సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1673వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 31వ భాగం

నా పేరు సాయిబాబు. 1995లో బాబా మాకు ఒక ఫిలిప్స్ కలర్ టీ.వీ. 16,000 రూపాయలకు ఇప్పించారు. అప్పటి మా స్థోమతకు అది ఎక్కువే. కానీ బాబా దయవలన చాలా సులువుగా మాకు ఆ టీవీ అమరింది. అప్పటినుండి ఇప్పటివరకూ ఆ టివికి ఏ రిపేరూ లేదు. అయితే ఒకరోజు నా భార్య హారతి చూస్తూ, "స్మార్ట్ టీవీ పెద్ద స్క్రీన్ మీద చూస్తే, శిరిడీలో మీకు ఎదురుగా ఉండి చూసినట్లు మీరు చాలా స్పష్టంగా కనిపిస్తారు బాబా" అని మనసులో అనుకొని హారతి అయ్యాక టీవీ ఆఫ్ చేసి తన పనుల్లో నిమగ్నమైంది. తరువాత నాలుగు రోజులకు నేను పేపరు చదువుతూ 'స్మార్ట్ టీవీలకు దసరా ఆఫర్లు ఇచ్చారు' అని ప్రక్కనే ఉన్న నా భార్యతో అన్నాను. వెంటనే ఆమెకు, 'న్యూస్ పేపరులో కొన్ని వందల వార్తలుంటే, టీవీలకు సంబంధించిన వార్తే ఎందుకు బాబా మావారితో చెప్పించారు?' అనిపించి, 'కొత్త టీవీ తీసుకోవాలా బాబా?' అని బాబాను అడిగింది. 'తీసుకోమ'ని ఆయన సమాధానం వచ్చింది. దాంతో 'చిన్న టీవీ అయినా పరవాలేదు. బాబా హారతి స్పష్టంగా కన్పిస్తే చాలులే' అని నేను, నా భార్య వెంటనే రిలయన్స్ షోరూంకు వెళ్ళాము. తీరా చూస్తే, అక్కడ చిన్న టీవీల ధరలే చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతో మేము, 'చిన్న టీవీకి ఇంత రేటా?' అని అసంతృప్తిగా 5 నిమిషాలు నిలబడి, ఇక వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాము. అనుకోకుండా ఒక ప్రక్కగా ఉన్న ఒక టీవీ మీద నా భార్య తన చేయి వేసింది. ఎందుకో మేము తీసుకోవాల్సిన టీవీ అదేనేమోననిపించి బాబాని అడిగితే, "తీసుకోమ"ని సమాధానం వచ్చింది. అయితే ఆ టీవీ చాలా పెద్దది. 42 ఇంచుల స్క్రీన్. మేము ఇది ఇంకా ఎక్కువ రేటు ఉంటుందని అనుకుంటూనే అక్కడున్న సేల్స్ బాయ్‌ని రేటు అడిగితే చాలా చాలా తక్కువ చెప్పాడు. ఒక్క నిముషం అతను చెప్పింది మేము సరిగా వినలేదేమోననుకొని మళ్ళీ రేటు అడిగాము. అతను మళ్ళీ అదే రేటు చెప్పి, నిర్ధారణకోసం స్లిప్ తీసి చూపించాడు. మేము నమ్మలేకపోయాం. ఇదంతా బాబా అనుగ్రహమని సంతోషంగా ఆ పెద్ద టీవీ కొనుక్కొని, కారులో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఫిక్స్ చేసాము. ఇప్పుడు నాలుగు హారతులు ఆ టీవీలో చూస్తుంటే పిక్చర్ చాలా క్లియర్‌గా ఉన్నందువల్ల శిరిడీలో బాబాకి ఎదురుగా వున్న అనుభూతి మాకు కలుగుతుంది. బాబాను నమ్మితే, ఆయన దయ అలా ఉంటుంది.

మేము ప్రతిరోజూ బాబా పూజకోసం మా ఇంటి కాంపౌండ్‌లో ఉన్న పూలచెట్ల నుండి పూలు కోసుకుని తెచ్చి అర్చన, పూజ చేస్తాము. ఒకసారి ఒక చెట్టు కొమ్మకి తేనెటీగలు తేనెతుట్ట పెట్టాయి. అది రోజురోజుకు పెరిగి పెద్దదవ్వసాగింది. ఆ చెట్టుకు నీళ్లు పోయాలన్నా, పూలు కోయాలన్నా మాకు ఇబ్బందిగా ఉండేది. వాటికి అసౌకర్యం కలిగి ఈగలు కుడితే ప్రమాదం కదా! 15 రోజులు వరకు వేచి చూసినా ఆ తేనెటీగలు అక్కడే ఉండేసరికి, "బాబా! ఆ తేనెటీగలను తేనెతొట్టతో సహా వేరే చోటికి మార్చు తండ్రి. మాకు ఇబ్బందిగా ఉంది" అని బాబాకి విన్నవించుకున్నాను. బాబా నా మొర విన్నారు. మరుసటిరోజు ఉదయం చూస్తే, ఆ చెట్టుకు తేనేతుట్ట పెట్టిన ఆనవాళ్లే లేవు. దరిదాపుల్లో ఒక్క తేనెటీగ కూడా లేదు. వాటిని తుట్టతో సహా మా ఇంటి ఆవరణలో మాకు ఇబ్బందిలేని వేరొక చోటికి మార్చారు బాబా. బాబాకి కృతజ్ఞతలు చెప్పి, ఆ చెట్టుకి నీరుపెట్టి, పూలు కోసుకున్నాను. బాబాకి విన్నవించుకుంటే మాకు, అటు ఆ తేనెటీగలకు ఇబ్బంది లేకుండా చేశారు.

బాబా తమ అవసానదశలో లక్ష్మీబాయి షిండేకు తొమ్మిది నాణాలు దానం చేసారు కదా! 1996 తర్వాత మేము శిరిడీ వెళ్ళినప్పుడు సమాధి మందిరంలో బాబామూర్తి ఎదుట వున్నప్పుడు(దర్శనానికి) నా అరచేతి గుప్పెట్లో కొన్ని నాణేలు పెట్టుకుంటుండేవాడిని. అక్కడున్న పూజారి నా అరచేతి గుప్పెట తెరిచి ఒక నాణెం తీసుకొని బాబామూర్తికి, సమాధికి తాకించి తిరిగి ఇస్తూ “పూజలో ఉంచుకోమ”ని చెప్పారు. అలా నవవిధభక్తికి నిదర్శనంగా తొమ్మిదిసార్లు జరిగింది. ఒకేసారి ఇవ్వకపోయినా మేము శిరిడీ ఎన్నోసార్లు వెళ్ళినప్పటికీ తొమ్మిది నాణేలు మాత్రమే బాబా ఆశీర్వచనంతో మాకు లభించాయి. మేము ఆ తొమ్మిది నాణేలను పూజలో పెట్టుకున్నాము.

బాబా మన సంశయులకు వెంటనే సమాధానం ఎలా ఇస్తారో చూడండి. 2022, సెప్టెంబర్ 13, సాయంత్రం బాబా ధూప్ హారతి ప్రత్యక్ష ప్రసారం టీవీలో  చూస్తున్నాను. అంతలో మా పూజగదిలోని గోడకు తగిలించిన శివుని క్యాలెండరుకు ఉదయం పెట్టిన పువ్వు కింద పడింది. సహజంగా దేవుడి పటాలకి, విగ్రహాలకి పెట్టిన పూలు మనం చూస్తుండగా కిందపడితే భగవంతుని ఆశీర్వాదంగా భావిస్తాము. కానీ ఆ పువ్వు కిందపడుతూనే నేను నా మనసులో ‘ఉదయం శివునికి పెట్టిన పువ్వు సాయంత్రం బాబా హారతి చూస్తుండగా కిందపడింది. అది దైవానుగ్రహమా? లేక గాలికి పడిందా?’ అని అనుకున్నాను. అంతే, మరుక్షణం టీవీలో బాబామూర్తిపై ఉంచిన పువ్వు సమాధి మీద పడింది. తద్వారా బాబా శివుని క్యాలెండరుకి పెట్టిన పువ్వు గాలికి పడలేదని, దైవానుగ్రహం వలెనే అని తెలియజేసారు.

2022, సెప్టెంబరు నెలలో ఒక గురువారం రోజు ఉదయం పూజకు అన్నీ సిద్ధం చేసుకొని ఇక పూజ మొదలుపెడతామనగా నా భార్య బాబాకి దక్షిణ సమర్పించింది. అది చూసిన నేను నా భార్యను, ”ప్రతి గురువారం పూజ పూర్తై హారతి ఇచ్ఛాక కదా దక్షిణ సమర్పిస్తాము. మరి ఈరోజు ఏంటి ముందుగానే దక్షిణ సమర్పించావు?” అని అడిగాను. అందుకామె, “ఎందుకో బాబా వెంటనే దక్షిణ సమర్పించు అని అడిగినట్లు నాకనిపించి సమర్పించాను” అని అంది. తరువాత పూజ పూర్తిచేసి నా భార్య బాబా పుస్తకం చదువుదామని ఒక పేజీ తెరిస్తే అక్కడ “నీపట్ల నా అనుగ్రహం వుంది కనుక వెంటనే దక్షిణ సమర్పించమ'ని అడిగాను” అని ఉంది. అది చదివిన నా భార్యకు చాలా ఆనందమేసింది.

20 comments:

  1. Sai dhaari chuupu thandri om sairam

    ReplyDelete
  2. Baba,bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  3. Baba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter. She has to get 45th rank in INI SET exam. She had her exam on 5th of this month.

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. ఓం సాయిరామ్

    ReplyDelete
  8. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please.. BP normal ga vundali thandri...na manasu ni prashantha ga vunchu baba ..chala bayamgavuntundi thandri... please save me and my baby baba...

    ReplyDelete
    Replies
    1. Everything will be alright, baba will bless you with healthy baby

      Delete
  9. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  10. Baba l settle my son's marriage early pl iam

    ReplyDelete
  11. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  12. ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  13. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  14. Sai baba pl madava eerojunundi etuvanti allri, godavalu cheyakunda chudu baba, alage tammudu Satya ki medical dept lo job vachhetattu cheyavalasinadi babavachhetattu chudu baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo