1. బాబా ఉన్నారు2. బాబా మనతోనే ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం
బాబా ఉన్నారు
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మిపద్మజ. సాయి నాతోనే ఉన్నారని నా నమ్మకం. అందువల్ల నాకు ఏ సమస్య వచ్చినా బాబాకి చెప్పుకోవడం నాకు అలవాటు. నా తమ్ముడు మావారి దగ్గర పని చేస్తున్నాడు. ఒకసారి నా భర్త చాలా కోపంగా తనని తిట్టి, "ఉద్యోగం నుండి తీసేస్తాన"ని అన్నారు. నాకు చాలా భయమేసి, "బాబా! నువ్వు ఉన్నావు. మావారి కోపాన్ని తగ్గించి, తమ్ముడితో మామూలుగా ఉండేటట్లు చూడు. మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల మర్నాడు మావారు ఏమీ జరగనట్లు తమ్ముడితో మామూలుగా ఉన్నారు. బాబా ఉన్నారని నాకు ఆనందంగా అనిపించింది.
ఒకసారి నేను బాగా విరోచనాలతో బాధపడ్డాను. అప్పుడు నేను, "బాబా! నువ్వు ఉన్నావు. విరోచనాలు తగ్గేలా చూడు. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల విరోచనాలు వెంటనే తగ్గిపోయాయి.
ఒకసారి మా ఫ్రిడ్జ్ ఉన్నట్టుండి పనిచేయడం మానేసింది. అప్పుడు నేను, "బాబా! ఫ్రిడ్జ్ పని చేసేలా చూడు" అని ఊదీ పెట్టాను. బాబా దయవల్ల అది దానంతట అదే పని చేసింది. అది నాకు ఒక అద్భుతంలా అనిపించింది. నా సాయికి వేలవేల నమస్కారాలు.
బాబా మనతోనే ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. ఈమధ్య ఒకరోజు మా అన్నయ్య, వదినల మధ్య వాగ్వివాదం జరిగింది. గొడవ చిన్నదే అయినా రెండు రోజుల వరకు అది పెరుగుతూ ఆ ప్రభావం ఇటు మా కుటుంబంపై, అటు మా వదినవాళ్ళ కుటుంబంపై పడింది. అంతా నావల్ల, మా అమ్మవల్లే అని మమ్మల్ని చాలా నిందించారు. నిజానికి మేము మా వదినని చాలా బాగా చూసుకున్నాము. అయినప్పటికీ వాళ్ళు మమ్మల్ని లేనిపోని మాటలన్నారు. అవి విన్నాక సమస్య ఇంకా పెద్దదై ఎంత దూరం వెళ్తుందో అని నాకు చాలా బాధేసింది. మా అమ్మానాన్న అయిందేదో అయిందని అన్నయ్యని వదినతో మామూలుగా మాట్లాడమని చెప్పారు. కానీ ఆమె మాట్లాడటం మానేసి, కావాలని ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. మేము ఎంత తగ్గినా ఆ అమ్మాయి అలా ఉంటే మాకు ఏం చేయాలో అర్థమేకాక రెండురోజులు నరకం అనుభవించాము. ఇక అప్పుడు నేను సాయిని తలుచుకొని, "మా తప్పు లేకపోయినా మాటలుపడిందేకాక ఇది ఇంకా ఎంత దూరం వెళుతుందో అర్థం కావడం లేదు సాయి. ఏదో రకంగా పరిష్కారం చూపించి అంతా చక్కబడేటట్లు సహాయం చేయి తండ్రీ. మీరే మాకు సహాయం చేయాలి. సమస్య పరిష్కారమైతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. అంతే, ఒక గంటలో ఆ సమస్యకు పరిష్కారం చూపించారు బాబా. మేము మా అన్నయ్యని వెళ్లి, "మనమిద్దరం వేరు ఉందామని చెప్పి రమ్మ"ని పంపించాము. అలా ఎందుకంటే, మేము ఉంటే వాళ్లకు కుదరదట. అన్నయ్య వెళ్లేసరికి వాళ్ళు కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారు. అన్నయ్య చెప్పగానే ఓకే అన్నారు. ఏదేమైనా ఆ ఒక్క ఆలోచనతో సమస్య అక్కడితో ఆగింది. బాబా మనతోనే ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం. "ధన్యవాదాలు సాయినాథా! మీరు ఎల్లప్పుడూ వాళ్లకు తోడుగా ఉండి ఇంకెప్పుడు ఇలాంటి సమస్యలు వారిద్దరి మధ్య రాకుండా సంతోషంగా ఉండేటట్లు సహాయం చేయ తండ్రీ. సదా రక్షించి కాపాడు సాయితండ్రీ".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
Baba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteSai na bartha lo marpu thiskooni ra baba sai
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai Ram...
ReplyDeleteOm sri sairam
ReplyDeleteBaba Kalyan marriage chai thandri
ReplyDeleteBaba bless my child and fulfill their wishes in education
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం శ్రీ సాయి రామ్
ReplyDeletebaba, sai madava bharam anta meede baba, hyd ki nannu, madavani kuda teesukoni velletattu cheyi baba. maa atta gariki kopam poyetattu cheyi baba.
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga chei baba
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBless me baba
ReplyDeleteOm sri sairam
Baba na barta udhogam manesela unnaru alacheste chala ibbandavutundhi ayana alochana Mari santhosh Anga udhogam chesela cheyandi Baba mire Naku dikku Baba
ReplyDelete