సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1674వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పెద్ద కష్టం నుండి కాపాడిన సాయి
2. శ్రీసాయిని వేడుకున్నంతనే తగ్గిన నొప్పి

పెద్ద కష్టం నుండి కాపాడిన సాయి

ఓం సాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ  నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను గవర్నమెంట్ టీచరుగా పనిచేస్తున్నాను. 2002వ సంవత్సరంలో నేను ప్రమోషన్ కౌన్సిలింగ్‌కి హాజరయ్యాను. ఆ సమయంలో నేను నివసిస్తున్న పట్టణంలో ఉన్న మూడు బాలికోన్నత పాఠశాలలో మూడు పోస్టులు ఖాళీ ఉన్నందున ఆ పాఠశాలలోనే నాకు ప్రమోషన్ వస్తుందని నేను నిశ్చింతగా వున్నాను. కాని కౌన్సిలింగ్ మొదలయ్యేటప్పుడు ఆ మూడు పాఠశాలల పోస్టులు బ్లాక్ చేసి దూర ప్రాంతాల్లో ఉన్న పోస్టులు మాత్రమే చూపిస్తూ, 'ఆ పాఠశాలలో మాత్రమే ప్రమోషన్ ఇస్తామ'ని అధికారులు అన్నారు. వాళ్ళ ఆ నిర్ణయం వల్ల సుమారు 20మంది ఉపాధ్యాయులు నష్టపోయే అవకాశం ఉంది. మేము ఎంత విన్నవించుకున్నా అధికారులు వినలేదు. యూనియన్ నాయకులు ఎడ్యుకేషన్ సెక్రటరీకి కూడా ఫోన్ చేసి అభ్యర్థించారు. అయినా నాలుగు గంటల దీర్ఘ పోరాటం జరిగింది. నాకు ఆరు నెలల బాబు ఉన్నాడు. దూర ప్రాంతాలకు బదిలీ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్ల నేను సాయిని వేడుకొని నిర్ణయం ఆయనకే వదిలేసాను. సాయి దయవలన సాయంత్రం 6.00 గంటలకు లోకల్ స్కూళ్లలో ప్రమోషన్ ఇవ్వడానికి అధికారులు ఒప్పుకున్నారు. నేను ముందు నాకు రెండు సబ్జెక్టులకు సంబంధించి ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఆ రోజు కౌన్సిలింగ్ జరిగే సబ్జెక్టుకి కాకుండా తర్వాత రోజు కౌన్సిలింగ్ జరిగే సబ్జెక్టులో ప్రమోషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ చివరి నిముషంలో బహుశా సాయి ప్రేరణ వల్ల ఆ రోజు సబ్జెక్టులో ప్రమోషన్ తీసుకున్నాను. మరుసటిరోజు నుండి జరిగిన ప్రమోషన్ కౌన్సిలిoగ్‌లో లోకల్ స్కూళ్ల పోస్టులు ఇవ్వలేదు. ఆ కారణంగా దాదాపు 17మంది ఉపాధ్యాయులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. నన్ను మాత్రం సాయి పెద్ద కష్టం నుండి కాపాడారు. "ధన్యవాదాలు సాయినాథా! ఇప్పుడు నాకు బదిలీ జరగనుంది. నాకు మంచిదని మీకు అనిపించే పాఠశాలకు బదిలీ అయ్యేటట్లు ఆశీర్వదించండి సాయి".


శ్రీసాయిని వేడుకున్నంతనే తగ్గిన నొప్పి

శ్రీసాయి భక్తకోటికి నా నమస్కారాలు. నా పేరు డా. క్రిష్ణ. నేను సాయి భక్తుడిని. మా ఇంట్లో మనసా వాచా ప్రతిరోజు శ్రీసాయినే కొలుస్తాము. మా జీవితంలో ఎన్నో సాయి లీలలు ఉన్నాయి. వాటిలో నుండి రెండు లీలలను మీతో పంచుకుంటున్నాను. నా కొడుకు పేరు అభినవ్. తను ఆరో తరగతి చదువుతున్నాడు. తను ఒకసారి తన ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పాడు. అలా ఒక వారం రోజుల చెప్పేసరికి మాకు భయమేసింది. తను తనని డాక్టరు దగ్గరకి తీసుకెళ్లి చూపించమని, ఎక్స్-రే తీయించమని అడిగాడు. అప్పుడు శ్రీసాయిని వేడుకొని వారి ఊదీ బాబు ఛాతికి రాసి, "బాబా! రేపటి లోపు బాబుకి ఛాతినొప్పి తగ్గిపోతే మీ లీలను బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాము. శ్రీసాయి కరుణించారు. వారి దయవల్ల మరుసటిరోజుకి నొప్పి కాస్త తగ్గి రెండు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదు. వారం రోజులుగా ఉన్న నొప్పి శ్రీసాయిని వేడుకున్నంతనే తగ్గిపోయింది. "ధన్యవాదాలు సాయి".

నా కుమార్తె 'సాయిచందనప్రియ'కు 9 సంవత్సరాల వయస్సు. ఒకసారి తన కుడిచేతి బొటనవేలు దగ్గర ఏదో గడ్డలా అయి చర్మం లోపల ఎముక విరిగినట్లు పెద్దగా కనపడుతుండేది. పాప నొప్పి కూడా ఉందని చెప్తే మేము డాక్టర్ దగ్గరకు వెళ్లాలనుకున్నాము. కానీ అలా అనుకుంటూనే నెల రోజులు గడిచిపోయాయి. మేము జీవితాలను బాబాకు సమర్పించాము. ఏ చిన్న సమస్య అయినా ఆయనకు చెప్పుకోవడం మాకు అలవాటు. ఆ అలవాటు ప్రకారం, "బాబా! పాపకు ఉన్న ఆ గడ్డ కరిగిపోతే మీ లీలను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాము" అని మ్రొక్కుకున్నాము. బాబా దయవల్ల ఆ గడ్డ చిన్నగా తగ్గిపోయింది. అంతా బాబా అనుగ్రహం. వారికి మా సాష్టాంగ నమష్కారాలు.


18 comments:

  1. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  2. Om sai tandri with your blessings and with udi our health problems can sloved

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Baba BP normal ga vundali thandri please baba.. healthy baby ni ivvu baba please.... please.. omesairam

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  10. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  12. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  13. Today I have MRM. Pl save me.

    ReplyDelete
  14. Sai baba madava bharam anta meede baba, madava baaga chaduvukovalu baba

    ReplyDelete
  15. Om Sri Sai nathya namaha

    ReplyDelete
  16. Baba thandri sainadha maku voutche year Kalla pandanti bidda puttali Ani korukuntunnanu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo