సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1676వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. విషయం చిన్నదైనా, పెద్దదైన బాబా ప్రేమ ఎప్పుడూ గొప్పదే!
2. నొప్పిని తగ్గించిన బాబా

విషయం చిన్నదైనా, పెద్దదైన బాబా ప్రేమ ఎప్పుడూ గొప్పదే!

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!! సాయి బంధువులకు నమస్కారం. మన అందరిపైన బాబా ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయిభక్తురాలిని. కొన్ని రోజుల క్రితం మా అమ్మకి కాలునొప్పి వచ్చింది. తనకి బాగా నొప్పి ఉంటే తప్ప మాతో చెప్పదు. ఆ కాలు నొప్పి విషయం కూడా రెండు రోజుల వరకు చెప్పకుండా మూడోరోజు నాకు చెప్పింది. నేను వెంటనే, "అమ్మకి త్వరగా కాలునొప్పి తగ్గిపోవాలి బాబా" అని అనుకున్నాను. తర్వాత నేను ఒక హోమియో మందు అమ్మకి చెప్తే, అది వేసుకోవటం మొదలుపెట్టింది. అలాగే ఆహార విషయంలో కొన్ని మార్పులు చెప్పాను. దాంతో అమ్మకి మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇది కేవలం నా సాయి ఆశీస్సుల వల్లే. ఎందుకంటే, హోమియో మందు, ఆహారం గురించిన అవగాహన ఇవన్నీ బాబా వల్లనే నాకు స్ఫూరించాయని నా నమ్మకం. "థాంక్యూ సో మచ్ బాబా. మీ దయవల్లనే మేము బ్రతకగలుగుతున్నాము. ఎప్పటికీ మా చేయి వదలొద్దు సాయి".

ఇపుడు బాబా నాపై చూపిన ప్రేమను మీతో పంచుకుంటాను. ఇది నేను బ్లాగులో పంచుకుంటాననుకున్నది కాకపోయినప్పటికీ బాబా తమ బిడ్డలపై చూపే ప్రేమ అందరికీ తెలియాలని పంచుకుంటున్నాను. ఈమధ్య ఒకరోజు ఉదయం నేను పారాయణ చేస్తుండగా ఎందుకో శిరిడీ ప్రసాదం తినాలనిపించింది. ఆ సమయంలో అదివరకు శిరిడీ నుండి పోస్టులో వచ్చిన ప్రసాదం ఇంట్లోనే ఉంది. అయినప్పటికీ ప్రసాదం తినాలనిపించిన విషయం తర్వాత మర్చిపోయాను. కాసేపటికి మా మావయ్య వచ్చాడు. తను కూడా బాబా భక్తుడు. మాటల్లో తను త్వరలో శిరిడీ వెళ్తానని, నాకోసం ఒక పెద్ద బాబా ఫోటో తెస్తానని అన్నాడు. అది విని మేము సంతోషించాము. మావయ్య వెళ్ళిపోయాక నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే, 'త్వరలో శిరిడీ నుంచి బహుమతి పంపుతాన'న్న సారాంశంతో ఒక బాబా మెసేజ్ వుంది. ఆ బహుమతి ప్రసాదం లేదా ఊదీ లేదా ఫోటో లేదా విగ్రహం కావొచ్చు అని కూడా ఉంది. కొద్దిసేపటి క్రితం మావయ్య ఫోటో తెస్తానని అన్నాడు కదా! దాని గురించే బాబా చెప్తున్నారు అనుకున్నాను.

అదేరోజు సాయంత్రం ప్రతివారం ప్రసాదం తెచ్చే పూజారిగారు ప్రసాదం తీసుకొని వచ్చారు. నాకు ఎందుకో కోవా తెచ్చారేమోనని అనిపించింది. ఎందుకంటే, కోవా ప్రసాదం ఏ గుళ్ళో ఇచ్చినా నేను అది బాబా ఇచ్చారనే అనుకుంటాను. కానీ పూజారిగారు అరటిపళ్ళు, కొబ్బరిముక్క, పువ్వులు తెచ్చారు, కోవా తేలేదు. అయినా నేను అస్సలు నిరాశ చెందలేదు. ఎందుకంటే, ఉదయం నుంచి జరుగుతున్నవేవీ నా మనసులో లేవు. ఉదయం మామూలుగా శిరిడీ ప్రసాదం తినాలనుకున్నానేగానీ ఇంట్లో ఉన్నా తినడం మర్చిపోయాను. సాయంత్రం పూజారి కోవా ప్రసాదం తెస్తే బాగుండునని అనుకున్నా అది కూడా బలంగా కోరుకోలేదు. ఇది మన సాయి బిడ్డలందరికీ అలవాటే కదా! బాబా ఎంత ఊదీ ఇచ్చినా, ఎంత ప్రసాదమిచ్చినా ఇంకా కావాలని కోరుకుంటూనే ఉంటాము. అలాగే శిరిడీ ప్రసాదం, కోవా కోరుకున్నాను తప్ప వేరే ఏం లేదు. కానీ మన బాబా మన మీద చూపే ప్రేమ ఎప్పుడూ మన ఊహలకు అందదు. అదే జరిగింది. కాసేపటికి మా పెదనాన్నగారు వచ్చారు. వాళ్ళబ్బాయి(అన్నయ్య) శిరిడీ వెళ్ళొచ్చాడని, ప్రసాదం తెచ్చారు. ఎప్పుడూ బూందీ, పటికబెల్లం వంటివే తెచ్చే ఆయన ఆ రోజు వాటితోపాటు కోవా ప్రసాదం కూడా తెచ్చారు. అది చూసి నేను ఎంత సంతోషించి ఉంటానో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఉదయం శిరిడీ ప్రసాదం తినాలనిపించటం ఏమిటి? అది కూడా కోవా కావాలి అనిపించటం ఏమిటి? సాయంత్రానికి అది నెరవేరటం ఏమిటి? జరిగినదంతా తలుచుకుంటుంటే ఇప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది. అది చిన్న విషయమే కానీ నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అయినా విషయం చిన్నదైనా, పెద్దదైన బాబా ప్రేమ మాత్రం ఎప్పుడూ గొప్పదే. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
శుభం భవతు!!!

నొప్పిని తగ్గించిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. ఒకసారి మా అమ్మ నాకు ఫోన్ చేసి, "పంటి నుండి చెవి వరకు నొప్పిగా ఉంటుందమ్మా" అని చెప్పి బాధపడింది. అమ్మ అలా మాట్లాడుతుంటే నాకు బాధేసింది. వెంటనే బాబా దగ్గరకి వెళ్లి, "అమ్మకి త్వరగా తగ్గేలా చేయండి బాబా. అలా చేస్తే వెంటనే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. అమ్మ మెడికల్ షాపుకు వెళ్లి సమస్య చెప్తే, వాళ్ళు డ్రాప్స్, టాబ్లెట్లు ఇచ్చి, "డ్రాప్స్‌‌కి తగ్గకపోతే టాబ్లెట్లు వేసుకోండి. తగ్గిపోతే టాబ్లెట్లు వేసుకోవద్దు" అన్నారు. బాబా ప్రేమ మూర్తి కదా! ఆయన దయవల్ల డ్రాప్స్‌‌తో అమ్మకి నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. కొన్ని సంవత్సరాలుగా కొన్ని సమస్యలతో బాధపడుతున్నాను తండ్రీ. ఇకనైనా ఆ సమస్యలన్నీ తీర్చండి సాయి. నాకన్నీ మీరే బాబా".


14 comments:

  1. Replies
    1. Om sai ram blessings us our family members

      Delete
  2. Om sai ram, 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba sarvantaryami miru ma samasyalu tirchandi baba🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Jaisairam bless amma for her health and bless supraja for her neck pain and shoulder pain and help her to get normal Jaisairam 🙏

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba healthy bp normal ga vundali thandri please baba...

    ReplyDelete
  8. Om Sai Ram baba you like deepalu . your masidu was decorated with lamps.i like this deepavali.when we keep lamps out side with breeze diyas light of

    ReplyDelete
  9. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo