సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1692వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరినట్లు నిదర్శనం ఇచ్చిన బాబా
2. దయచూపిన బాబా
3. జ్వరం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

కోరినట్లు నిదర్శనం ఇచ్చిన బాబా

నా పేరు శ్రీరంజని. నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! మీరు మీ సందేశాలు ద్వారా నన్ను నడిపిస్తున్నారు కానీ, నాకెప్పుడు స్వప్నదర్శనం అనుగ్రహిస్తారు" అని చాలాసార్లు అనుకున్నాను. 2023, అక్టోబర్ 19న నా భర్త పుట్టినరోజు. ఆ ముందురోజు అక్టోబర్ 18న నా భర్త, "రేపు బాబా గుడికి వెళదామ"ని, మళ్ళీ అంతలోనే "రేపు గురువారం కదా! గుడిలో ప్రశాంతంగా ఉండదు. గుడికి వెళ్ళేది ప్రశాంతత కోసమేగా! కాబట్టి శుక్రవారం గుడికి వెళదాం. రేపు ఇంట్లోనే పూజ చేసుకుందాం" అని అన్నారు. అలా అన్న ఆయన మరుసటిరోజు ఉదయం 11.30కి "బాబా గుడికి వెళదాం" అన్నారు. నేను వెంటనే తయారయ్యాను. ఇద్దరం కలిసి ఇంటినుండి బయటపడేసరికి 12.15 అయింది. ఇంట్లో ఉండగా నేను, "బాబా! మీరు నాకు గుడిలో ఏదో ఒక నిదర్శనమిస్తే, త్వరలోనే మీరు నాకు స్వప్న దర్శనమిస్తారని నేను ఆనందంగా ఉంటాను తండ్రీ" అని అనుకున్నాను. అలాగే టైం అయిపోయినప్పటికీ "మాకు మధ్యాహ్న హారతి కూడా అందితే బాగుంటుంది బాబా" అని అనుకున్నాను. మేము గుడికి వెళ్లి కాళ్ళుచేతులు కడుక్కొని కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడొక చిన్నబాబు 'హ్యాపీ బర్త్ డే టు యు' అని పాడుకుంటున్నాడు. అది విని నేను ఆ రూపంలో బాబానే స్వయంగా నా భర్తకి శుభాకాంక్షలు చెప్పారని చాలా సంతోషించాను. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. తర్వాత మేము గుడి లోపలికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. ఆ వెంటనే మధ్యాహ్న హారతి మొదలైంది. హారతి అయ్యాక దర్శనం లైన్లో ఉన్న ఒకావిడ తన బాబుని 'చింటూ' అని పిలిచింది. ఇంట్లో నా భర్తని పిలిచే పేరు కూడా 'చింటూ'నే. నా భర్త కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. ఇలా బాబా నాకు నాలుగు నిదర్శనాలు ఇచ్చి నన్ను ఎంతగానో అనుగ్రహించారు. "బాబా! మీరు రోజురోజుకి నన్ను మీకు దగ్గరగా చేర్చుకుంటున్నారు. ధన్యురాలిని బాబా. త్వరలో నాకు స్వప్న దర్శనాన్ని అనుగ్రహించండి బాబా".


దయచూపిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సత్యనారాయణమూర్తి. 2023, అక్టోబర్ నెల మూడోవారంలో ఒకరోజు ఉన్నట్లుండి నా భార్య బీపీ ఎక్కువై తను చాలా ఇబ్బందిపడింది. నాకు ఏం చేయాలో తోచక బాబా ఊదీ తన నుదుటన పెట్టి నా దగ్గరున్న ఒక టాబ్లెట్ ఇచ్చాను. తర్వాత డాక్టర్ని సంప్రదించి, వారి సలహా మీద మరొక టాబ్లెట్ కూడా ఇచ్చాను. అప్పుడు కొంచెం నార్మల్ అయి నా భార్య సుమారు రెండు గంటలసేపు నిద్రపోయింది. సాయంత్రం డాక్టర్ దగ్గరకి వెళ్లి చూపిస్తే కొన్ని టెస్టులు వ్రాశారు. ఆ టెస్టులు చేస్తున్నంతసేపు నేను, "రిపోర్టులు నార్మల్ రావాల"ని బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. కొద్దిగా బీపీ ఎక్కువగా ఉంటే దానికి మందులు వ్రాసి పంపారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా".


2023, అక్టోబర్ 19 రాత్రి ఒక్కసారిగా నా బీపీ ఎక్కువై ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపించింది. ‘గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఊపిరి ఆడట్లేదేమో! ఈ రాత్రివేళ హాస్పిటల్స్‌లో డాక్టర్లు అందుబాటులో ఉండరు’ అని భయపడ్డాను. మా క్రింద అపార్ట్మెంట్లో డాక్టర్లు ఉన్నారని వెళ్లి చూస్తే, వాళ్ళు ఇంట్లో లేరు. వెంటనే నేను నా స్నేహితుడికి ఫోన్ చేసి, రమ్మని పిలిచాను. తను రాగానే ఇద్దరం కలిసి దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌‌కి వెళ్ళాము. వెంటనే చికిత్స మొదలుపెట్టి ఈసీజీ తీసి గుండెలో సమస్య ఉందని చెప్పారు. నేను, "బాబా! నాకు ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి వెళితే మీకు తులసిమాల, కొబ్బరికాయ సమర్పించుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. ఆ రాత్రి ఏదో చికిత్స చేసి, మర్నాడు ఉదయం గుండెకు స్కానింగ్ చేసారు. రిపోర్టులో కొద్దిగా సమస్య ఉందని వచ్చినప్పటికీ "మందులతో తగ్గిపోతుంది" అని చెప్పి నన్ను ఇంటికి పంపేసారు. "ధన్యవాదాలు బాబా. మీ భక్తులందరినీ ఇలాగే కాపాడుతూ ఉండండి బాబా".

జ్వరం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

నా పేరు శ్రీకాంత్. 2023, అక్టోబర్ నెల మూడోవారంలో నాకు జ్వరం వచ్చింది. రెండు రోజుల్లో తగ్గకపోతే డాక్టర్ వద్దకు వెళదామని ఒక టాబ్లెట్ వేసుకుని, "బాబా! మీ దయతో జ్వరం తగ్గిపోవాలి" అని బాబాని ప్రార్ధించి, ఊదీ పెట్టుకొని పడుకున్నాను. మర్నాడు జ్వరం చాలావరకు తగ్గింది. అయితే నేను నా అనుభవాన్ని బ్లాగుకి పంపుదామని అనుకుంటూనే వారం గడిచిపోయింది. తర్వాత నాకు మళ్ళీ జ్వరం వచ్చింది. అప్పుడు నేను నా మ్రొక్కు నెరవేర్చనందు వల్లే ఇలా జరిగిందని గ్రహించి బాబాను క్షమించమని వేడుకొని, "జ్వరం తగ్గించండి బాబా. ఈసారి మీ అనుగ్రహాన్ని తప్పకుండా బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఒక్కరోజులో జ్వరం తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".

18 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. sai baba, maa sai madava ki eeroju telugu exam. madava rayagaligina questions vachhelaga cheyandi baba, madava ki telugu tough. subbu ki kuda jaundice taggali baba

    ReplyDelete
  7. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga chei baba..Anni tablets Vadina bp control ki ravadamlethu please baba.. atuvanti complications lekunda safe delivery chei baba please

    ReplyDelete
  8. Baba Kalyan ki marriage fix chai thandri. lpl thondara ga marriage chai thandri

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  10. Baba Naku pregnancy lo bp normal ga undela ashirvadinchu thandri Naku konchem prasanthata ivvu baba

    ReplyDelete
  11. Baba nannu ee kastam nundi kapadandi baba....nannu eppudu Mee dyanam lo vundela chudandi

    ReplyDelete
  12. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  13. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo