సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1668వ భాగం....


ఈ భాగంలో అనుభ
వం:

  • తలుచుకోగానే బాబా పక్కన ఉంటారు

ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్తురాలిని. కొన్నిరోజుల ముందు నేను అనుకున్నది ఒకటి జరిగితే కాలినడకన కొండెక్కి తిరుమలకి వస్తానని ఏడుకొండలవాడికి మొక్కుకున్నాను. అది నేను అనుకున్నట్టుగానే జరిగింది. దాంతో ఎలాగైనా తిరుమల వెళ్లాలని ఒకరోజు టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ రోజు దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయో చూసి ఆ రోజుకి నాకోసం, నాతోపాటు ఇంకొకరికోసం బుక్ చేశాను. ఆ రోజు దగ్గరపడుతుండగా నాతోపాటు రావలసిన అతనికి రావడానికి కుదరని పరిస్థితి వచ్చింది. దాంతో నేను అతని స్థానంలో మా తమ్ముడిని తీసుకెళ్లాలని అనుకున్నాను. కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, ఫోటో చెక్ చేస్తారు. ఆ విషయం గురించి నేను, "బాబా! నేను తప్పేమీ చేయట్లేదు. ఆ భగవంతుడి దర్శనానికి ఒకరికి బదులు ఇంకొకరిని తీసుకు వెళ్తున్నాను. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో. ఇక మీదే భారం" అని బాబాతో చెప్పుకున్నాను. తర్వాత ప్రయాణానికి బస్సు టిక్కెట్లు బుక్ చేశాను. ప్రయాణానికి ముందు నా ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. ఆహార సమస్య వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ అయింది. ఆ స్థితిలో నడిచి తిరుమల వెళ్లగలనో, లేదో అనే భయమేసింది. వెంటనే, "బాబా! ఏ ఇబ్బంది లేకుండా నేను కాలినడకన తిరుమల కొండెక్కి స్వామి దర్శనం చేసుకొని వచ్చినట్లైతే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తర్వాత తిరుమలకి ప్రయాణమయ్యే రోజున బస్సుకోసం మేము మా ఊరు నుండి పక్క ఊరు వెళ్లాల్సి ఉండగా ఆటోని పిలిపించాము. సరిగ్గా ఆ సమయానికి మా ఆఫీసువాళ్ళు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ మీట్ పెట్టారు. అది ఎంతసేపటికీ పూర్తికాకుండా కొనసాగుతూ పోయింది. ఒక పక్క ఆటో మాకోసం వచ్చి వుంది, మరో పక్క ఆఫీసు కాల్, ఇంకో పక్క బస్సుకి టైం అయిపోతుంది. నాకు ఏమి చేయాలో కూడా అర్ధంకాక 'అసలు ఈరోజు బస్సు ఎక్కుతామా, లేదా' అని భయమేసింది. కానీ బాబా దయవల్ల సమయానికి బస్సు ఎక్కగలిగాము. మరుసటిరోజు తిరుపతిలో దిగగానే ఎందుకైనా మంచిదని కాలినడకన వెళ్లే భక్తులకి ఇచ్చే టిక్కెట్లు తీసుకొని, ఒక రూము తీసుకొని ఫ్రెష్ అయ్యి టిక్కెట్లు ప్రింట్ తీసుకొని నడక మొదలుపెట్టాము. దారిలో శక్తికోసం ఫ్రూట్ జ్యూస్ లాంటివి త్రాగుతూ నడక సాగించాము. కొంతదూరం బాగానే వెళ్ళాము కానీ, తర్వాత నాకు కడుపునొప్పి విపరీతంగా వచ్చింది. ఏం చేసినా తగ్గలేదు. ఇంకేం చేయాలో తెలియలేదు. ఇక అప్పుడు బాబాని, వెంకటేశ్వరస్వామిని, "ఎలాగైనా నొప్పి తగ్గించమ"ని కోరుకుంటూ నడకసాగించాను. ఇంతలో వైద్య సహాయం అందించే ఒక చోటు కనిపించింది. అక్కడికి వెళ్లి వాళ్ళని అడిగి ఒక టాబ్లెట్ వేసుకున్నాను. తర్వాత బాబాని తలుచుకుంటూ నడకసాగించాను. మొత్తానికి బాబా, వెంకటేశ్వరస్వాముల దయవల్ల మేము కొండపైకి చేరుకున్నాము. మేము ఫ్రెష్ అవ్వడానికి కొండపైన రూమ్ బుక్ చేసుకోలేదు. కానీ బాబా దయవల్ల అంత రద్దీలో కూడా మాకు ఒక రూము దొరికింది. అదెలా అంటే, కొండపైకి వెళ్ళాక టాబ్లెట్స్ కోసం ఒక మెడికల్ షాపుకి వెళ్తే, వాళ్ళు రూము ఎలా తీసుకోవాలో చెప్పారు. వాళ్ళు చెప్పినల్టు రూము తీసుకొని ఫ్రెష్ అయ్యి, టాబ్లెట్ వేసుకొని దర్శనానికి వెళ్ళాము. టిక్కెట్లు చెక్ చేసే చోట నాకు కాస్త టెన్షన్‌గా అనిపించి, "నేను చేసే పనిలో తప్పు లేకపోతే ఏ ఇబ్బంది లేకుండా లోపలికి పంపించేలా చేయమ"ని బాబాని కోరుకున్నాను. ఆయన దయవల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని లోపలికి పంపారు. ఆ రోజు కొంచెం రద్దీ ఎక్కువగానే ఉన్నప్పటికి దర్శనం ఇంతకముందు కన్నా బాగా జరిగింది. ఆ తరువాత అక్కడే అన్నప్రసాదంలో భోజనం చేసి, టాబ్లెట్ వేసి 'ఏదైతే అది అయ్యింది' అని అనుకున్నాను. ఎందుకంటే, నాకు అప్పటివరకు కడుపునొప్పి తగ్గలేదు. కానీ ఏదో అద్భుతం జరిగినట్టు భోజనం చేసి, టాబ్లెట్ వేసుకోగానే కడుపునొప్పి తగ్గిపోయింది. తర్వాత కొండ దిగొచ్చి అదేరోజు బస్సు బుక్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసాము. నిజానికి నాకు ఉన్న కడుపునొప్పికి కొంచెం దూరమైనా నడవగలనా? దర్శనం చేసుకోగలనా? అనిపించింది. కానీ దయతో ఆ వెంకటేశ్వరస్వామి, బాబా అడుగడుగునా నాకు తోడుగా ఉన్నందున ఇబ్బంది ఉన్నప్పటికీ(ఏదో కర్మఫలం ఆ విధంగా అనుభవించానని అనుకున్నాను) కాలినడకన కొండెక్కి, దర్శనం చేసుకున్నాను. నాతోపాటు నడిచినవాళ్ళు కాళ్లనొప్పులు వచ్చినప్పటికీ నాకు మాత్రం కాళ్లనొప్పులు లేవు. అది బాబా అనుగ్రహమే. "ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనుక్షణం తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న బాబాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు".

తిరుపతి నుండి తిరిగి వచ్చాక కూడా చాలారోజుల వరకు నాకు కడుపునొప్పి తగ్గలేదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. ఒకానొక సమయంలో అయితే అసలు ఈ సమస్య తగ్గుతుందా, లేదా అనే భయమేసి బాబాని గట్టిగా ప్రార్థించి, ఆయన ఊదీ పెట్టుకొని మంచి ఆహారం తీసుకుంటుంటే బాబా దయవల్ల కొన్ని రోజులకి అంతా సెట్ అయ్యింది. కానీ బయట ఫుడ్ తింటే మళ్ళీ కడుపునొప్పి వస్తుంది. పరిస్థితి అలా ఉన్నప్పటికీ మా ఆఫీసువాళ్ళు వారానికి మూడురోజులు ఆఫీసుకి రమ్మని అంటుంటే వారంలో మూడు రోజులు ఆఫీసుకు వెళ్లి, తర్వాత ఇంటికి తిరిగి వచ్చేస్తుండేదాన్ని. అయితే ఒకరోజు మా మేనేజర్, 'ఒకరికి ట్రైనింగ్ ఇవ్వాలి. వారమంతా ఆఫీసుకి రమ్మ"ని నాకు మెసేజ్ చేసింది. అసలే నాకు బయట ఫుడ్ పడట్లేదు. ఆఫీసుకి వెళ్ళినట్లైతే బయట ఫుడ్‌యే తినాలి. నాకు ఏమి చేయాలో అస్సలు అర్ధంకాక బాబాని తలుచుకుంటూ మా మేనేజర్‌కి, "నాకు ఫుడ్ ప్రాబ్లెమ్ అవుతుంది. అందువల్ల నేను వారమంతా ఆఫీసుకి రాలేను. 3 రోజులు మాత్రమే వస్తాను" అని మెసేజ్ పెట్టాను. తర్వాత, "బాబా! మా మేనేజర్ మూడు రోజులు రావడానికి ఒప్పుకుంటే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. కొంచం చర్చ జరిగినప్పటికీ బాబా దయవల్ల మా మేడమ్ ఒప్పుకుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దయ నా మీద ఇలానే ఉంచి కడుపునొప్పి పూర్తిగా తగ్గేలా చేయండి తండ్రీ. అలాగే నేను ఉండటానికి హైదరాబాదులో నాకు ఒక మంచి స్థలం చూపించండి సాయి".

19 comments:

  1. Om Sai Sri Sai Jaya Jaya Sai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please..bp normal ga vundali thandri please baba

    ReplyDelete
  9. sai baba maa sai madava bharam antha meede baba , manchiga chaduvukoni prayojakudu avvali baba, alage maa tammudu satya ni kuda kanipettukuni undu baba

    ReplyDelete
  10. Om sairam eroju scan undi baba baby growth Baga undela chudu baba bharam antha ne Paine vesanu baba

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  12. Baba Naku sahayam cheyyandi baba meere dikku baba nannu elagaina gattekinchu baba Naku manasuku shanthi ivvandi baba

    ReplyDelete
  13. Sai bhakulaki na namaskarm na Peru mani nenu naku jarigina anubavam mito panchukovalanukuntunnanu Naku 6 month back oppression jarigindhi garbasanchi tisesaru chala kritikal pojishan aindhi Naku oppression inappatinuchi chala ibbandhi paddanu moshans avadam nidhra rakapovadam Baga vekga undadam ilaundedhi oppression lo amyna tedajarigindhemo Ani chala bayapaddanu 4 rojulamundhu malli okasari scan tipinchu kunnanu riport lu annibaga vaste anubavanni blog lo panchukuntanu tandri Ani anukunnanu a Baba dhayavalla report lu Anni Baga vachay a samasya ledhu harmones prablam valla ala avutundhi medicine vadite taggipotundhi annaru Naku chala anandham kaligindhi ventane nenu e coment pedutunnanu please andharu chadivela publish cheyandi jai shree sadguru Sainath Maharaj ki Jai

    ReplyDelete
  14. 🙏🏻🌼🌼🌼🌼🌼🙏🏻

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo