. బాబా అదేవిధంగా నా ఆరోగ్యం, నా వెయిట్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నందుకు థాంక్యూ థాంక్యూ దేవా హృదయ పూర్వక కృతజ్ఞతలు సాయిరాం బాబా దేవా..
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI....OM SAI RAM
ReplyDeleteOm Sai Ram
ReplyDelete