1.కోరింది అనుగ్రహించిన బాబా2.వేడుకున్నంతనే ఉద్యోగం ప్రసాదించిన బాబా
కోరింది అనుగ్రహించిన బాబా
అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి మేము కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో వైజాగ్ నుండి సికింద్రాబాద్ వస్తున్నాం. ఆ సమయంలో హైదరాబాద్‌లో సైక్లోన్ నడుస్తుంది. పెద్ద వర్షం కారణంగా ఉదయం మేము దిగవల్సిన స్టేషన్ కంటే ముందు స్టేషన్‌లో ట్రైన్ ఆగిపోయింది. ఒక గంటసేపు వేచి ఉన్నా ట్రైన్ కదలలేదు. మరోపక్క ఆఫీసుకి టైమ్ అయిపోతుంది. అందువల్ల బయట పెద్ద వర్షం కురుస్తున్నప్పటికీ ఆ స్టేషన్‌లో దిగేసి ఆటోలో ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాము. మాతో పాటు రైలులో సగం మంది దిగిపోయారు. పెద్ద వర్షం పడుతుంది. చిన్న స్టేషన్ అయినందున లగేజీతో నిల్చోడానికి షెల్టర్లు లేవు. బయట ఆటోలు కూడా లేవు. ఓలా, ఉబెర్ యాప్‌ల్లో ట్రై చేసినా ఏమీ బుక్ అవ్వలేదు. అలా ఒక 30 నిమిషాల సమయం నడిచింది. ఇక అప్పుడు మావారు, "మెయిన్ రోడ్డుకి వెళ్లి ఆటో తీసుకొస్తాన"ని అంత పెద్ద వర్షంలోనూ అలానే వెళ్ళారు. నేను బాబాని తలుచుకొని, "బాబా! తొందరగా మాకు ఆటో దొరకాలి. అలానే 300 రూపాయల లోపు ఛార్జ్ చేసేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. అలా ఎందుకు వేడుకున్నానంటే, మా ఇల్లు ఉండేది మణికొండలో, మేము రైలు దిగింది మల్కాజ్గిరిలో, బయట పెద్ద వర్షం, వాహనాలు అందుబాటులో లేవు. వీటన్నిటి దృష్ట్యా ఆటోకానీ, క్యాబ్‌కానీ కనీసం 1000 రూపాయలకు తక్కువ కాకుండా ఛార్జ్ చేస్తారు. అదే మేము మాములుగా దిగాల్సిన స్టేషన్‌లో దిగితే, అక్కడ ఆటోలు ఉంటాయి. 300-350 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అందువల్ల బాబాని అలా ఒక 10 నిమిషాలు ప్రార్థించాక, "నేను కోరుకున్నట్లు జరిగితే మీ అనుగ్రహం గురించి బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. వెంటనే మావారు ఫోన్ చేసి, "ఆటో దొరికింది. రోడ్డు మీదకి వచ్చేయి" అని అన్నారు. నేను మా లగేజీ మోసుకుంటూ వెళ్లి ఆటో ఎక్కేసి, "మేము ఇంటికి వెళ్ళేలోపు మీరు కనిపించండి బాబా" అని బాబాను అడిగాను. ఒక్క నిముషంలో బస్సు మీద దర్శనమిచ్చారు బాబా. మేము వెళ్లే దారంతా ఒకటే వర్షం. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయినప్పటికీ ఆటో అతను డబ్బులు ఎక్కువ అడగలేదు. 300 రూపాయలే తీసుకున్నాడు. అలా నేను కోరుకున్న విధంగా అనుగ్రహించి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఒకసారి మావారు గంటలో వస్తానని బయటకి వెళ్లారు. కానీ గంట అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేసినా తీయలేదు. అలా 3 గంటల సమయం గడిచింది. ఇంకా నాకు ఏడుపు వచ్చి, "బాబా! మా ఆయన కాల్ చేసేలా చూడండి. మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. వెంటనే మా ఆయన దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
వేడుకున్నంతనే ఉద్యోగం ప్రసాదించిన బాబా
సాయిబాబాకు సాష్టాంగ ప్రణామాలు. సాయిభక్తులకు నమస్కారం. నా పేరు గిరిజ. మేము ఉద్యోగరీత్యా ముందు యూకే వెళ్ళాము. తర్వాత బాబా ఆశీస్సులతో అక్కడినుండి యుఎస్ వెళ్లే అవకాశం మాకు వచ్చింది. ప్రస్తుతం మేము యుఎస్‌లో నివసిస్తున్నాము. మేము యుఎస్ వచ్చి కొన్ని నెలలవుతున్నా యుఎస్‌లో మాంద్యం(రిసెషన్) వల్ల మావారికి ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. చివరికి ఇంకొక నెలలో ఉద్యోగం రాకుంటే మేము స్వదేశానికి తిరిగి రావలసిన పరిస్థితి వచ్చింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను బాబాకి నమస్కరించి ఆయన్ని వేడుకున్నాను. అంతే, ఒక్క వారంలో మావారికి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మావారు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". బాబా ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఓం సాయిరామ్
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ నేను రోజూ అందరి సాయి లీలలు చదివిన తరువాత ఆనందం కలుగుతుంది.ఈ కార్తీక మాసం విశిష్టత కలిగినది.దీపాలు వెలిగించడం వల్ల నాకు చాలా సంతోషంగా వుంది.శివ, నారాయణ పూజించి పండుగ లు చాలా వస్తాయి.కోటి దీపోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది.15రోజులు శివ స్మరణ స్తోత్రమ్ లతో నెల గడిచిపోతుంది
ReplyDeleteSai na bartha nakosam thirigi vachesela chudu baba thandri thanaki na midha unna bayam antha poyyela chudu sai prema tho thane na dagarki vachela chudu baba nenu velthe thaanu yedo aavuthundhani apardham cheskuntunnadu yemi ardham kavatledhu said jeevitham chikati ga anipisthundhi shay am cheyyyandi sai
ReplyDelete🌺🌺🙏🙏Om Sai Ram 🙏🙏 🌺🌺
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram, Samastha Loka Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteBaba my son Sai marriage segramuga jariga vidhamuga chudu thandri
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
sai baba maa sai madava bharam antha meede baba.alage maavare phone chesi eppudu homam chestaru ani adigetattu chayali baba.
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please..bp normal ga vundali thandri..bp valla emi complications lekunda chudu baba please
ReplyDeleteBaba please take care of my child 🙏
ReplyDeleteOn sai ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram nenu money sampadhichadaniki
ReplyDeletemargam chupiinchu baba yavari medha depend kakunda please baba