సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1685వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • దయతో అక్కున చేర్చుకొని సహాయం అందిస్తున్న బాబా

సాయిబాబాను నమ్మి ఆరాధించే అందరికీ నమస్సుమాంజలులు. నా పేరు కావ్య. నేను నిజానికి ఈ సంవత్సరం అంటే 2023, సెప్టెంబర్ నెల ముందువరకు సాయి భక్తురాలిని కాదు. చిన్నప్పుడు బాబా గుడికి వెళ్ళి ఉన్నప్పటికీ అది కేవలం ప్రసాదం కోసమే. అంతేగానీ, మనకు కావాల్సింది అడిగితే బాబా ఇస్తారాన్న ఊహ కూడా నాకు అప్పట్లో లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాలి. అలాంటిది నాకు ఇప్పుడు అంతా బాబానే. ఆయన నా జీవితంలోకి ప్రవేశించి తమపట్ల నమ్మకాన్ని ఎలా బలపరిచారో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

2009లో నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ సమయంలో నా రూమ్మేట్ నాకు శిరిడీ సాయిబాబా ఊదీ ఇచ్చింది. నేను రోజూ ఆ ఊదీ నా నుదుటన పెట్టుకొని పరీక్షలకు వెళ్లాను. తర్వాత ఆ పరీక్షలు ఫలితాలు వెలువడినప్పుడు ఊదీ మహిమ ఏమిటో బాబా నాకు తెలియజేశారు. నిజానికి నేను పరీక్షలు సరిగా వ్రాయనందున ఫెయిల్ అవుతానని ఫిక్స్ అయిపోయాను. అలాంటి నేను బాబా మహిమ వల్ల పాసయ్యాను. కానీ అప్పట్లో నేను ఆ క్రెడిట్ బాబాకి ఇవ్వలేదు. ఎందుకంటే, నాకు అప్పుడు బాబా మీద అంత దృష్టి లేదు. అప్పుడే నేను బాబాని గుర్తించి వుంటే ఇన్ని సంవత్సరాలు నేను బాబాకి దూరంగా వుండి కష్టాలు పడేదాన్ని కాదు. నా జీవితం చాలా బాగుండేది అనుకుంటున్నాను. "నన్ను క్షమించండి బాబా".

నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలకు బాబా మళ్ళీ నా మీద దయ చూపారు. దయతో నన్ను తమ భక్తుల్లో చేర్చుకున్నారు. ఇంత ఆలస్యమైనందుకు నేను బాధపడుతున్నాను. అసలు విషయానికి వస్తే..  2023, సెప్టెంబర్ నెలలో ఒకరోజు నేను ఫేస్బుక్ చూస్తుండగా ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' పోస్ట్ ఒకటి నా కంటపడింది. అదేమిటంటే, "నువ్వు నా దగ్గరకి రాలేనందున నేనే నీకు ఊదీ ప్యాకెట్ పంపాను. దాన్ని తీసుకున్నావా, లేదా?" అని. అది చదివి నేను నా మనసులో, "ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? నిజంగా అలా జరిగితే ఎంత బాగుండు?" అని అనుకున్నాను. ఎందుకంటే, నేను ప్రస్తుతం గర్భవతిని. తర్వాత ఆ విషయం వదిలేసాను. ఒక రెండు వారాల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం నా భర్త మధ్యాహ్న భోజనానికి వచ్చినప్పుడు, "ఇదిగో!" అంటూ తన షర్ట్ జేబులో నుంచి ఒక చిన్న ప్యాకెట్ తీసి నాకు ఇచ్చారు. నిజం చెప్తున్నాను, మావారి ఇచ్చిన ప్యాకెట్ చూసి నేను షాకై నోటిలో నుండి మాట రాలేదు. అది శిరిడీ బాబా ఊదీ ప్యాకెట్. మావారు అసలు ఇవన్నీ నమ్మరు. అలాంటి ఆయనకి ఊదీ తెచ్చి నాకు ఇవ్వాలన్న అలోచన ఎలా వచ్చిందో నాకు అర్దం కాలేదు. ఆనందంగా అరుస్తూ "ఎవరు ఇచ్చారు?" అని అడిగితే, "తెలిసిన అతను ఇచ్చాడు" అని చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే మనసులో బాబాకి దణ్ణం పెట్టుకుని రోజూ ఊదీ పెట్టుకుంటున్నాను. తర్వాత నేను చాలా విషయాల గురించి బాబాని అడగడం, ఆయన నాకు సహాయం చేయడం పరిపాటి అయిపోయింది. నేను బాబాని పూర్తిగా నమ్ముతూ 'సాయి సచ్చరిత్ర' పారాయణ కూడా చేశాను.

2023, అక్టోబర్ నెల రెండో వారంలో టిఫ్ఫా స్కాన్ చేయించుకోవడానికి నేను, మావారు హాస్పిటల్‌కి వెళ్ళాం. డాక్టరు స్కాన్ చేస్తూ, "బిడ్డ చాలా కిందకి వుంది. బోర్లపడి మొత్తం కవర్ చేసుకొని వుంది. అందువల్ల ముఖం తప్ప శరీర అవయవాలేవీ కనపడట్లేదు. ఈ పొజిషన్‌లో స్కాన్ కష్టం. నువ్వు వెళ్లి జ్యూస్ తాగి గంటన్నర వాక్ చేయి. అప్పుడు చూద్దాం. అప్పుడు కూడా రాకపోతే రేపు లేదంటే ఎల్లుండి మళ్ళీ రావాలి" అన్నారు. అసలే నా భర్తది బిజీ షెడ్యూల్. సెలవు పెట్టి మరీ నాకోసం ఉన్నారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ అంటే ఆయనకి కష్టం. విషయం చెప్తే, ఆయన కూడా అదే అన్నారు. తర్వాత ఇద్దరం టెన్షన్‌గా గడిపాము. నేను వాక్ చేస్తూ, 'బిడ్డ కదిలితే నాకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడే స్కాన్ కోసం లోపలికి వెళదాం. లేదంటే ఇంటికే' అనుకుంటూ బాబాని తలచుకుంటూ ఉన్నాను. హఠాత్తుగా అక్కడున్న ఒక గది లోపల బాబా ఫోటో కనిపించింది. నేను బాబాని చూసి 'హమ్మయ్య..' అనుకొని ఇంక వాక్ చేయడం ఆపేసి ప్రశాంతంగా కూర్చున్నాను. మావారు, "బిడ్డ కదిలేవరకు కూర్చోకుండా కాస్త వాక్ చేయి ప్లీజ్" అన్నారు. సరిగ్గా అప్పుడే డాక్టర్ పిలిచారు. బాబా తోడుగా వున్నారు కదా అని నేను లోపలికి వెళ్ళాను. బిడ్డ కదిలిక తెలియకపోయినప్పటికీ స్కానింగ్‌లో అన్ని క్లియర్‌గా తెలిసాయని డాక్టర్ చెప్పారు. బాబా కడుపులో బిడ్డను కూడా చేతితో పట్టుకుని కదపగలరని నాకు అర్థమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు వేల కోట్ల వందనాలు బాబా. ఇలాగే తోడుగా ఉండి మా అందరినీ కాపాడండి బాబా. మీకు తెలియంది ఏమీ లేదు. నా కన్నీళ్లను మీరు మాత్రమే తుడవగలరు బాబా. నా కోరికలు మన్నించి ఇదేవిధంగా నా అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే భాగ్యాన్ని నాకు కలిగించు బాబా".


17 comments:

  1. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  2. Sai na bartha lo maarpu thiskura baba kalisi brrathakalsindhi memu edharam ma manasulu kalisi ye nindhalu avamanalu goddavalu abhaddhalu siikshalu lekunda premaa tho na bartha natho kalise margam chupu thandri calla. Annaya ni marchu sai

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Samastha Loka Sukhino Bhavanthu, Om Sai Ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba..bp normal ga vundali thandri please baba

    ReplyDelete
  9. saibaba maa sai madava bharam antha meede baba, madava kosam cheyalanukuntunna japamulu, homam cheyutaku maa varu vappukonetatlu cheyi baba, nenu ee blog lo panchukuntanu baba

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. ఓం సాయిరామ్

    ReplyDelete
  12. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  13. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo