సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1675వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబాను ప్రేమతో వేడుకుందాం  - ఎలాంటి కష్టనైనా చిటికెలో తీసేస్తారు

నా పేరు సౌమ్యశ్రీ. నేను బాబా భక్తురాలిని. ఆయన నా తండ్రి, గురువు. మాది ఒక మధ్య తరగతి కుటుంబం. నా చిన్నప్పుడు మా నాన్న ఆరోగ్యం బాగుండేది కాదు. మేము ఎన్నో కష్టాలు అనుభవించాము. ఎవరూ మమ్మల్ని దగ్గరకి తీసేవారు కాదు. మేము మా సొంత ఊరు లక్ష్మి నగరం నుంచి భద్రాచలంకి మారాము. అక్కడికి వచ్చిన మొదట్లో మా నాన్నకి ఉద్యోగం దొరకలేదు కానీ, కొన్నిరోజుల తర్వాత ఒక స్నేహితుని ద్వారా మా నాన్నకి ఉద్యోగం వచ్చింది. కానీ మా నాన్న ఆ ఉద్యోగం చేయలేకపోయారు. నేను అప్పుడు ఎనిమిదో తరగతి చదువుతుండేదాన్ని. స్కూలుకి వెళ్లేదారిలో ఒక బాబా గుడి ఉండేది. కానీ అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలీదు. నేను పదో తరగతికి వచ్చాక మా ఇంటి ముందు ఒక ఐరన్ వర్క్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు మా అక్క వయసువాళ్ళు. తనతో కలిసి చదివేవాళ్ళు. మా అక్క అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుండేది. ఒకరోజు వాళ్ళింటికి ఒక ఆయన వచ్చారు. ఆయన బాబాకి పరమ భక్తుడు. ఆయన్ని మా అక్క మా ఇంటికి తీసుకొచ్చింది. ఆయన మాకు బాబా గురించి చెప్పారు. ఆ సమయంలో నా పదవ తరగతి పూర్తైంది. అప్పటినుండి నేను బాబాను నమ్మడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడైతే గురుచరిత్ర చదవడం మొదలుపెట్టానో అప్పటినుంచి మా జీవితాల్లో అంతా మంచే జరగడం మొదలైంది. నాటి నుండి నేటి వరకు బాబా మాకు చాలా అండగా ఉంటున్నారు. ప్రతి విషయంలో బాబా మా వెన్నంటే ఉండి నడిపిస్తున్నారని మాకెప్పుడు అనిపిస్తుంది.

నేను నా డిప్లమా పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాను. మొదట నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఎనిమిది నెలల తర్వాత ఆ కంపెనీ వేరే చోటుకి మారడం వల్ల నేను ఆ ఉద్యోగం వదిలేసాను. మళ్ళీ ఆరు నెలల వరకు నాకు ఏ ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో ఒకసారి నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరు 'తొమ్మిది గురువారాల సాయి వ్రత' పుస్తకం నాకు ఇచ్చారు. నేను ఆ వ్రతం మొదలుపెట్టిన కొన్నిరోజులకి నాకు మంచి ఉద్యోగం వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఉద్యోగ విషయంలో నేను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతలా బాబా నాకు దారి చూపారు.

2017లో నాకు పెళ్లి అయింది. బాబా నేను కోరుకున్న వ్యక్తితోనే నా పెళ్లి జరిపించారు. పెళ్ళైన ఎనిమిది నెలలకి నేను గర్భవతినయ్యాను. ఆ సమయంలో నేను ఉద్యోగం చేయలేక మూడో నెల నుంచి సెలవు తీసుకొని మా ఊరు వెళ్లాను. ఐదో నెలలో స్కానింగ్ చేసినప్పుడు 'సింగిల్ అంబిలికల్ ఆర్టరీ(ఒకే బొడ్డు ధమని) అనే సమస్య ఉందని తెలిసింది. ఆ సమస్య 500/1000 మందిలో ఒకరికి వస్తుంది. డాక్టరు, "ఈ సమస్య ఉన్నవాళ్ళలో తల్లి పేగుకి, బిడ్డ పేగుకి సరిగా కనెక్షన్ ఉండదు.  అందువల్ల కడుపులోని బిడ్డకి ఆహారం సరిగా అందక బిడ్డ సరిగా వృద్ధి చెందక ఎదుగుదల ఉండదు, బరువు పెరగడం ఉండదు" అని చెప్పారు. దాంతో మా ఇంట్లో వాళ్ళందరూ ఆబార్షన్ చేయించుకోమని చాలా బలవంతం చేశారు. కానీ నేను, మా ఆయన "అబార్షన్ చేయించం, ఎలా ఉన్నా మేము చూసుకుంటాము" అని వాళ్లతో చెప్పాము. ఆ సమయంలో నేను బాబానే నమ్ముకొని 8 నెలల వరకూ ప్రతినెలా భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్లి చెకప్ చేయించుకుండేదాన్ని. 8వ నెల చివరి వరకు నా కడుపులోని బిడ్డ కేవలం ఒక కేజీ బరువే ఉండేది. కానీ తొమ్మిదో నెలలో స్కాన్ చేసినప్పుడు బిడ్డ 3.5 కేజీల బరువు ఉంది. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఆరోజు మా ఆనందానికి అవధులు లేవు.  అంతా బాబా చేసిన అద్భుతం. ఆయన దయతో ఎలాంటి సమస్య లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్న అందమైన బాబు మాకు పుట్టాడు. బాబా వల్లే అంతా మంచి జరిగింది. ఇది నా జీవితంలో అతిపెద్ద అద్భుతం.

బాబు పుట్టాక మా జీవితాల్లో కొంచెం కొంచెంగా అదృష్టం కలిసి రావడం మొదలైంది. నేను ప్రతి సంవత్సరం బాబా 9 గురువారాల వ్రతం చేస్తూ ఉండేదాన్ని. నాలుగేళ్లుగా అంటే 2019 నుండి హైదరాబాదులో ఒక ఇల్లు కొనాలని మేము ఎన్నో ఇల్లు చూసాము. కానీ ఒక్కటి కూడా నచ్చక మా కోరిక నెరవేరలేదు. చివరికి నేను 2023లో, "బాబా! తొందరగా మాపై అనుగ్రహం చూపించు తండ్రీ. తొమ్మిది గురువారాల వ్రతం, గురుచరిత్ర పఠనం చేస్తాను" అని అనుకున్నాను. అంతే, బాబా మాకు ఒక ఇల్లు చూపించారు. అది మాకు నచ్చడం, చేతిలో ఒక్క లక్ష కూడా లేకపోయినా కావాల్సిన డబ్బు అంతా సమకూరి 2023, జూన్ 23న రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నీ ఒక్క నెలలో జరిగిపోయాయి. మా ఆనందానికి అవధులు లేవు. బాబా మా జీవితంలో చాలా చాలా ఆనందాన్ని నింపారు. అయితే గృహప్రవేశానికి ఎన్ని ముహూర్తాలు చూసినా కుదరలేదు. ఆ విషయం గురించి నేను బాబాని ప్రార్థించాను. సరిగ్గా అప్పుడే "నీకు నేను ఉన్నాను" అన్న బాబా సందేశం నాకు బ్లాగులో కనిపించింది. అప్పుడు నేను, "బాబా! నా అనుభవాలన్నీ తోటి భక్తులతో పంచుకుంటాను. ఎలాంటి ఆటంకం లేకుండా గృహప్రవేశం జరిగేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. తర్వాత బాబా దయతో 20023, ఆగస్టు 31న గృహ ప్రవేశానికి ముహూర్తం కుదిరి ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ చాలా బాగా చేశామని మెచ్చుకున్నారు. అంతా ఆ బాబా దయ. అందరం ఆ బాబాను ప్రేమతో వేడుకుందాం, మనకున్న ఎలాంటి కష్టనైనా ఆయన చిటికెలో తీసేస్తారు. ఆయన అందరికీ తండ్రి లాంటివాడు. ఎప్పుడూ, ఎవరినీ ఇబ్బంది పెట్టరు. కొంచెం ఆలస్యమైనా మన కోరికలు తప్పక తీరుస్తారు. మనకి ఎప్పుడు, ఏం చేయాలో, ఏమి ఇవ్వాలో బాబాకి బాగా తెలుసు. దీన్ని నేను గట్టిగా నమ్ముతాను. అందరూ బాబాని ప్రేమగా చూడండి. మనసులో ఎలాంటి బాధైనా బాబా తప్పక తీరుస్తారు. ఇది సత్యం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు పాదాభివందనాలు, శతకోటి నమస్కారాలు. ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే దయతో చూడండి తండ్రీ. అలాగే అందర్నీ దయతో కాపాడండి బాబా",

సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


17 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  8. Baba, you saved me . Thanks Baba.

    ReplyDelete
  9. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba

    ReplyDelete
  10. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  11. 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  12. Baba ye avamanalu nindhalu dweshalu abbadhalu chadilu lekunda santha ga samasya parishkaram ayyela chudu sai

    ReplyDelete
  13. ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo