సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1669వ భాగం....


 
ఈ భాగంలో అనుభవాలు:


1. తలచుకున్నంతనే బాధలు తీరుస్తున్న బాబా
2. బాబా మహిమలు ఇలా ఉంటాయి

తలచుకున్నంతనే బాధలు తీరుస్తున్న బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. ఈమధ్య ఒకసారి నేను అద్దంలో చూసుకుంటున్నప్పుడు నా మెడలో ఉండాల్సిన ఒక గోల్డ్ చైన్ కనపడలేదు. అది ఎప్పుడు ఎక్కడా పడిపోయిందో, లేకపోతే నేనే ఎక్కడైనా పెట్టానో నాకు అస్సలు గుర్తులేదు. అప్పటికి రెండు రోజుల ముందు నేను చాలా రద్దీగా ఉండే ఒక ప్రదేశానికి వెళ్ళాను. బహుశా అక్కడ ఏమైనా పడిపోయిందో లేక ఇంట్లోనే పడిపోయిందో కూడా తెలియక భయపడి, "బాబా! ఎలాగైనా ఆ చైన్ కనపడేటట్లు చేయండి" అని బాబాని వేడుకున్నాను. వెంటనే బాబా తమ అనుగ్రహాన్ని చూపించారు. నేను అనుకోకుండా నా భుజం మీద చేయి వేయగానే ఆ చైన్ నా డ్రెసుకి తగులుకుని కనిపించింది. సంతోషంగా బాబాకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఒకసారి మా డాడీ కంపెనీవాళ్ళు ఆఫర్ చేసిన ఒక టూర్‌కి వెళ్లాలనుకున్నారు. అది చాలా దూర ప్రయాణం. పైగా బస్సు ప్రయాణం. అందుకని నేను, "బాబా! డాడీ క్షేమంగా వెళ్ళొచ్చేలా చేయండి. ఆయన ఏ ఇబ్బందీ లేకుండా వెళ్ళొస్తే, మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని కోరుకున్నాను. నేను కోరుకున్నట్లే డాడీ ఏ ఇబ్బందీ లేకుండా టూర్‌కి వెళ్లి తిరిగి వచ్చారు. "ప్రతి నిమిషం మా కుటుంబానికి తోడుగా ఉండి కాపాడుతున్ననందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా". ఎన్నోసార్లు మా అమ్మ తలనొప్పి, కాళ్ళనొప్పులతో బాధపడుతుంటే, అమ్మకి ఊదీ పెట్టి, "ఎలాగైనా అమ్మకి నొప్పులు తగ్గేలా చేయండి. అమ్మకి నొప్పులన్నీ తగ్గి ఆరోగ్యంగా ఉంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. నేను వేడుకున్న ప్రతిసారీ అమ్మకి నొప్పి తగ్గేలా చేసి నేను ఉన్నానుని బాబా చెప్పారు. కేవలం మా అమ్మకే కాదు ఇంట్లో మా నాన్నకి, ఇంకెవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా బాబాని తలుచుకొని "దయచేసి నయం చేయమ"ని కోరుకొగానే బాబా వాళ్ళకి నయం చేస్తున్నారు. "ఏ సమయంలో తలచుకున్నా మా బాధలు వింటున్నందుకు, తీరుస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు చేసిన ఏ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరు ఉన్నా లేకపోయినా తలుచుకోగానే మీరు నా పక్కన ఉంటారు అనే ధైర్యాన్ని ఇచ్చారు. మీ దయ ఎప్పుడూ నా మీద ఉంచమని, అలాగే ఈ ప్రపంచంలో అవసరం, బాధ ఉన్న ప్రతి మనిషికి మీరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".


బాబా మహిమలు ఇలా ఉంటాయి

సాయిభక్తులందరికీ బాబా ఆశీస్సులు. నా పేరు నాగలక్ష్మి. మాది విజయవాడ. నేను 2008 నుంచి బాబాని పూజిస్తున్నాను. నా జీవితంలో ఏ కష్టం వచ్చినా బాబానే చూసుకుంటున్నారు. నా జీవితంలో జరిగిన ప్రతిదీ బాబా ప్రసాదించిన వరమే. ఈ బ్లాగులో తోటి భక్తుల అనుభవాలు చూసి నేను కూడా నా అనుభవాలు పంచుకోవాలని అనుకున్నాను. కానీ సరిగ్గా వ్రాయలేనేమోనని ఆగిపోయేదాన్ని. కానీ బాబా ఏదో ఒక రూపంలో పంచుకోమని సూచించేవారు. 2023, సెప్టెంబర్ నెల మూడో వారం చివరిలో మా బాబుకి జ్వరం చాలా ఎక్కువగా వచ్చింది. కానీ బాబా దయవల్ల ఒక మూడు రోజుల్లో తగ్గింది. అయితే మరుసటిరోజు నుండి బాబుకి విపరీతమైన కాళ్ల నొప్పులు మొదలయ్యాయి. నాకు చాలా భయమేసి, "బాబా! ప్రతి గురువారం సాయంత్రం గుడికి వచ్చి హారతికి హాజరై పారాయణ చేస్తాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల తర్వాత రోజుకి బాబుకి కాస్త తగ్గి, ఆ మరుసటిరోజుకి నొప్పులు అస్సలు లేవు. సరిగ్గా ఒక వారం తర్వాత గురువారం మధ్యాహ్నం బాబుకి మళ్లీ జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మా వాడికి జ్వరం తగ్గేలా చేయి తండ్రీ. మీ అనుగ్రహాన్ని బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకొని ఆయన దయతో తగ్గిపోతుందని ఆశించాను. అదే జరిగింది. నేను బ్లాగులో నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని అనుకున్నప్పటి నుంచి మా బాబుకి జ్వరమే పూర్తిగా తగ్గిపోయింది. మన బాబా మహిమలు అలా ఉంటాయి. నేను మరుసటి గురువారం నుండి బాబా సన్నిధిలో 7 రోజుల పారాయణ చేయడం మొదలుపెటాను. "చాలా చాలా ధ్యన్యవాదాలు బాబా".


15 comments:

  1. ఓం శ్రీ సాయి రామ్ బాబా లీలలు చదివిన తరువాత ఆనందం కలుగుతుంది.జబ్బులు నిత్యమై ఆనందంగా ఉంది.ఊదీ మహిమ వలన తీరని కోరికలు తీర్చే తండ్రి సాయినాథ్ మహారాజ్

    ReplyDelete
  2. Health problems sai ram cures.Trust and Saburi is need to sai devotees.om sai ram

    ReplyDelete
  3. Kapadu Sai Tandri 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  9. saibaba maa sai madava bharam antha meede baba , madava ki telugu subjectlo weekga unnadu, baba meere madavaki telugulo improve ayyetattu cheyali baba, maa tammuduni kuda kanipettukoni undali baba

    ReplyDelete
  10. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please...

    ReplyDelete
  11. ఓం సాయిరామ్

    ReplyDelete
  12. ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  13. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo