సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1670వ భాగం....


ఈ భాగంలో అనుభ
వం:

  • చిన్ని చిన్న బాబా అనుగ్రహాలు

ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్తురాలిని. ఒకసారి నాకు నెలసరి ఆగిపోయింది. అప్పుడు నేను, "ప్లీజ్ బాబా! ఏ వైద్య పద్ధతి లేకుండా నాకు నెలసరి వచ్చేలా చూడండి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని అనుకున్నాను. అయినా నాకు నెలసరి రాలేదు. అందువల్ల 'ఎందుకు ఇలా అయ్యింది బాబా?' అని చాలా బాధపడ్డాను. తర్వాత డాక్టర్ని సంప్రదించి అవసరమైన వైద్యం చేయించుకున్నాను. దాంతో నెలసరి వచ్చింది కానీ, ఎక్కువ రోజులు రక్తస్రావం అవుతుండేది. అప్పుడు బాబాని తగ్గించమని అడుగుతుండేదాన్ని. బాబా దయతో ఒక వారం రోజుల తర్వాత ఆ సమస్యని తగ్గించారు. అయితే తర్వాత కూడా కొన్నిసార్లు రక్తస్రావం అవుతుండేది. దాంతో నేను భయపడ్డాను, బాధేసింది. కానీ దయతో బాబా ఆ సమస్య లేకుండా చేశారు. అయితే చాలా రోజుల వరకు నాకు నెలసరి రాలేదు. అప్పుడు, "బాబా! నెలసరి వచ్చేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. బాబా కొన్నిరోజులకి నెలసరి వచ్చేలా చేశారు. కొన్నాళ్ళకి మళ్ళీ నెలసరి ఆగుతుందేమో అని భయమేసి, "ప్లీజ్ బాబా! ఎలాగైనా నెలసరి వచ్చేలా చేయండి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని అని అనుకున్నాను. బాబా దయతో నెలసరి వచ్చేలా చేసి నాకు ఏ టెన్షన్ లేకుండా చేశారు. "ధన్యవాదాలు బాబా".

ఒకసారి నా ముఖం మీద ఏవో మచ్చలు వచ్చాయి. నేను అవి తగ్గడం కోసం ఏ ప్రయత్నాలు చేయలేదు. అవి చాలా రోజులైనా తగ్గకపోయేసరికి అప్పుడు డాక్టర్ దగ్గరకి వెళ్ళాలేమో అని అనుకున్నాను. కానీ ముందుగా బాబాని, "బాబా! ఈ మచ్చలు తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత నేను ఏ క్రీములు వాడకుండానే అవి వాటంతటవే తగ్గిపోయాయి. "ధన్యవాదాలు బాబా".

నేను చాలాసార్లు ఏదైనా పని మీద వెళ్లాలనుకున్నప్పుడు వర్షం మొదలయ్యేది లేదా వర్షం వచ్చే పరిస్థితులు ఉండేవి. అప్పుడు నేను "బాబా! వర్షం ఆగేలా చేయండి. మీ అనుగ్రహం 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకునేదాన్ని. బాబా దయవల్ల వర్షం ఆలస్యంగా వచ్చేది లేదంటే నా పని పూర్తయ్యాక పడేది. అలా చాలాసార్లు జరిగింది. "ధన్యవాదాలు బాబా".

ఒకసారి సీసా మూత రాలేదు. అది వస్తే సాయి మహరాజ్ సన్నిదిలో పంచుకుంటానని అనుకున్నాను. వెంటనే ఆ సీసా మూత ఓపెన్ అయింది. ఈ సిల్లీ అనుభవానికి క్షమించండి. కాని ఈ అనుభవం ద్వారా బాబాకి చెప్పుకున్నంతనే బాబా మనకి కావాల్సిన బలాన్ని ఇస్తారనిపించింది. అందుకే మీతో పంచుకోవాలని అనిపించింది. "ధన్యవాదాలు బాబా".

2022లో ఒకసారి మా అమ్మకి ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. డాక్టర్ థైరాయిడ్ టెస్ట్ చేసి థైరాయిడ్ వచ్చే అవకాశాలు కాస్త ఉన్నాయని చెప్పి తక్కువ డోస్ ట్యాబ్లెట్లు ఇచ్చి వాడమని చెప్పారు. కానీ మా అమ్మ ఆ టాబ్లెట్లు సరిగా వాడేది కాదు. ఒకరోజు వేసుకుంటే, ఇంకొకరోజు వేసుకునేదికాదు. కొన్ని నెలలు గడిచాక అమ్మకి 2-3 నెలలు నెలసరి రాలేదు. అప్పుడు అమ్మ మళ్ళీ థైరాయిడ్ టెస్టు చేయించుకుంటే మామూలుగా ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ చూపించింది. ఆ ల్యాబ్ అతను, "థైరాయిడ్ ప్రారంభంలో ఉంది" అని చెప్పారు. దాంతో నేను, "బాబా! ఏదో ఒకటి చేసి అమ్మకి థైరాయిడ్ లేకుండా చూడండి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తర్వాత అమ్మ వెళ్లి ఆ టెస్ట్ రిపోర్టులు తెచ్చింది. అందులో ధైరాయిడ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. డాక్టర్ దగ్గరకి వెళ్తే మునపటి డోస్ కంటే డోస్ పెంచుతారేమో అనుకున్నాము. కానీ అమ్మ 3-4 నెలలు వరకు డాక్టర్ దగ్గరకి వెళ్ళలేదు. అలాగని ముందు ఇచ్చిన టాబ్లెట్లు కూడా వాడలేదు. 4 నెలలు తర్వాత డాక్టర్ దగ్గరకి వెళదాం, లేదంటే ఇంకా ఎక్కువైపోతుందని అనుకున్నాము. అయితే వెళ్లేముందు మళ్ళీ టెస్టు చేయించుకుని కొత్త రిపోర్టుతో వెళదామని అమ్మ టెస్టు చేయించుకుంది. రిపోర్టు మునపటి కంటే తక్కువ వచ్చింది. అప్పుడు పాత రిపోర్టు, కొత్త రిపోర్టు తీసుకొని డాక్టర్ దగ్గరకి వెళ్లి, ఆ రిపోర్టులు చూపిస్తే, "థైరాయిడ్ అస్సలు లేదు. ఏ టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు" అని ఆవిడ చెప్పింది. అలా బాబా అద్భుతంగా అనుగ్రహించి 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకునే అవకాశం ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా".

ఒక పిల్లి మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేది. మేము దానికి ఆహారం పెడుతుండేవాళ్ళం. ఒకసారి అది 3 పిల్లల్ని పెట్టింది. ఒకరోజు నేను ఆ పిల్లల్ని పట్టుకున్నాను. అప్పటినుండి అవి మా ఇంట్లోనే ఉండేవి. రోజూ వాటి అన్నిటికీ ఆహారం పెడుతూ ఉండేవాళ్ళం. ఇలా ఉండగా ఒకరోజు నేను వేరే ఊరు వెళ్ళాను. అప్పుడు మా అమ్మ ఆ పిల్లలను ఇంటి నుండి తరిమేసింది. నేను ఇంటికి వచ్చాక చూస్తే, అవి లేవు. నేను చాలా బాధపడి, "బాబా! అవి మళ్లీ తిరిగి వచ్చేలా చూడండి. అవి బాగుండాలి, వాటికి ఏం అవ్వకూడదు. మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత ఆ పిల్లులు మా ఇంటికి వచ్చాయి. వాటికీ ఏమీ కాకుండా బాబా కాపాడారు. "థాంక్యూ బాబా".

మా మావయ్య కొడుకుకి 4 సంవత్సరాల వయసు. తనకి 2022లో తరచుగా జ్వరం వస్తుండేది. ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గి మళ్ళీ వస్తుండేది. అందువల్ల బాబు చాలా సన్నగా అయిపోయాడు. తనని చూస్తే నాకు చాలా బాధగా ఉండేది. ఒకసారి బాబుకి జ్వరం వచ్చినప్పుడు, 'బాబుకి జ్వరం తగ్గితే, సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు ద్వారా తోటి భక్తులతో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని అనుకున్నాను. అప్పటినుంచి బాబుకి జ్వరం తరచూ రావడం కాస్త తగ్గి, తర్వాత నెమ్మదిగా పూర్తిగా ఆగిపోయింది. "ధన్యవాదాలు బాబా".

కొంతకాలంగా నా ఫ్రెండ్‌వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో డైట్ కాంట్రాక్టర్లుగా చేస్తున్నారు. మూడేళ్ళ క్రితం అంటే 2019లో వాళ్ళకి టెండర్ రాలేదు. తర్వాత 2022లో వాళ్ళు మళ్ళీ కాంట్రాక్టు కోసం టెండర్ వేశారు. అప్పుడు నేను, 'వాళ్ళకి టెండర్ వస్తే, 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాన'ని అనుకున్నాను. అయితే వాళ్ళకి ఆ టెండర్ రాలేదు. అప్పుడు నేను, 'బాబా అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. కానీ బాబా ఎందుకు వాళ్ళకి ఆ టెండర్ ఇవ్వలేదు. బాబా అడిగినవి కాదనరు కదా!' అని అనుకున్నాను. కొన్నిరోజుల తర్వాత ఇంకో ఏరియాలో టెండర్ ఓపెన్ అయింది. అది తెలిసి నా ఫ్రెండ్‌వాళ్ళు ఆ టెండర్ కోసం ప్రయత్నించారు. అయితే కొంతమంది వాళ్ళ మీద ప్రతికూలంగా చెప్పించడంతో వాళ్ళు ఆ టెండర్ అయిన వస్తుందో, లేదో అని భయపడ్డారు. కానీ ఒక షరతు మీద టెండర్ వాళ్ళకి వచ్చింది. అదేమిటంటే, 3 నెలలు చూసి అంతా బాగుంటే టెండర్ వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తామని అన్నారు. బాబా దయవల్ల 3 నెలలు అంతా సవ్యంగా గడిచి టెండర్ వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. "థాంక్యూ బాబా”.


13 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om sai ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. sai baba, sai madava ni kapadu thandri, nenu officeki vacheesanu. madava bharam antha meede baba

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  9. Pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please

    ReplyDelete
  10. ఓం సాయిరామ్

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo