1. ఏ ఇబ్బందీ లేకుండా చూసుకున్న బాబా
2. బాబా దయ
ఏ ఇబ్బందీ లేకుండా చూసుకున్న బాబా
నా పేరు రాంబాబు. మాది విజయనగరం. నేను పని చేస్తున్న కంపెనీలో సేఫ్టీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఏ కొద్దిపాటి సాల్వెంట్(ద్రావకం) లీకేజీ అయినా, సేఫ్టీ లేకుండా పనిచేసినా దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటారు. 2023, మే నెల మొదటి వారంలో ఒక రాత్రి నా బ్లాక్ లో ఒక ఎక్విప్మెంట్ క్రింద వాల్వ్ ఫెయిల్ అయ్యి అందులో వున్న మెటీరియల్ మరియు సాల్వెంట్ బయటకు రావడం మొదలైంది. దానిని ఆపటానికి సాధ్యపడేలేదు, కనీసం దగ్గరకి కూడా మా ఆపరేటర్ వెళ్ళలేకపోయాడు. నాకు ఫోన్ చేసి విషయం చెప్పేసరికి నేను ఒక్కసారిగా కూలబడిపోయాను. వెంటనే తేరుకొని నాకు తెలిసిన కొన్ని సలహాలిచ్చి, నా పైఆఫీసరుకు ఫోన్ చేసి చెప్పి కంపెనీకి బయలుదేరాను. ఆ ముందురోజే కుటుంబంతో పూణేలో పెళ్లికి వెళ్లి, అలాగే శిరిడీ వెళ్లాలన్న ప్రతిపాదనను కొన్ని కారణాల వలన విరమించుకున్న నేను కంపెనీలో జరిగిన సంఘటన గురించి వినినంతనే, "బాబా! ఎలాగైనా సరే సమస్యను పరిష్కరించండి. నేను శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను. ఇంకా ఈ ఘటన వలన ఎవ్వరిపైన ఎలాంటి చర్య తీసుకోకుండా వుంటే మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల నేను కంపెనీకి వెళ్ళేలోపే పరిస్థితి అదుపులోకి వచ్చింది. సీనియర్ మేనేజ్మెంట్ వచ్చి విచారణ జరిపారు. కానీ ఆశ్చర్యమేమిటనే, ఎవ్వరినీ ఏమీ అనలేదు, ఏ రిపోర్టూ లేదు, ఎటువంటి చర్య ఎవ్వరిపైన లేదు, ఆ మెటీరియల్ అవుట్పుట్‌లో కూడా ఏ సమస్యా లేదు. బాబానే దగ్గరుండి అంతా సరిచేసారు. ఇది నా కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ సంఘటన.
తర్వాత శిరిడీ వెళదామంటే ప్రయాణానికి టికెట్లు నాకు మాత్రమే కన్ఫర్మ్ అయి మా కుటుంబాలకి కన్ఫర్మ్ అవ్వలేదు. దూర ప్రయాణమైనా, కంఫర్మ్ టిక్కెట్లు లేకపోయినా నేను నా కుటుంబంతో ట్రైన్ ఎక్కేశాను. బాబా చేసిన అద్భుతం చూడండి. నా బెర్త్ క్రింద వున్న రెండు బెర్తులవాళ్ళు రాలేదు. దాంతో మా ప్రయాణం ఏ ఇబ్బందీ లేకుండా జరిగింది. "చాలా చాలా ధన్యవాదాలు సాయినాథా! నేను, నా కుటుంబం సదా మీకు కృతజ్ఞులమై ఉంటాం"
సర్వేజనా సుఖినోభవంతు!!!
బాబా దయ
నా పేరు దేవప్రసాద్. నేను 2001 నుండి తరచూ శిరిడీ వెళ్తున్నాను. నేను హృద్రోగిని. వైద్యులు అందరూ 'తక్షణమే బైపాస్ సర్జరీ చేయాల’ని చెప్పారు. కానీ నేను బాబా మీద భారమేసి ఆపరేషన్ చేయించుకోకుండా ఆరు నెలలుగా ఆయుర్వేద ఔషధం వాడుతున్నాను. బాబా దయవల్లే నేను బ్రతికి ఉన్నాను. ఇకపోతే, 2023, సెప్టెంబర్ నెలలో ఒకరోజు రాత్రి నేను బస్సులో వేరే ఊరు వెళ్ళడానికి బయలుదేరాను. చూస్తే, నా మోటార్ సైకిల్ తాళం కనిపించలేదు(నేను నా తాళం అలమారాలో పెట్టి మర్చిపోయాను). ఇల్లంతా వెతికినా ఆ తాళం కనిపించలేదు. ఒక పక్క బస్సుకి సమయం' అవుతుంది. ఆ బస్సు వెళ్లిపోతే అరగంట తర్వాత వేరే బస్సు ఉన్నప్పటికీ ఆ బస్సుకి వెళితే నాకు ఆలస్యం అయిపోతుంది. అటువంటి స్థితిలో నేను నా మనసులో, 'తాళం కనిపిస్తే, బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన'ని అనుకున్నాను. వెంటనే తాళం కనిపించింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteసాయి ఏ అపార్థాలు అవమానాలు అనిందలు అబద్ధాలు చాడీలు ఈర్షలు ద్వేషాలు ఏమీ లేకుండా ప్రేమతో నేను నా భర్త కలిసే మార్గాన్ని చూపించే సాయి తండ్రి
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram 🙏
ReplyDeletesai baba maa sai madava bharam anta meede swamy
ReplyDeleteNa e bp normal ga vundali thandri please baba.. healthy baby ni ivvu baba.. Thursday check cheyichukunnapudu normal ga vunte Sai Maharaj blog lo post chestha thandri.. please e complications nunchi bayataku thesukura baba..meku tappu konni evaruku cheppukolenu thandri
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Sainathaya namah
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDelete🙏🏻🌼 OM SAI SRI SAI JAYA JAYA SAI 🌼🙏🏻
ReplyDelete