1. బాబాని ఏమి అడిగినా వెంటనే అనుగ్రహిస్తారనేదానికి నిదర్శనం2. బాబాని ప్రార్థించి, వదిలేయండి - ఖచ్చితంగా బాబా సహాయం చేస్తారు3. కోరుకున్నట్లు సమస్యను పరిష్కరించిన బాబా
బాబాని ఏమి అడిగినా వెంటనే అనుగ్రహిస్తారనేదానికి నిదర్శనం
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు 'సాయి అవినాష్'. నేను నా చిన్నవయసు నుండి బాబాని ఆరాధిస్తున్నాను. ఎన్నోసార్లు, ఎన్నో బాధల నుండి నన్ను, నా కుటుంబాన్ని సాయి ప్రేమతో కాపాడారు. ఏ రోజు ఇలాంటి ఒక బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని నేను అనుకోలేదు. 2023, అక్టోబర్ 2న 20 నెలల వయసున్న నా కూతురు రాత్రి 12 గంటలప్పుడు 'నాన్నా' అని ఉలిక్కిపడి లేచి ఏడవసాగింది. అప్పటివరకు నిద్రపోతున్న పిల్ల హఠాత్తుగా లేచి ఏడుస్తుంటే మాకేం అర్థం కాలేదు. మా అమ్మ, నా భార్య, నేను ఎంత ప్రయత్నిస్తున్నా తాను ఆపకుండా ఇంకా గట్టిగా అరగంట నుండి గంట వరకు ఏడుస్తూనే ఉండింది. కనీసం నీరు కూడా త్రాగకుండా తను అంతసేపు ఆపకుండా ఏడుస్తుంటే మాకు చాలా భయమేసింది. నేను తన ఆ బాధ చూడలేక, "బాబా! పాప వెంటనే నిద్రపోవాలి. తనకి ఏ భాద లేకుండా చూడండి. తన బాధ్యత మీదే" అని గట్టిగా బాబాను వేడుకున్నాను. అయినా పాప ఏడుపు ఆపలేదు. కాసేపటికి తను నా దగ్గరకు వచ్చింది. తనకి బాబా అంటే ఇష్టం. తను ముద్దుగా 'సాయిబాబా సాయిబాబా' అంటూ ఉంటుంది. నేను తనని ఎత్తుకుని బాబా విగ్రహం ముందు నిలబడి, "చూడు! బాబాకి చెప్పాము కదా! తగ్గిపోతుంది" అని పాపతో చెప్పాను. విచిత్రంగా కాసేపటికి పాప ఏడుపు ఆపేసి నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టింది. మరికాసేపటికి చక్కగా నిద్రపోయింది. ఇలా బాబాను ఏమి అడిగినా వెంటనే అనుగ్రహిస్తారనేదానికి ఎప్పటికప్పుడు నాకు నిదర్శనం కనిపిస్తూనే ఉంటుంది. నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదిస్తున్న ఆ బాబాకు నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. "ధన్యవాదాలు బాబా".
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
బాబాని ప్రార్థించి, వదిలేయండి - ఖచ్చితంగా బాబా సహాయం చేస్తారు
నా పేరు దీప. నేను బాబాకి చిన్న భక్తురాలిని. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మా అబ్బాయికి పెద్దవాళ్ళు ఇచ్చే డబ్బులు దాచిపెట్టుకోవడం అలవాటు. ఒకరోజు మా అమ్మ వాడికి 100 రూపాయలు ఇచ్చింది. దాన్ని వాడు ఎక్కడో పోగొట్టుకొని ఏడవడం మొదలుపెట్టి, ఆ సాయంత్రం మొదలు రాత్రి వరకు ఆ 100 రూపాయలకోసం అంతటా వెతికాడు కానీ, దొరకలేదు. ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడో వాడికి గుర్తురాక చాలా కలత చెందాడు. నేను తనని ఓదారుస్తూ ఆఖరికి "నువ్వు ప్రశాంతంగా ఉండు. బాబాను ప్రార్థించి, ఆయనకు వదిలేయ్" అని చెప్పాను. కానీ తను నేను చెప్పినట్లు చేసే మానసిక స్థితిలో లేడు. కాబట్టి నేను తనకి ఆ డబ్బులు ఇస్తానని చెప్పి బాబాను ప్రార్థించాను. కాసేపటికి మా అబ్బాయి కూడా శాంతించి బాబాను ప్రార్థించాడు. మూడు రోజుల తరవాత నేను డస్ట్ బిన్‌లోని చెత్త బయటపారేసి దాన్ని శుభ్రం చేస్తుంటే ఆ డస్ట్ బిన్ అడుగున 100 రూపాయల నోటు అంటుకొని ఉండడం కనిపించింది. నేను ఆశ్చర్యచకితురాలినయ్యాను. వెంటనే మా అబ్బాయిని పిలిచి తనకి ఆ నోట్ ఇచ్చాను. తను ఆనందంగా బాబాకి ధన్యవాదాలు తెలిపి, 10 రూపాయలు బాబాకి ఇచ్చాడు. బాబాని ప్రార్థించి ఆయనకి వదిలేయండి. ఖచ్చితంగా బాబా సహాయం చేస్తారు.
కోరుకున్నట్లు సమస్యను పరిష్కరించిన బాబా
Baba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter.
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba maa vari arogyam bagunday la chudandi baba
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam baba Chelli ki manchi sambandam kudiri thanaku na delivery aiyelopu marriage aiyela chudu baba naku chala bada ga undi Chelli vishayam lo please baba naku sahayam chey baba
ReplyDeleteBaba BP normal ga vundali thandri please baba.. doctor daggara ki vellinappudu antha bagundi Ani chepali baba.. healthy baby ni ivvu baba please
ReplyDeleteOmsai om sai om sai
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai ram 🙏🏽🙏🏽🙏🏽🌹🌷🌹
ReplyDeleteBaba na anubavam kuda andharu chadivela publish chesela chudu tandri please nenu comments lo pettina anubavam publish cheyandi
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteSai
ReplyDeleteBaba please my child career and education🙏🙏🙏🙏🙏
ReplyDeletesai baba maa madava bharam anta meede baba, thammudini kuda kapadu, maa atta gari manasu maarchi maatho apartment ki vachhela cheyu tandri
ReplyDelete