శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
దీపా సావంత్ ముంబైలో నివసిస్తూ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఉండేవారు. ఆమె కుటుంబమంతా బాబా భక్తులు. వాళ్లంతా వారి నుదుటిపై బాబా ఊదీ పెట్టనిదే ఇంటి నుండి బయటికి వెళ్లరు. ఊదీని వాళ్ళ జీవితానికి కవచంగా, చీడపీడలన్నింటి నుండి రక్షణగా భావించి వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ వారి పర్సులో ఒక ఊదీ ప్యాకెట్ ను ఉంచుకునేవారు. ఇప్పుడు చెప్పబోయే లీల వర్షాకాలంలో జరిగింది. అది 1996, జూన్ 15. ఆరోజు సాయంత్రం పని పూర్తి చేసుకొని ఆఫీసు నుండి దీప తన ఫ్రెండ్‌తో కలిసి బస్టాప్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో తుఫాను కారణంగా వర్షపు నీరు రోడ్డుమీద నదిలా ప్రవహిస్తూ ఉంది. అందువలన వాళ్ళు రోడ్డుకు ఒక చివర్లో నడుస్తూ ఉన్నారు. అంతలో ఎదురుగా వస్తున్న బస్సును చూసి బస్సు ప్రక్కనుండి పోతుందన్న ఉద్దేశ్యంతో దీప తన కుడివైపుకు ఒక అడుగువేసింది, హఠాత్తుగా ఆమె లోతైన గొయ్యిలో పడిపోయింది. రహదారి మరమ్మత్తు పనుల కోసం రోడ్డు త్రవ్వబడి ఉందన్న విషయం ఆమెకు తెలియక పోవడంతో అంతపెద్ద ప్రమాదం సంభవించింది. వెంటనే తన స్నేహితురాలు దీపని కాపాడటానికి దీప చేతిని పట్టుకుంది. కానీ, దీప పడిపోతున్న ఫోర్స్ లో ఆమెను కూడా గొయ్యిలోకి లాగుతుండటంతో ఆమె దీప చేతిని విడిచిపెట్టేసింది.
దీప ఆ గొయ్యి లోతుల్లోకి జారిపోతూ ఒక వేలితో ఒక చెట్టు వేరు గట్టిగా పట్టుకొని సహాయం కోసం గట్టిగా అరవసాగింది. అంతలో అటుగా వస్తున్న ఆమె సహోద్యోగులు ముగ్గురు మగవాళ్ళు ఆమె అరుపులు విన్నారు. వెంటనే వాళ్ళు పరుగున వచ్చి ఎలాగో మొత్తానికి కష్టపడి ఆమెను బయటకు తీశారు. జరిగిన దుర్ఘటనకు ఆమె భయభ్రాంతురాలైంది. ఇంటికి చేరుకున్నాక జరిగిన దాని గురించి తన తల్లికి చెప్తూ, "నేను చెట్టు వేరు పట్టుకొన్న వేలికి బాబా ఉంగరం ఉంది. నా పర్సులో ఊదీ ఉంది. అందువల్ల నేను నీళ్లలో సమాధి కాకుండా బాబా కాపాడారు" అని చెప్పింది. నిజంగా అది బాబా మహిమే! లేకపోతే ఒక్క వేలితో చెట్టు వేరు పట్టుకోవడం సాధ్యమేనా?
కొన్నిరోజుల తరువాత నీరు ఎండిపోయాక, ఆమె ఆ గోతిని చూసింది. అది దాదాపు 20 అడుగుల లోతు ఉంది. పైగా దాని దిగువన కొన్ని ఇనుప కడ్డీలు ఉన్నాయి. నిజంగా వాటిపై పడి ఉంటే ఏమి జరిగేదో? బాబా కృపవలన చిన్న చిన్న గాయాలతో ఆమె బయటపడింది.
ఆ సమయంలో ఎక్కడనుండి ప్రత్యక్షమయ్యాడో తెలియదు గాని ఒక వృద్ధుడు హఠాత్తుగా ఆమె ఎదుట కనిపించి ఆమెను బోగీ లోపలకి లాగి ఆమె జీవితాన్ని కాపాడాడు. ఆమె అతనికి కృతజ్ఞతలు చెప్పాలని చూసేసరికి అతను అదృశ్యమైపోయాడు.
ఆ సాయంత్రం ఆమె, జరిగిన ఆ అసాధారణ ప్రమాదం గురించి తీవ్రంగా ఆలోచించగా ఆమెకు ఒక విషయం అర్థమయ్యింది. ప్రతినెలా వచ్చే అమావాస్య రోజే తనకిటువంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని గ్రహించింది. ఆరాత్రి ఆమె బాబాకు ఒక కొబ్బరికాయ కొట్టి, ప్రతి అమావాస్యకి తనకు సంభవించే ఇటువంటి ప్రమాదాల నుండి తనను కాపాడమని ప్రార్థించింది. అలా బాబా సహాయం అర్థించిన తరువాత బాబా దయవలన ఆమెకు ఎటువంటి ప్రమాదం ఎదురుకాలేదు.
దీప ఆ గొయ్యి లోతుల్లోకి జారిపోతూ ఒక వేలితో ఒక చెట్టు వేరు గట్టిగా పట్టుకొని సహాయం కోసం గట్టిగా అరవసాగింది. అంతలో అటుగా వస్తున్న ఆమె సహోద్యోగులు ముగ్గురు మగవాళ్ళు ఆమె అరుపులు విన్నారు. వెంటనే వాళ్ళు పరుగున వచ్చి ఎలాగో మొత్తానికి కష్టపడి ఆమెను బయటకు తీశారు. జరిగిన దుర్ఘటనకు ఆమె భయభ్రాంతురాలైంది. ఇంటికి చేరుకున్నాక జరిగిన దాని గురించి తన తల్లికి చెప్తూ, "నేను చెట్టు వేరు పట్టుకొన్న వేలికి బాబా ఉంగరం ఉంది. నా పర్సులో ఊదీ ఉంది. అందువల్ల నేను నీళ్లలో సమాధి కాకుండా బాబా కాపాడారు" అని చెప్పింది. నిజంగా అది బాబా మహిమే! లేకపోతే ఒక్క వేలితో చెట్టు వేరు పట్టుకోవడం సాధ్యమేనా?
కొన్నిరోజుల తరువాత నీరు ఎండిపోయాక, ఆమె ఆ గోతిని చూసింది. అది దాదాపు 20 అడుగుల లోతు ఉంది. పైగా దాని దిగువన కొన్ని ఇనుప కడ్డీలు ఉన్నాయి. నిజంగా వాటిపై పడి ఉంటే ఏమి జరిగేదో? బాబా కృపవలన చిన్న చిన్న గాయాలతో ఆమె బయటపడింది.
రైలు ప్రమాదం నుండి ఆమెను ఒక వృద్ధుడు కాపాడాడు.
కొంతకాలానికి దీప కుటుంబం కుర్లాకు మారారు. ఆమె తన ఉద్యోగ విధులకు హాజరు కావడానికి రోజూ రైలులో వెళ్ళాల్సి వచ్చేది. ఒకరోజు ఉదయం ఆమెకు ఆలస్యమై కండివాలి స్టేషన్ లో ప్రవేశించేసరికి ఆమె ఎక్కాల్సిన రైలు కదులుతోంది. ఆమె పరుగున ఒక బోగీలో ఎక్కడానికి ప్రయత్నించింది, కానీ బోగీ ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికులు అడ్డంగా ఉన్నారు. అయినప్పటికీ ఆమె తొందరలో డోర్ వద్ద ఉన్న హేండిల్ పట్టుకుని ఒక అడుగు బోగీలో పెట్టింది. అప్పటికే రైలు ప్లాట్ ఫారం దాటింది. ఏమాత్రం అదుపుతప్పినా ఆమె ట్రాక్ పై పడిపోతుంది అటువంటి భయంకర పరిస్థితి అది.ఆ సమయంలో ఎక్కడనుండి ప్రత్యక్షమయ్యాడో తెలియదు గాని ఒక వృద్ధుడు హఠాత్తుగా ఆమె ఎదుట కనిపించి ఆమెను బోగీ లోపలకి లాగి ఆమె జీవితాన్ని కాపాడాడు. ఆమె అతనికి కృతజ్ఞతలు చెప్పాలని చూసేసరికి అతను అదృశ్యమైపోయాడు.
ఆ సాయంత్రం ఆమె, జరిగిన ఆ అసాధారణ ప్రమాదం గురించి తీవ్రంగా ఆలోచించగా ఆమెకు ఒక విషయం అర్థమయ్యింది. ప్రతినెలా వచ్చే అమావాస్య రోజే తనకిటువంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని గ్రహించింది. ఆరాత్రి ఆమె బాబాకు ఒక కొబ్బరికాయ కొట్టి, ప్రతి అమావాస్యకి తనకు సంభవించే ఇటువంటి ప్రమాదాల నుండి తనను కాపాడమని ప్రార్థించింది. అలా బాబా సహాయం అర్థించిన తరువాత బాబా దయవలన ఆమెకు ఎటువంటి ప్రమాదం ఎదురుకాలేదు.
మూలం: శ్రీ సాయి సాగర్ పత్రిక, దీపావళి ఇష్యూ 1996, విన్నీ చిట్లూరు గారి రచించిన బాబా'స్ డివైన్ సింఫొనీ.
🕉 sai Ram
ReplyDelete