సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1687వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా తమ భక్తులతో ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఉంటారనేది సత్యం
2. నమ్మకాన్ని పెంచుతున్న బాబా

బాబా తమ భక్తులతో ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఉంటారనేది సత్యం

సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జయలక్ష్మి. ఒకరోజు ఉద్యోగ విధులు ముగించుకొని నేను, మావారు ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా ఒక బైకు అడ్డురావడంతో ఇద్దరమూ కింద పడిపోయాము. ఆ ప్రమాదంలో రోడ్డు బలంగా గుద్దుకోవడం వల్ల నా చేయి, మావారి కాలు విరిగిపోయాయి. రక్తం చాలా పోయింది, ఆపరేషన్‌కి నాలుగు గంటల సమయం పట్టింది. ఆ సమయంలో నేను మూడు నెలల గర్భవతినైనందున లోపల బిడ్డకు ఏమైందో అని తొమ్మిది నెలలు నిండేవరకు చాలా భయపడుతూ టెన్షన్‌గా ఉంటుండేదాన్ని. ఆ టెన్షన్ వల్ల నాకు షుగర్ వ్యాధి కూడా వచ్చింది. ఏదేమైనా బాబా తమని నమ్మిన భక్తులకు ఎటువంటి కష్టాలు దరిచేరనివ్వరని, ఆయన దయవలన నా బిడ్డ ఈ లోకంలోకి క్షేమంగా వస్తుందని నమ్మకంతో సాయిని ప్రార్థిస్తూ, మందులు వాడుతుండేదాన్ని. బాబా దయవల్ల 2018, మార్చి 19న ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతమైన పాపకు జన్మనిచ్చాను.

పాప పుట్టిన తర్వాత నేను మరల ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. కానీ కరోనా వల్ల కాలేజీలు మూతపడటంతో ఉద్యోగం దొరకలేదు. కానీ బాబా దయతో ఉద్యోగం ఉంటే ఎంత సంపాదన ఉండేదో అంత సంపాదన ట్యూషన్ల రూపంలో నాకు అందించారు. కరోనా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మంచి కాలేజీలో ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించారు. రెండు సంవత్సరాలపాటు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉద్యోగం చేసుకున్నాను. తర్వాత మా ఇంటి దగ్గర నుండి కాలేజీ చాలా దూరంలో ఉండటం వలన ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉందని వేరే కాలేజీకి మారుదామని బాబాను ప్రార్థించి ఇంటర్వ్యూకి వెళ్లాను. వాళ్లు డెమో క్లాసుతోపాటు వ్రాతపరీక్ష కూడా వ్రాయాలని, క్వాలిఫై అయితే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నేను అప్పటివరకు ఎలాంటి పరీక్షలూ వ్రాయలేదు. అందువల్ల బాబాని తలచుకొని డెమో క్లాస్ ఇచ్చి, పరీక్ష వ్రాశాను. కానీ నా మీద నాకే నమ్మకం లేదు. అలాంటిది బాబా దయవల్ల ఆరోజు సాయంత్రం కాలేజీవాళ్ళు ఫోన్ చేసి,  "మీరు ఉద్యోగానికి రావచ్చు" అని చెప్పారు. అంతేకాదు, నేను అనుకున్నదానికంటే చాలా మంచి జీతం ఇచ్చారు. నేను కొన్నిసార్లు ఏవో కారణాల వల్ల ఆలస్యంగా కాలేజీకి వెళ్లేదాన్ని. అలాంటప్పుడు నేను బాబాను తలచుకొని "ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూడమ"ని ప్రార్థించేదాన్ని. బాబా దయవలన నాకెప్పుడూ ఎటువంటి ఇబ్బందీ కలగలేదు.

నేను దాటలేని కష్టాలను సైతం గట్టెక్కిస్తూ అడుగడుగునా నా వెంట ఉండి నన్ను నడిపించే శక్తి సాయినాథుడు. నేను ఏ పని మొదలుపెట్టినా, ఏం చేసినా సాయినే తలచుకుని చేస్తాను. ఆయనని తలచుకోగానే ఆ పని చేయలేని స్థితిలో ఉన్న నాకు తెలియని శక్తి వస్తుంది. రెండు, మూడుసార్లు నా బంగారం వస్తువులు కనపడకుండా పోవడం, నేను భయంతో నిలువెల్లా వణికిపోవడం, 'బాబా, బాబా' అని అనుకుంటూ అన్నిచోట్లా వెతకడం జరిగింది. బాబాని తలచిన తర్వాత కష్టం తీరకుండా ఉంటుందా? పోయిన బంగారం వస్తువులను బాబా ఎంతో దయతో మాకు తిరిగి అందించారు. ఇలా బాబా నిత్యమూ ఏదో విధంగా చిన్న కష్టాల నుండి పెద్ద కష్టాల వరకు నన్ను కాపాడుతూనే ఉన్నారు. బాబా తమ భక్తులతో ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఉంటారనేది సత్యం. బాబా అంటే తండ్రి అని కదా! "ధన్యవాదాలు బాబా. మీరు ప్రసాదించిన గొప్ప వరం మా అబ్బాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న తనకి ఈమధ్య మొండితనం పెరిగి చదువు మీద శ్రద్ధ తగ్గుతోంది. వాడికి సద్బుద్ధిని ప్రసాదించి చదువులో ముందు ఉండేలా ఆశీర్వదించు తండ్రీ. నన్ను నడిపిస్తున్న మార్గదర్శి మీరు. కరుణతో మంచి నడవడి కలిగివుండేలా చూడు తండ్రీ. ఎల్లప్పుడూ మీ నామస్మరణలో, భక్తి, ప్రేమలతో ఉండేలా ఆశీర్వదించు బాబా. మా కుటుంబం మీద, నా తల్లిదండ్రుల మీద, అలాగే మీ భక్తులందరి మీద మీ కరుణ, ప్రేమలు ఎల్లప్పుడూ ఉండేలా చూడు తండ్రీ".


నమ్మకాన్ని పెంచుతున్న బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. నేను మొదటినుండి బాబానే ప్రార్థించేదాన్ని. కానీ ఈమధ్య బాబా మీద ఎక్కువగా నమ్మకం కలుగుతోంది. ఏ పని చేసినా బాబాని తలచుకొని చేస్తే అది జరుగుతుందని నాకు బాగా నమ్మకం వచ్చింది. ఒకరోజు మా రెండేళ్ళ బాబు చెవినొప్పి ఎక్కువగా ఉందని ఏడుస్తూ ఒక అరగంటసేపు బాధతో బాగా విలవిలాడిపోయాడు. అప్పుడు నేను బాబాని తలచుకొని బాబుకి పెడదామని ఊదీ తీసుకొచ్చాను. బాబు అంత నొప్పిలో కూడా ఊదీ పొట్లం చూడగానే నోరు తెరిచి, "నోట్లో వేయమ"ని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, నేను అంతకుముందెప్పుడూ ఊదీని తన నోట్లో వేయలేదు. అలాంటిది ఊదీని తన నోట్లో వేస్తానని తనకి ఎలా అర్థమైందా అని నాకు అనిపించింది. ఊదీ నోట్లో వేశాక బాబుకి నొప్పి తగ్గి కొంచెంసేపు నిద్రపోయాడు. కానీ కొంతసేపటి తర్వాత మళ్ళీ నొప్పి వచ్చిందని ఏడ్చాడు. నేను మళ్ళీ బాబానే తలచుకొని, "బాబుకి నొప్పి తగ్గిపోవాల"ని అనుకున్నాను. తర్వాత మందు తీసుకొచ్చి, కొన్ని డ్రాప్స్ బాబు చెవిలో వేశాము. బాబా దయవల్ల వెంటనే బాబుకి ఉపశమనం కలిగి నిద్రపోయాడు. ఈ అనుభవం ద్వారా బాబా మమ్మల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారన్న నమ్మకం బాగా వచ్చింది నాకు. "ధన్యవాదాలు బాబా".

18 comments:

  1. Baba thandri na bartha ki na midha un na bayam poi premaga nakosam tthirigi vachesela ashirvadhinchu baba sai

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om Sri Sai Ram, Loka Samastha Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  7. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  9. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba.. atuvanti complications lekunda chudu baba please..eroju reports Anni normal ga vundali thandri please baba

    ReplyDelete
  10. Baba please take care of my child 🙏

    ReplyDelete
  11. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  12. sai baba maa sai madava bharam antha meede baba. maavaru puja, homam kuu vappukunnaru mee daya valana. alage maavaru kuda vastanu pujaki analani korukuntunnnanu. baba vare ayanaku pujaku vachhetattu cheyali baba.

    ReplyDelete
  13. Baba Kalyan ki marriage

    ReplyDelete
  14. సాయీ కృపానిధీ... స్వామీ ఎల్లప్పుడూ మాతో ఉండు నాయనా 🙏🙏

    ReplyDelete
  15. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  16. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo