1. సాయి కృపతో అందరికీ ఆరోగ్యం
2. తోడుగా ఉండి వర్క్ పూర్తి చేయడంలో సహాయం చేసిన బాబా
సాయి కృపతో అందరికీ ఆరోగ్యం
నేను ఒక సాయిభక్తురాలిని. మేము బెంగుళూరు నివాసస్థులం. ముందుగా సాయిబంధువులకు, నిరాటంకంగా బ్లాగును నడుపుతున్న నిర్వాహకులకు నా నమస్కారాలు. నేనిప్పుడు సాయి దివ్య పాదములకు నమస్కరిస్తూ వారు నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. కాస్త ఆలస్యమైనందుకు ముందుగా బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను.
2021, ఏప్రిల్ నెలలో మా చెల్లికి జ్వరం వచ్చింది. తన అత్తింటివారు తనకి కరోనా టెస్టు చేయించగా, కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో వాళ్ళు మా చెల్లిని వెంటనే మా అమ్మగారింటికి పంపించారు. మా చెల్లి మాకు ఫోన్ చేసి చాలా బాధపడింది. వెంటనే నేను బాబా నామస్మరణ చేసుకుంటూ, "బాబా! చెల్లికి ఎటువంటి ప్రమాదం లేకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. అలాగే మా చెల్లిని కూడా "బాబా నామస్మరణ చేసుకుంటూ, ప్రతిరోజు బాబా ఊదీ నీటిలో కలుపుకుని త్రాగమ"ని చెప్పాను. తను అలానే చేసింది. అయితే, చెల్లి అమ్మ వాళ్ళింట్లో ప్రత్యేకించి ఒక గదిలో ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరికీ జ్వరమొచ్చి, కరోనా లక్షణాలు కూడా కనపడ్డాయి. నాకు చాలా భయమేసి, "ఎటువంటి ఆపద కలగకుండా వాళ్లందరినీ కాపాడండి బాబా. వాళ్లకు తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి భారం ఆయన మీద వేసాను. అంతలో మా అత్తయ్యకి, మా బాబుకి కరోనా పాజిటివ్ వచ్చింది. అత్తయ్యకు లివర్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది. నేను పూర్తి నమ్మకంతో బాబానే ఆశ్రయించి ప్రతిరోజూ 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రం జపిస్తూ ఉండసాగాను. బాబా దయవలన రెండు వారాల తరువాత అందరూ కరోనా బారినుండి క్షేమంగా బయటపడ్డారు. "బాబా! మా వాళ్లందరినీ కాపాడినందుకు మీ పాదపద్మములకు శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాను తండ్రి".
మా పాప విజయవాడలో హాస్టల్లో ఉంటూ బి.టెక్ చదువుతుంది. 2021, ఏప్రిల్ నెల చివరిలో మూడో సంవత్సరం పరీక్షలైన తరువాత తను బెంగుళూరు వద్దామని బస్సు రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తే, లాక్ డౌన్ కారణంగా ఏ బస్సులూ లేవు. అప్పుడు మేము చాలా కంగారు పడ్డాము. నేను, "బాబా! ఎలాగైనా పాపని మా వద్దకు చేర్చండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత బాబా దయవలన పాపకి ట్రైన్ టికెట్ దొరికింది. బాబా కృపను చూడండి! ఆ ఒక్క టిక్కెట్టే అందుబాటులో ఉంది. బాబా మా పాపకోసమే ఆ టికెట్ ఉంచారని మేము చాలా సంతోష పడ్డాము. అయితే, మా పాప ఒంటరిగా ట్రైన్ లో ప్రయాణం చేయడం అదే మొదటిసారి. అంతేకాక ఆ సమయంలో కరోనా ఉధృతి చాలా ఎక్కువ ఉంది. అందువలన మాకు చాలా భయమేసింది. "బాబా! పాపను క్షేమంగా ఇంటికి చేర్చి ఎటువంటి ఆపద కలగకుండా ఉంటే, గురుచరిత్ర పారాయణ చేయించి ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు చెప్పుకున్నాను. బాబా పాపను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత నేను రోజూ పాపచేత ఊదీ నీళ్ళు త్రాగించాను. కరోనా సమయంలో ప్రయాణం వలన పాపకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా క్షేమంగా ఉండేలా బాబా కృప చూపించారు. అందులకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి పాదపద్మములకు నమస్కారాలు అర్పించుకుంటున్నాను.
2021, జూన్ నుండి నాకు నిద్రపట్టకపోవడం, తలనొప్పి, మెడనొప్పి, తల తిరగడం ఎక్కువగా ఉండటంతో మావారు నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి చెకప్ చేయించారు. అప్పుడు నాకు బిపి ఉందని చెప్పారు. కానీ టాబ్లెట్స్ ఏమీ తీసుకోక ప్రతిరోజు నీటిలో బాబా ఊదీ వేసుకుని త్రాగుతూ ఉండేదాన్ని. కొద్దిరోజులకు బ్లడ్ టెస్ట్లు చేయించి, "ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా చూడమ"ని బాబాని ప్రార్ధించాను. కానీ నాకు థైరాయిడ్ ఉందని తెలిసింది. అప్పుడు డాక్టరుని కలిస్తే, B12 ఇంజెక్షన్స్ చేశారు. బాబా దయవల్ల హై బిపి ఉన్నప్పటికీ కొద్దిపాటి మందులతో నా సమస్యలు మెల్లమెల్లగా తగ్గడం ప్రారంభించాయి. ఇంతలో మా వారికి జాండిస్ వచ్చి లివర్ ఇన్ఫెక్ట్ అయ్యింది. నాకు చాలా భయమేసి, అనుక్షణం బాబాను ప్రార్థిస్తూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' మంత్రాన్ని జపిస్తూ ప్రతిరోజూ బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని నేను, మావారు త్రాగుతూ ఉండేవాళ్ళం. ఊదీయే మా పాలిట ఒక ఔషధంలా పనిచేసింది. బాబా దయవలన ఒక నెల పూర్తయ్యాక మేము ఇద్దరం అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి క్షేమంగా బయటపడ్డాము. ఆ కష్ట సమయంలో బాబా తప్ప మాకు దిక్కు లేదు. బాబాయే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అయి అక్కున చేర్చుకున్నారు. తోడుగా ఉండి మా చేయి పట్టుకుని ఏ ప్రమాదం జరగకుండా మమ్మల్ని కాపాడి సమస్య నుండి బయటపడేసారు బాబా. ఇది అంత సాయి కృప.
"బాబా! మా కుటుంబంలో అందరినీ కాపాడినందులకు మీ పాదపద్మములకు శతకోటి వందనాలు. ఆనందభాష్పాలతో మీ పాదములు కడగడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయులము. మేము ఆర్థికంగా చాలా సమస్యలలో ఉన్నాము. వాటిని త్వరగా పరిష్కరించి మా జీవన ప్రయాణంలో గమ్య స్థానానికి చేరుస్తారని ఆశిస్తున్నాము తండ్రి".
తోడుగా ఉండి వర్క్ పూర్తి చేయడంలో సహాయం చేసిన బాబా
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నడుపుతున్న సాయి అన్నయ్యకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్వేత. నేను ఇంతకు ముందు నా అనుభవంలో బాబా నేను కోరుకున్న ఒక ఎమ్.ఎన్.సి కంపెనీలో నాకు ఉద్యోగం అనుగ్రహించారని పంచుకున్నాను. ఆ ఉద్యోగంలో చేరాక నేను బాగా పని చేయడం చూసి మా మేనేజర్ నాకు ఒక కొత్త పనిని అప్పగించారు. అయితే నేను ఇంతకు ముందెప్పుడూ ఆ వర్క్ చేయనందువల్ల మా టీమ్ లో ఎవరిదైనా సహాయం తీసుకుని ఆ వర్క్ చేద్దామనుకున్నాను. కానీ టీమ్ లో ఎవరిని అడిగినా 'అది పాజిబుల్ కాదు, చేయకపోవడం బెటర్' అని సలహా ఇచ్చారు. అప్పుడు నేను, "బాబా! నేను ఈ వర్క్ చేయగలనని నమ్మి మేనేజర్ నాకు ఈ పని అప్పగించారు. కానీ ఇదివరకు అనుభవం లేని ఆ వర్క్ చేయడానికి నాకు ఎవరి సహాయం అందట్లేదు, ఏ దారి దొరకట్లేదు. ఇక మీరే నాకు దిక్కు సాయీ" అని బాబాను వేడుకున్నాను. ఆ తరువాత నాకు చేతనైనంత వరకు ప్రయత్నించి కొంత వర్క్ పూర్తి చేశాను. ఆ పై ముందుకు పోవడానికి నా వల్ల కాలేదు. అప్పుడు నా భర్త, "టెన్షన్ పడకు,నువ్వు ఎంతవరకు చేశావో అది మేనేజర్ కి చూపించి, ఎక్కడ సమస్యను ఎదుర్కుంటున్నావో దాని గురించి వివరించు. వాళ్ళు ఏమైనా సూచనలిస్తే ముందుకు పోవచ్చు" అన్నారు. నాకు, 'కరెక్టే కదా!' అనిపించి మరుసటిరోజు మా మేనేజర్ తో మాట్లాడాను. తను, "నీకు సహాయం చేయమని ఒకామెతో చెప్తాను" అన్నారు. ఆమె కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి ప్రయత్నించమంది. అప్పుడు నేను వర్క్ మొదలుపెట్టి, వర్క్ చేస్తున్నంతసేపూ బాబాను స్మరిస్తూ ఉన్నాను. చివరికి ఆరోజు సాయంత్రానికి వర్క్ కావల్సినట్లుగా వచ్చింది. పట్టలేని ఆనందంతో మనసులోనే బాబాకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అంతా పూర్తయ్యాక అదివరకు ఆ వర్క్ చేయమని మా టీమ్ లో ఎవరిని అడిగినా, 'అది వర్క్ అవ్వదు, పాజిబుల్ కాదని' చెప్పడం వల్ల చివరిగా మా మేనేజర్ నాకిచ్చారని తెలిసింది. ఇలా బాబా నాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వటమేకాక, తమ సహాయాన్ని అందించి వర్క్ పూర్తి చేయించారు. "థాంక్యూ సో మచ్ సాయీ. అందరూ బాగుండాలి బాబా. ఏమైనా తప్పులుంటే క్షమించండి తండ్రి".
Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sri sai naathaaya namaha
ReplyDeleteOm sai ram your leelas are miracles.in another blog jogs story was very nice��.sai baba Protects his devotees.if we had Shraddha and Saburi.om sai ram ❤❤❤
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete