సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1672వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఉద్యోగ విషయంలో బాబా అనుగ్రహం

నేను ఒక సాయిభక్తురాలిని. బాబా దయవల్ల నేను ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ నేను 2022, జనవరి నుంచి 2023, జూన్ వరకు ఒక ప్రాజెక్ట్ మీద పని చేశాను. ఆ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నప్పుడు నాకు పని ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉండేది. అయితే 2022, సెప్టెంబర్‌లో హైదరాబాద్ లొకేషన్‌వాళ్ళని ఆఫీసుకి రమ్మని చెప్పారు. నాకు వెళ్ళడానికి ఇష్టం లేక బాబాని, "మీరే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేలా చూడాలి" అని అడిగాను. తర్వాత వేరేవాళ్ళ ద్వారా నా వర్క్ లొకేషన్ విజయవాడకి మార్పించుకున్నాను. అయితే హైదరాబాద్‌వాళ్ళలా విజయవాడవాళ్ళు కూడా ఆఫీసుకి రమ్మని అన్నారు. విజయవాడ మా ఊరుకి దగ్గరే అయినప్పటికీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుంటుందనుకొని, "బాబా! ఆఫీసుకి వెళ్లకుండా ఇంట్లోనే పని చేసుకొనేలా సహాయం చేయండి" అని బాబాను వేడుకున్నాను. ఇకపోతే, మేము ఆఫీసుకి వెళ్లాలంటే, ఆఫీసులో మాకు సీట్లు కేటాయించాలి. అందుకోసం నేను నాకు సీటు కేటాయిస్తారేమోనని మెయిల్స్ పెట్టాను. కానీ ఎవరూ స్పందించలేదు. నన్ను ఆఫీసుకి రమ్మని కూడా చెప్పలేదు. నేను వెళ్లకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. అలా బాబా ఆఫీసుకి వెళ్ళకుండా ఇంటిలో ప్రశాంతంగా పని చేసుకునేలా సహాయం చేసారు. అలా రోజులు గడిచాక 2023, జూలైలో ఆ ప్రాజెక్ట్ అయిపోవస్తున్న కారణంగా మమ్మల్ని ఆ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ చేసి బెంచ్‌పై ఉంచి రోజూ ఆఫీసుకి రమ్మని చెప్పారు. దాంతో నేను రెండు నెలల వరకు వారానికి 2, 3 సార్లు ఆఫీసుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ ప్రయాణం చేయడం నాకు ఇబ్బందిగా అనిపించి, "బాబా! నాకు ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పించండి" అని అడిగాను. బాబా సహాయం చేసారు. 2023, సెప్టెంబర్ నెలలో అదే కంపెనీలో పెర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్ ఇప్పించారు. "ధన్యవాదాలు బాబా".

నేను హైదరాబాద్ లొకేషన్‌లో పని చేస్తున్నప్పుడు ఒకప్పుడు నా ఆఫీసు ల్యాప్‌టాప్ హఠాత్తుగా స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉండేది. ఆ సమస్యని పరిష్కారించాలంటే నేను హైదరాబాద్‌లో ఉన్న మా ఆఫీసుకి తీసుకెళ్లాలి. పోనీ, వేరే లాప్టాప్ ఉపయోగించుకుందామంటే అన్నిటికీ యాక్సెస్ ఉండదు, పని చేయడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల బాబాతో, "ఎలాగైనా లాప్టాప్ పనిచేసేలా చూడండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల లాప్టాప్ కొన్నిరోజులు పని చేసింది. అయితే తర్వాత అస్సలు ఆన్ అవ్వలేదు. అప్పుడు నేను ఆ లాప్టాప్ హైదరాబాద్లోని మా ఆఫీసుకి తీసుకెళ్తే చెక్ చేసి, "ఇది పని చేయదు, కొత్త లాప్టాప్ ఇస్తాం" అని పాతది ఉంచుకొని కొత్తది ఇచ్చారు. అయితే నేను కొత్త లాప్టాప్ మీద పని చేయడం కష్టమవుతుందని అనుకున్నాను. కానీ బాబా దయవల్ల ఏమీ ఇబ్బంది కాలేదు. "ధన్యవాదాలు బాబా".

ఒకసారి నా ఆఫీసు ల్యాప్‌టాప్‌లో నెట్‌వర్క్ కనెక్ట్ అవ్వలేదు. ఏదో లోపం అని చూపించింది. అలా చాలాసేపటి వరకు కనెక్ట్ అవ్వకపోయేసరికి బాబాతో, "నెట్‌వర్క్ కనెక్ట్ అయ్యేలా అనుగ్రహించండ"ని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నెట్వర్క్ కనెక్ట్ అయింది.

బాబా దయవల్ల నేను చేస్తున్న ఉద్యోగంలో పని ఒత్తిడి లేక చాలా ప్రశాంతంగా ఉండటం వల్ల చాలామంది ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేను కూడా రెండో ఉద్యోగం చేయాలనుకొని చాలాసార్లు బాబాని "రెండో ఉద్యోగం ఇప్పించమ"ని అడిగాను. అయితే ఎంత ప్రయత్నించినా నాకు రెండో ఉద్యోగం దొరకలేదు. అటువంటి సమయంలో మా ఫ్రెండ్‌‌వాళ్ళ కంపెనీలో ఉద్యోగ అవకాశాలున్నాయని నాకు తెలిసింది. అక్కడ బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ ఉండదు. అందువల్ల బాబాని అడిగి మా చెల్లి పేరు మీద ఉద్యోగ ప్రయత్నం చేస్తే, బాబా నాకు రెండో ఉద్యోగం అనుగ్రహించారు. ఆ ఉద్యోగం ఆర్థికంగా నాకు కొంత ఊరటనిచ్చింది. ఒక 3 నెలలు బాగానే చేశాను. తర్వాత రావాల్సిన ప్రాజెక్ట్ రాలేదని మమ్మల్ని ఆ ఉద్యోగం నుంచి తీసేసారు. అప్పుడు, "మళ్ళీ మా చెల్లి పేరు మీద ఉద్యోగ ప్రయత్నం చేయనా?" అని బాబాని అడిగితే, వద్దన్నారు బాబా. అంతలో ఒక కోర్స్ నేర్పే ఆవిడ నాకు పరిచయమయ్యింది. ఆవిడ నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. అప్పుడు బాబాని, "ఆవిడ దగ్గర ఉద్యోగం కోసం ప్రయత్నించమంటారా?" అని అడిగితే, బాబా సరే అన్నారు. "ధన్యవాదాలు బాబా".


21 comments:

  1. ఓం శ్రీ సాయి రామ్ నీవు యిచ్చిన ప్రశాంతత జీవితంలో చాలా బాగుంది.మా వెంట వుండి కాపాడు తండ్రీ.నాకు , నా భర్త కి నొప్పులు తగ్గించు సాయి.హద్దులం శారీరక బాధలు భరించలేకుండా వున్నాయి.నీ ఆశీస్సులు యియ్యవలెను సాయి రామ్

    ReplyDelete
  2. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. ఓం సాయిరాం

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  9. sai baba, sai madava machiga ayyi andari maata vini chakkaga chaduvukoni manchiga avvalani korukuntu puja, homam cheyutaku entlo andaru vappukonelaga cheyi thandri baba

    ReplyDelete
  10. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba

    ReplyDelete
  11. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  12. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  13. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  14. Baba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter. She had her exam yesterday. Pl bless her with extraordinary rank .

    ReplyDelete
  15. Baba, very very happy. Chandrababu Naidu garu has released from jail.

    ReplyDelete
  16. ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo