1. వేడుకున్నంతనే సమస్యని తీర్చిన బాబా2. వీసా, శిరిడీ దర్శనాలను అనుగ్రహించిన బాబా
వేడుకున్నంతనే సమస్యని తీర్చిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మా అక్క తన అత్తవారింటిలో చాలా కష్టాలు పడింది. తన భర్త, అత్త తనని బాగా కొట్టేవాళ్ళు. తనకి ఎలాంటి అనారోగ్యం చేసినా డాక్టరుకి చూపించేవాళ్ళు కూడా కాదు. కొన్నాళ్ళకి మా బావ ఇల్లు కట్టించడంతో మా అక్కాబావ ఆ ఇంటిలోకి మారారు. దాంతో మా అక్కకి అత్తపోరు తప్పిందిగాని అప్పుడప్పుడు మా బావ తనని కొడుతుండేవాడు. అదీకాక అక్క ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుండేది. ఇలా ఉండగా ఒకసారి మా బంధువుల్లో ఒకరు జ్యోతిష్యం చెప్పేవాళ్ల దగ్గరకి వెళ్తుంటే వాళ్లతో మా అక్క కూడా వెళ్లింది. అక్కడ జ్యోతిష్యం చెప్పే అతను చెప్పినట్లు తన ఆరోగ్యం బాగవ్వడానికి, బావలో మార్పు రావడానికి, ఇంకా వాళ్ళ వ్యాపారం బాగా జరగడానికి కొన్ని పూజలు చేయించింది. తర్వాత మా బావలో కొంచం మార్పు వచ్చింది, వ్యాపారం కూడా బాగానే నడుస్తుండేది. కానీ అక్కకి ఒకటిపోతే మరొక ఆరోగ్య సమస్య వస్తూనే ఉండేది. ఎందుకిలా అవుతుందని అక్క మళ్లీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళ దగ్గరకి వెళ్ళింది. అతను, “ఏదో దుష్టశక్తి వెంటాడుతుంద”ని చెప్పి, “ఈ అమావాస్యకి రండి. పూజ పెడతాన”ని అన్నాడు. దాంతో అక్క అమావాస్యరోజు అక్కడికి వెళ్లాలనుకుంది. ఇంతలో మా పెద్దమ్మవాళ్ళు మా బావతో, “నెల్లూరులో ఒక ఆవిడ ఒంటిలోకి వెంగమాంబ అమ్మవారు వచ్చి మంచిగా చెపుతున్నారట. మనం అక్కడికి వెళ్లి ఒకటిపోతే ఒకటి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయో చెప్పమని అడుగుదాం” అని చెప్పారు. అక్క వేరేవాళ్ళ దగ్గరకి వెళ్లిన విషయం తెలియని బావ, “సరే అలాగే వెళదామ”ని వాళ్లతో చెప్పాడు. తర్వాత బావ అక్కతో, “అమావాస్య రోజు నెల్లూరు వెళదామ”ని చెప్పాడు. అక్కకి ఏమి చేయాలో తెలియక నన్ను సలహా అడిగింది. నేను బాబా దగ్గర 3 సార్లు చీటీ వేస్తే, ‘ముందు నుండి వెళ్తున్న వాళ్ళ దగ్గరకే వెళ్ళమ’ని వచ్చింది. అదే విషయం నేను మా అక్కతో చెప్పాను. కానీ అక్క బావకి తెలిస్తే, తిడతాడన్న భయంతో ఎటూ తేల్చుకోలేకపోయింది. ఇంకా నేను బాబాని, "అక్క కన్ఫ్యూజన్ పోగొట్టి తన సమస్యని తీర్చు బాబా. అమావాస్య రోజున నెల్లూరు వెళ్లే పనిని రద్దు చేసి, వేరే రోజు వెళ్లేలా చేయండి బాబా. మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని వేడుకున్నాను. అలా వేడుకున్నంతనే అక్క సమస్య తీరింది. అక్కడ నెల్లూరులో ప్రశ్నలు చెప్పే ఆవిడ లేదని, ఒక వారం తర్వత వస్తుందని తెలిసింది. దాంతో నెల్లూరు వెళ్లడం రద్దు అయింది. ఇంకా అమావాస్య రోజున అక్క తను ముందు వెళ్లిన దగ్గరకి వెళ్లి పూజ చేయించుకుంది. ఒక వారం తర్వాత నెల్లూరు కూడా వెళ్లొచ్చారు. తర్వాత నేను మా అక్కతో, "బాబాని నమ్ముకో. ఆయన గుడికి వెళ్లి నీ సమస్యలు చెప్పు. బాబా నిన్ను ఆదుకుంటాడు" అని చెప్పాను. తను నేను చెప్పినట్లే చేయసాగింది. బాబా దయవల్ల అక్క ఇప్పుడు కొంచెం కొంచెంగా కొలుకుంటుంది. "ధన్యవాదాలు సాయి. తన ఆరోగ్యం పూర్తిగా నయమయ్యేలా చేయి బాబా. నా కోరిక తీర్చు బాబా. అందరినీ రక్షించు తండ్రీ".
వీసా, శిరిడీ దర్శనాలను అనుగ్రహించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు వనజ. మా అబ్బాయి యుఎస్ఏ వెళ్ళడానికి వీసా స్టంపింగ్కి వెళ్ళేటప్పుడు నేను, "మొదటి ప్రయత్నంలోనే అబ్బాయికి వీసా వస్తే శిరిడీ వస్తాన"ని బాబాకి మొక్కుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా దయవల్ల మా అబ్బాయికి వీసా వచ్చింది. దాంతో శిరిడీ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. అయితే ప్రయాణానికి ముందు ఒక వారమంతా వర్షాలు కురుస్తుండటంతో ఈ పరిస్థితుల్లో శిరిడీ వెళ్లలేమని ప్రయాణానికి సిద్ధపడలేదు. కానీ మా పిల్లలిద్దరూ వర్షాలు పడుతున్నా వెళ్తామని అన్నారు. నేను మాత్రం "హైదరాబాద్ నుండి శిరిడీ వెళ్లి, వచ్చేవరకు వర్షం పడకుండా ఉంటేనే బయలుదేరుతాన"ని అన్నాను. చిత్రంగా వెంటనే వర్షం ఆగింది. దాంతో అందరం కలిసి శిరిడీ వెళ్ళాము. అక్కడ బాబా హారతి, దర్శనం అన్ని చక్కగా జరిగాయి. మేము హైదరాబాద్ రావడానికి శిరిడీ రైల్వేస్టేషన్కి బయలుదేరేటప్పుడు మాత్రమే వర్షం కురిసింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ అనుగ్రహం నా మీద, నా కుటుంబసభ్యల మీద మరియు అందరి మీద అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి. అందరి కష్టాలు తీర్చు తండ్రీ".
సాయినాథ్ మహారాజ్ కి జై!!!
Baba, please give job security. ఆందోళన గా ఉంటుంది. మంచి ఉద్యోగం ఇప్పించు తండ్రి.🙏🙏🙏 పిల్లల చదువు భారం కూడా నీదే సాయి. మా వారు నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి. అందరి ఆరోగ్యం బాగుండాలి సాయి.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteNo words are enough to express my gratitude for fulfilling my son’s wish. I totally trust and surrendered to you. Guide us in the right path 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba son marriage cheyandi drink mani pinchandi
DeleteOm sai ram, 🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba maa vari arogyam bagunday la chudandi baba
ReplyDeletesai baba maa sai madava bharam antha meede baba
ReplyDeleteBaba Naku sahayam cheyyandi baba Naku manasuku shanthi ivvandi baba Naku pregnancy lo BP peragakunda chudu thandri
ReplyDeleteBaba roju bp check cheyichukunta thandri normal ga vundali thandri.same tablet continue cheyali baba.. healthy baby ni ivvu baba please... atuvanti complications lekunda chudu baba please
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOmsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba naku money paramga chala ibbandi ga vundhi help me and send me pls
ReplyDeleteSai
ReplyDelete