సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1683వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృప
2. అడిగినంతనే అందిన బాబా సహాయం

బాబా కృప

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు చల్లా గురుమూర్తి. ఒకరోజు నా చేతికి ఉండాల్సిన ఉంగరం కనిపించలేదు. అది ఒక సందర్భంలో మా అమ్మాయి నాకు బహుమతిగా ఇచ్చినదైనందున నాకు చాలా బాధేసి, "బాబా! ఉంగరం దొరికితే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని సాయిదేవుని వేడుకున్నాను. వెంటనే నా మనసుకి బిస్కెట్లు వగైరా ఉండే ఒక గుడ్డ బ్యాగులో వెతకాలని అనిపించింది. చూస్తే, ఆశ్చర్యకరంగా ఉంగరం ఆ బ్యాగులో కనిపించింది. బహుశా ఆరోజు ఉదయం బిస్కెట్ల కోసం ఆ బ్యాగులో చేయి పెట్టినప్పుడు ఉంగరం జారీ పడిపోయి ఉంటుందని నాకు అనిపించింది. ఏదేమైనా బాబాని తలుచుకోగానే ఆ బ్యాగులో చూడాలనే ప్రేరణ కలిగి, ఉంగరం దొరికినందుకు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "ధన్యవాదాలు సాయినాథా! ఇలాగే మిమ్మల్ని వేడుకున్నంతనే మిగతా విషయాలలో కూడా మంచి జరుగుతుందని పూర్తిగా నమ్ముతున్నాను తండ్రీ".

ఇటీవల హైదరాబాదులో మాకు ఒక అపార్ట్మెంట్ నచ్చి కొనాలని  నిశ్చయించుకున్నాము. అప్పుడు ఆ అపార్ట్మెంట్ విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమోననిపించి, "సరియైన నిర్ణయం తీసుకునే విధంగా దీవించమ"ని సాయిదేవుని వేడుకొని ముందుకుసాగాం. అంతా అయిపోతుందని అనుకున్న దశలో కొన్ని కారణాల వల్ల ఆ డీల్ క్యాన్సిల్ అయింది. తర్వాత ఆ అపార్ట్మెంట్‌కి సంబంధించి కొన్ని సమస్యలున్నాయని మాకు తెలిసింది. అలా సమస్యల్లో చిక్కుకోకుండా బాబా మమ్మల్ని కాపాడారు. "ధన్యవాదాలు సాయినాథా! నాకున్న మిగతా సమస్యలను కూడా త్వరలో తీరేలా దయచూపండి సాయి దేవా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
సర్వం సాయినాథార్పణమస్తు!!!

అడిగినంతనే అందిన బాబా సహాయం

సాయి పాదపద్మములకు నమస్కారాలు, నా పేరు మణి. నాకు 20 సంవత్సరాలుగా బాబా తెలుసు. 15 సంవత్సరాల కిందట నాకు 33 సంవత్సరాల వయస్సున్నప్పుడు నా భర్త చనిపోయారు. దాంతో ఇద్దరు పిల్లలతో, అప్పులతో నా జీవితం ఎటు పోతుందో నాకు అర్థం కాలేదు. అటువంటి సమయంలో బాబా నన్ను అక్కున చేర్చుకుని నాకు తల్లి, తండ్రై అండగా నిలిచారు. ఆయన దయతో నేను టైలరింగ్ చేసి, ఇతరులకి నేర్పుతూ అప్పులు తీర్చి, పిల్లల్ని చదివించి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేలా చేశాను. అలా ఎవరితోనూ మాటపడకుండా బాబా నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టారు. మా అమ్మాయి పెళ్లి నా తమ్ముడుతో జరిగింది. పాప ఫార్మసి పూర్తి చేసినందువల్ల భార్యాభర్తలిద్దరూ సొంతంగా మెడికల్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. 2023, మే నెలలో తమ్ముడు ఇల్లు కొనుక్కుందామని అనుకుంటే మాకు తెలిసిన ఒక పూజారిగారు ఒక ఇల్లు చూపించి, అనుకున్న దానికంటే లక్ష రూపాయలు తక్కువలో అగ్రిమెంట్ వ్రాయించారు. కానీ మా పాప, తమ్ముడికి లోన్ ప్రక్రియల గురించి తెలియక గందరగోళంలో పడ్డారు. ఏదోలా ప్రయత్నించినా అగ్రిమెంట్ సమయం పూర్తైయ్యేలోగా బ్యాంకు పనులు, లోన్ పనులు పూర్తయ్యేలా కనిపించలేదు. అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పోతుండేవి.  అందువల్ల మా పాప, తమ్ముడు చాలా ఆందోళన చెందారు. అప్పుడు నేను బాబాని, "సాయీ! పిల్లల ఆందోళన తగ్గించు" అని వేడుకున్నాను. అంతే, ఒకరు తనకు తెలిసినవాళ్ల ద్వారా పిల్లలకు సహాయం చేశారు. వెంటనే లోన్ వచ్చి చెక్కు రిలీజ్ అయింది. కొంచెం ఆలస్యమైనా ఆ ఇంటి యజమాని అర్థం చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. మొదట ఇల్లు మాట్లాడి పెట్టింది భాస్కర్ గారు, తెలిసిన వాళ్ళని పంపించి లోన్ పూర్తి చేయించింది బాలకృష్ణగారు, లోన్ ఇప్పించింది బలరాంగారు. వీళ్ళందరూ బాబా స్వరూపులే. బాబా వాళ్ళ ద్వారా పని పూర్తి చేయించారు. నేను పెద్దగా చదువుకోలేదు. కానీ కేవలం బాబా అనుగ్రహంతో ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

రక్ష రక్ష సాయిరక్ష!!!


17 comments:

 1. Baba, bless my children and fulfill their wishes in education.

  ReplyDelete
 2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

  ReplyDelete
 3. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

  ReplyDelete
 4. Baba, take care of my son 🙏🙏🙏🙏

  ReplyDelete
 5. ఓం సాయిరాం

  ReplyDelete
 6. Baba bless my child 🙏 🙏🙏🙏🙏

  ReplyDelete
 7. ఓం సాయిరామ్

  ReplyDelete
 8. Baba ma abbai viviham segramuga chai thandri. Gruha pravasam vighnalu

  ReplyDelete
 9. Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha

  ReplyDelete
 10. Om Sai Sri Sai Jai Jai Sai

  ReplyDelete
 11. Om Sai Sri Sai Jai Jai Sai

  ReplyDelete
 12. Om Sai Ram
  Sai always be with me

  ReplyDelete
 13. ఓం శ్రీ సాయి రామ్ నా భర్త పిల్లలు మనవలని చల్లగ చూడాలి తండ్రి.నా బిడ్డలకు, భర్త కి, మనవలకి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించు తండ్రీ.నీ ఆశీస్సులతో నా ఆరోగ్యం బాగా అయింది.నీ దయకి నేను కృతఘ్నతను తెలుపుతున్నాను.

  ReplyDelete
 14. Om Sri Sai nathya namaha

  ReplyDelete
 15. sai baba maa sai madava ni prayojakudini cheyadaniki meeru shaktini, sahakaramni evvavalasinadi baba, alage tammudiki kuda toduga vandu baba.

  ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo