సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 997వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్నవారికి నమ్ముకున్నంత బాబా అనుగ్రహం
2. బాబా కృపకు ఆంక్షలు అవసరం లేదు

నమ్ముకున్నవారికి నమ్ముకున్నంత బాబా అనుగ్రహం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి భక్తులందరికీ నమస్కారాలు. నా పేరు శిరీష. నేను ఇంతకు ముందు నా అనుభవాలు కొన్ని ఈ బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకున్నాను. నాలాగే ఎంతోమంది భక్తులకు తమ అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించి, మా అందరి అనుభవాల ద్వారా తోటి భక్తులకు బాబా మీద శ్రద్ధ, భక్తులను పెంపొందింపజేస్తున్న ఈ బ్లాగు నిర్వాహకులైన సాయికి నా ధన్యవాదాలు. నేను గత మూడు నెలల నుండి ప్రతి ఏకాదశికి సాయి స్తవనమంజరి పారాయణ చేస్తున్నాను. దీపావళి ముందు వచ్చిన ఏకాదశి రోజున ఉదయం 9 గంటలవరకే ఏకాదశి ఘడియలు ఉన్నందువల్ల మావారు క్యాంపుకి వెళ్ళాల్సి ఉన్నా ఆలోపే పారాయణ పూర్తిచేశాను. తరువాత మావారు నెల్లూరు జిల్లాలోని PHC(పబ్లిక్ హెల్త్ కేర్), GGH(గవర్నమెంట్ హాస్పిటల్)ల ఇన్స్పెక్షన్ పనిమీద క్యాంపుకి వెళ్ళారు. తరువాత నేను మా పాపను స్కూల్లో దించి, బాబా గుడికి వెళ్ళాను. అప్పుడు బాబా ఎందుకో నావైపు బాధగా చూస్తున్నట్లు అనిపించింది. నాకు ఏమీ అర్థం కాలేదు. అయితే రెండురోజులు క్యాంప్ అని వెళ్ళిన మావారు ఫోన్ చేసి, "సాయంత్రానికి తిరిగి వచ్చేస్తున్నాను, మళ్లీ ఇంకోసారి వెళ్తాను" అని చెప్తే, నేను వర్షం వల్ల తిరిగి వచ్చేస్తున్నారని అనుకున్నాను. కానీ ఆయన వచ్చిన తరువాత అసలు విషయం తెలిసింది. అదేమిటంటే, ఆరోజు మధ్యాహ్నానికి మావారు కావలిలో ఇన్స్పెక్షన్ ముగించుకుని వాళ్ళ ఎస్.ఈ గారితో మాట్లాడటానికి వెళ్తుండగా కాలుజారి పడిపోయారు. ఆయన పడుతున్నప్పుడు తన అరచేతిని క్రింద ఆనించడం వల్ల మణికట్టు దగ్గర ఎముక విరిగిపోయింది. వెంటనే ఆయనని హాస్పిటల్ కి తీసుకుని వెళితే, ఎక్స్-రే తీసి, "మీరు చాలా అదృష్టవంతులు, ఎముక విరిగినా గానీ పక్కకు జరగలేదు. కొంచెంలో తప్పింది, లేకపోతే సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం కట్టుతో సరిపోయింది" అని చెప్పారు. బాబానే పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. ఆయన తమ భక్తులకు జరగబోయే పెద్ద ప్రమాదాలను తప్పించి వారిని రక్షిస్తారు. ఆ సాయినాథుని మీద నమ్మకంతో మా వారిని, నా కుటుంబాన్ని ఆయనకు అప్పగించాను. బాబా ఎన్నోసార్లు, ఏన్నో ప్రమాదాల నుండి నా కుటుంబాన్ని కాపాడారు, కాపాడుతునే ఉన్నారు. "సాయినాథా! మిమ్మల్ని నమ్మి మీ చేయి పట్టుకున్నందుకు తల్లివలే మా కుటుంబాన్ని కాపాడుతున్నారు. త్వరలోనే మావారి చేయి బాగయ్యేటట్లు చూడు తండ్రి".


ఇప్పుడు బాబా మా చిన్నాన్న, చిన్నమ్మలను కోవిడ్ నుండి కాపాడిన అనుభవాన్ని పంచుకుంటాను. మా చిన్ననాన్న ఎన్నో సంవత్సరాల నుండి బాబా భక్తులు. ఆయన ప్రతిరోజూ బాబాకి ప్రదక్షిణలు చేస్తారు, రోజూ సత్సంగంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం మందిర వార్షికోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఆయనే చేస్తారు. అయితే ఎన్నో పూజలు, వ్రతాలు చేసిన తరువాత కూడా వాళ్ళకి 20 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. చివరకు బాబా దయవలన మా చెల్లి పుట్టింది. తనకి సాయిదివ్య అని పేరు పెట్టుకున్నారు. ఇటీవల 2021, మే నెలలో మా చిన్నమ్మ కోవిడ్ బారినపడ్డారు. అయితే అది కోవిడ్ అని తెలియక మామూలు జ్వరమనుకుని వారం రోజుల వరకు అశ్రద్ధ చేశారు. వారం రోజులైనా జ్వరం తగ్గకపోయేసరికి కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న ఈ సమయంలో ఇప్పటికే వారం రోజులు అశ్రద్ధ చేశారని చెప్పి చిన్నమ్మను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాము. ముందుగా రాపిడ్ టెస్టు చేసి "కరోనా కాదు, టైఫాయిడ్" అని చెప్పారు. తరువాత మరోసారి టెస్టు చేసి "కరోనా వచ్చింద"ని చెప్పారు. అప్పటికే చిన్నమ్మ పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. రెండురోజుల తరువాత చిన్నాన్న ఫోన్ చేసి, 'రెమెడిసివర్ ఇంజక్షన్ చేయాలని అంటున్నారు. అవి ఎక్కడా దొరకడం లేదు. అర్జెంట్ గా రెండు ఇంజెక్షన్లు కావాలి. మీరు కూడా ప్రయత్నించండి" అని చెప్పారు. మావారు మెడికల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తుండటం వల్ల తెలిసిన చాలామంది ద్వారా ఆ ఇంజక్షన్ కోసం ప్రయత్నించారు, కానీ దొరకలేదు. అంతలో చిన్నాన్న మళ్ళీ ఫోన్ చేసి చాలా బాధపడుతూ, "చిన్నమ్మ ఆక్సీజన్ లెవల్స్ 89కి వచ్చాయి. ఆ బాబా మా ఇంటిని చీకటి చేస్తారో, వెలుగులోనికి తీసుకువెళతారో గానీ నేను ఆయన మీదే భారం వేశానమ్మ" అని అన్నారు. తరవాత బాబా దయవల్ల రెమిడిసివర్ ఇంజక్షన్ దొరకడంతో చిన్నమ్మను బోర్లా పడుకోపెట్టి ఇంజక్షన్స్ ఇచ్చి, "ఆ రాత్రి గడిస్తే చాలు" అన్నారు. చిన్ననాన్న బాబా మీద భారం వేసి ఆ రాత్రంతా బాబా నామస్మరణ చేస్తూ గడిపారు. తెల్లారేసరికల్లా చిన్నమ్మ ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతూ 92-94 మధ్యకు వచ్చాయి. తరువాత ఒకరోజుకి చిన్నమ్మ పరిస్థితిలో చాలా మార్పు వచ్చి వారం రోజులకు పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఇదంతా బాబా దయ, ఆయన మీద చిన్నాన్న పెట్టుకున్న నమ్మకం. అయితే చిన్నమ్మతో సన్నిహితంగా ఉండటం వల్ల చిన్నాన్నకి కూడా కోవిడ్ వచ్చింది. ఆయన్ని కూడా బాబానే కాపాడారు. నమ్మకంతో వేడుకుని, శ్రద్ధ, సబూరీలతో భారం బాబా మీద వేస్తే, ఆయన మన చేయి పట్టుకుని మనకొచ్చిన కష్టాలు నుండి విముక్తి కలిగిస్తారు. "నేను ఈ అనుభవాన్ని చాలా ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు సాయి". 


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా కృపకు ఆంక్షలు అవసరం లేదు


నేను సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారాలు. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను. మా తమ్ముడికి వివాహమై ఒక బాబు ఉన్నాడు. ప్రస్తుతం మా మరదలు కడుపుతో ఉంది. కానీ వాళ్ళ వైవాహిక జీవితం ఎప్పుడూ గొడవల మయం. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని వాళ్ళిద్దరూ గొడవపడుతుంటారు. వారిద్దరి మధ్య మా అమ్మనాన్నలు చాలా నలిగిపోతూ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈమధ్య ఒకసారి మా తమ్ముడు, మరదలు బాగా గొడవపడి, మా మరదలు బాబుని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండు నెలలు అయినా ఫోన్ కూడా చెయ్యలేదు. మధ్యవర్తులు మాతో, "మీరు ఫోన్ చేయకండి,వాళ్ళే తప్పు తెలుసుకుని వస్తారు" అన్నారు. అలా మూడవ నెల కూడా గడిచిపోయింది. అయినా మా మరదలు వాళ్ళ దగ్గరనుండి ఎటువంటి స్పందనా లేదు. ఆ విషయం అలా ఉంచితే, ప్రతి గురువారం మనవడిని తీసుకుని బాబా గుడికి వెళ్ళే మా నాన్న మా మరదలు బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిన తరువాత నుండి బాబు వచ్చిన తరువాతే గుడికి వస్తానని గుడికి వెళ్ళటం మానేసారు. ఆ విషయం నాకు చాలారోజుల వరకు తెలియదు. ఈమధ్య మాటల సందర్భంలో నాన్న చెపితే, "నాన్నా! బాబు ఇంటికి తప్పనిసరిగా వస్తాడు. నువ్వు బాబాను క్షమాపణ అడిగి ప్రతి గురువారం మునుపటిలా గుడికి వెళ్ళు" అని చెప్పాను. బాబా లీల చూడండి. తరువాత వారమే మా మరదలు వాళ్ళ దగ్గర నుండి మాకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు మా మరదలు తిరిగి ఇంటికి వచ్చింది. మా నాన్న 5 వారాల సాయి దివ్యపూజ పూర్తి చేశారు. "బాబా! వాళ్ళు తమ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు సృష్టించుకుంటున్నారు. వాళ్ళు బుద్ధిగా ఉండేటట్లు చూడండి సాయీ. తప్పులుంటే క్షమించండి బాబా".



6 comments:

  1. ఓమ్ సాయిరాం నీ దయ తో sai దివ్య పూజ పూరిత్రి చేయిochu neenu నమ్ముకున్న బాబా నా కుటుంబbani కాపాడు తండ్రి ❤❤❤

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness. Jaisairam

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo