సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1671వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • విడాకుల విషయంలో బాబా అనుగ్రహం

నేను ఒక సాయిభక్తురాలిని. నేను నా భర్తతో విడాకులు తీసుకోవాలనుకున్న తర్వాత ఒకరోజు రాత్రి నేను నా ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ నా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల గురించి చెప్తే, తను 'సమస్య అందరికీ అర్థమయ్యేలా చెప్పు' అని అంది. అందుకు నేను, 'నా సమస్యలు అందరితో పంచుకోవడం నాకు ఇష్టం లేదు' అని అన్నాను. అప్పటికి చాలా ఆలస్యం అవ్వడంతో నేను నిద్రకు ఉపక్రమించబోతూ పడుకునే ముందు, "ప్లీజ్ బాబా! నా విడాకుల విషయంలో మీ కన్ఫర్మేషన్ తెలియజేయండి ప్లీజ్" అని బాబాను వేడుకొని మరీ పడుకున్నాను. మరుసటిరోజు బుధవారం, తెల్లవారుజామున 4.45కి అలా నాకు ఏవేవో కలలు వచ్చాయి. అవేంటో అర్థం కాలేదు, సరిగా గుర్తు రాలేదు గాని కలలో నేను నా ఫ్రెండ్(రాత్రి చాట్ చేసిన ఫ్రెండ్)తో ఏదో చెప్పి, 'అందరికీ చెపుదాం, చెపుదాం' అని అంటున్నాను. అలా కలలో చెపుదామంటున్న విషయం ఏమిటో స్పష్టంగా తెలీదు కానీ, నా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యల గురించే అన్నట్లు నాకు అనిపించింది.

తర్వాత 5 గంటలప్పుడు నాకు మెలుకువ వచ్చి, "ప్లీజ్, నాకు మీ నిర్ణయాన్ని తెలియజేయండి బాబా" అని బాబాను అడిగి, బాబా నాతో మాట్లాడుతున్నట్టు, తధాస్తు అన్నట్లు అనుభూతి చెందాను. అంతలో మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. కలలో నేను చేతిలో ఏవో డాక్యుమెంట్లు పట్టుకొని ఎక్కడికో వెళదామనుకుంటు మా కజిన్ ఒకరు, ఇంకో ముగ్గురు, నలుగురు కలిసి అక్కడికి వెళ్తున్నాము. అలా వెళ్తూ నేను, మా కజిన్ విడాకులు గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అక్కడికి చేరుకున్నాక చూస్తే, అప్పటికే అక్కడ క్యూలో చదువురాని వృద్ధులు చాలామంది ఉన్నారు. మేము ఇంత క్యూ ఉంది అనుకుంటూ వేరే లైన్‌‌లోకి వెళ్లి వేచి ఉన్నాము. అంతలో సాయిబాబా ఒక లేడీ లాయర్ రూపంలో అక్కడికి వచ్చారు. ఆవిడా వచ్చారని మేము వెనక్కి వెళ్తుంటే, ఆవిడా మా వైపు కోపంగా చూసి, 'నాగరికులకు ఒక్కసారి చెప్తే చాలు. అనాగరికులకు అలా కాదు కదా' అని అన్నారు. ఆవిడ అలా అన్న వెంటనే పక్క క్యూలో ఉన్న వాళ్ళందరూ పక్కకి జరిగారు. మా నలుగురు, ఐదుగురం ఆవిడ దగ్గరకు వెళ్ళాం. ఆవిడ మమ్మల్ని చూస్తూ, ముఖ్యంగా ముందున్న నా వైపు కోపంగా చూస్తూ, "మీ డబ్బు ఏమీ వృధా చేసుకోనక్కర్లేదు. మీకు అవసరమైనవి తీసుకొని నా దగ్గరకి వస్తే, మీకు కావాల్సింది నేను చేసి పెడతాను. దానికోసం ఇక మీద మళ్ళీ రానక్కర్లేదు" అని నన్ను ఉద్దేశించి అన్నారు. 

కలలోని బాబా ఆ మాటలను బట్టి, 'నీ సమయాన్ని వృధా చేసుకొని అందరి దగ్గర దేని గురించి చెప్పక్కర్లేదు. నా దగ్గరకి వస్తే నీ సమస్య పరిష్కారమవుతుంది' అని బాబా  అన్నట్టు అనిపించింది. దాంతో నేను బాబాని నాకు విడాకులు విషయంలో కన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగిన దానికి నీకు కావాల్సింది నేను చేసి పెడతాను అని బాబా చెప్పినట్లుగా అనిపించింది. ఇకపోతే, నాకు అదివరకే విడాకుల గురించి కలల్లో 'నువ్వు అడిగింది చేస్తాను' అని బాబా కన్ఫర్మ్‌ చేసినట్టు అనిపిస్తుండేది. కాని ఎందుకో నేను మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి, ఇంకోక్కసారి అని బాబాను విడాకుల గురించి పదేపదే అడుగుతుండేదాన్ని. అందువల్లే 'నాగరికులకు ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు, మళ్ళీ రావక్కర్లేదు' అని బాబా అన్నట్లు నాకు అనిపించింది. 

దాంతో నేను విడాకులు తీసుకోవడానికి బాబా వద్ద నుండి నాకు కన్ఫర్మేషన్ వచ్చిందని ఇంట్లోవాళ్లతో "నేను విడాకులు తీసుకుంటాను. నా వైవాహిక జీవితం బాగుండదు" అని స్పష్టంగా చెప్పేసాను. కానీ ఆ అబ్బాయి(మాజీ భర్త), మా ఇంట్లోవాళ్లు ఎవరూ విడాకులు తీసుకోడానికి ఒప్పుకోలేదు. అందరూ వద్దు అన్నారు. కానీ నేను బాబా మాట మీద నిలబడ్డాను. అయితే, 'నాకు విడాకులు తీసుకోవడమే ఇష్టమని, నేను బాబాని అడిగాను, ఆయన కూడా ఆమోదించారని' వాళ్లతో చెప్పలేదు. కానీ నా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల గురించి మా అమ్మతో పంచుకున్నాను. ఆమె ఒక రకంగా 'నీ ఇష్టం' అన్నప్పటికీ "విడాకులు తీసుకునే అంత సమస్యలు కావవి’ అని అంటుండేది. చివరికి అమ్మ "నువ్వు అన్నీ బాబాని అడిగి చేస్తావు కదా! ఇది కూడా బాబాని అడుగు" అని అంది. అప్పుడు నేను, "నేను బాబాని అడిగాను కాబట్టే మీ అందరికీ నేను విడాకులు తీసుంటానని కన్ఫర్మ్‌గా చెప్పాను" అని చెప్పాను.

తర్వాత ఒకరోజు ఆ అబ్బాయివాళ్ళ ఇంట్లోవాళ్ళు, మా ఇంట్లోవాళ్ళు అందరూ విడాకుల గురించి మాట్లాడటానికి కూర్చున్నారు. వాళ్ళు వచ్చేముందు నేను బాబాను, "బాబా! ఇదే చివరిసారి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సరిగ్గా ఆన్సర్ ఇవ్వండి. దాన్నిబట్టి నేను వాళ్ళ దగ్గర విడాకులు తీసుకుందామా, లేకుంటే విడాకులు తీసుకోకుండా కలిసి ఉందామని చెప్పాలి" అని చీటీలు వేసాను. 'విడాకులు తీసుకోమ'ని బాబా సమాధానం ఇచ్చారు. ఇంకా నేను బాబా సమాధానానికి కట్టుబడ్డాను. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ తెరిస్తే కింద ఫోటో ఉంది.

ఆ ఫోటో మీద ఉన్న మెసేజ్ అర్థం: 'ప్రపంచమంతా 'నో' చెప్పినా సాయి 'అవున'ని చెప్తే అవుననే... ఎవరూ ఆపలేరు! ఆయన సమయాలను నమ్మండి, అందమైన జీవితం మీ కోసం వేచి ఉంది' అని. అది చదివాక నేను బాబా నాకిచ్చిన సమాధానం సరైనదని, బాబా ఎప్పుడూ నాతో ఉంటారనుకొని అందరితో, "నాకు విడాకులు కావాలి. అతనితో నేను సంతోషంగా లేన"ని అందుకు నాకున్న కారణాలన్నీ చెప్పాను. ఐనప్పటికీ మావారితో సహా ఎవరూ విడాకులకు ఒప్పుకోలేదు. నేను మాత్రం బాబా సమాధానమిచ్చారు, ఆయనే చూసుకుంటారని ఊరుకున్నాను.

కొన్నిరోజులకి మావారు "నాతో మాట్లాడాలి. కాస్త సమయమివ్వు" అని అడగసాగారు. నేను, 'బాబా సమాధానమిచ్చాక ఇంకా తనతో మాట్లాడాల్సిన అవసరం ఏముంద'ని, "నేను మాట్లాడను. నాకు ఇస్టం లేదు" అని చెప్పాను. కానీ అతను మళ్లీ మళ్లీ అడుగుతుండేసరికి నేను బాబాని, "మాట్లాడమంటారా?, వద్దా?" అని బాబాను అడిగాను. దానికి బాబా మాట్లాడమన్నారు. దాంతో నేను అతనితో మాట్లాడతానని చెప్పాను. కానీ అతను 3 నెలలు వరకు మాట్లాడలేదు. 3 నెలలు తర్వాత వచ్చి, "విడాకులు తీసుకోవడానికి నాకు కూడా సమ్మతమేన"ని చెప్పాడు. నేను బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. తర్వాత ఇంట్లోవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని విడాకులు తీసుకోవడానికి ఒప్పుకొని, "విడాకులు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోండి" అని చెప్పారు. అలా బాబా నాకు విడాకులు వచ్చేలా చేసారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


15 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  7. Pregnancy journey lo thodu vundu baba please healthy baby ni ivvu baba BP normal ga vundali baba please thandri

    ReplyDelete
  8. sai baba , maa sai madava ki 5 grahalu baaga levani chepparu. japam, homam cheyinchalani chepparu. edi cheyenchataniki maa intlo vallu vappukonelaga cheyi thandri. vappukunte nenu naa anubhavanni blog lo panchukuntanu baba, nenu malli andaru vappukunnaru ani blog lo panchukovalani vundi baba

    ReplyDelete
  9. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏

    ReplyDelete
  10. బాబా న నా మీద కరుణ చూపించవా, నా. కష్టాలు రోజు నీకు చెప్తున్న కానీ ఎందుకు నీకు చేరడం లేదు బాబా

    ReplyDelete
  11. ఈ కష్టాలు అనుభవించలేక ఏ దారి దొరకక పిల్లలని చదివించుకొలేకున్న, దయ కలిగి నా పిల్లల చదువులకి డబ్బులు కావాలి,న. సమస్యలు తీరడానికి నాకు దారి చూపించవా లేదంట నీ పదలా చెంతకి చేర్చుకో

    ReplyDelete
  12. E గ్రూప్స్ లో బాబా వచనలని పెడుతున్నారు రోజు అవి చదువుతుంటే బాబా నే మాట్లాడినట్లు అనుకునేదాన్ని,కానీ ఆ వచనాలు నాకోసం కాదు, అని ఇంత కష్టం లో అనిపిస్తుంది.

    ReplyDelete
  13. Na భాద ఎవరికైనా అర్దం ఐయేత్ మీరైనా నాకు సహాయం చేయండి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo