సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1682వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎప్పుడు చెప్పుకున్నా వెంటనే సమస్య నుండి కాపాడుతున్న బాబా
  2. లాప్టాప్ సమస్యని పరిష్కరించిన బాబా

ఎప్పుడు చెప్పుకున్నా వెంటనే సమస్య నుండి కాపాడుతున్న బాబా

సాయిబాబా భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక బాబా భక్తురాలిని. కొన్నినెలల ముందు మా ఆఫీసులో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌కి నేను ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఈ ప్రెజెంటేషన్ అంతా బాగా అయ్యేలా చూడు. నేను ధైర్యంగా బాగా ప్రెజెంట్ చేసేలా చూసి నా పరువుపోకుండా కాపాడు తండ్రీ. మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని కోరుకున్నాను. బాబా దయవల్ల ప్రెజెంటేషన్ చాలా బాగా జరిగింది. మా మేనేజర్ నన్ను బాగా మెచ్చుకున్నారు కూడా. ధైర్యంగా మాట్లాడలేని నేను ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు బాగా మాట్లాడగలిగానంటే అంటే అది బాబా దయే.

ఒకసారి మా ఆఫీసులో కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పుల కారణంగా నేను వేరే మేనేజర్ కిందకి పోవలసి వస్తుందని మా మేనేజర్ చెప్పి, "ఆ విషయం టీమ్ మీటింగ్‌లో చెప్తాన"ని అంది. టీమ్ మీటింగ్ గురువారంనాడు ఉంటుంది. నేను ఆరోజు బాబాని, "బాబా! ఈరోజు ఆమె(మేనేజర్) ఆ విషయం చెప్పకుండా చూడండి. అలాగే ఆ మార్పు కూడా లేకుండా చూడండి. ఈరోజు ఆ విషయం చెప్పకుంటే ఇంకా ఆ మార్పు ఉండదు. ఈరోజు ఆమె ఆ మార్పు గురించి చెప్పకుండా ఉంటే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవలన ఆరోజు మా మేనేజర్ టీమ్ మీటింగ్‌లో ఆ విషయం గురించి ఏమీ చెప్పలేదు. నేను చాలా సంతోషించాను. కానీ, ఆ మార్పు మాత్రం జరిగింది. "బాబా! ఆ మార్పు నాకు ఏ మాత్రమూ ఇష్టం లేదని మీకు తెలుసు. మళ్ళీ మునపటిలాగానే ఉండేలా చూడు బాబా ప్లీజ్". 

ఇంకోసారి ఆఫీసులో కొత్తగా వచ్చిన ఒక ఎగ్జిక్యూటివ్ విషయంలో చిన్న అపార్థం జరిగింది. నేను అంతకుముందు కూడా ఆ ఎగ్జిక్యూటివ్‌‌తో పని చేశాను. అయితే అప్పుడు అతని జాబ్ రోల్ వేరు. అప్పట్లో అతను నాకు చాలా గౌరవం ఇచ్చేవాడు. పనిలో ఏ సహాయం తీసుకున్న మంచిగా స్పందించేవాడు. అతను ఈమధ్య పైస్థాయి జాబ్ రోల్ కూడా తీసుకున్నందువల్ల నేను నేరుగా అతనితో ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తను ఒక వర్క్ అడిగితే నేను చేసి పెట్టాను. తర్వాత తను వేరే ఇంకో వర్క్ అడిగాడు. అయితే అది చేసి ఇచ్చేలోపు మా మేనేజర్ మాట్లాడి, "ఇప్పుడే ఆ వర్క్ పంపొద్దు. నేను మాట్లాడాక పంపుదువులే" అని అంది. 'అంత పెద్ద ఎగ్జిక్యూటివ్ ఒకటి అడిగితే, నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే బాగుండదు' అని నేను అప్పుడే అనుకున్నాను. కానీ రెస్పాన్స్ ఇస్తే మా మేనేజర్ ఏమంటుందో అని రెస్సాన్స్ ఇవ్వలేదు. దాంతో నేను ఎంత వర్క్ చేసినా అతను నాకు కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు. మామూలుగా అయితే అతని స్వభావం అది కాదు. అందరినీ చాలా గౌరవిస్తాడు. అలాంటి అతను అలా ప్రవర్తిస్తుంటే, చేతులారా చేసుకున్నానని నాకు చాలా బాధేసింది. అసలే తనతో నేను ఎక్కువ వర్క్ చేయాల్సి ఉన్నందున, "బాబా! అంతా మంచిగా అయ్యేలా చూడండి. ఆ ఎగ్జిక్యూటివ్ మళ్ళీ మంచిగా ఉండేలా చూడండి ప్లీజ్ బాబా. మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తర్వాత అపార్థాలన్నీ తొలగిపోయి ఇప్పుడు అతను నాకు మంచి గౌరవమిచ్చి మాట్లాడుతున్నాడు. అంతా బాబా దయ. ఇలా నేను ఎప్పుడు బాబాకి నా సమస్య చెప్పుకున్నా వెంటనే ఆ సమస్య నుండి కాపాడుతున్నారు బాబా. "ధన్యవాదాలు బాబా. మీ దయలేకుంటే నేను అసలు ఇన్ని సమస్యల నుండి బయటపడేదానినే కాదు. ప్రేమతో అడుగడుగునా నన్ను కాపాడుతున్నావు. ఇలానే మీ దయ మా మీద ఎప్పుడూ ఉండాలి బాబా. మీరు ప్రసాదించిన అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు నా మీద కోపగించుకోకు. ఇంకెప్పుడు ఆలస్యం చేయను. నన్ను క్షమించు బాబా. మీరు తప్ప నాకెవరు వున్నారు బాబా, ఎన్నోసార్లు మీ బ్లాగు తెరవగానే మీ మాటగా "నన్ను విడిచి పెట్టన"ని మాట ఇచ్చావు. ప్రస్తుతమున్న సమస్య నుండి నన్ను గట్టెక్కించి నాకు మనస్సుకి శాంతిని కలుగజేయి బాబా. నా వలన ఒకరికి, ఒకరి వలన నాకు ఏ సమస్యలు రాకుండా చూడు బాబా. నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి బాబా"

సర్వం సాయినాథార్పణమస్తు!!! 


లాప్టాప్ సమస్యని పరిష్కరించిన బాబా

ముందుగా తోటి సాయిభక్తులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తుడిని. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఒకరోజు  అనుకోకుండా నా లాప్టాప్ పని చేయలేదు. నేను పరిష్కారం కోసం యూట్యూబ్ మొదలైన వాటిలో చూసానుగానీ పరిష్కారం ఏమీ దొరకలేదు. మా కంపెనీ పాలసీ చూస్తే, లాప్టాప్ రిపేర్‌కి అయ్యే ఖర్చులో 80% ఉద్యోగి చెల్లిస్తే, ఆ డబ్బులు ఒక సంవత్సరం తర్వాత వెనక్కి వస్తాయన్నట్టుగా వుంది. కానీ సొంత డబ్బు అంత పెట్టి రిపేర్ చేయంచాలంటే నావల్ల అయ్యే పని కాదు. నాకు చాలా కష్టం అవుతుంది. అందువల్ల నేను బాబాని, "బాబా! ఏ సమస్యా లేకుండా లాప్టాప్ పని చేస్తే, మీ అనుగ్రహం తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం లాప్టాప్ మామూలుగా పని చేసింది. "థాంక్యూ సో మచ్ బాబా" అనుకున్నాను. అయితే కాసేపయ్యాక మళ్ళీ అదే సమస్య వచ్చింది. ఇక అప్పుడు నేను కంపెనీవాళ్ళని సంప్రదిస్తే, వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించారు. "బాబా! సదా నా తండ్రి స్థానంలో వుండి నన్ను కాపాడుతున్నావు తండ్రీ. థాంక్యూ సో మచ్ బాబా".


14 comments:

  1. Nina kuda vamsi raledu sai

    ReplyDelete
  2. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om sai ram, 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  8. sai baba maa sai madava bharam antha meede baba, madavani bhrgava vachhi kottakunda chudu baba. maa athagari manasu maarchi maatho manchigavandetattu cheyi baba

    ReplyDelete
  9. Kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏 omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏

    ReplyDelete
  10. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  11. Bp normal ga vundali thandri please baba healthy baby ni ivvu baba please pregnancy journey lo thodu vundu baba please

    ReplyDelete
  12. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo